గల్లీగల్లీ కెసిఆర్ సభకు తరలిరండి
బిఆర్ఎస్ యూత్ నాయకుడు మడికొండ ప్రవీణ్
పరకాల నేటిధాత్రి
27 తేదీన బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యూత్ నాయకుడు మడికొండ ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి తెలంగాణ ప్రజలను ఏకతాటిపై నడిపి ఎన్నో కష్టనష్టాలకు అవమానాలకు అణిచివేతకు వెనకడుగు వేయకుండా ప్రజలను అంటిపెట్టుకొని రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని
నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో
ఆ తర్వాత 10 యేండ్లు అధికారంలో,నేడు ప్రతి పక్షంలో,తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజల తరుపున నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మాత్రమేనన్నారు.టిఆర్ఎస్ 25 ఏళ్ల మహాప్రస్థానం సందర్భంగా ఈనెల ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది.తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని రాక్షస పాలనని దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందని,పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పిలుపుమేరకు పరకాల ప్రాంత ప్రజలు యువత మహిళలు కార్మికులు రైతాంగం ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకై జరుగుతున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.