విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా.

పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా పరిపాలన అధికారి పామెల సత్పత్తి, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ హైస్కూల్ ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8&9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పుస్తకాలను అల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి. విద్యార్థులకు ఇరవై ఒక రోజులపాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుపుతూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో మూడు వందల యాభై మంది విద్యార్థులో ఎనభై మంది విద్యార్థులు ఎంపికైనరని ఆఎంపికైన వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా, సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవనందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, ఐఏఎస్ కి, జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును.!

ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును జయప్రదం చేయండి – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్, నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈనెల 25వ తేదీన బద్దం ఎల్లారెడ్డి భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సదస్సు జరుగుతుందని కావున జిల్లాలోని కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడులో గల సిమెంట్ గోదాం హమాలీ కార్మికుల సమావేశం జంగం తిరుపతి అధ్యక్షతన గోదాం వద్ద జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేయాలని అందుకోసమే సదస్సు నిర్వహించడo జరుగుతుందని దీనిలో కార్మికలోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు ననవేని కొమరయ్య ననవేని శ్రీనివాస్, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

గల్లీగల్లీ కెసిఆర్ సభకు తరలిరండి.

గల్లీగల్లీ కెసిఆర్ సభకు తరలిరండి

బిఆర్ఎస్ యూత్ నాయకుడు మడికొండ ప్రవీణ్

పరకాల నేటిధాత్రి

 

27 తేదీన బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యూత్ నాయకుడు మడికొండ ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి తెలంగాణ ప్రజలను ఏకతాటిపై నడిపి ఎన్నో కష్టనష్టాలకు అవమానాలకు అణిచివేతకు వెనకడుగు వేయకుండా ప్రజలను అంటిపెట్టుకొని రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని
నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో
ఆ తర్వాత 10 యేండ్లు అధికారంలో,నేడు ప్రతి పక్షంలో,తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజల తరుపున నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మాత్రమేనన్నారు.టిఆర్ఎస్ 25 ఏళ్ల మహాప్రస్థానం సందర్భంగా ఈనెల ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది.తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని రాక్షస పాలనని దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందని,పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పిలుపుమేరకు పరకాల ప్రాంత ప్రజలు యువత మహిళలు కార్మికులు రైతాంగం ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకై జరుగుతున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.

చీకటి ని అంతం చేయాలి.

చీకటి ని అంతం చేయాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గల మేరీ మాత చర్చి ఎదురుగా ఓపెన్ గ్రౌండ్లో మూడు రోజులకు గాను ఏర్పాటు చేసిన ప్రార్థన కూడికలు బుధవారం మూడవ రోజు విశ్వాసులు భారీగా తరలివచ్చి ప్రార్థన కూడికలో పాల్గొని ఆరాధించారు. ఈ ప్రార్థన కూడికలు ఘనంగా జరిగాయి.మనోహరమైన పునరుత్థాన పండుగలలో ముఖ్య వర్తమానికులు రెవరెండ్ చార్లెస్ పి.జాకబ్ ఫిలదె ల్ఫియాఎజిచర్చ్ విజయవాడ పాస్టర్ దైవ సందేశాన్నఅందించారు. చీకటి ని ప్రతి ఒక్కరు అంతం చేయాలని తన ఇంటికి చీకటి ని పంపియాలి అని చక్కటి ప్రసంగాని వినిపించడం జరిగింది. ఎప్పుడు జరుగాని కానివిని ఎరుగని రీతిలో ఈ పండుగలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను.!

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి -భావండ్లపల్లి యుగంధర్ డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోంగార్డుల పక్షాన (డిసిపి)డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈసందర్భంగా ఎఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ గత పదకోండు సంవత్సరాలుగా తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ లో విధులు, అదే విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలక్ట్ అయినారు. రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయారని, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగినా, హోంగార్డులను మార్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, ఆకుటుంబాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. దీనివలన వారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో, కుటుంబం తెలంగాణలో ఉండటంవలన, మానసికంగా, కుటుంబపరంగా, విధులకి హాజరుకావడానికి, రవాణాపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోంగార్డుల తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారన్నారు. కొంతమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో విద్యను కొనసాగిస్తున్నారనివారు భవిష్యత్తులో తెలంగాణ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపుగా పదకోండు సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నా, వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని వాపోయారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కు హోంగార్డ్స్ బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ స్పందించటంలేదన్నారు. తెలంగాణ హోంగార్డులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో రాజేష్, నగేష్, మురళి, విజేందర్, సురేందర్, సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్ష

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్ష
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవు, వాతావరణ శాఖ వెల్లడి
రైతులు అధైర్య పడవద్దు / ఆందోళన చెందవద్దు
మిల్లుల అలాట్మెంట్ జరగని కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలి
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ,రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతముగా జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 246 కొనుగోలు కేంద్రాలకు గాను 244 కేంద్రాల ప్రారంభం చేసి 224 కొనుగోలు కేంద్రాల నుంచి 28వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్ లు సిరిసిల్లలో అపెరల్ పార్క్ లో మరియు ఇతర చోట్ల అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి ధాన్యం తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లర్లకు సామర్థ్యం ప్రకారం ధాన్యం అలాట్మెంట్ చేయాలని అన్నారు. జిల్లాలో రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవనీ వాతావరణ శాఖ వెల్లడించినందున రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని సెంటర్లలో టార్ఫాలిన్ కవర్లు, అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకొవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నందున ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డి.ఎం.పౌర సరఫరాల శాఖ రజిత, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, ఏ.పి.ఎం, తదితరులు పాల్గొన్నారు.

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ.!

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువుల మీద దాడి పరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఏపార్టీ స్పందించడం లేదని,హిందువుల కోసం మాట్లాడే పార్టీ, హిందువుల పక్షాన కొట్లాడే పార్టీ ఒక బీజేపీ పార్టీయేనని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కారుపాకల అంజిబాబు, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, వంచ మనోజ్, సుదగోని మహేష్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, రాగం కనకయ్య,బొజ్జ తిరుపతి, అనుపురం శంకర్ గౌడ్, భూస మధు, చేవెళ్ల అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు

వాట్సాప్ గ్రూప్ ద్వారా సామాజిక చేయూత

శభాష్ నెక్కొండ వాట్సాప్ గ్రూప్ అంటూ పలువురు ప్రశంసలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

నెక్కొండ అభివృద్ధికైనా, సామాజిక సేవా కార్యక్రమానికైనా, రైల్వే స్టేషన్ సంబంధించి రైలు ఆపడంలో, రాజకీయ బహిరంగ చర్చ కైనా నెక్కొండలో జరిగే ప్రతి అంశానికి ఆతిథ్యమిస్తూ ఏకైక గ్రూప్“ నెక్కొండ పౌరులు“ఈ వాట్సాప్ గ్రూప్ గత పది సంవత్సరాల క్రితం సేవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నెక్కొండ నగరానికి సంబంధించి మంచి చెడు తెలుసుకోవడానికి 2014 సంవత్సరంలో దుంప నాగరాజు అనే ఓ పారిశ్రామికవేత్త గ్రూప్ క్రియేట్ చేసి నెక్కొండలో జరిగే ప్రతి విషయాన్ని మంచి చెడులను నెక్కొండ ప్రజలకు తెలిసే విధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూపులో చేరవేస్తూ ఆపద వస్తే మేమున్నామంటూ నిరుపేదలకు మేమున్నామంటూ ఒక భరోసాను కల్పిస్తూ వందల మందికి ఆదర్శంగా నిలుస్తున్న నెక్కొండ పౌరులు అనే గ్రూపు ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపు లలో చర్చనీ అంశంగా మారింది. వాట్సాప్ గ్రూప్ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పోస్టు వారు పెట్టకుండా నెక్కొండ అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాలకు రాజకీయ చర్చలకు ప్రజా అభిప్రాయాల సేకరణకు నెక్కొండ కేంద్ర బిందువుగా పనిచేస్తున్న నెక్కొండ పౌరులు పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపు ద్వారా పలువురికి సహాయం

నెక్కొండ పౌరులు అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఏర్పాటు చేయడంలో దీనస్థితిలో చనిపోయిన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడంలో నెక్కొండ పౌరులు అనే గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరికి తోచినంత వారు గ్రూప్ అడ్మిన్ అయినా దుంప నాగరాజుకు ఆన్లైన్లో అమౌంట్ చేరవేసి ఇలా చేరవేసిన అమౌంట్ ను పేదరికంతో చనిపోయిన వ్యక్తులకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ ఈ గ్రూపు ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూతనందించడం గమనార్ధం.

పహాల్గం మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన.

పహాల్గం మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం

ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పరకాల న్యాయవాదులు నిరసన

పరకాల నేటిధాత్రి

 

పహాల్గంలో పర్యటకులపైన చేసిన ఉదగ్రవాదుల దాడికి నిరసిస్తూ పరకాల కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి షాలినిలింగం మరణించిన పర్యాటకుల చిత్రపటాలకు కొవ్వాత్తులతో నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గురువారాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఉగ్రవాదులను త్వరగా పట్టుకుని శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ నవీన్,కిరణ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Terrorist Attack

 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

పరకాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ పరిధిలోని అడ్వకేట్స్ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులను శిక్షించాలని ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక బస్టాండ్ కూడలిలో నిరసన వక్తం చేసారు.ఈ సీనియర్ న్యాయవదులు పి.రాజి రెడ్డి, రాజమౌళి,మెరుగు శ్రీనివాస్, స్వామి,చంద్రమౌళి,గండ్ర నరేష్ రెడ్డి,రమేష్ రాహుల్ విక్రమ్, సురేష్,రాజు,చంద్ర మోహన్, పవన్ కళ్యాణ్ మరియు కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి.!

స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఎమ్మెల్యే మాణిక్ రావు సన్మానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ మండల పరధిలోని శేఖాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ – హుమెర గారి కుమారుడు
షేక్ అద్నాన్ సమీ ఇటీవలే విడుదలిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపీసీ ~ 470 మార్కులకు 467 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన సందర్బంగా సన్మానం చేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మాజి సర్పంచ్ చిన్న రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,గ్హౌస్ తదితరులు.

చేర్యాల కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు.

చేర్యాల కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

చేర్యాల నేటిధాత్రి

 

చేర్యాల పట్టణంలో కోర్టు ఆవరణలో నిన్నటి రోజున కాశ్మీర్ లోయలో ఉగ్రవాద ముష్కరుల దాడి నీ ఖండిస్తూ ఈరోజు చేర్యాల కోర్టు జడ్జి కృష్ణ తేజ మరియు కోర్టు సిబ్బంది న్యాయవాదులు సంతాపం తెలియజేశారు

 

Lawyers

ఆ తర్వాత విధులు బహిష్కరించి న్యాయవాదులు ఉగ్రదాడికి నిరసనగా బైకు ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమం లో దాదాపు 30 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు

 

Lawyers

సీనియర్ న్యాయవాది భూమి గారి మనోహర్ చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరేళ్ల వీర మల్లయ్య తాటికొండ ప్రణీత్ సురేష్ కృష్ణ కాటం సురేందర్ ఆరెల్లి మహేందర్ మెరుగు రమేష్ మోకు రాజిరెడ్డి ఏ సురేందర్ పర్వతం రాములు తదితరులు పాల్గొన్నారు

ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఐపీ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దాడులలో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న.!

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని కమిటి చైర్మన్ రాజేశ్వరి సద్వినియోగం చేసుకోవాలన్నారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

వేసవి పిల్లల శిభిరం విద్యార్థులకు మంచి వరంలోఉందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుప్పానగర్ లో 24/04/2025 నుండి 14/05/2025 20 రోజులపాటలు స్వచ్చంద సంస్థ మయిన శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని అమ్మ అద పాఠశాలల కమిటి చైర్మన్ రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ శిక్షణా శిఖరం విద్యార్థులకు వరం లాంటింది దీనిని అందరు విద్యార్ధులు సద్వనియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిభిరం నిర్వహకులు ఆయేషా సిద్దిఖీ శిభిరం కో ఆర్డినేటర్లు, రాంచెందర్, అశోక్ సి ఆర్ పి షఫీయుద్దీన్ & యోజ్బెన్, అంగన్ వాడి టీచర్. శక్తిమంతులు పాల్గొన్నారు.aa

హామీలు సరే…. వంతెన ఏదీ!

హామీలు సరే…. వంతెన ఏదీ!

గ్రామం నుండి మండలానికి పోవడానికి తప్పని అవస్థ

శాయంపేట నేటిధాత్రి:

 

ప్రభుత్వాలు పాలకులు మారిన ప్రతిసారి సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీలు గుప్పిస్తు న్నారు చివరకు వాటిని అమ లు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. శాయంపేట మండలం నుండి నేరేడుపల్లి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంలో ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూట గానే మిగిలిపోయాయి.

ప్రజలకు తిప్పలు

నేరేడుపల్లి గ్రామం నుండి ప్రజలు మండల కేంద్రానికి రావడానికి ప్రజలకు తిప్పలు బ్రిడ్జి నిర్మాణం చేస్తే మండల కేంద్రానికి రావడానికి సమయం తక్కువగా ఉంటుంది బస్సు సౌకర్యం కూడా కలిగే ఆస్కారం ఉంటుందని ప్రజలు అంటున్నారు అప్పటి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రామారెడ్డి సైతం సమస్య పరిష్కరించకుండా వంతెన ఏర్పాటు చర్యలు తీసుకుం టామని మాట ఇచ్చిన నీటి మట్టలాగే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శ్రీరామ రక్ష స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

Shayampet mandal

 

ఏదైనా పనిమీద మండల కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. దీంతో అన్ని విధాల నష్టపోతున్నాం అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరువ తీసుకొని వంతెన త్వరిత గతిన నిర్మిస్తే ఇక్కట్లు తీరుతాయి.

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం

శాయంపేట మండలం నేరేడు పల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుంది. గ్రామం నుండి మండల కేంద్రానికి రావడానికి ప్రజల ఆర్థిక భారం పడాల్సి వస్తుంది. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ప్రజల కోరికను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాల పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అభివృద్ధి సంక్షే మాలు ప్రతి ఒక్క నిరుపేదకు అందించేలా చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరు తున్నారు.

పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల.!

పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బొచ్చు కోమల
యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్

పరకాల నేటిధాత్రి

పెహాల్గంలో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల తీవ్రంగాఖండించారు.ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ఆయన అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని,ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి,వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్ర వాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా తుడిచివేయాలని,ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని,ఉగ్రదాడుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.

-రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు, జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పట్టణానికి చెందిన తస్కియా ఫైజా, 2024-25 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి జహీరాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. తస్కియా ఫైజా, జహీరాబాద్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో బైపిసి గ్రూప్లో చదువుతూ, 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె ఈ ర్యాంకుతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినిగా నిలిచింది. ప్రభుత్వ కళాశాలలో చదువుతూ, ఎటువంటి కోచింగ్ సెంటర్ సహాయంలేకుండా తన కష్టపడి సాధించిన ఈ విజయం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. తస్కియా ఫైజా అభినందనలు అర్షించింది. ఆమె తల్లిదండ్రులు, అధ్యాపకులు, సహ విద్యార్థులందరూ ఈ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, జహీరాబాద్ విద్యా ప్రాంగణంలో విద్యా సంస్థల ప్రతినిధులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. “ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించగలరన్న సత్యాన్ని తస్కియా నిరూపించిందని అని వారు వ్యాఖ్యానించారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.aa

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను.!

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ఆరుముల్ల ఎల్ల స్వామి కుమార్తె అరుణ్ జ్యోతి కిషోరల వివాహ మహోత్సవానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేగండ్రసత్యనారాయణరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version