యాక్షన్‌ థ్రిల్లర్‌

 

యాక్షన్‌ థ్రిల్లర్‌

 

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ హీరోగా జోషీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రారంభం కాబోతోంది. మంగళవారం జోషి పుట్టినరోజు సందర్భంగా ఉన్ని ముకుందన్‌ ఫిల్మ్స్‌, ఐన్‌స్టీన్‌ మీడియా సంస్థలు ఈ కొత్త ప్రాజెక్టుని అనౌన్స్‌ చేశాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్‌’ తర్వాత వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమా నిర్మించిన ‘యూఎంఎఫ్‌’ సంస్థ ఇప్పుడు జోషి లాంటి మాస్టర్‌ డైరెక్టర్‌తో చేతులు కలిపింది. దీంతో నిర్మాణానికి ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో ఉన్ని ముకుందన్‌ సరికొత్త లుక్‌లో, మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది.

అప్పటి వరకు పెళ్లి చేసుకోను..

 

అప్పటి వరకు పెళ్లి చేసుకోను..

యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా ‘జూనియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరీటి హీరోగా నటించిన ఈ చిత్రంలో జెనీలియా ప్రధాన ప్రాతల్లో నటించి మెప్పించింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శ్రీలీల. గతంలో శ్రీలీల తనను పెళ్లి కూతుర్ని చేసినట్లు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా.. అందరూ శ్రీలీల పెళ్లి చేసుకుంటుంది అనుకున్నారు.

కానీ అవి అడ్వాన్స్ బర్త్ సెలబ్రేషన్స్ అంటూ రివీల్ చేసింది శ్రీలీల. ఇక దీనిపైనే తాజాగా యాంకర్ సుమ ప్రశ్నించగా.. ‘అది తిథి ప్రకారం చేసుకున్న బర్త్డే సెలబ్రేషన్స్. ఇది తెలుగు బర్త్. మా ఇంట్లో సాంప్రదాయకంగా ఎన్నో జరిగితే అందులో కొన్ని మాత్రమే నేను షేర్ చేశాను. ఇక అవి పెట్టిన తర్వాత జనాలు అందరూ నాకు పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు. నాకు పెళ్లి అప్పుడే జరగదు. నాకు 23 ఏళ్లు.. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోను’ అంటూ క్లారిటీ ఇచ్చింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు..

హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు.. విషయం ఏంటంటే..

పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్‌ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.

చెన్నై: పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్‌ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌(Vijay)కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది. తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలనసభ అధ్యక్షుడు పచ్చయప్పన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో… తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్‌గా పనిచేస్తుందన్నారు.

ఈ సభ జెండాను ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.నిర్ధిష్ట రంగులు వినియోగించే హక్కు తమ సభకు మాత్రమే ఉందన్నారు. కానీ, నటుడు విజయ్‌ 2024లో ప్రారంభించిన టీవీకే జెండాలో ఎరుపు, పసుపు రంగులున్నాయని, అందువల్ల టీవీకే జెండాలోని రంగులు తొలగించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ గురువారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ రామమూర్తి… ట్రేడ్‌ మార్క్‌ సర్టిపికెట్‌ సరుకులకు మాత్రమే వర్తిస్తుంది,

రాజకీయ పార్టీల జెండాలకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు. ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్‌ సరుకులకు మాత్రమే కాకుండా సేవలకు వర్తిస్తుందని, స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్ట్‌లకు కూడా ఈ సర్టిఫికేట్‌ వర్తిస్తుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వివరించారు. అనంతరం న్యాయమూర్తి, ఈ పిటిషన్‌పై టీవీకే అధ్యక్షుడు విజయ్‌ అఫిడివిట్‌ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసి, విచారణ వాయిదావేశారు.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి

సిరిసిల్ల టౌన్ ( నేటి ధాత్రి ):

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జ నపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి ఘనంగా జరిగింనది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ ఘన నివాళి సమర్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి శంకరయ్య పూర్వ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ సినారే ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు నాటక ప్రదర్శనలో అతని చేతులు మీదుగా బహుమతి అందుకున్న జ్ఞాపకం ఉందని, వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే,అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా గాయకుడిగా బోధకుడిగా గురువుగా మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మనీ మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు. అంకారపు రవి తన ఘనంగా కవితను సినరే కు అంకితం ఇచ్చారు.ముడారి సాయి మహేష్ కవితలు ఆలపించారు.గుండెల్లి వంశీ తన కవితను ఆలాపించారు. దొంత దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య,అంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

నలుగురు హీరోయిన్లతో జయం రవి హీరోగా, నిర్మాతగా.. 

నలుగురు హీరోయిన్లతో జయం రవి హీరోగా, నిర్మాతగా.. 

 

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్‌’ (Brocode) చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ప్రకటించారు. ‘డిక్కీలోనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో పేరొందిన కార్తీక్‌ యోగీ దర్శకత్వంలో ‘బ్రోకోడ్‌’ చిత్రం తెరకెక్కనుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ఎస్‌.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. స్ల్లాప్‌ స్టిక్‌ కామెడీ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రవి మోహన్‌ (Ravi Mohan) స్టూడియోస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు జయం రవి. మహిళా నటీమణులు ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్‌ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్‌ కె. బాబు డైరెక్ట్‌ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు కార్తీక్‌ యోగీ మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. ఈ చిత్రంలో స్లాప్‌ స్టిక్‌ కామెడీ బేస్డ్‌ సినిమా ఇది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అందించేలా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. పోర్‌ తోజిల్‌ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్‌ శివాజీ, యానిమల్‌, అర్జున్‌ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్థన్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్‌ ఇ. రాఘవ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎ. రాజేష్‌ వ్యవహరించనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version