ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు.

మరిపెడలో ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు

యువత ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలి

– చేతి వృత్తులవారు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.

– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటిధాత్రి.

 

యువత ఉద్యోగాల సాధన పైనే కాకుండా వ్యాపారాల నిర్వహణపై కూడా దృష్టి సారించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.బుధవారం మరిపెడ పట్టణ కేంద్రంలో చోడోజు వీరభద్రా చారి నూతనంగా ఏర్పాటుచేసుకున్న ఉడ్ క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు కేంద్రమైన మరిపెడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందనన్నారు. పట్టణంలో యువత సరైన ప్రణాళికతో వ్యాపార రంగంలోకి దిగితే సులువుగా విజయం సాధించవచ్చని తెలిపారు.వ్యాపారాల నిర్వహణతోనే త్వరగా ఆర్థిక అభివృద్ధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక రకాలైన వ్యాపార సంస్థలు పట్టణంలో నెలకొని ఉన్నాయని,నూతనంగా ఏర్పాటైన శ్రీ వీరభద్ర ఉడ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ వినియోగదారుల ఆదరణ పొంది వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా చేతి వృత్తుల వారు టెక్నాలజీ ని అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బీఆర్ ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్, మాసబత్తిని సతీష్,రేఖ వెంకటేశ్వర్లు,పానుగోతు వెంకన్న, కత్రోజు వెంకటాచారి,మాజీ ఎంపీటీసీ శ్రీరాముల రాములు,కట్టోజు అంజయ్య,రాగి సైదాచారి,బుచ్చయ్య,సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

సిట్టింగ్ సక్సెస్..?

సిట్టింగ్ సక్సెస్..?

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

పలుగుల 8, 9, మరో రెండు ఇసుక రీచ్ లో పెంచిన అక్రమ వసూళ్ల రూపాలు.

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలో అక్రమ వసూళ్ల వ్యవహారం టి జి ఎం డి సి చీకటి ఒప్పందాలతో, అక్రమ వసూళ్లలో ఇసుక రీచులు రెట్టింపు ఉత్సాహం కనబరుస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలను టీజీఎండిసి అధికారులు, కాసులకు కక్కుర్తి పడి, సీక్రెట్ సెట్టింగ్ ల వ్యవహారాలను కొనసాగిస్తూ, అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారం, దర్జాగా కొనసాగేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అనేక ఇసుక రీచ్ లో అక్రమాల సాక్షాలు తెరపైకి వచ్చిన, చర్యలు తీసుకోవాల్సిన టిజిఎండిసి, గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్లకు మూలాఖాత్ అయి, చీకటి ఒప్పందాలతో ఇసుక రీచుల్లో ఇసుక క్వాంటిటీ పూర్తయ్యే వరకు, చూసి చూడనట్టుగా ఉండి అక్రమ వసూళ్లకు పరోక్షంగా మద్దతు తెలపడం, ఇప్పటికీ అక్రమ వ్యవహారాలు అదనపు ఇసుక రవాణా చేసిన ఉసుక్ పల్లి ఒకటి, పలుగుల పుసుపల్లి 6, పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు జరిపి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకున్నారు, కానీ టి జి ఎం డి సి మాత్రం చర్యలకు శశి మీరా అంది. ఓ అధికారి మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సెట్టింగులు నిర్వహించుకొని, పక్క జిల్లా కు సంబంధించిన, రీచులు కూడా గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, హద్దులు దాటి ఇసుక రవాణా చేస్తుంటే, పీజీఎండిసి నిశ్శబ్దం, కేవలం అధికారులు సెట్టింగులు కొరకే పరిమితం కావడంతో, మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు మరింత పెరగడానికి ప్రధాన కారణం.

సిట్టింగ్ సక్సెస్..?

మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు హద్దు అదుపు లేకుండా కొనసాగుతున్న క్రమంలో, టీజీఎండిసి అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా అక్రమాలను అడ్డుకట్ట వేయాల్సిన టీజీఎండిసి, ఇసుక కాంట్రాక్టర్ల తో సెట్టింగులు జరుపుకొని ఇసుక రీచ్ లో అక్రమాలకు పోస్ట్చాయిస్తున్నారని అధికారి వారం రోజులపాటు “గ్రీన్ ప్రాంతం” ముఖం వేసి కాంట్రాక్టర్లకు తమ వద్దకు పిలుచుకొని సెట్టింగ్ సక్సెస్ చేసుకోవడం జరిగిందని మండలంలో ప్రస్తుతం ఆ అధికారి గ్రీన్ ప్రాంతంలో వారం రోజుల మాఖామ్ చర్చనీయంగా మారింది. ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో కొనసాగుతూ భారీ ఇసుక లారీల్లో ఇసుక రవాణా చేస్తున్న క్వారీల కాంట్రాక్టర్లు అధికారికి వద్దకు వెళ్లి సెట్టింగులు సక్సెస్ చేసుకున్నట్లు సమాచారం, సెట్టింగ్ సక్సెస్ కావడంతో అధికారి తిరిగి వెళ్లిపోవడం జరిగిందని తెలుస్తుంది.

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

టీజీఎండిసి ఉన్నత అధికారి మండలంలో గ్రీన్ ప్రాంతం వద్ద, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖం వేసి పలు ఇసుక క్వారీలకు సంబంధించి కాంట్రాక్టర్లతో సెట్టింగ్ చేసుకున్నట్లు సమాచారం, ఐదు రోజుల మాఖం లో అంత సెట్టింగ్ కావడంతో ఆ అధికారి, ఇసుక క్వారీల పై చర్యలు విచారణ లాంటి ఏమీ చేయకుండా, వెళ్లిపోవడం జరిగిందని విశ్వ నీయ సమాచారం. టీజీఎండిసి అధికారి ఇసుక అక్రమాలు చేపడుతున్న ఇసుక క్వారీలను సందర్శించి, లారీల డ్రైవర్ల తో అదనపు వసూళ్లపై వివరాలు సేకరించడం, ఇసుక రీచ్ ల వద్ద కాంటాలను పరిశీలించడం, వి విల్ పై ఉన్న ఇసుక టన్నులు, లారీలకు కాంట ఇచ్చిన రసీదులు ఇలాంటివి పరిశీలించాల్సిన అవసరం బాధ్యత ఆ అధికారి చేయవలసి ఉంటుంది, కానీ నామమాత్రంగా ఒకరోజు దగ్గర్లోని రెండు ఇసుక క్వారీలకు వెళ్లి తిరిగి తమ గ్రీన్ ప్రాంతానికి వచ్చి, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖంలో అంత సెట్టింగ్ చేసుకొని వెళ్లిపోవడం జరగడంతో, టి జి ఎం డి సి అధికారుల ప్రోత్సాహంతోనే, ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగుతుందని స్పష్టం అవుతుంది.

 

TGMDC

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా లో తమ సత్తా చాటుతున్న పలువుల 8, 9, మహాదేవపూర్పుచుపల్లి 1, తోపాటు మరికొన్ని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు, ఆ అధికారి ఉన్న గ్రీన్ ప్రాంతానికి వెళ్లి, కలవడం జరిగిందని సమాచారం. ఇక టీజీఎండిసి ఉన్నత అధికారి, విధులు ఎక్కడ నిర్వహించాడు, ఆ హోటల్ విధులు నిర్వహించే కేంద్రం, ఇసుక రీచులను తనిఖీ చేయాల్సిన ఆ అధికారి, ఆ గ్రీన్ ప్రాంతంలో, ఎందుకు మఖాం వేసినట్టు, వారం రోజులపాటు అధికారి మాఖామ్, ఇసుక క్వారీల అక్రమాలకు స్థిరపడిందా, అలాంటి వ్యవహారం ఏమీ కొనసాగలేదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం అందరూ ఆ హోటల్లో అధికారిని కలవడం ఎందుకు జరిగింది. ఏదైనా అధికారి వస్తే కార్యాలయంలో, విధి నిర్వహణ చేయడం జరుగుతుంది కానీ గ్రీన్ ప్రాంతంలో, కాంట్రాక్టర్లను పీల్చుకోవడం, టీజీఎండిసి గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగిస్తూ, అక్రమాలకు ప్రోత్సహిస్తూ నుండి అనడానికి దీనికంటే పెద్ద సాక్ష్యం మరిన్ని ఉండదు.

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

ఇక మండలంలో ఇసుక క్వారీల అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే, దానికి మరో సాక్ష్యం ఉన్నత అధికారి కాంట్రాక్టర్లకు ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పిలుచుకొని తమ సెట్టింగులు సక్సెస్ చేసుకోవడం జరిగిందన్న సమాచారమే సాక్ష్యం. ఆ అధికారితో సెట్టింగ్ అనంతరం, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి ఇసుక క్వారీలో గతంలో 700 రూపాయలు వసూలు చేసే ఈ క్వారీ గత రెండు రోజుల నుండి వెయ్యి రూపాయలు సీరియల్ పేరుతో వసూలు చేస్తుంది. ఇక ఇదే క్రమంలో పలువుల 8 ,9, గత వారం రోజులుగా 100 నుండి 150 లారీల వరకు ఈ రెండు క్వారీలు పెద్ద మొత్తంలో లారీలు ఇసుక రవాణా చేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో 11 క్వారీలు నిర్వహణలో ఉన్నప్పటికీ వీటిలో, పలువుల 8 ,9, మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు మరింత రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పరంపరను సాగిస్తున్న సాగిస్తున్నాయి.

 

TGMDC

 

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

టి జి ఎం డి సి ఇసుక అక్రమాల వ్యవహారం పై కనీస చర్యలు తీసుకోకపోవడం, అందిస్తాయి అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం, టీజీఎండిసి నిబంధనలకు తుంగలో తొక్కి అక్రమ వ్యవహారాలను టీజీఎండిసి అధికారులు ప్రోత్సహిస్తున్నారని సాక్షాలు తెరపైకి వచ్చిన కూడా చర్యలు తీసుకోకపోవడమే, ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక క్వారీలో అక్రమాలు, మైనింగ్ శాఖ క్వారీలకు ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచుల నిర్వహణ కొనసాగించడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు, తాజాగా మంచిర్యాల జిల్లా ఎర్రయిపేట పేరుతో నిర్వహించబడుతున్న ఇసుక కాంట్రాక్టర్, టీజీఎండిసి నిబంధనలను తుంగలో తొక్కి, నడి గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కుంట్లం గ్రామ శివారు వద్ద ఉన్న గోదావరి నుండి ఇసుకను రవాణా, చేయడం జరుగుతుంటే టీజీఎండిసి అధికార యంత్రాంగం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మిస్తే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఏలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వివరించడం, ఇసుక క్వారీ అంటేనే అధికారులకు ,”కన్ఫామ్ కమిట్మెంట్” అనే విధంగా మారింది. అందుకే ఏమో ఇసుక క్వారీల్లో అక్రమాలు, సరిహద్దులు దాటి ఇసుక తోడుతున్న ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

గత నెల ఏప్రిల్ 4వ తేదీ నుండి నేటి ధాత్రి వరుస కథనాలతో పి జి ఎం డి సి కింది స్థాయి అధికారి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు, ఇసుక వారిల్లో జరుగుతున్న అక్రమాలకు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, సూత్రధారి టీజీఎండిసి శాఖ అని సాక్షాలతో పైకి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఉన్నత అధికారులు టి జి ఎం డి సి మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్, దృష్టి సాధించకపోవడం కిందిస్థాయి అధికారులకు మరింత బలాన్ని చేకూర్చి, టి జి ఎం డి సి ఇసుక రీచ్ ల వద్ద ఉన్న సిబ్బంది నుండి మొదలుకొని ఉన్నత అధికారుల వరకు, చీకటి ఒప్పందాలు విచారణ పేరుతో హోటల్లో ముఖం వేసి కాంట్రాక్టర్లను పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది అన్నా తాజా సమాచారం, వీటిని పరిగణంలోకి తీసుకుంటే టీజీఎండిసి ఇసుక రీచుల అక్రమాలకు సూత్రధారి అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు.

 

TGMDC

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.మండల ప్రజలు.

ఇసుక అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకోవడంలో టి జి ఎం డి సి విఫలం కావడం జరిగింది. అక్రమ వ్యవహారాలపై అనేక సాక్షాలతో, తేరపై కి తీసుకువచ్చిన అధికార యంత్రాంగం, టీజీఎండిసి ఉన్నత అధికారులు స్పందించకపోవడం, ఇసుక కాంట్రాక్టర్లు అక్రమాల్లో మరింత రెట్టింపు ఉత్సాహం కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు ఇసుక రీచుల్లో నేటికీ అమలు కాకుండా, ఇసుక రీచుల్ల క్వాంటిటీ అయ్యేవరకు టీజీఎండిసి చీకటి ఒప్పందంతో, కాంట్రాక్టర్లకు శాఖ సిబ్బంది ద్వారా వసూలు చేయించి ఇవ్వడం లాంటి కొనసాగించడం తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక వ్యవహారంపై ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేలా ఇప్పటికే టీజీఎండిసి వివరించడం జరిగింది. టి జి ఎం డి సి ఇసుక అక్రమాలపై ఇక చర్యలు తీసుకునే పరిస్థితి లేదని ప్రజలకు కూడా స్పష్టం కావడం జరిగింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల వ్యవహారంపై దృష్టి సాధించి, రెవెన్యూ విజిలెన్స్ శాఖలను ఆదేశించి విచారణ చేపట్టి, ఇప్పటికీ పెద్ద మొత్తంలో అక్రమాలు చేపట్టిన క్వారీలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
వనపర్తి నేటిదాత్రి :

రాష్ట్రంలో
రైతులు పండిచి న వడ్లు కొనుగోలులో
రాష్ట్ర ప్రభుత్వ రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ సాగునీళ్ళు రావడం లేదని రాకున్నా రైతులు కష్టపడి పండించుకున్న వడ్లు వెంటనే కొనుగోలు జరగక రైతులు ఐ.కే.పి,పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని నిరంజన్ అన్నారు యాసంగి పంటలో ఎటువంటి తేమగాని,తరుగుకాని ఉండదు అధికారులు తేమ ఉందని కొన్నిరోజులు,తాలు ఉందని గన్ని బ్యాగులు లేవని ,లారీలు రాలేదని రైతులను ఇబ్బందిపెట్ట డమూ పై మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులు కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగుల వాడకం వల్ల అక్కడ కూడా రైతులు తరుగు కోల్పోవడం తో పాటు తేమ,తాళ్ళు అంటూ తరుగు కోల్పోవడంతో రైతులు తీవ్ర నష్టం ఎదురుకుంటున్నారని అన్నారు. రైతులు తూకం అయిపోగానే వాళ్ల పని అయిపోతలేదని బ్యాగులు నింపి ట్రాన్స్పోర్ట్ వరకు ఆగాలివస్తుందని వారికి సరిఅయిన సమయం అధికారులు చెప్పకపోవడం వల్ల రైతులు అన్ని పనులు వదులుకొని అక్కడ ఉండాల్సి వస్తుందని అన్నారు
మంత్రులు,అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేయాలని మాజి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతులకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను రైతులు వదులు కొని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసా పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఇమ్రాన్,నారాయణ నాయక్, మాజీద్,శ్రీనివాసులు ,తదితరులు పాల్గొన్నారు.

గణపురం లో బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్.

గణపురం లో బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్

నేడే సమ్మర్ కోచింగ్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు సమ్మర్ కోచింగ్ గా సీనియర్ కోచ్ మామిడి శెట్టి రవీందర్ ను నియమించినట్లు వారు తెలిపారు రవీందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు ఆదేశాల మేరకు గణపురం జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల ఆవరణంలో కోచింగ్ ఇవ్వబడుతుంది మే నెల ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని ఎండ తగలకుండా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పిల్లలకు మే ఒకటో తారీకు నుండి 6- 6 -2025 వరకు బాల్ బాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ ఇవ్వబడుతుంది వారు అన్నారు అండర్ 14 పిల్లలు ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 9030936615 ను సంప్రదించగలరు

ఘనంగా జరుపుకున్న బసవ జయంతి.

ఘనంగా జరుపుకున్న బసవ జయంతి…

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

బసవ జయంతి సందర్భంగా లింగాయత్ సమాజ్ ఝరాసంగం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ మాలిపటల్ గారి అధ్యక్షతన బసవేశ్వరుడికి పూలమాలలు వేసి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గాలప్ప పటేల్ మాలి పటేల్ సంతోష్ పటేల్ బొగ్గుల గాలెప్ప గారు నాగేశ్వర్ సర్జన్ శెట్టి, కంటాణం మల్లికార్జున స్వామి,బొగ్గుల నాగేశ్వర్ తమ్మలి రేవన సిద్దేశ్వర మడపతి నాగేశ్వర్ స్వామి గడ్డం మల్లన్న పటేల్ మరియు ఆలయ అర్చక సిబ్బంది మడుపతి నాగయ్య స్వామి మరియు తదితరులు పాల్గొని పూజలు చేయడం జరిగింది.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అక్షయ తృతీయ సందర్భంగా డిపో మేనేజర్ రవిచంద్ర తో పాటు అరుణ ఫర్టిలైజర్ యజమాని మాజీ ఛైర్మెన్ శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్ స్టోర్ యజమాని సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని లక్ష్మణ్ లు ప్రారంభించి మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది,ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన

ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తరం మండలంలో గతంలో నాటు సారాయి కేసులలో పట్టుబడిన పారుపల్లి లక్కారం మచ్చుపేట ఖమ్మం పల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలలోని వ్యక్తులను ఇకమీదట నాటు సారాయి అమ్మకుండా ఉండటానికి ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయల జరిమానతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి దగ్గర బైండోవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సిబ్బంది నిరంజన్ శ్రీనివాస్ రవి పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన.

నూతన వధూవరులను ఆశీర్వదించిన

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోనీ శివసాయి ఫంక్షన్ హాల్ లో గోపాల్ పూర్ గ్రామానికి చెందిన మేడ శైలజ – రవి పుత్రిక ప్రవళిక – నరేష్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం..

ధరణితో 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన భూ చట్టం.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

1971-72 సంవత్సరంలో భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పట్టాలు ఇచ్చినాం.2005 లో మరిన్ని భూ సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సాదాబైనామ ద్వారా భూ చట్టాల ప్రకారం రైతులకు పాస్ బుక్ లు ఇచ్చింది.గత ప్రభుత్వం కొత్త చట్టం చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు సరైన న్యాయం హక్కులు కలుగలేదు.ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుండి పూర్తి స్థాయిలో భూముల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది నిపుణులతో అధ్యయనం చేసి నూతన భూ భారతి చట్టాన్ని రూపొందించిందని దీంతో భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దదానికి ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంతో అమల్లోకి తెచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా భూ భారతి చట్టం పట్ల నర్సంపేట మండలంలోని రైతులకు రెవెన్యూ శాఖ,వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు.ముందుగా వరంగల్ రోడ్డు కూడలి నుండి రైతు వేదిక వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన కొద్ది రోజులకే పూర్తిస్థాయిలో గ్రామస్థాయి నుండి అన్ని రకాల సమస్యలు పరిష్కారం కోసం 90 రోజుల సమగ్ర సర్వే జరిపామన్నారు.ధరణి ఫోర్టర్ లో రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని సర్వేలో తేలిందని పేర్కొన్నారు.అందరికీ సరైన న్యాయం జరిగేందుకు గాను నిపుణులతో తయారుచేసి భూ భారతి చట్టం రూపాంతరం చెందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ఫోర్టల్ తో భూ చట్టం 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని ఆరోపించారు.నర్సంపేట మండలంలో 17 వేల ఎకరాల భూమి ఉండగా ఇప్పటివరకు 14600 ఎకరాలకు భూమి పట్టాలు ఇచ్చామని, నేపపద్యంలో మరో మూడు వేల పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని కాగా ప్రస్తుతం 4 వేల దరఖాస్తులు వచ్చాయి.ఈ భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను అవలీలగా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భూముల పట్ల గ్రామాల సమస్యలను గ్రామాల్లోనే సదస్సులు నిర్వహించి పరిశీలన చేసి అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తామని వివరించారు. 80 శాతం భూ సమస్యలు మండల స్థాయి ఎమ్మార్వో వద్ద పరిష్కారం అవుతాయని లేని యెడల ఆర్డీఓ,లేక కలెక్టర్ వద్ద తప్పనిసరిగా పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భూ భారతి చట్టం వలన భూముల సమస్యలు భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు వివరించారు.

భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంలో రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి మొత్తం 23 సెక్షన్స్ ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.మొత్తం 23 సెక్షన్ల భూ భారతి నూతన చట్టంపై
రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉన్న భూ చట్టం వలన రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా ఉండేందుకు గాను భూ భారతి చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు.భూమి అనేది ప్రతీ ఒక్కరికీ ముఖ్యమైనది. దానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఎలాంటి భూముల సమస్యలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటలిజెంట్ తో పెట్టిన చాట్ బాట్ ద్వారా సమస్య అవలీలగా పని పూర్తి అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి,ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్,ఏఈఓలు అశోక్ కుమార్, శ్యాం కుమార్, టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణోతు లక్ష్మణ్ నాయక్,మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్,నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేందర్,మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు చైర్మన్…

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు చైర్మన్…

జహీరాబాద్ నేటి ధాత్రి

లక్ష్మి కన్వేషన్ హాల్ కంకోల్ లో జరిగిన వివాహ వేడుకల్లో ల్గొపాని నూతన వధూవరులను ఆశీర్వదించిన జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి సర్పంచ్లు బస్వరాజ్,శ్రీనివాస్ రెడ్డి,కృష్ణ, పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ పాటిల్, ఉపసర్పంచ్లు మాణిక్యం యాదవ్, శివశంకర్, తదితరులు.

పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి.

డిసిసి అధ్యక్ష పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలి- అనుపురం పరశురాం గౌడ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలని యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడిపల్లి సత్యం పీహెచ్డీ చేసిన ఒక విద్యావేత్త, యువ నాయకులు, పేదల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే గొప్ప వ్యక్తి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగివున్న సత్యంకు డిసిసి అధ్యక్ష పదవిని అందించడం ద్వారా ముందు ముందు పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా యువత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను.!

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.

Shadikhana building

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.

రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

 

భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బడే నాగజ్యోతిని విమర్శించే స్థాయి నీది కాదు.

బడే నాగజ్యోతిని విమర్శించే స్థాయి నీది కాదు

హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు ఇరుప విజయ

#గత పది సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసామో ప్రజలకు తెలుసు..

#కాంట్రాక్టర్ల నుండి 12 శాతం కమిషన్లు తీసుకుంటున్నది మీ నాయకులే చెప్తుండ్రు.

#బడే నాగజ్యోతి ని విమర్శిస్తే మీరు నాయకురాలు అవుతారని అనుకోవడం నీ మూర్ఖత్వం

#ములుగును జిల్లాను చేసిందే బిఆర్ఎస్ పార్టీయే.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

గత పది సంవత్సరాలలో అధికారంలో ఉండి ఏం చేశారని మీరు అడుగుతున్నారు కదా పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ములుగు జిల్లా చేశాడు ట్రైబల్ యూనివర్సిటీ కి భూములు సేకరించి గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చిన యోధుడు కేసీఆర్ గిరిజనల్ పట్ల ఆధార అభిమానాలు చూపించాడు మల్లంపల్లి మండలం కేసీఆర్ ఉన్నప్పుడే చేశాడు అది మేము చేశామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు ములుగు మున్సిపాలిటీగా ప్రకటించింది కేసీఆర్ కాదా అది మర్చిపోతున్నారా మీరు అది కూడా మేమే తెచ్చామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు ఎటునాగారం రెవెన్యూ డివిజన్ చేసింది వాస్తవం కాదా దాన్ని తుంగలో తోక్కారు నాగారం బస్టాండ్ బస్ డిపో తెచ్చింది కేసీఆర్ టైంలో కాదా ? ఎటు నగరానికి అగ్నిమాపక కేంద్రం తెచ్చింది వాస్తవం కాదా గోదావరి పరివాహ ప్రాంతంలో కరకట్ట కేసీఆర్ టైంలో కదా శాంక్షన్ అయింది ఇప్పుడు ఎందుకు ఆగిందో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామపంచాయతీలను చేసిన చరిత్ర కేసీఆర్ కి ఉంది అందులో భాగంగానే కామారం గ్రామంలో రేగ కళ్యాణి సర్పంచ్ కావడానికి కూడా కేసీఆర్ ఏ కారణమనే సంగతి రేగ కళ్యాణి మర్చిపోతున్నావు మీ తాడువాయి గ్రామాలలో మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనబడట్లేదా తాడువాయి మండలంతో సహా మీ గ్రామం కామారంతో సహా ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల నీళ్లు ఇస్తున్నది మీకు కనబడట్లేదా ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసిఆర్ ఉంటే మీరు వాటిని తుడిపేసే ఘనకార్యం లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కి ఎక్కడ పేరు వస్తుందోనని కెసిఆర్ కిట్టును తీసేసి అత్యధికంగా ఉన్న గిరిజనలు పేద ప్రజలు ఉన్న ములుగు జిల్లాలో కేసీఆర్ కిట్టును అందనీయకుండా చేసింది మీరు కాదా ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకుని కేసీఆర్ ని బడే నాగజ్యోతిని విమర్శించే నైతిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నది మీరు కాదా ములుగు జిల్లా వెనుకబడ్డ జిల్లా అని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ములుగు నియోజకవర్గంలో కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి ఇచ్చింది నిజం కాదా దాంట్లో అప్పటి ఎమ్మెల్యే సీతక్క అనేక నిధులు దయాకర్ రావు ద్వారా తెచ్చుకుని చేసింది వాస్తవం కాదా బడే నాగజ్యోతికి రాజకీయ బిక్ష పెట్టింది సీతక్క అని అనటం కూడా విడ్డూరంగా ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచిగా కాల్వపల్లి ప్రజలు గుండెల్లో ఉంచుకొని తనని గెలిపించుకున్నారు తప్ప సీతక్క దయా దక్షిణాల మీద కాదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని ఇంకొకసారి బడే నాగజ్యోతిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మతిభ్రమించలేదని కేసీఆర్ రజితోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మతిభ్రమించి అవాక్కులు చవాకులు పేలుతూ లేనిపోని ఆరోపణ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అక్రమాల గురించి మాట్లాడిన వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపడమే పరమావధిగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం సీతక్కని విమర్శించి బడే నాగజ్యోతి నాయకురాలు కావాల్సిన అవసరం లేదు బడే కుటుంబం అంటే ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు విప్లవ త్యాగాలతో బడే నాగజ్యోతి అమ్మానాన్నలు వాళ్ళ బాబాయి ప్రాణత్యాగం అర్పించి ఇక్కడ ఉన్న గిరిజనుల ఈ ప్రాంత ప్రజల తరపున పోరాడి అమరులైన కుటుంబం వారి త్యాగాల పురిటి నొప్పుల నుంచి ఉద్భవించిందే బడే నాగజ్యోతి ఆ సంగతి మీరు మర్చిపోతున్నారా రేగ కళ్యాణి ఇప్పుడు సీతక్క మెప్పుల కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పుల కోసం విమర్శిస్తుంది కావచ్చు బడే నాగజ్యోతికి ఆ అవసరం లేదు ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ మీద ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి మీద అనవసరమైన ఆరోపణలు చేసే బదులు ములుగు నియోజకవర్గ మీద అభివృద్ధి మీద సంక్షేమ పథకాలు అమలు చేసే మీద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే విధంగా పని చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.

అనుమతులు లేకుండా నడిపిస్తున్న.!

అనుమతులు లేకుండా నడిపిస్తున్న జూనియర్ కళాశాలలను మూసివేయాలి

డి ఐ ఈ ఓ గోపాల్ కి వినతిపత్రం అందజేత

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు
ఎల్తూరి సాయికుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జూనియర్ కళాశాలను నడిపిస్తున్న చైర్మన్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ,కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కాలేజ్ స్ట్రక్చర్ లేకుండా నడిపించడమే కాకుండా జేఈఈ,మెయిన్స్ పేరిట లక్షల రూపాయలు విద్యార్థుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న కళాశాలల చైర్మన్లు, పర్మిషన్ ఉన్న బ్రాంచ్ వద్ద అడ్మిషన్ చేర్చుకొని అక్కడ క్లాసులు చెప్పకుండా విచ్చలవిడిగా అద్దె భవనాలు తీసుకొని అక్కడ కళాశాలలను నడిపించడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థులకు బాధ్యత ఎవరు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి ఐ ఈ ఓ స్పందించి తక్షణమే అనుమతులు లేని కాలేజీలను మూసివేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శివకుమార్, సిద్ధార్థ , విక్రం, సాత్విక్ ,శ్రావణ్, జస్వంత్ ,సాయి ,ముఖేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు.

బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు

విభేదాల సమస్య సమన్వయం జరిగేనా!

పార్టీ సస్పెండ్ ను ఎత్తి వెయ్యాలని డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలకు సమస్య సమన్వ యం జరుగుతుందా! గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య సమస్య తీరుతుందో లేదో !ఈ సమస్య ఇంతవరకు ఓ కొలిక్కి వచ్చిన దాఖనాలు కల్పించడం లేదు ఈ వివాదం ఇంకా చక్క బడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాప కింద నీరులా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమస్య పోతాయా! బీఆర్ఎస్ పార్టీ మండల పరిధిలో కార్యకర్తలకు సమావేశం నిర్వహించినప్పుడు మమ్మల్ని దూరంగా ఉంచడం నిదర్శనం. కేసీఆర్ జెండా ఎజెండా కింద మేము పనిచేస్తాం. బీఆర్ఎస్ పుట్టుక నుండి ఉద్యమం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధాకరం. పార్టీ నుండి సస్పెండ్ ను ఎత్తివే యాలని డిమాండ్ చేశారు.

 

BRS

 

కారులో కొట్లాట

మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నా యి చాలా గ్రామాల్లో గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య కొట్లాటలు చోటు చేసుకుంటు న్నాయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఒకరిపై ఒకరు దుష్ప్రచారం కొనసాగు తుంది. సమస్యను సమన్వ యము చేయకపోతే పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బరచ గలదో వేచి చూడా ల్సిందే మరి!ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ నిమ్మల మహేందర్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఇమ్మడిశెట్టి రవీందర్, మాజీ మండల ఉపాధ్యక్షులు పల్లెబోయిన సారయ్య, అశోక్, జుపాక సారయ్య అరికెళ్ల వీరయ్య దూదిపాల మల్లారెడ్డి దూదిపాల రాజిరెడ్డి జిల్లా యువజన నాయకులు విజయ్ కుమార్ ,కొత్తగట్టు సాయి ,మండల యూత్ నాయకులు బెరుగు తరుణ్ గోపి, సాగర్ ,గజ్జి శంకర్, బుర్ర విజయ్ ,బుర్ర గణేష్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న..

రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,

◆ మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు మంగళవారం పట్టణం లోని బసవ మంటపం లో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్
ఈ సంధర్బంగా డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు,ప్రేమతత్వం, సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని విశ్వమానవాళికి ప్రబోధించిన మహాత్మ శ్రీ బసవేశ్వరుడి చూపిన మార్గంలో నడవాలాన్నారు.బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రక్త దాన కార్యక్రమాలు చేయడం ఒక పుణ్య కార్యం అని,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజశేఖర్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,అశ్విన్ పాటిల్,రంగా అరుణ్ కుమార్, కుతుబోద్దిన్,తాజోద్దిన్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,బి.జి.సందీప్ మరియు రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version