ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు.

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు

ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని వినతి

పరకాల నేటిధాత్రి:

ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుబొచ్చు కళ్యాణ్ అన్నారు.ఆర్సిఓకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ మరియు కాలేజీ సమస్యలు పరిష్కరించాలని,అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అద్దె భవనంలో ఉంటున్నటి విద్యార్థులకు వాటర్ మరియు బాత్రూం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్ కు సొంతభవనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్ పాల్గొన్నారు.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

వీణవంక మండల కేంద్రంలో అతి పెద్ద కల్వల చెరువు పై ఆధారపడి సుమారు 300 మంది మత్స్యకారులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చెరువు యొక్క తూము మరమ్మత్తులు చెడిపోయి నీరు వృధాగా పోవడం వలన చెరువులలో చేపలు చనిపోతున్నాయి దీనివలన మత్స్యకారుల జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తూము మరమ్మత్తులు చేయగలరని మా యొక్క మనవి వారు కోరినారు ఈ కార్యక్రమంలో వీణవంకమత్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మోటం,వెంకటేష్ సెక్రెటరీ రాయిశెట్టి కుమారస్వామి డైరెక్టర్ చుక్కల రవీందర్, సభ్యులు రాయిశెట్టి వెంకటేష్, గట్టు రామయ్య, రాయిశెట్టి రమేష్, చొప్పరి సునీల్, నాయిని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.!

ఎమ్మెల్యే రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ నాయకులు బొచ్చు కళ్యాణ్,మడికొండ ప్రశాంత్ లు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ లను విడుదల చేయాలని అదే విధంగా పరకాల పట్టణంలో ఎస్సీ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మించాలని పరకాల పట్టణంలో ఉన్న ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరమన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version