ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి.

‘అందరిపై.. ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.

రాజ్యాంగమును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో నగరంపల్లి కొండంపల్లి కొండాపూర్ రంగారావుపల్లి బిక్కోనిపల్లి బంగ్లాపల్లి సీతారాంపురం అప్పయ్య పల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా ఈ రోజు గణపురం మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్,కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపిటిసి కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారుభారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేయాలని కోరారు. నగరంపల్లి మాజీ సర్పంచ్ ఆలూరి కుమారస్వామి, పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి భాస్కర్ రావు, మాధవ్ సత్యనారాయణ రెడ్డి, గొర్రె బాలరాజు, గొర్రె రవి, వెల్గం రాజయ్య, మల్లికార్జున, ఆవుల రవి, తదితరులు పాల్గొన్నారు.కొండంపల్లి దాసర రవి,చిట్యాల నాగరాజు, దాసరి లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజబాబు , మాజీ సర్పంచ్ మామిడి రవి, మామిడి సర్వేశం, మాజీ ఎంపిటిసి పెద్దల్ల సారయ్య, మామిడి చిరంజీవి, రవి తదితరులు పాల్గొన్నారు. రంగారావు పల్లి మాజీ ఎంపీపీ రామేశ్వరరావు, కందుకూరు బ్రహ్మచారి, రవి, ఎర్రబెల్లి మలల్ రావు,భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. బంగ్లాపల్లి సీనియర్ నాయకులు ఉపేందర్ రావ్, గొట్టేముక్కల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షులు పీట్ల రంజిత్, మాజీ ఎంపిటిసి బొల్లం జంపయ్య, మాజీ ఎంపిటిసి పెద్దోళ్ల సారయ్య, ఉపేందర్ రావ్, గొట్టేముక్కుల సుధాకర్ రావు, దూడ దేవేందర్ రెడ్డి, గంధం రాజు, మంద రగు, మేకల పున్నo, తదితరులు పాల్గొన్నారు. అప్పయ్య పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు కొడాలరి రవి, దోమల రాజయ్య, దోమల సమ్మయ్య, ఎలుక పెళ్లి రమేష్, దోబ్బాల సాంబయ్య, మాజీ సర్పంచ్ దోమల రవీందర్, తదితరులు పాల్గొన్నారు

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే.!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు

◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి

◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

MLA Manik Rao

 

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన మండల మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పద్మ సమ్మయ్య దంపతుల కుమార్తె నిత్యశ్రీ వివాహమునకు పాల్గొ ని నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, మైలారం ఎంపీటీసీ గడిపే విజయ కుమార్ శాయంపేట ఉప సర్పంచ్ సుమన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బత్తిని తిరుపతి, మండల నాయకులు పాల్గొన్నారు.

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి.

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి.
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని “శేఖర్ రావు” పిలుపు.
“నేటిధాత్రి” వరంగల్.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం  నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని  జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ అందరి వ్యక్తి, అందరి శక్తి అని కొందరికే పరిమితం చేయడం సరికాదన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుతున్నట్లుగానే అన్నివర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ  ఈ ఏడాది కూడా విజ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. 
పది విభిన్న మతాలు, 25 వేల కులాలున్న మన భారత  దేశంలో కాలమాన పరిస్థితులకు, ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని  సవరించుకునే గొప్పగా రూపొందించారని వారు  కొనియాడారు.
Congress
భారత రాజ్యంగ విలువలను వివరిస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సాగే ఈ యాత్రలో దళిత, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించాలని డీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు కోరారు. 
సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య, రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నర్సింహరావు, మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నె బాబురావు, డీబీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్, జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకా హరిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మణీంద్రనాథ్, మాల మహానాడు నాయకులు కాళేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు.

బార్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ.

హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ:-

స్వల్ప మెజారిటీతో గట్టెక్కేనా పులి సత్యనారాయణ:-

హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

 

 

హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ శుక్రవారం రోజున రసవత్తరంగా ముగిసాయి. అధ్యక్షునిగా తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పులి సత్యనారాయణను తన ప్రత్యర్థి మొలుగూరి రంజిత్ ముప్పుతిప్పలు పెట్టాడు, కేవలం 26 ఓట్ల మెజారిటీ తో పులి సత్యనారాయణ హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గెలుపొందారు.

Elections

హన్మకొండ బార్ అసోసియేషన్ లో 867 ఓట్లకు గాను 752 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఇందులో పులి సత్యనారాయణకు 336 ఓట్లు రాగా తన సమీప అభ్యర్తి మొలుగూరి రంజిత్ కు 310 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రధాన కార్యదర్శి గా కొత్త రవి ఎన్నికయ్యారు. ఇతను తన సమీప అభ్యర్థి అయిన వి. నరేందర్ పై 109 ఓట్ల మెజారీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా చిర్ర రమేష్ బాబు గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా అంబేద్కర్, లైబ్రరీ సెక్రటరీ గా వెంకటేష్, స్పోర్ట్స్ సెక్రటరీ గా మల్లేష్, ట్రెస్సరర్ గా సాంబశివ రావు, 30 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రాజేశ్వర్, 20 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అశీర్వాదం, మరియు మహిళా సంయుక్త కార్యదర్శిగా నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా శివకుమార్, సునీల్ కుమార్, కమలాకర్, నిఖిల్, మరియు మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా వేద, స్వాతి గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్
————–
అలాగే వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వలస సుదీర్ మరియు ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ ఎన్నికైనారు, వీరిని వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పార్టీ క్లస్టర్ ఇంఛార్జి, న్యాయవాది మోటురి రవి కోరారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలను నర్సంపేట మండలలోని జి.జి.ఆర్ పల్లె(గుర్రాల గండి రాజపల్లి)గ్రామంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోటురి రవి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో పార్టిని స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తుందన్నారు.తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో రాష్ట్ర అభిృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుత్తురు కోమల – రమేశ్,మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత – రమేశ్,గ్రామ పార్టి ప్రధాన కార్యదర్శి పురాణి రవీందర్,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,మండల నాయకుడు కత్తుల కుమారస్వామి,గురిజాల గౌడ సంఘం అధ్యక్షుడు మంచిక దేవేందర్,దుగ్గొండి మండల యూత్ నాయకుడు బాణోత్ జై కుమార్,గురిజాల ఎస్ఎంసి మాజీ ఛైర్మన్ కొమ్మ రవి,తుత్తురు వెంకటేష్,గుంటూర్ పల్లి గ్రామ ఇన్చార్జి సంగెం శ్రీకాంత్,తుత్తురు దేవేందర్,మూలం రాజు,జక్కుల అనిల్,మంద బాలయ్య,బర్ల కుమారస్వామి,జక్కుల కనకయ్య,పురాని ఎల్లయ్య,మూలం ఐలయ్య తదితరులు ఉన్నారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం

ఉద్యమ పార్టీకి 25ఏళ్ళు పూర్తి.

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

తెలంగాణలో భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే

రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలి.

బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి

బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 యేండ్లు పూర్తి కానున్నదని తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కెసిఆర్ పాలన స్వర్ణయుగంగా ఉన్న తరుణంలో నేడు కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు. గత 15 నెలల కాంగ్రెస్ పాలన సాగుతున్న క్రమంలో ప్రజల గుండెల్లో నేటికీ కేసీఆరే ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో చేపట్టబోయే భారత రాష్ట్ర సమితి రజితోత్సవాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితోత్సవ సంబరాల గోడ పత్రికలను పెద్ది ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును గత కేసిఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామాల స్థాయి నుండి మండలాల వరకు ప్రజలతో చర్చ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల విసుకు చెందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత నాది అని పెద్ది హామీ ఇచ్చారు. రాజకీయంలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో బతికేవాడే నిజమైన నాయకుడని అదే స్థాయిలో నిత్యం ప్రజల్లో ఉంటున్నానని గుర్తుకు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే నా హాయంలోనే అన్ని గ్రామాల్లో 10 రేట్ల పనులు ఎక్కువ పనిచేశామని అధికార పార్టీ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు. 27 న సభ విజయవంతం చేసే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి 25 వేల మంది కార్యకర్తలను తరలించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద నర్సంపేట పౌరుషం చూపించాలని,రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉందడం వలన అధిక సంఖ్యలో పురుషులు హాజరవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ చైర్మన్ లు , మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్.

శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్ నుండి మండలానికి వచ్చిన బోర్ బావిలను ఈరోజు రెండు గ్రామాల్లో సిరికొండ,కథలాపూర్ లో కొబ్బరికాయ కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,బద్రి సత్యం,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్,కాసోజీ ప్రతాప్,గాందారి శ్రీనివాస్, తెడ్డు మహేష్,సునీల్,జీవన్ రెడ్డి,ప్రసాద్,భూమేష్,శ్రీనివాస్, ప్రమోద్,శ్రీకర్,రాకేష్,రాజారెడ్డి,గంగామల్లయ్య ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు..

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు

-కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని కాంగ్రెస్ పార్టీ మొట్లపల్లి గ్రామ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఒక కుడి భుజం లాంటిదని, కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని, పార్టీకి యూత్ సేవలు కీలకమని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఏఐసీసీ నుంచి మండల కమిటీ వరకు ఏ పిలుపు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని, పార్టీ కార్యకలాపాలలో ముందుండి పార్టీని నడిపించే విధంగా యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుండాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు.

ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి.

ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మాట్లాడుతూ దేశానికి జ్యోతిబాపులే అందించిన సేవలను స్మరించుకున్నారు. వర్ణవివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ,మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన కార్యచరణ మహోన్నతమైందని తెలిపారు. భారతదేశంలో అట్టడుగు వర్గాల పై జరుగుతున్న దాస్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడాయన.కుల లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయని పూలే ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతి బాపులే ను స్మరించుకుంటూ ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. జ్యోతిబాపూలే విద్యా కు ఇచ్చిన ప్రధాన్యత తో వెనబడిన తరగతుల గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలుగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసుకున్నామని వెల్లడించారు. బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు పెంచడానికి చట్టం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలతో ముందుకు పోతున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కనుమల్ల సంపత్, పెద్ది శివకుమార్, గోలి కిరణ్ , గుడిశాల పరమేశ్వర్ , బొమ్మ శీను , మారపల్లి ప్రశాంత్ , కారింగుల రాజేందర్,మీస రాజయ్య, గంగారపు మహేష్ ,కోడం శ్రీనివాస్, తోడేటి కిషన్ ,గురుకుంట్ల స్వామి , అన్నారపు సాయి, బండి మల్లయ్య ,మ్యాడిద తిరుపతిరెడ్డి, కారెట్ల పెళ్లి మణి, మోటపోతుల రాము, దారా నరేష్, జక్కు కుమార్ ,మంకు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి
సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):

 

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.

దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు.

‘దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని టంకర, వేపూర్ గ్రామాల్లో MGNREGA పథకం క్రింద రూ.44.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్లు, రవాణా, కమ్యునికేషన్, ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, విద్యుత్ ఏర్పాటు వంటివి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,

ZPTC

డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,
యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు.

మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ JAC అధ్యక్షులు.

ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు చిలుముల రమేష్

రామడుగు, నేటిధాత్రి:

 

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన గల్ఫ్ జెఎసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలు మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక కోట ఇవ్వాలని, గల్ఫ్ లో ప్రమాదంలో అవయవాలు కోల్పోయి ఉపాధి లేక ఉన్న కుటుంబాలకు బ్యాంక్ ద్వారా జీవన ఉపాధి కల్పించాలని, నకిలీ ఏజంట్లపై చేర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి రామడుగు మండల అధ్యక్షులు మోడీ రవీందర్, చిలుముల సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు సంబంధించిన గొడ పత్రిక ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రచోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 5 వేలకు పైగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు.

BRS

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు.

చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.

నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.

కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

మెట్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వెల్లుల్ల రోడ్డు ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్క్ ఫండ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ముఖ్య కార్తి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మల్లాపూర్ మండల్ ముత్యంపేట ఆటో యూనియన్ వారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవం వరంగల్ లో జరిగే చలో వరంగల్ కార్యక్రమానికి పార్టీ నిధులు కింద 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి అందజేశారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు వారి సలహాలు సూచనలు మాట్లాడిన
అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు పార్టీ బలోపేత నికి కృషి చేయాలని కెసిఆర్ అడుగుజాడల్లో నడిచి పూర్వ వైభవం పార్టీకి తేవాలని నియోజకవర్గంలో మన పార్టీకి బెంచి పట్టు ఉందని దానికి ప్రతి కార్యకర్త వచ్చే సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ రజతోత్సవాలు పురస్కరించుకొని చలో వరంగల్ సభను ఘన జరుపుకుందామని దానికి ప్రతి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు గురించి తెలిపి వరంగల్ సభకు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ , మాజీ జడ్పిటిసిలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గులాబీమయమైన గ్రామవీదులు..

గులాబీమయమైన గ్రామవీదులు..

200 బైకులతో రమణన్న ర్యాలీ…

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఈనెల 27న నిర్వహించడం జరుగుతుందని కార్యకర్తలందరూ వేడుకను జయప్రదం చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో. కార్యకర్తలతో కలసి బైక్ ర్యాలీని నిర్వహించగా ఆయా గ్రామాలన్నీ పండుగ వాతావరణాన్ని సంచరించుకునేలా గులాబీమయంగా. మారింది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. రంగాపురం గ్రామం నుండి ఆకినపల్లి గ్రామం వరకు దాదాపు 15 కిలోమీటర్లు 200 బైకులతో మొగుళ్ళపల్లి మండల గ్రామాల్లో ర్యాలీ తీస్తూ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ పైన ప్రజలుకు ఎంతగానో ఆదరణ ఉందన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version