డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి ):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్.బి. గితె ఐపీఎస్ ప్రారంభించారు.అనంతరం డాడీస్ రోడ్ ఆప్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాపెల్లి రాజలింగం వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరణ ఇచ్చారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.వాహనాలకు “డాడీస్ రోడ్ ఆప్” క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక, లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడటమే “డాడీస్ రోడ్ యాప్” ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అనంతరం సూపరింటెండెంట్ పోలీస్ మహేష్ బి గితె ఐ.పీ.ఎస్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు.ఇటువంటి యాప్ తయారు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.జిల్లా ప్రజలు అనుకోని ప్రమాదాల భారీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ ఆప్ క్యూఆర్ స్టిక్కర్ ను వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ ముప్పిడి గంగారెడ్డి డాడీస్ రోడ్ సభ్యులు పాల్గొన్నారు.