సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ
సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం
ఈరోజు 25 వ వార్డులో గల రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ఉదయం 10 గంటలకు 25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి తాడికొండ శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు బిల్ల శేషాద్రి,పాషికంటి శ్రీధర్,ఉప్పుల సంజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పేదలందరికీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు నిరంతరం ఇలాగే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కాంగ్రెస్ నాయకులను కోరారు.