కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

చిట్యాల నేటి ధాత్రి

 

కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు గా మురహరి తిరుపతి (ట్రిమ్స్) ను నియమించినట్టు కెటిఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ప్రకటించారు.. వారికి నియమకపత్రాన్ని చిట్యాల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారితో కలిసి చిట్యాల మండల కేంద్రంలో అందించారు..ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మాజీ జడ్పీటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏరుకొండ రాజేందర్, పెరుమాండ్ల రవీందర్, దూదిపాల తిరుపతి రెడ్డి, ఆరె పల్లి సమ్మయ్య, యూత్ నాయకులు గుండు నగేష్ తదితరులు. పాల్గొన్నారు…

నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా.

నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా

పరకాల- భూపాలపల్లి ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో నిర్వహణ

సీఐ రంజిత్ రావు

శాయంపేట నేటిధాత్రి!

 

తేది: 04-04-2025 రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కావున శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువత మీ సర్టిఫికెట్లతో తప్పకుండా జాబ్ మేళాలో పాల్గొని మీకున్నటు వంటి స్కిల్స్, టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ద్వారా ఉద్యోగాలు పొందండి. జాబ్ మేళా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కావున నిరుద్యోగ యువత అందరూ పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

దొంతికి మంత్రిపదవి రావాలని మోకాళ్ళ నడకతో దర్శనం.

దొంతికి మంత్రిపదవి రావాలని మోకాళ్ళ నడకతో దర్శనం.

 

కొమ్మాల దేవాలయం మెట్లపై కాంగ్రెస్ నాయకుల వినూత్న ప్రయాణం.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ దుగ్గొండి మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో
గీసుకొండ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గుట్టపైకి మెట్ల నుండి మోకాళ్ళ నడకతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

Congress

మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీలు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తెచ్చిన ఘనత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సాంస్కృతిక అధ్యక్షులు గుండెకారి సునీల్,నాచినపల్లి గ్రామ యూత్ అధ్యక్షులు ఇజ్జగిరి నరేష్,
మహ్మదాపురం గ్రామ యూత్ అధ్యక్షులు ఆడెపు అనిల్,మండల యూత్ నాయకులు బండారి ప్రకాష్ గారు,కూరతోట సురేష్ గారు,మునుకుంట్ల నాగరాజు,భూక్య గోపి,దండు రాజేందర్,మ్యాక అశోక్,గంగారపు శ్రీకాంత్,కొమాకుల రఘుపతి,బూర్గుల రాజబాబు,ఇజ్జగిరి యశ్వంత్ లు పాల్గొన్నారు.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజురమేష్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి మండల పరిసరప్రాంత ప్రజలకు విశ్వవసు నామ నూతన తెలుగుసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతమని ఇది హిందూ చాంద్రమాన పంచాంగ ప్రకారం సంవత్సరంలో తొలి రోజని ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంతో భక్తి,శ్రద్ధలతో జరుపుకుంటారని కొత్త ఆశయాలతో,కొత్త సంకల్పాలతో జీవన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేసి జీవితం లోని ఆరు రుచులను ఆస్వాదిస్తూ. బంధుమిత్రులతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలని ఈ పండుగ సందర్బంగా నూతన ఉత్సాహాన్ని,శుభ ఫలితాలను అందిస్తుందన్నారు.ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం ఆనవాయితీ. శుభ కార్యాలు ప్రారంభించేందుకు ఇది అత్యుత్తమమైన సమయమని ఉగాది సందేశం. కొత్త ఆరంభాలకు,పండుగ రోజు మనం చేసే ప్రతి పని మనకు సంతృప్తిని అందిస్తుందని ఈ ఉగాది మీ జీవితాన్ని ఆనందం,ఆరోగ్యం,శాంతితో నింపాలి కొత్త సంవత్సరం మీకు విజయాలు,సంతోషాన్ని తీసుకురావాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమాన్ టెకిడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతలు పూలమాలలు వేశారు .

ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .

1982లో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 1983 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 0 2 అసెంబ్లీ సీట్లు ఎన్టీ రామారావు గెలిపించారని గుర్తు చేశారు పటేళ్లు పట్వార్లు ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన తెలిపారు .

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇల్లు కట్టించారని జూరాల ప్రాజెక్టు హయంలోనే నిర్మించాలని రెండు రూపాయల కిలో ప్రజలకు బియ్యం పథకం అమలు చేశారని మైనార్టీలకు బీసీలకు న్యాయం చేశారని ఆయన తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడానికి మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు .

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలు జెడ్పిటిసిలు ఎం పీ టీ సీ లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బి రాములు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ పోటీ చేస్తుందా అని విలేకరుల ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు ఉన్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని వారికి భవిష్యత్తు ఉంటుందని బి రాములు తెలిపారు .

ఈ విలేకరుల సమావేశంలో ఎండి దస్తగిరి కొత్త గొల్ల శంకర్ చిన్నయ్య ఆవుల శ్రీనివాసులు మాదయ్య న్యాయవాది షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం మేదరి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ దస్తగిరి అరుణ్ ర షీ ద్ బాబర్ ఫారూఖ్ కాగితాల లక్ష్మయ్య డి బాలరాజ్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా.

ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా

 

సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

 

బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది.
₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం

కందుకూరి నరేష్ వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి

పరకాల నేటిధాత్రి

తెలుగుదేశంపార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలో టౌన్ ప్రైసిడెంట్ చీదురాల రామన్న శంకర్, స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి పరకాల నియోజకవర్గం బాధ్యులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం అని అన్నారు.కాంగ్రేస్ పార్టీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతకలహాల తో,నెలకో ముఖ్యమంత్రి ని మారుస్తు పాలన గాలికొదిలేసిన సందర్బం లో పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘణత తెలుగుదేశం పార్టీ కే దక్కిందన్నారు.తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని ప్రగతి ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశమని,పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారన్నారు.సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారు.వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా,ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం కొనియాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆటు పోట్లు సహజమే అని మొక్కవోని దీక్షతో పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం మేనని అన్నారు.రాబోయో రోజుల్లో తెలంగాణ లో సైతం అధికారంలోకి రావడానికి కృషిచేస్తున్నామన్నారు‌. ఈ కార్యక్రమంలో టీడీపీ దామెర మండలం నాయకులు, నల్ల రవి, నగేష్,జనార్దన్ రావు,నడికూడ మండలం నాయుకులు రేగురి వెంకటరెడ్డి,పరకాల పట్టణ మహిళా నాయకురాలు మెహరాజ్ బేగం,అశోక్ యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చట్కూరి నారగౌడ్ ఆధ్వర్యంలో 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు జరిపారు. తదనంతరం నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాల చేసి తెదేపా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సూర్య నాయక్ హాజరై రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యాప్తంగా పటిష్టం చేయడానికి నూతన కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. స్థానిక సంస్థల్లో తెదేపా పార్టీ నుండి ఫోటిలో ఉండబోతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రహ్లాద, బందారపు మల్లారెడ్డి, లింగాల దాసు, కట్టెల బాలయ్య, లచ్చ గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ

సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

 జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందు పట్టణం లోని షాది ఖానా లోనీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ సంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఎండి ముల్తాని మండల ఎమ్మార్వో తిరుమల రావు డిప్యూటీ ఎమ్ఆర్ఓ ఆసిన్ హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు లో వారితో కలిసి పాల్గోని పండ్లు, ఫలహారాలు తినిపించారు. రంజాన్ అంటేనే నియమ నిష్ఠలతో కూడుకున్న పండుగా అని, నిబద్ధత తో ఎలా జీవనం సాగించాలో చాటి చేప్పే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తాజా మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ ముస్లిం మత పెద్దలు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ ముస్లిం నాయకులు ఆన్సర్ . లియాకత్ ఆఫీస్ షకీల్ షకీర్ శంకర్ పాటిల్ తాజా మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్ అశ్విని పాటిల్ ఇస్మాయిల్ సాబ్ అసఫ్ అలీ వేణుగోపాల్ రెడ్డి. ముస్లిం సోదరులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం.

పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిజెపి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఆరోపణలకు వాడుకున్నకాంగ్రెస్, బీఆర్ఎస్

చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించని భూపాలపల్లి ఎమ్మెల్యే

తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ అన్నారు.

శుక్రవారం గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు.

రాష్ట్రంలో తాగు సాగు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారని ఆమె అన్నారు.

రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కీర్తి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తిరిగి కాంగ్రెస్ బిఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం జరిగిందే తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు.

చట్టసభల సమయం వృధా అవ్వడం తప్ప ప్రజా సమస్యలపై చర్చించిన పాపాన పోలేదన్నారు.

అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంలో విఫలమయ్యారని మొక్కుబడిగా కొన్ని విషయాలు మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించారని కీర్తి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

ముఖ్యంగా మండలంలోని గాంధీ నగర్ లో ఇండస్ట్రియల్ కార్యులర్ కోసం శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వినర్ ప్రసాద్ రావు, గణపురం మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు,రేగొండ మండల మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,సోషల్ మీడియా కన్వినర్ దుగ్యల రామ్ చందర్ రావు, నాయకులు మంద మహేష్, ప్రవీణ్, రాజు, విప్లవ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం సే కి ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

సిపిఎం నాయకులు డిమాండ్

పలమనేరు (నేటి ధాత్రి) మార్చి 28:

 

పలమనేరు మండలంలో విద్యుత్ కార్యాల నందు కరెంట్ ఆఫీసు నందు శుక్రవారం 28వ తేదీన ఉదయం 11 గంటలకి ధర్నా నిర్వహించినాము ఈ ధర్నా లో పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ
28 మార్చి 2025
రాష్ట్ర ప్రభుత్వము స కి ఒప్పందాన్ని స్మార్ట్ మీటర్లు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షంగా ఉన్న టిడిపి జనసేన కూటమి మ్యానుఫెస్టివల్లో విద్యుత్ చార్జీలను నీ య నియంత్రస్తామని విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చినారు వైసిపి ప్రభుత్వ పాలనలో ఐదేళ్లలో రకరకాల పేరుతో వేసిన 32 కోట్ల . 166 కోట్ల బారాలతో బాధపడుతున్న రాష్ట్ర ప్రజలను ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఐదు ఏళ్ళు కరెంటు చార్జీలు పెరగబోవుని భావించారు

ఆదా నీ– సే కి సోలార్ విద్యుత్ పై వైసీ ప్రభుత్వము తప్పు దోవ పట్టిస్తుందని ఉండగా ప్రతిపక్షం ప్రతిపక్షం ఉండగా నేటి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యాల కేశవ్ గారు వివరించారు ఒక యూనిట్ కి విద్యుత్తు 1. 99 పైసలు వైసిపి ప్రభుత్వం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందం చేసింది ఆనాటి యువతరం పాదయాత్ర సందర్భంగా 2023 జూలై రెండో తేదీన( 144వ రోజు సందర్భంగా) నెల్లూరు స్టార్ మీటర్లని పగలగొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చార పుండు పై కారం చెల్లినట్టుగా
వ్యవసాయం పంపు సెట్ స్టార్ మీటర్లని దానిని పగలగొట్టాలని వారే ఉపన్యాసాలు ఇచ్చారు,
పలమనేరు కమిటీ ఈశ్వర మాట్లాడుతూ స్టార్ మీటర్లతో కొత్త భారం అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకి పి పెయిడ్ మీటర్లను బిగించి విద్యుత్తు పంపిణీ సంస్థను సిద్ధమయ్యాయి రాష్ట్రంలో
1 90 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులను ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమలు వారి ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తున్నారు 200 యూనిట్లు దాటి గృహ వినియోగదారులు కూడా అమర్చి ఒక మీటర్ కి పదివేల 25 రూపాయలు చొప్పున అదనపుగా 56 లక్షల మీటర్లు అంగీకరించి ఆ దానికి అప్పగించినారు
పాల్గొన్నవారు రాజా శ్రీరామయ్య లక్ష్మయ్య రత్తమ్మ కైరునిషా సరోజమ్మ బాబు బాలకృష్ణ మొదటి వారు పాల్గొన్నారు..

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోవ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు, భూక్య గణేష్, కొత్తగట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు

మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ.

మంత్రి సీతక్క ( ఆదివాసీ ) కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ చెప్పాలి

ఆదివాసీలు అంటే అంత చులకనా

*రాష్ట్ర మొదటి అధికార భాష
తెలుగు తెలుగు తెలియనిమీరు తెలంగాణ శాషనసభలోఉండడం సబబా?
సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

జమ్మికుంట :నేటిధాత్రి

 

మంత్రి గారికి హిందీ, ఇంగ్లీష్ రాదు .. సరే ..
మరి
మీకు తెలుగు ఎందుకు రాదు ?
రాష్ట్ర మాతృబాష తెలుగు
రాష్ట్ర మొదటి అధికార భాష తెలుగు.
అలాంటి తెలుగు తెలియని
తెలంగాణ శాషన సభలో
మీరు ఉండటం సబబా .
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిగారు కదా !
రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత మీకు ఉండాలి కాని లేదు.

అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే మాటాడుతున్నప్పుడు ఏం అర్ధం అవుతుంది మీకు ?

ఏదోకటి అసెంబ్లీ లో ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందా ?

రాష్ట్రం లో సమస్యలు నీకు ఎలా అర్ధం అవుతాయి మీకు ?

ఇతరులకు
హిందీ , ఇంగ్లీష్ రాకపోతే
వారిపై అంత చిన్న చూపా ?

ఆదివాసీలు ( ఎస్టీ ) లు అంటే
అంత చిన్న చూపా ?

మీ అహంకారాన్ని తగ్గించుకొని ,

ఆదివాసీ బిడ్డ అయిన
గౌరవ మంత్రివర్యులు
సీతక్క గారికి మీరు
క్షమాపణ చెప్పాలి.

అప్పుడే మీరు ఉన్న
శాసన సభ కు ,
శాసన సభ్యులు గా ఉన్న మీకు
గౌరవం ..

కొసమెరుపు…

మంత్రి సీతక్క ను అవమానించిన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను ఖండించక పోవడం , శాసన సభలో ఎవరూ కూడా సీతక్కకు క్షమాపణ చెప్పాలి అని నిలదీయక పోవడం  ఆశ్చర్యం.

కేంద్ర మంత్రి కుమారస్వామితో ఎంపీ వద్దిరాజు భేటీ.

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ

“నేటిధాత్రి” న్యూఢిల్లీ.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డి.కుమారస్వామితో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో ఆయన్ను కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Kumaraswamy

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా నెలకొల్పిన ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా మూతపడడంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఎంపీ రవిచంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు.ఈ విషయమై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన కార్మిక నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం వచ్చే నెల 2వతేదీన ఢిల్లీ వస్తున్నదని,వారు కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరగా, మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి *

మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్

నేటిధాత్రి మొగుళ్ళపల్లి :

 

మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.

కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం.

* కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం…………..

భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు* –

అజయ్ రెడ్డి యార నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్ ప్రభుత్వం) రైతుకు న్యాయం జరగాలి అని 2 లక్షల రూపాయలు ఏక కాలంలో రుణ మాఫీ చేసి రైతు భరోసాను పది వేల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచి చిన్న సన్న కారు రైతులకు ఎంతో మేలు జరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా నిరు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది మరియు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.

రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గృహ అవసరాలకు ఇవ్వడం జరుగుతుంది మరియు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచి కార్పోరేట్ హాస్పటల్ లో పేద ప్రజలు చికిత్స పొందేలా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న విద్యార్థులకు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేశారు. అంతే కాకుండా నిరుద్యోగులకు 4 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ప్రయోజనాలు అందించాలని, నిత్యం ప్రజల ప్రయోజనాల కోసం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇందుకు గాను భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో
వ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

 

పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి ఘన నివాళి.

పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి ఘన నివాళి

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
హనుమంతరావు

మల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 27:

 

సికింద్రాబాద్ సెంచనరీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని తెలపడం జరిగింది.
కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్ స్వీటీ, సంజీవరావు బాబు సత్యనారాయణ గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా.!

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సంజయ్ కుమార్

2025 – 26 బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొడిదేల సంజయ్ కుమార్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.2025 – 26 సంవత్సరానికి గాను నర్సంపేట కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నర్సంపేట 2025 – 26 ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుని ఎన్నికల్లో
ఆర్ లక్ష్మీ నారాయణకు 13 ఓట్లు రాగా కొడిదేల సంజయ్ కుమార్ 22 ఓట్లు వచ్చి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే ఉపాధ్యక్షుని ఎన్నికలో నారగోని రమేష్ కు 15 ఓట్లు రాగా కొంగరీ రాజు 20 ఓట్లు పోలై 5 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షునిగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి ఎన్నికలో దొంతి సాంబయ్యకు11 ఓట్లు రాగా మోటురి రవి 24 ఓట్లతో 13 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.మొత్తం బార్ అసోసియేషన్ లో 39 ఓట్లు ఉండగా 35 మంది ఓట్లు వినియోగించుకున్నారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా కోడిదేల సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కొంగరి రాజు,ప్రధాన కార్యదర్శిగా మోటురి రవి ఎన్నికైనట్లు అదికారులు తెలిపారు.

2025 – 2026 జనరల్ బాడి..

2025 – 2026 జనరల్ బాడి కమిటీలో
అధ్యక్షుడు కొడిడేలా సంజయ్ కుమార్,ఉపాధ్యక్షుడు కొంగరి రాజు,
ప్రధాన కార్యదర్శి మోటురి రవి,
సహాయ కార్యదర్శి కాంసాని అశోక్,
కోశాధికారి దాస్యం రంగనాథస్వామి,
ఈ.సి మెంబర్లుగా బొడ్డుపెల్లి అజయ్,
లావుద్య తిరుమాల్ చౌహాన్,ఎం.ప్రభాకర్,ఎం.ఎం కృష్ణలు ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారులు కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version