అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి
కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.