మంద మహేష్ బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్
గణపురం నేటి ధాత్రి :
గణపురం మండల పోలీసులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందస్తు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బి జే వైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఆరోగ్యం అనే ప్రజల యొక్క కనీస అవసరాలను మరిచిపోయి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించడానికి ఉన్న సమయం చదువుకునే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ అకాల వానలతో చేతికొచ్చిన పంటలను కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి సమయం ఉండాదని ఎద్దేవ చేశారు సరస్వతి పుష్కరాలకు కోట్ల రూపాయల డబ్బుతో భక్తుల సౌకర్యాలకు పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాకపోయినా ఆగమేఘాల మీద పుష్కరాలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని అన్నారు
బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ పిల్లలకు వైట్ టోపీలు
సీనియర్ కోచ్ మామిడిశెట్టి రవీందర్
గణపురం నేటి ధాత్రి
Ball badminton
గణపురం మండల కేంద్రంలో బాల్ బ్యాడ్మింటన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ కోచ్ మామిడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో బాల్ బ్యాడ్మింటన్ సమర్ కోచింగ్ కు పిల్లలకు ఎండ దెబ్బ తాకకుండా వైట్ క్యాప్ లను స్పాన్సర్ చేసిన ఉప్పుగల్లు గ్రామానికి చెందిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వైట్ క్యాప్ లను బహుమతి గా ఇచ్చారు ఇందులో పాల్గొన్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సాంబయ్య సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రమేష్ చిరంజీవి సతీష్ మహేందర్ బుచ్చి రెడ్డి హంచత్ ఈర్ల స్వామి పాల్గొన్నారు ఈ యొక్క గణపురం క్యాంప్ కే కాకుండా వేములపల్లి క్యాంపు కూడా 20 టోపీలను అందజేయడం జరిగింది ఇంకా ఏ అవసరం పడ్డ నన్ను అడగండి అని అన్నారు
వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన
★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి :
కోహిర్ మండలంలోని మనియర్పల్లి గ్రామ. కాంగ్రెస్ నాయకులు దేవదాస్ గారి సోదరుని కుమారుని వివాహనికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,జె జె కన్స్ట్రక్షన్ జావీద్ భాయ్,ఎస్సి సెల్ ఛైర్మెన్ అనిల్,కోహిర్ పట్టణ అధ్యక్షులు శంషీర్,మాజీ సర్పంచ్ రచన్న,గ్రామ కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుక ళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించినారు స్వామివారికి విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యా వచనము ద్వాదశ ఆరాధన లతో వివిధ రకాల పుష్పాలతో పుష్ప యాగాన్ని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు వీరవల్లి వేణుగోపాలాచార్యు లు వేదమంత్రాలు మధ్య నిర్వహించినారు మత్స్యగిరి స్వామి శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి వేద పారాయణాలను చేసుకుంటూ దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఊరేగించారు ఒక్కొక్కసారి ఒక్కో వాయిద్యం తో 12 రకాల వాయిద్యాలతో 12సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పండిత సన్మానం చేసినారు పండిత సన్మానంతో శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సైనా రెడ్డి కృపాకర్ రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి శివరామకృష్ణ రెడ్డి మనీష్ రెడ్డి కందగట్ల కోటేశ్వరరావు సామల రవీందర్ కుసుమ శరత్ బాబు దిండిగాల వంశీ కాంబత్తుల ప్రకాష్ బాసని వెంకటేశ్వర్లు నామనిశివ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
బైక్ ఇప్పించడం లేదని బావిలోకి యువకుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన న్యాల్కల్ మండలం మామిడిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సాల్మన్ (32) బైక్ ఇప్పించాలని తల్లితో తరచుగా గొడవపడేవాడు. గురువారం కూడా తల్లితో గొడవపడి బయటికి వెళ్లి గ్రామంలో ఉన్న బావిలో దూకాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు సాల్మన్ ను బయటకు తీశారు.
పలు సంఘాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు..మజ్జిక పంపిణీ.
వరంగల్/నర్సంపేట నేటిధాత్రి:
గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా గీసుకొండ సోషల్ సర్వీస్ టీం,స్థానిక గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనాయమాకుల బస్ స్టాండ్ లో ప్రయాణీకులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సంపేట బస్ డిపో ఎంఎఫ్ ప్రభాకర్, ఏఈ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మండుటెండల్లో విధులు నిర్వహించనున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లకు 100 మందికి తెల్ల రుమాళ్లను కూడా లక్ష్మీనారాయణ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, మాజీ చైర్మన్ రామా కుమారస్వామి, ఆర్టీసీ ఉద్యోగి వంగల రాంబాబు,గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ,యాదగిరి కుమారస్వామి,పసుల సంపత్, వటుకుల రవికుమార్, గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం అధ్యక్ష కోశాధికారులు కర్ణకంటి రజిత, కత్తి హేమలత, గౌరవ సలహాదారులు కక్కెర్ల సుజాత, వీరగొని హేమలత,పసుల సునిత తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు
మల్లాపూర్ మే 15 నేటి ధాత్రి:
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాదం నాగరాజు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది మండలానికి చెందిన అఖిలభారత మహాసభ మండల యాదవ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏదైనా అవసర నిమిత్తం అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనరేకుల సంతోష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్, కార్యవర్గ సభ్యులు బండారి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంగ గంగారాజం, జిల్లా యూత్ అధ్యక్షులు రేబ్బటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహేష్, మామిడి తిరుపతి, రాజలింగం మాదం రాజేందర్, రాజు గణేష్ , అంజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కో-పరేటివ్ సెంటర్లో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన జరిగేటువంటీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని దీని ద్వారా పెట్టుబడిదారి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం,అసంఘటిత రంగాల కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;వేటగాని శ్రీనివాస్,కలపాక వంశీ,జల్లే జాన్సన్,యాటగాని రాములు,గడ్డం నరసయ్య,పానుగంటి రాములు,అయినల శ్రీనివాస్,చాగంటి రాములు,కలపాక శ్రీను,మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో అష్ట తీర్థాల సంగమంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకుగాను అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. బుధవారం మండల కేంద్రమైన ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే మార్గంలో పారిశుద్ధ్య, మొక్కల సంరక్షణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవి ధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూసు కోవాలన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అంద జేయాలన్నారు. మేదపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావే శంలో జిల్లా పరిషత్ సీఈవో జానకిరామ్ రెడ్డి, డీపీఓ సాయి బాబా, జహీరాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ మల్లు రవి పత్రిక సమావేశం నిర్వహించి ఈ నెల 18వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు గ్రామంలో గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా గిరి జల సౌర వికాస్ పథకాన్ని రూ. 12,600 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పత్రిక సమావేశం నిర్వహించి తెలియజేశారు. ఇందిర జల సౌర వికాస్ పథకం ద్వారా గిరిజనులు అభివృద్ధికి,వారి సంక్షేమం కోసం,వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పాడుతుంది అని ఎంపీ మల్లు రవి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలోపాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ ,కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి వద్ద ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసి మా పుట్ట కొడుతున్నారు.
వెంటనే స్కూల్ బస్సులను నిలిపివేయాలి.
పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్ల నిరసన. రోడ్డుపై బైఠాయి.
మహదేవ్పూర్ -నేటి ధాత్రి;
కాలేశ్వరం బస్టాండ్ వద్ద స్థానిక ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు బస్టాండ్ నుండి గోదావరి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో స్థానిక ఆటోల్లో భక్తులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా భక్తులను ఆటోలో తరలించడంతో స్థానిక ఆటో డ్రైవర్లకు ఉపాధి కలుగుతుంది. కానీ పుష్కరాల సందర్భంగా మండలానికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల వాహనాలను భక్తుల కు గోదావరి వద్ద తరలించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తక్షణమే స్కూల్ బస్సులను తీసివేయాలంటూ ఆటో డ్రైవర్లు సుమారు రెండు గంటల పాటు ధర్నా కొనసాగించడం జరిగింది. పోలీసుల జోక్యంతో ఆటో డ్రైవర్లు ధర్నా ను విరమించినట్లు తెలుస్తుంది.
ఆదివాసీ యువకుడి పై దాడి చేసిన గిరిజనేతరుడి పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్..
.. ఆదివాసీ నవనిర్మాణ సేన, తుడుందెబ్బ సంఘాలు…
వలస గిరిజనేతరుల నుండీ ఆదివాసీలకు రక్షణ కల్పించాలి..
ఆదివాసీల పైన అగ్రవర్ణాల ఆగడాలను అరికట్టాలి.
ఎస్సై రాజ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు..
నూగూర్ వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం నేటి ధాత్రి:
ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. మండపాక గ్రామానికి చెందిన తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ పైన విచక్షణ రహితంగా దాడి చేసిన నాగేంద్ర బాబు రాజు పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాయం జానకి రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాయకులు నర్సింహా మూర్తి, పాయం జానకిరావు వాజేడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రాజ్ కుమార్ ని కలిసి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసినారు. తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ యువకుడిని వాజేడు గ్రామానికి చెందిన కృష్ణబాబు రాజు తన ఇంటి ఆవరణలో ఉన్న మట్టి దిబ్బలు చదును చేయమని ట్రాక్టర్ డ్రైవర్ తోలేం సర్వేశ్వరరావు ని తీసుకెళ్ళినరాని అన్నారు. పని చేస్తున్న డ్రైవర్ ని నాగేంద్ర బాబు రాజు అకారణంగా కొడుతూ,కులం పేరుతో దుర్భాషలు ఆడినట్టు ఫిర్యాదు లో పేర్కొన్నట్టు తెలిపారు. అనంతరం ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి, పాయం జానకి రావు మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరుల వల్ల ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆరోపించారు. పని చేస్తున్న యువకుడి పైన రాత్రి ఏడున్నర గంటల సమయం లో దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. యువకుడి పై దాడి చేయడం తో పాటు ట్రాక్టర్ పైన కూడా రాళ్లతో దాడి చేసినారని అన్నారు.యువకుడి తండ్రి ముందు కూడా కొడుతూ హైదరాబాద్ బాద్ నుండి రౌడీలను తెప్పిస్తా ట్రాక్టర్ ని పెట్రోలు పోసి కాల్చేస్తా అని బెదిరించినట్టు నాయకులు మీడియా కు తెలిపారు. అగ్రవర్ణాలకు ఆదివాసీల పైన అంత అక్కస్సు ఎందుకని అన్నారు. వలస వచ్చి వాజేడు మండలం లో ఉన్న సారవంత మైన వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు తెలిపారు. ఇక్కడున్న స్థానిక గిరిజన గిరిజనేతరుల పైన పెత్తనం చెలయిస్తూ ఉన్నారని అన్నారు. పూర్వం వాజేడు మండలం లోని ఆదివాసీల పైన అరాచకాలు, హత్యలు, హత్యా చారాలు చేసినారని అన్నారు.రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని నేటికీ వాజేడు మండలం లో వలస గిరిజనేతరుల అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడున్న ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వ భూములకు పట్టాలు చేపించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వాదులకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధన్యత ఇస్తూ ఉండడం కారణంగానే ఆదివాసీల పైన దుర్మార్గాలకు తెగపడుతున్నారని అన్నారు. వలస గిరిజనేతరుల స్వాధీనం లో ఉన్న గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. తోలేం సర్వేశ్వర్ రావు పైన జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజం పైన జరిగిన దాడి గా నాయకులు పేర్కొన్నారు. అగ్రవర్ణాలు అహంకారం తో ఆదివాసీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారని అన్నారు. తోలేం సర్వేశ్వర్రావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే వాజేడు లో భారీ ర్యాలీ చేస్తామని నాయకులు ప్రకటించారు. నాయకులు మోడెం నాగరాజు, నల్లేబోయిన సర్వేష్, కుంజ మహేష్, యుగంధర్,చాప కిరణ్, మండపాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి :
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి. షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది… సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాలకు. సంబంధించి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్. చెక్కులను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక మార్కండేయ భవన్ లో ఏర్పాటుచేసిన. దానిలో భాగంగా మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి . షాది ముబారక్. చెక్కుల పంపిణీలను. స్థానిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు. తంగళ్ళపల్లి ఎమ్మార్వో సంబంధిత అధికారుల. చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా. కొంచెం ఆలస్యం.అయిన అర్హులందరికీ. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్. చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి. ఎమ్మార్వో . జయత్ కుమార్. జిల్లా గ్రంధాల చైర్మన్ నాగుల సత్య నారాయణ గౌడ్. సిరిసిల్ల ఏఎంసి. చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరాల శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధనకు శ్రవణ కుమారికి డాక్టరేట్
నేటిధాత్రి:
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (ఆటనామస్) కంప్యూటర్ సైన్స్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న కుడికాల శ్రవణ కుమారికి కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి. మంజుల గారి పర్యవేక్షణలో పరిశోధన గ్రంధం సమర్పించిందుకు గాను కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ట రాజేందర్ డాక్టరేట్ ప్రకటించారు. డాక్టరేట్ సాధించిన వీరిని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హన్మకొండ ప్రిన్సిపాల్ కె. రజనీలత మరియు అధ్యాపకులు అభినందించారు. తన పిహెడి పరిశోధన సాధనలో ఎల్ల వేళల సహాయ సహకారం అందించిన సూపర్వైజర్, అధ్యాపక బృందానికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఝరాసంగం తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
జహీరాబాద్ నేటి ధాత్రి :
జహీరాబాద్ ఝరాసంగం మండల గ్రామాల్లో బంగ్లాగడ్డ కాలనీ ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు బంగ్లాగడ్డ కాలనీ చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు.
Jhara Sangam
జిల్లా కలెక్టర్ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 5 రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో నీరు వృథాగా పోతున్నది.అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.
Jhara Sangam
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.
ఎండ తీవ్రతకు సరస్వతీ పుష్కరాల్లో ఎక్కడి వారు ఆక్కడే.
కిక్కిరిసిన సెలవ పందిర్లు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
సరస్వతి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు దర్శనాలకు వచ్చిన భక్తులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు ఐదుగురు అస్తవ్యస్తకు గురికావడం జరిగింది. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందని సమాచారం. మిగతా నలుగురు భక్తులు కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాకు చెందిన వారిని తెలిసింది. అస్తవ్యస్తకు గురైన వారందరికీ ప్రధమ చికిత్స కేంద్రానికి తరలించి చికిత్సను అందించడం జరుగుతుందని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులందరూ చలవ పందిళ్లకు పరిమితం కావడంతో చలవ పందిళ్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నాలుగు తర్వాత భక్తులు గోదావరి స్థానానికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది.
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తిప్పని లక్ష్మి మరియు తీర్తాల సుస్మిత కి హస్పెటల్ ఖర్చుల కొరకు నాయకుడు పేదలకు ఆధర్షవంతుడు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహయనిధి(సీఎం ఆర్ఎఫ్ )Rs. 52000/ల చెక్కులను చిట్యాల మండల కాంగ్రేస్ పార్టీ వర్క్ంగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్,అదజేయడం జరిగింది . ఈ కార్యక్రమం లోపిఎసియస్ వైస్ చైర్మెన్ ఏరుకొండ గణపతి గ్రామ శాఖ అధ్యక్షులు నీలం కుమార స్వామి నా యకులు తాటి కంటి మల్లయ్య, చెవుల రమేశ్, సంపెల్లి రాజు తదితరులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని రాయపర్తి రైతు వంతడుపుల సుజాత వారి ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యానశాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ 100% భరోసా కల్పిస్తుంది, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ మాట్లాడుతూ ఇంకా విస్తీర్ణం పెంచేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ టన్నుకు ధర 21000 ఉంది. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము.అదేవిధంగా నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన,ఆయిల్ ఫామ్ తోటలకు డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని రైతులకు వివరించడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధతతో కూడుకున్నది మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడికి కృషి చేయాలని రైతులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, హెచ్ ఓ టెక్నికల రాకేష్, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ,ఫీల్డ్ ఆఫీసర్ భరత్ తదితర రైతులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాస్తు గాయపడగా ఆయన ను పరామర్శించిన. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పెళ్లి బిక్షపతి కొన్ని రోజుల క్రితం గాయపడగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి. పరామర్శించి. వారికి మనో ధైర్యం చెప్పి అండగా ఉంటామని పార్టీ పరంగా గాని ప్రభుత్వపరంగా కానీ తగిన సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి గాయపడిన బిక్షపతికి కుటుంబానికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. బి ఆర్ ఎస్ పార్టీ. తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజ భీంకర్ రాజన్న. పాక్స్. వైస్ చైర్మన్. ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. పార్టీ సీనియర్ నాయకులు. పడిగల రాజు. గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్. జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్. కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్. తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ నాయకులు క్యారం జగత్ కుమార్. భాను. మూర్తి. నేరెళ్ల అనిల్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.