ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్.!

ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు

నేటిధాత్రి వరంగల్:

ఎస్సార్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు బుధవారం నాడు హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు, ఎస్సార్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం పార్టిసిపేటరీ రూరల్ అప్రజల్ గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం నుండి విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కెవి కెఆర్ ఎడబ్ల్యూ డిపి కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సోషల్ మ్యాపింగ్, వెన్ రేఖ చిత్రాలు వంటి వివిధ భాగస్వామ్య పద్ధతులను ఉపయోగించి భాగస్వామ్యంపై రైతులకు వివరించారు. అనంతరం స్థానిక సంఘంతో సమావేశమయ్యారు విద్యార్థులు. ఆ ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి కీలక సమస్యలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ డాక్టర్ భూపాల్ రాజ్, ఆర్ ఎ డబ్ల్యూ ఏపీ కోఆర్డినేటర్ శ్రీకర్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కె వి కె ఆర్ ఏ డబ్ల్యు ఏపీ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్, మార్గదర్శకత్వంలో పాల్గొన్న విద్యార్థులు మీనుమోసెస్, ప్రణయ్, అభిషేక్, నవీన్, ఆలీ, రంజిత్, సాయిపవన్, రాజేష్, సమద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version