తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్. జూనియర్ కాలేజీలో అత్యుత్తమ ఫలితాలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గల. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ సిరిసిల్ల .1. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనార్టీ విద్యార్థులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని అందులో భాగంగా. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో భాగంగా. Bush ra.kouser. కు.470.465. వచ్చాయని. అలాగే.నవిత.కు.470.460. సాధించారు.Bipc . విభాగం నందు. సంవత్సర. విభాగంలో నందిని. 440.గాను 431. అలాగే సన. సచ్చిరి నా. 440 ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీసీ.sodi ya.noushir.కి. 1000.కి గాను.895. సాధించారు మిగతా విద్యార్థులు1000.కి గాను.872. అలాగే. ఇంకో విద్యార్థి.1000. గాను.871. మార్కులు సాధించారు.Bpc . విభాగమునకు.J. స్నేహ కు.1000.గాను..982. మార్కులు మిగతా విద్యార్థికి 1000 కి గాను. 991. మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ మేము బోధించడం ఒకటైతే విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఇంకా ముందు ముందు ఫలితాలు సాధించాలని విద్యార్థులు ఇటువంటి ఫలితాలు సాధించడం మైనార్టీ పాఠశాలకు గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి ):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్.బి. గితె ఐపీఎస్ ప్రారంభించారు.అనంతరం డాడీస్ రోడ్ ఆప్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాపెల్లి రాజలింగం వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరణ ఇచ్చారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.వాహనాలకు “డాడీస్ రోడ్ ఆప్” క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక, లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
SP launches
అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడటమే “డాడీస్ రోడ్ యాప్” ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అనంతరం సూపరింటెండెంట్ పోలీస్ మహేష్ బి గితె ఐ.పీ.ఎస్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు.ఇటువంటి యాప్ తయారు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.జిల్లా ప్రజలు అనుకోని ప్రమాదాల భారీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ ఆప్ క్యూఆర్ స్టిక్కర్ ను వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ ముప్పిడి గంగారెడ్డి డాడీస్ రోడ్ సభ్యులు పాల్గొన్నారు.
కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంస్థ
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనాపాల శంకరయ్య కార్యనిర్వహణలో కాశ్మీరంలో జరిగిన ఉగ్ర చర్యను ఖండిస్తూ స్వర్గస్తులైన వారికి మౌనం పాటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ కఠిన చర్యలు ఉగ్రవాదుల మీద గైకొనాలని ప్రభుత్వం నేడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదని పేర్కొన్నారు. డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోతున్నదని ఇలా అయితే శాంతికి విఘాతం కలుగుతుందని వాపోయారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ స్వర్గస్తులైన వారికి సద్గతులు ప్రాప్తించాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దొంత దేవదాస్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కాశ్మీరంలో శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు
నేటిధాత్రి వరంగల్:
ఎస్సార్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు బుధవారం నాడు హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు, ఎస్సార్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం పార్టిసిపేటరీ రూరల్ అప్రజల్ గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం నుండి విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కెవి కెఆర్ ఎడబ్ల్యూ డిపి కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సోషల్ మ్యాపింగ్, వెన్ రేఖ చిత్రాలు వంటి వివిధ భాగస్వామ్య పద్ధతులను ఉపయోగించి భాగస్వామ్యంపై రైతులకు వివరించారు. అనంతరం స్థానిక సంఘంతో సమావేశమయ్యారు విద్యార్థులు. ఆ ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి కీలక సమస్యలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ డాక్టర్ భూపాల్ రాజ్, ఆర్ ఎ డబ్ల్యూ ఏపీ కోఆర్డినేటర్ శ్రీకర్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కె వి కె ఆర్ ఏ డబ్ల్యు ఏపీ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్, మార్గదర్శకత్వంలో పాల్గొన్న విద్యార్థులు మీనుమోసెస్, ప్రణయ్, అభిషేక్, నవీన్, ఆలీ, రంజిత్, సాయిపవన్, రాజేష్, సమద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బుర్ర.తేజశ్రీ 463 /470, జి.గౌతమి 456/470, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో శ్రావ్య 992/1000, దీపిక 992/1000, నిక్షిప్త 990/1000, రశ్మిత 988/1000, అనన్య 986/1000 మార్కులు సాధించారు.
chairman Narender Reddy
ఈసందర్భంగా కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నాయక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, నేటిధాత్రి:
టిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చింతకుంట మాజీ ఎంపీటీసీ, కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి ఫ్రాక్చరయి గాయపడిన విషయం తెలుసుకొని వారి స్వగృహం శాంతినగర్ లో కలిసి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈసందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడుతున్న తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యాదిలో ఉంచుకుంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తెలంగాణ (మోడల్) ఆదర్శ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. సిఈసి ప్రథమ సంవత్సరం ఫలితాల్లో భోగ శ్రీజ 494/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తెలియజేశారు. ఎంపిసి విభాగంలో పుట్ట హాసిని 448/470, అదరలేని వైష్ణవి 427/470, మ్యాడారం అంజనీ సామ్య 415/470, బైపిసి విభాగంలో ఎన్.జ్యోతి 389/440, జాడి హరిణి 350/440, గడ్డం నవ్య 342/440, సిఈసి మొదటి సంవత్సరంలో భోగ అర్చన 477/500, కూన రేణుక 462/500 మార్కులు, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపిసిలో కే.మహేశ్వరి 934/ 1000, ఎస్.సాయి ప్రణవి 896/1000, బైపిసిలో సిహెచ్.శ్రీవిద్య 893/1000, ఎమ్.ప్రణవి 829/1000, సిఈసిలో ఈ.కార్తిక్ 955/1000, కే.శ్రావణి 873/1000 మార్కులు సాధించి రామడుగు మోడల్ పాఠశాలను మండలంలో ముందు వరుసలో ఉంచారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుల బృందం, తదితరులు అభినందించారు.
లబ్ధిదారులకు ఇసుక ఉచితం.. రవాణా ఛార్జీలు చెల్లించాలి పైలట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం పూర్తి చేయాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీల వారిగా ఇండ్ల నిర్మాణాల పురోగతి పై ఆరా తీశారు. ఎందుకు లక్ష్యం చేరుకోలేదో వివరాలు అడిగి తెలుసుకొని, త్వరగా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ, కమిటీలు గుర్తించిన వారితో పాటుగా ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇండ్లు ఇవ్వాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన గృహాలను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
Collector
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్దిదారు చెల్లించాలని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయిన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేసి ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్హులకు ఇండ్ల నిర్మాణాలపై సూచనలు అందించాలని, పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, సర్వే వివరాలు ప్రతి రోజూ సాయంత్రం తమకు పంపించాలని కలెక్టర్ సూచించారు.వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండల మండల కేంద్రం వాసవి కళ్యాణ మండపంలో జరిగిన *మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గారు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్j ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ గ్రామాల అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు.
ఛలో వరంగల్ కు లక్షలాదిగా తరలి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామ ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల కెసిఆర్ పాలల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగా కేవలం 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు భరించ లేకపోతున్నారు.
Congress
గులాబీ దండు కేసీఆర్ దళం బీఆర్ఎస్ సైనికుల వెన్నంటి ఉంటా ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటా అన్నారు.రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. పోలీసులు రాజ్య మేలు తున్నారు . ఏప్రిల్ 27న ఎల్క తుర్తి బీఆర్ఎస్ సభకు నాయకులు తరలిరావాలని కోరారు.జరగనున్న రజతో త్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి దిశా నిర్దేశం చేయను న్నారని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని గోవిందాపూర్, పెద్దకోడేపాక,జోగంపల్లి ,మైలారం, ఆరేపల్లి గ్రామాలలో బీ ఆర్ఎస్ పార్టీ రజోత్సవసభకు కార్యకర్తలను సమయత్వం చేస్తూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆహ్వానిస్తూ పర్యటించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు , అన్ని గ్రామాల కార్యకర్తలు టిఆర్ఎస్ అభిమానులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీ సీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఈరోజు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది
కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది
పంపిణీ అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మరియు ఉపాధ్యాయులు సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ… ఈరోజుల్లో యువత చెడు మార్గంలో వెళుతున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక కొత్త మార్గం ఎంచుకోవాలని వారిని కోరడం జరిగింది
5 సంవత్సరాలుగా మాకు సహకరించి మా కోసం ముందుండి నడిపిన ప్రతి ఒక్క మా మిత్రులకు అన్నలకు, తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు మరియు పట్టణ ప్రజలందరికీ మా తరఫున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మొదలుపెట్టి సరిగ్గా ఈరోజుకు 6 సంవత్సరాలు పూర్తయింది
ఈ సంస్థ నేను స్థాపించినప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులతో మొదలై ఈరోజు కొన్ని వందల మందితో ముందుకు వెళుతుంది
మా ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు ఏమిటంటే కొన్ని మీకోసం తెలియజేయడానికి
1. కరోనా వచ్చి మృతి చెందిన వారికి దహన సంస్కరణాలు చేయడం జరిగింది
2. కరోనా వచ్చినవారికి మా సొంతంగా పౌష్టిక ఆహారం మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారికి ఇవ్వడం జరిగింది
3. లాక్ డౌన్ సమయంలో వందల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మేము వారి వద్దకు వెళ్లి అందించడం జరిగింది
4.పాఠశాల పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు బుక్స్ అందించడం జరిగింది
5.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది
6. పట్టణ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిన సమయంలో రోడ్లపై స్వయంగా మేమే మరమత్తులు చేయడం జరిగింది
7. వాహనదారులకు రోడ్డు మార్గంలో చెట్లు చాలా వేపుగా పెరిగి రోడ్డు సరిగ్గా కనబడక చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మా సొసైటీ సభ్యులంతా కలిసి ఆ చెట్లను తీసివేయడం జరిగింది
8. నిరుపేద కుటుంబంలోని అమ్మాయిల వివాహాలకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది చాలా సందర్భాలలో
9.వికలాంగులకు స్టాండ్స్ పంపిణీ చేయడం జరిగింది
10.కరోనా సమయంలో పెరిగిన ఆటో చార్జీలను మా వంతుగా కృషి చేసి తగ్గించడం జరిగింది ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్న వారికి మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది
11.మందమర్రి చుట్టుపక్కల రాత్రివేళ మహిళలకు ఇబ్బందికరంగా మారిన మార్కెట్ల లైట్ల కోసం సమస్యపై కృషి చేయడం జరిగింది
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి చేయడం జరిగింది
ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించిన నాతోటి మిత్రులకు అధికారులకు ఇతర పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు
ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకు వస్తాం
రాబోయే రోజుల్లో ఈ వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారి వేల నుంచి లక్షల సంఖ్యలుగా మారాలని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్ జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్ మండల అధ్యక్షుడు సకినాల శంకర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఓరం కవిరాజ్, దాడి రాజు అబిద్ కిరణ్ చరణ్ చింటూ అజయ్ సుందర్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులు
జూనియర్ ఇంటర్ ఎంపీసీ లో 468 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు
జహీరాబాద్. నేటి ధాత్రి:
వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తా చాటారని హోతి -కె ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు.
జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎ.గాయత్రి, ఐశ్వర్య అనే విద్యార్థులు 468 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆమె తెలిపారు.
బి. నికిత 470 మార్కులకు గాను 468, కె. స్నేహ 467, ఎం. అరవింద 467, ఎం. పూజ 466, టీ స్పందన 465, ఆఫియా తాసుమ్ 465, ఏ. ప్రవళిక 465, జి మేఘన 464, జాదవ్ లతా బాయ్ 464 మార్కులు సాధించారు. బైపిసి మొదటి సంవత్సరంలో 440 మార్కులకు సిహెచ్ భవాని 436, జాయ్స్ మేరీ 435, ఎం. హరిణి 433, కే వైశాలి 432, వర్షిక 432, కీర్తి 432, మహేశ్వరి 430 సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 1000 మార్కులకు గాను ఎం. అర్చన 986, హరిప్రియ 986, దేవి శ్రీ 986, జి.లయ 981, బైపీసీ రెండో సంవత్సరంలో 1000 మార్కులకు గాను నిత్య స్వరూపిణి 991, ఎస్. శివాని 991, పి వైశాలి 982, సాయి భవాని 980 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాల అయినప్పటికిని కార్పొరేట్ కళాశాల కు దీటుగా తమ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థులు శ్రద్ధ వహించి ఏకాగ్రతతో చదవడం మూలంగా ఈ ర్యాంకులు సాధించినట్లు, ఈ ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఎంతో క్రమశిక్షణతో పాఠాలు బోధించిన ఉపాధ్యాయ బృందానికి ఎంతో సాయ సహకారాలు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బడులు అన్నిoటికీ వేసవి సెలవులు గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభమవు తున్నాయి,. బుధవారం పాఠశాలల్లో పని దినాలు ముగియనున్నాయి. ఇప్పటికీ వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డులు జారీ కూడా పూర్తి చేశారు దీంతో ఈ విద్యా సంవత్సరం ముగిసింది పాఠశాలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12 న పునః ప్రారంభమవుతాయి. దీంతో అన్ని పాఠశాలలో ఏప్రిల్ 23 తేదీనే ఈ ఏడాదికి చివరి పని దినంగా ఉండనుంది.
Summer vacations
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రవేట్ బడులన్నిం టికీ ఏప్రిల్ 24 వ తేదీతో తరగతులు ముగిస్తాయి 2025-26 విద్యా సంవత్స రానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించేం దుకు కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రణ కూడా ఇప్పటికే ప్రారంభమైంది బడులు తెరిచిన రోజే అంటే జూన్ 12 వ తేదీన విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు.
మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
జహీరాబాద్. నేటి ధాత్రి:
‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్ సూచించారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రతి ఏడాది ఎండాకాలంతోపాటే మామిడిపండ్ల సీజన్ వస్తది. మామిడిపండు రుచికరంగానే కాక అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, కాపర్, ఫోలేట్, మెగ్నీషయం, పొటాషియం, విటమిన్ బీ6, విటమిన్ కే తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణకోశం, చర్మం, కురుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మామిడిపండులోని పోషకాలు తోడ్పడుతాయి. అంతేగాక బరువును తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.అయితే మామిడిపండ్లు రుచిలో చాలా తియ్యగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచివి కావని, రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని చెబుతుంటారు. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మధుమేహులు కూడా హాయిగా మామిడిపండ్లను ఆస్వాదించవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవనీత్ బాత్రా తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా ఖతాలో ఒక పెట్టారు.
Mangoes
‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్ సూచించారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. మితంగా తీసుకోవాలి
మీరు మధుమేహులు అయినప్పటికీ రోజుకు ఒకటికి మించకుండా మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదని లవనీత్ బాత్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఒక మీడియం సైజు మామిడిపండులో 50 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయని, అలాంటి పండును రోజుకు సగం లేదా ఒకటి తినడంవల్ల వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు.
2. పోషకాల బ్యాలెన్సింగ్
మధుమేహులు మామిడిపండును తీసుకున్నప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్‌లు, చక్కెరల పరిమాణం బ్యాలన్స్ తప్పకుండా చూసుకోవాలని బాత్రా తెలిపారు. అందుకోసం మామిడిపండును తినడానికి ముందే కొవ్వులు, ఫైబర్‌లు ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా ఉండే మామిడిపండును ఫైబర్స్, కొవ్వులు లాంటి ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అంటే మామిడిపండును తినడానికి ముందు ఒక కప్పు నిమ్మరసంతోపాటు వాల్‌నట్స్, నానబెట్టిన చియా గింజలు లేదా బాదామ్ గింజలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడంవల్ల మామిడిపండు తిన్నప్పటికీ గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయని తెలిపారు.
3. టైమింగ్ పాటించాలి
మధుమేహులు మామిడి పండును ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా సరైన టైమ్‌లో మాత్రమే తీసుకోవాలని లవనీత్ బాత్రా సూచించారు. ఏదైనా పనిచేయడానికి ముందు, నడవడానికి ముందు, వ్యాయామం చేయడానికి ముందు మామిడి పండును తీసుకోవాలని తెలిపారు. దాంతో పెరిగిన కార్బోహైడ్రేట్స్ వెంటనే అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు.
4. సరైన పద్ధతిలో తినాలి
డయాబెటిక్స్ మామిడిపండును తినాల్సిన పద్ధతిలో మాత్రమే తినాలని బాత్రా సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మామిడిపండును జ్యూస్‌ల రూపంలో, మిల్క్ షేక్స్ రూపంలో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తినాలని తెలిపారు. ప్రకృతి ఇచ్చిన పండును ప్రకృతి సిద్ధంగా తినడంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ.
Silver Jubilee
27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,వీర రెడ్డి,రాజు పటేల్,రాజ్ కుమార్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అశోక్,హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు , గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.
MLA
పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్వామి,సారంగారవు, అమర్నాథ్ రెడ్డి.
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలు గత నెలలో ముగియడంతో ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ గౌరవ అధ్యక్షులుగా పిలుమాల్ల గట్టయ్య(మెట్రో ఈవినింగ్), గౌరవ సలహాదారులు గా కలువల శ్రీనివాస్ (జర్నలిస్టు దినపత్రిక)ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఆరెంద స్వామి(సిటీ కేబుల్),ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు (జనం సాక్షి), కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి(వుదయం )లకు పదవీ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాంగారపు గౌతమ్ ( ప్రజా పక్షం), ప్రచార కార్యదర్శి ఆరెల్లి గోపి కృష్ణ( మన సమాజం),ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య( నేటి ధాత్రి), ఎం వేణుగోపాల్ రెడ్డి( వాస్తవం), కొండ శ్రీనివాస్ ( మనతెలంగాణ),కార్యనిర్వాహణ కార్యదర్శి పి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం),సహాయ కార్యదర్శులు ఎన్ శ్రీనాథ్ (సూర్య ) పి గంగులు యాదవ్ (సామాజిక తెలంగాణ) లు నూతనంగా ఎన్నికయ్యారు. క్లబ్ సభ్యులుగా ఎం ప్రవీణ్, కె సదానందం, ఎం రవీందర్, డి స్వామి, డి వెంకటస్వామి లు ఉన్నారు. సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం తో పాటు పలు అంశాలను చర్చించారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి లు మాట్లాడారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి ని సమిష్టిగా కలిసి మెలిసి పని చేసి ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. ప్రెస్ క్లబ్ నియమనిబంధనలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాటించాలని, నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.