చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి.మండలం కస్పే కట్కూరు గ్రామానికి చెందిన శనిగరం దిలీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా. వారి. తల్లిదండ్రులను . కుటుంబ సభ్యులను. పరామర్శించి. మనోధైర్యం ఇచ్చి. వారి కుటుంబానికి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ. సత్తు శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఈ oదుకుగాను బాధిత కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి. వారి కుటుంబానికి. పార్టీ పరంగా కాను ప్రభుత్వపరంగా కాను. అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. బాధిత కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్. కే రాజేశ్వరరావు. కిషన్ కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
మున్నూరుకాపు సంఘము మండల అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో గుడివాడలో కాంగ్రెస్ సినియర్ నాయకుడు సిరంగి బిక్షపతి పటేల్ తల్లి సిరంగి రాధమ్మ స్వర్గస్తులయ్యారు కావున వారి కుటుంబ సభ్యులను పారమర్శించి ఓదార్చి మనోధైర్యం చెప్పిన గణపురం మండల మున్నూరుకాపు సంఘము అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్ వారి వెంట తో దేవేందర్ పటేల్ సిరంగి రామకృష్ణపటేల్ రిటైడ్ ఈఈ,ప్రభాకర్ పటేల్, రాజేశ్వర్ రావుపటేల్, అన్నం అనిల్ పటేల్,పటేల్,సురేష్ పటేల్,సుధాకర్ పటేల్,విడిదినేని రవి పటేల్ విద్యుత్ ఏ ఈ, శంకర్ పటేల్ పుప్పాల రామారావు పటేల్ నర్సింగం పటేల్ రామదాసు బాబు రాముణయ్య రవీందర్ రెడ్డి ల్యాదేళ్ల సమ్మయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు నేడు వనపర్తి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు నామినేషన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ పేర్కొన్నారు
కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి
◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి
◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..
నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.
పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.
మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.
ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..
ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.
ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా పదవి ఇవ్వాలని ప్రతిపాదన
కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన
తిరుపతి(నేటి ధాత్రి) మే 26:
ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకుని టిడిపి మహానాడు 27, 28,29 న భారీ బహిరంగ సభ కు భారీగా తరలిరావాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపు నిచ్చారు, స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో సోమవారం తిరుపతి టిడిపి నాయకుల తో కలిసి ఆయన మాట్లాడుతూ నందమూరి తారకరామారావు జన్మదిన పురస్కరించుకొని 27 28 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టారని తిరుపతి నుంచి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలని, నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా (టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ) పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన తిరుపతి నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురి అభిప్రాయలతో ఈ ప్రతిపాదనను పెడుతున్నామని ఇందుకు అందరూ అంగీకరించాలని కోరుతున్నామన్నారు. కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన వైసీపీ పార్టీలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ కేసులో పై చర్చించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను మహానాడులో చర్చించాలని ఆయన అన్నారు, ఈ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిపాలనపై అంశాలపై అలాగే పలు అంశాలపై చర్చించుకుని ఇటు పార్టీని అటు రాష్ట్ర పరిపాలనను పరిపాలించేందుకు పొలంసాలపై చర్చించి అలాగే తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు, అన్నిటిని అందరూ ఆమోదించి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నారని ఆయన తెలిపారు, ముఖ్యంగా 29వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో పాటు డిప్యూటీ మేయర్ ఆర్ సి, మునికృష్ణ, కట్టా జయరామ్ యాదవ్, బుల్లెట్ రమణ, రామారావు,జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత.
#కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
#మహిళలు తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధికి ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలి.
#రూ,10 కోట్ల బ్యాంకు రుణాల చెక్కును మహిళా సంఘాల బాధ్యులకు అందజేత.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి:
నల్లబెల్లి నేటి ధాత్రి:
మహిళలు ఆర్థికంగా పురోగతి చెందినప్పుడే కుటుంబాలు, రాష్ట్రాల తో పాటు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య భవనంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అందుకు అనుగుణంగానే ఎలాంటి వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతుందని దానిని ప్రతి ఒక్క మహిళ తీసుకున్న రుణాన్ని స్వయం ఉపాధికి ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగి సంఘాలను బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని.
దేశ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు ఆర్థిక పురోగతి చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా ముందుకు వెళుతుందని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆనాడే ఆలోచించి మహిళా సంఘాల ఏర్పాటుకు పునాది వేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళా సంఘానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రతి మహిళా సంఘానికి పావలా వడ్డీ తో 2 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
Congress
మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాలను ఎక్కువ మొత్తంలో వ్యవసాయంపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థికంగా లాభాపేక్షం లేకపోవడం తద్వారా సంఘాలు ఆర్థికంగా ఎదగకపోవడం జరుగుతుందని వ్యవసాయానికి ఎలాగో బ్యాంకు రుణాలు తీసుకొని వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాన్ని చిన్నచిన్న వ్యాపారంపై ఖర్చు చేస్తే నెలకు కనీసం 10 వేల రూపాయల ఆదాయం వస్తే వెనకబడి కుటుంబ ఆర్థిక పరిస్థితి తో పాటు సంఘ అభివృద్ధి కొరకై పాటుపడడం జరుగుతుందని.
మండలంలో 996 సంఘాలు ఉండగా కనీసం 100 సంఘాలు సంఘానికి 50 నుండి 70 లక్షల వరకు రుణాలు కావాలని అడిగితే బ్యాంకర్స్ తో మాట్లాడి వారికి ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
వచ్చిన రుణాన్ని ఏదో ఒక వారికి నచ్చిన వ్యాపారంపై పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని.
నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నత కోసమై ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగినప్పుడు ఎమ్మెల్యేగా నాకు అంతకంటే సంతోషం ఉండదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, కమిటీ మెంబర్ జ్యోతి, అడిషనల్ డి ఆర్ డి ఓ రేణుక దేవి, డి పి ఎం అనిత, ఎమ్మార్వో ముప్పు కృష్ణ, ఎంపీడీవో నరసింహమూర్తి, ఏపిఎం సునీత, మండల సమైక్య కార్యదర్శి అనూష, కోశాధికారి రమ, సిఏలు, గ్రామ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టడం జరిగినది. గత కొద్ది కాలం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల,పట్టణ, గ్రామ స్థాయి,నాయకులు సిరిసిల్ల బైపాస్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి. చిత్రపటాన్ని పెట్టడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వెళ్లడం జరిగినది. అక్కడ ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడానికి అనుమతించకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగినది. ఇంతలో పోలీసుల జోక్యంతో ఇరు పార్టీల వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నుండిజలగం ప్రవీణ్, మునిగేల్ రాజు,గజ్జల రాజు, గుండెలు శీను, భైరవేణి రాము, భాను,ఆరుట్ల మహేష్, చుక్క శేఖర్, రంజాన్ నరేష్, అభి గౌడ్,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు
బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్
నేటి ధాత్రి చర్ల
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు మూడో దఫాలో కేటాయించవలసిన వ్యక్తులను మొదటి దశలోనే కేటాయించడం సరైంది కాదని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గుర్తించాలని కోరారు తక్షణమే రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని తెలియజేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో అర్హులైన వారిని గుర్తించి ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ కోశాధికారి పంబి కుమారి పార్టీ మండల ఈసీ మెంబర్ ఏకుల వెంకటేశ్వర్లు పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఉప్పరిగుడం సెక్టార్ అధ్యక్షులు రాజు కుదునూరు సెక్టార్ అధ్యక్షులు వర్షిక త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు
చిట్యాలమండల లోని గుంటూరు పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ముద్దేన నాగరాజు*ఉపాధ్యక్షులుగా*:మన్యం పెద్ద తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శిగా*:-కంకణాల రామ్, కోటేశ్వరరావు ,సహాయ కార్యదర్శిగా*:- మునిమాకుల నాగేశ్వరరావు, కోశాధికారిగా:కోటపాటి సాంబశివరావు ,*కార్యవర్గ సభ్యులు*పాశం శంకర్ ,కంకణాల లక్ష్మీనారాయణ ,పంచమర్తి కృష్ణారావు మన్నెంచిన్న తిరుపతయ్య, గోదే సుబ్బారావు ,కోటపాటి శ్రీనివాస్, కొంక వెంకటప్పయ్య, మన్యం శ్రీనివాసరావు దుగ్గినేని హరిబాబు..
*నూతన దంపతులను ఆశీర్వధించిన . బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండలం, లోని పెద్ద కోమటిపల్లి వంశీ వెడ్స్ నందిని వివాహ రిసెప్షన్ కు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వారి వెంట రాష్ట్ర సభ్యులు చదువు రామచంద్రారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ మోర్ రవీందర్ రెడ్డి మండల అధ్యక్షులు మోరే వేణుగోపాల్ రెడ్డి జిల్లా నాయకులు చెవ్వ శేషగిరి అన్నం శ్రీనివాస్ ఎర్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు
వనపర్తి: నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వనపర్తి మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కృషి తో జయరాములు కుటుంబ సభ్యులు.ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జయరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పా షా, శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ స్మృతిసభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.
తెలుగుదేశం పార్టీ చొప్పదండి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం శనివారం గంగాధరలో మాజీ మండల అధ్యక్షుడు మల్కాపూరం రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కల్యాణపు ఆగయ్య హాజరై ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షులను నియమించాల్సిన అవసరముందని, అలాగే గ్రామ స్థాయిలో అన్ని పదవులను పూర్తి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీని నియోజకవర్గ స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. గతంలో చొప్పదండిలో పార్టీకి ఉన్న గౌరవాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మల్కాపురం రాజేశం గౌడ్, వైద భూపాతి, కొడిమ్యాల నర్సయ్య, పూరేళ్ళ మనోజ్ గౌడ్, గంటె మునిందర్, జవ్వాజి కాంతయ్య, నెల్లి కానుకయ్య, దొపతి సత్యం, ఉప్పు నారాయణ, మంగళరాపు శ్రీనివాస్ రెడ్డి, ఓరుగల్ల తిరుపతి, ఎలిగేటి శ్రీను, గజ్జెల కరుణాచారి, ముదిగంటి బాలు, కొలిపాక వినోద్ కుమార్, జరతి నర్సయ్య, మిష్కమ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఓబికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరు పెట్టడంపై హర్షం
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
జహీరాబాద్. గతకొద్దీ రోజులుగా పట్టణంలోని జాతీయ రహదారి నెంబర్ 65 పై గల రైల్వే లైన్ మీదుగా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి మాజీ మంత్రి స్వర్గీయ మొహమ్మద్ ఫరీదుద్దీన్, నామకరణం చెయ్యాలని డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించుకొని సీఎం పాల్గొన్న బహిరంగ సభలో స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఆర్బ్బ బ్రిడ్జిని జహీరాబాద్ ప్రాంత ముద్దు బిడ్డ మొహమ్మద్ ఫరీదుద్దీన్ పేరిట నామకరణం చేస్తున్నననే ప్రకటనను ఝరాసంగం మండల మైనారిటీ నాయకులు షేక్ సజావుద్దీన్ సద్దాం హుస్సేన్ స్వాగతిస్తు మాజీ మంత్రి పెట్టడంపై జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కార్, ఇంచార్జ్ చంద్రశేఖర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్ గ్రామ సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు, ఓసారి శాసన మండలి సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మైనారిటీ శాఖ, సహకార, మత్య్స శాఖ మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సేవలు అందించి ప్రజలలో మంచిపేరు సంపాదించుకున్నారని షేక్ సజావుద్దీన్ సద్దాం హుస్సేన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.
పరకాల నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తో కలిసి హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల,నడికూడా మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,కుంకుమేశ్వర స్వామి ఆలయకమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ మరియు సమన్వయకమిటి సభ్యులు చిన్నల గొనాద్,మంద రాంచెందర్,బొచ్చు చెందర్,చందుపట్ల రాఘవరెడ్డి,పంచగిరి జయమ్మ, మార్క రఘుపతి గౌడ్,పసుల రమేష్,మడికొండ సంపత్ కుమార్,మాజీ జెడ్పిటిసి పాడి కల్పన దేవి ప్రతాపరెడ్డి దుబాసి వెంకట స్వామి,అనిల్,పోరండ్ల వేణు,ఒంటెరు శ్రవణ్, మంద నాగరాజు,దార్న వేణుగోపాల్,గడ్డం శివ,లక్కమ్ వసంత,బొమ్మకంటి చంద్రమోలి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శంకర్ సాగర్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వెంకటేశం ,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్,సీనియర్ నాయకులు కలిమ్,ఆర్ సుభాష్,మర్తుజా ,విజయ్,వెంకట్ సాగర్,రాథోడ్ భీమ్ రావు నాయక్,మోహన్ రాథోడ్,రాథోడ్ ప్రేమ్ సింగ్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని రూ 99.80 లక్షలతో చేపట్టిన ఏకశిల జంక్షన్ అభివృద్ధి పనులకు,98 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి పనులకు మరియు 80 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ నుండి రెడ్డిపాలెం క్రాస్ రోడ్ వరకు నిర్మించనున్న వరద కాలువ నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యల మీద డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించామని,ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు.డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాను అని తెలిపారు.ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. త్వరలో డివిజన్ లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గీసుగోండ,సంగెం,ఆత్మకూరు, దామెరలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో 3 బ్యాచ్ లు పూర్తి చేసుకున్నారన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని,దానికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.డివిజన్ లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మంచినీరు, శానిటేషన్,లైటింగ్ కూడా ప్రాధాన్యతమైనవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కుట్రలకు తెరలేపిందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశాడని, రైతుల సాగునీటి ఘోష తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తెలంగాణను ధాన్యకారంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణకు ఏం అన్యాయం చేశాడని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే..తెలంగాణ మరోసారి మర్ల పడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఇబ్బందులు పెడితే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
రైతుల అభివృద్దే నా లక్ష్యం.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..
నర్సంపేట,నేటిధాత్రి:
అకాల వర్షాలతో నోటికాడికచ్చిన పంటలు నీటిపాలయ్యాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద,వ్యయసాయ మార్కెట్ వద్ద, వరి కళ్ళాల వద్ద రైతులు ఆరబోసిన,అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన వరిదాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యాయి.రైతుల కష్టాలను చూసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంటనే స్పందించారు.రాష్ట్ర మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని ఈ నెల 22 న వినతిపత్రం సమర్పించి వేడుకొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభ్యర్థన మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాకు 7500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వగా వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల తడిసిన వరిధాన్యాన్ని బాయిల్డ్ వరిధాన్యంగా పరిగణించి వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన కాఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో వాటిని చూసిన రైతులు,సమాచారం పలువురు నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రైతుల అభివృద్దే నా లక్ష్యం…. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..
Narsampet MLA Donthi Madhav Reddy..
నర్సంపేట నియోజవర్గంలో రైతుల అభివృద్దే లక్ష్యంగా కృషిచేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.యాసంగి సాగులో అనుకూల పంటలు పండించిన రైతులను వరిధాన్యం అమ్మకాల సమయంలో రైతులకు మేలు జరిగినప్పటికీ కొందరి రైతులకు అకాల వర్షాలతో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నది ఎమ్మెల్యే పేర్కొన్నారు.గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని సుమారు 4 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని తెలిపారు.రైతుల కన్నీళ్లను తుడ్చాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర మార్కెటింగ్ , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని విన్నవించుకోగా సానుకూలంగా స్పందించి వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జీవో జారీచేయండం చేయడం నర్సంపేట ప్రాంత రైతులకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక చొరవతో నియోజకవర్గ రైతులను ఆదుకున్నందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Farmer Varanganti Praveen Reddy..
రైతులను ఆపదలు ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్మకాలు చేపట్టే వద్ద అకాల వర్షాల తీవ్రనష్టం చేశాయని, ఈ నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వంతో కోట్లాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక జీ.ఓ తెప్పించారని నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు వరంగంటి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలకు నిల్వ ఉంచిన ధాన్యం గత ఐదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయని దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నుండి ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆనందం వెళ్ళబుచ్చితోందని రైతు ప్రవీణ్ రెడ్డి తెలియజేశారు.
సకాలంలో రైతులకు అండగా ప్రభుత్వం ఉండడం అభినందనీయం..
Coffee issued by the government.
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్..
గత వారం రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు అరుగాలం పండించిన వారి ధాన్యం పట్ల నష్టపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణిస్తూ కొనుగోలు చేయాలని జీవో జారీ చేయడం అభినందనీయమని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వరిధాన్యం రైతులకు నష్టం వాటిల్లుతుందనే పిర్యాదులు సమాచారం మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ఈనెల 22న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కలిసి ప్రత్యేక మెమోరండం అందించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి సూచనల మేరకు వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని తెలిపారు. రైతుల కోసం ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రభుత్వంపై చేపట్టిన విజయంగా భావిస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గ ఆదేశం మేరకు కొప్పుల, కాట్ర పల్లి గ్రామాలలో నూతనంగా కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకె ళ్లాల చూడాలన్నారు అనం తరం నూతన గ్రామ కమిటీ లను ఎన్నుకున్నారు కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వాంకు డోత్ జగన్ ఉపాధ్య క్షుడిగా ఆరే కమలాకర్ ప్రధాన కార్యదర్శి వంటేరు శ్రీకాంత్ కోశాధికారిగా కొప్పుల గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏరుకొండ శంకర్ ఉపాధ్యక్షుడిగామామిడి రవి ,ప్రధాన కార్యదర్శిగా చాడ రామ్ రెడ్డి, పిట్టల నరేష్ ఎన్నుకున్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ మండల నాయకులు బాసని చంద్ర ప్రకాష్ ,చల్లా చక్రపాణి, అబు ప్రకాష్ రెడ్డి ,మారేపల్లి రవీందర్ దుబాసి కృష్ణమూర్తి, పోతు కృష్ణమూర్తి, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జరుపుల యాదమ్మ వీరన్న నాయక్ దంపతుల కూతురు ఊర్మిళ అమీర్ లాల్ వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి, సుంకరి సంతోష్ రెడ్డి, వాంకుడోతు రాజన్న,రాచర్ల నాగరాజు,మామిడి ఐలయ్య, భాషబోయిన రాజు,మాజీ సర్పంచ్ అజ్మీర పాపయ్య,జితేందర్,నవీన్,క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.