ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం.

ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం

మతోన్మాద విధానాలతో లౌకికత్వానికి ప్రమాదం

ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధినేటిధాత్రి:

దేశంలో ఉగ్రవాదుల పన్నాగాలను పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఈ క్రమంలోనే పహెల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పైశాచిక దాడి జరిగిందని ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు.
మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం కామ్రేడ్ షేక్ నజీర్ అధ్యక్షతన వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు కర్షకులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదాని అంబానీ లాంటి పెట్టుబడుదారులు ఎదేచ్ఛగా దేశ సంపదను అనుభవిస్తున్నారని ఆరోపించారు. శ్రమజీవులకు ఎలాంటి కనీస సౌకర్యాలు తగిన విధంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దేశ లౌకికత్వాన్ని సమగ్రతను దెబ్బతీసేందుకు మతపరమైన విధానాలకు చర్యలు చేపట్టడం ఆందోళన కలిగిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతులకు తీరని నష్టం జరుగుతున్నదని అలాగే దేశాన్ని రక్షించాల్సిన కీలక బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకులు అది విస్మరించి తగిన విధంగా భద్రతను ఏర్పాటు చేయకుండా, నియామకాలు చేపట్టకుండా, ఉగ్రవాదులు పర్యాటకుల ప్రాణాలు బలి కొనడానికి కారణమయ్యారని ఆరోపించారు ఏ లక్ష్యం లేకుండానే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఎంతో సాధించామని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏ రకమైన మతోన్మాదం అయినా ప్రజలకు తీవ్రమైన హాని కలిగిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష సామాజిక ప్రజా సంఘాలు రాజకీయాలకతీతంగా ప్రజలను సమీకరించి ఉద్యమాలను చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని అందులో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు ముందు ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యటకుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్,కుంభం సుకన్య, వసుకుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, ఎన్ రెడ్డి హంసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి :-

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం జరిగినది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సాక్షాత్తు దేశ ప్రధాని జైలుకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పెడితే ఇంటెలీజిన్స్ డిపార్ట్మెంట్ ఎంచేస్తుందని ప్రశ్నించారు.

 

పాకిస్థాన్ లో ఉన్నటువంటి అధైల్ జైల్ ఈవ్యక్తికి ఎలా తెలుసని, మరి అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

వెంటనే ఆవ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి, అతడికి ఉన్న ఉగ్రవాద సంబంధాలు బయట పెట్టాలని కోరారు. మండలంలో ఉన్న పలు మదర్సలో ఇతర దేశస్తులు నివాసిస్తున్నారని వెంటనే వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

మోడీ మీద పోస్టు చేసిన ఈవ్యక్తి మీద వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని ప్రభుత్వ ఉద్యోగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈసందర్భంగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లలో కి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

వెంటనే ఆవ్యక్తి మీద కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని బిష్మించుకొని ఉండడంతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి కడారి స్వామి

జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేణి అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపు అనంత రెడ్డి, దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి, రాగం కనకయ్య, జంగిలి కరుణాకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు,పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మామిడి గోపి, ఎగుడ మొండి,సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి,గంగాదరి మల్లయ్య,బోయపోతుల కొమురయ్య,మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్,గొడిసెల గురువయ్య, శ్రీకాంత్ ,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పహల్గామ్ లో జరిగిన దాడి దురదృష్టకరమని అమాయకులైన 26 మందిని బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని సిరిసిల్ల మజీద్ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ భారత దేశంలో అన్నదమ్ములల కలిసి మెలిసి ఉన్న హిందూ ముస్లింలలో వైశాల్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి దేశంలో కునుకు లేకుండా ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పహల్గామ్ లో అమాయకులైన 26 మందిని బలిగొన్నారని అమాయకులైన వారి ప్రాణాలను బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీద్, రఫీ ఉద్దీన్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ.!

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువుల మీద దాడి పరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఏపార్టీ స్పందించడం లేదని,హిందువుల కోసం మాట్లాడే పార్టీ, హిందువుల పక్షాన కొట్లాడే పార్టీ ఒక బీజేపీ పార్టీయేనని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కారుపాకల అంజిబాబు, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, వంచ మనోజ్, సుదగోని మహేష్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, రాగం కనకయ్య,బొజ్జ తిరుపతి, అనుపురం శంకర్ గౌడ్, భూస మధు, చేవెళ్ల అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version