జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు

జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు

నస్పూర్,నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కార్యాలయం నందు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బి ఎం ఎస్) ఆధ్వర్యంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం రోజున జరిగినది.ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూలై 9న కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఉద్దేశాలతో పిలిచిన దేశవ్యాప్త సమ్మెలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) పాల్గొనదని స్పష్టం చేశారు.దేశంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లుగా రూపుదిద్దిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వాటిలో వేతనాల కోడ్ 2019 మరియు సామాజిక భద్రత కోడ్ 2020లను బిఎంఎస్ స్వాగతించిందని పేర్కొన్నారు.ఈ కోడ్‌ల ద్వారా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన హక్కు,గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత వంటి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని వివరించారు.ఇతర రెండు కోడ్‌లైన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020,ఆక్యుపెన్షియల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో కొన్ని సవరణలు అవసరమని పేర్కొన్నారు.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ,మరింత లోతుగా చర్చించి వీలైనంత త్వరగా సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాజకీయ ప్రయోజనాల కోణంలో కొన్ని కార్మిక సంఘాలు జూలై 9 సమ్మెకు పిలుపునిస్తున్నప్పటికీ,బిఎంఎస్ మాత్రం కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు.అందుకే కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరిచి ఆ సమ్మెలో పాల్గొనరాదని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాగం రాజేందర్ ఏరియా సెక్రటరీ,ఐలవేణి శ్రీనివాస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,భూoపల్లి రమేష్ జాయింట్ సెక్రెటరీ,కట్కూరి సతీష్ జాయింట్ సెక్రెటరీ,శాంతం సంపత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,గోళ్ళ మహేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,కిరణ్ కుమార్,గోనె రామకృష్ణ ఆర్కే 5 పిట్ సెక్రెటరీ,కుంట రాజు ఆర్కే 7 అసిస్టెంట్ సెక్రటరీ,కొమ్మ బాపు,ఎస్ అండ్ పి సి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు టి యు డబ్ల్యు జె ఐ జె యు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్ని దానాల కన్నరక్త దానం గొప్పదనం గొప్పదని అన్నారు, ఈ రక్తదాన శిబిరంలో జర్నలిస్టులందరూ పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, శామంతుల శ్యామ్ ఐజేయు జిల్లా జిల్లా నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు పుల్ల రవితేజ, వెల్దండ సత్యనారాయణ, శృంగారపు రంగాచారి, బోల రాజేందర్, బుర్ర రమేష్, గుర్రం రాజమౌళి, కటుకూరి శ్రీనివాస్, సరి గొమ్ముల రాజేందర్, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్.

మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని బర్దీపూర్ ఆశ్రమంలో గత నలభై రోజులుగా . డా.సిద్ధేశ్వర అవదూత గిరి మహరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారుద్ర యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అని ఈ సందర్భంగా మేధపల్లి తాజ్ మాజీ సర్పంచ్ పరమేశ్వర పాటిల్.మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసా శక్తుల పీడ నివారణకై.చేపడుతున్న ఇట్టి యజ్ఞంలో పాల్గొనడం తో చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఇలాంటి యజ్ఞాలు మరిన్ని చేయాలని దేశ సైనికులకు ప్రజలకు శాంతీ సౌభాగ్యం కలిగించాలని శత్రు పీడ నశించాలి అని లోక కళ్యాణఅర్థం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

దేశవ్యాప్త సంఘటితంగా అందరూ పాల్గొనాలి .!

దేశవ్యాప్త సమ్మెలో సంఘటితంగా అందరూ పాల్గొనాలి

ఏ ఐ సి టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం నేటి ధాత్రి :

 

 

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కో-పరేటివ్ సెంటర్లో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన జరిగేటువంటీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని దీని ద్వారా పెట్టుబడిదారి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం,అసంఘటిత రంగాల కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;వేటగాని శ్రీనివాస్,కలపాక వంశీ,జల్లే జాన్సన్,యాటగాని రాములు,గడ్డం నరసయ్య,పానుగంటి రాములు,అయినల శ్రీనివాస్,చాగంటి రాములు,కలపాక శ్రీను,మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా మే 6వ తేదీ మంగళవారం జహీరాబాద్‌లో జరిగే మహిళల నిరసన సమావేశంలో పాల్గొనమని విజ్ఞప్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన దేశవ్యాప్త నిరసన ఉద్యమం “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్”లో భాగంగా, “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్” అనే పేరుతో మహిళల చారిత్రాత్మక కేంద్ర సర్వసభ్య నిరసన సమావేశం 2025 మే 6 మంగళవారం ఉదయం 10:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్థానిక ప్రచారకర్త హజ్రత్ మౌలానా అతిక్ అహ్మద్ కాస్మి అధ్యక్షతన జరుగుతుందని ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి కానో మరియు ఎండోమెంట్స్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ జహీరాబాద్ తెలియజేశారు. ఈ సమావేశానికి హజ్రత్ మౌలానా ఘియాస్ అహ్మద్ రషాది, కన్వేజ్, వక్ఫ్ బచా క్యాంపెయిన్, తెలంగాణ, శ్రీమతి న్యాయవాది జలీసా యాస్మిన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఇంచార్జి, వీరితో పాటు జామియా గుల్షాన్ గర్ల్ టీచర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, జామియా గుల్షన్ హనీస్ ఖైరీ- జమాతే ఇస్లామీ మహిళా విభాగం అధిపతి బుష్రా అఫ్రోజ్, సున్నీ దావత్-ఏ-ఇస్లామీ మహిళా విభాగం ఇన్‌చార్జి జహీర్ అబా, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ – ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, మిస్టర్ ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ, స్థానిక జమాత్ ఘోరీ ఈ సమావేశానికి సయ్యద్ జియావుద్దీన్ మౌలానా మసూమ్ ఆలం కూడా హాజరుకానున్నారు. జహీరాబాద్ నగరం మరియు హదీసు పరిసర ప్రాంతాల మహిళలు మరియు బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జాతీయ ఐక్యత మరియు ఇస్లామిక్ మద్దతును ప్రదర్శించాలని జమియత్ ఉలేమా, జమాతే-ఇ-ఇస్లామి, సఫా బైతుల్ మల్, సున్నీ దావత్-ఇ-ఇస్లామి, జమియత్ అహ్లే యాత్ ముస్లిం యాక్షన్ కమిటీ మరియు అన్ని ఇతర సంస్థల నాయకులు విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version