పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం.

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి

◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి

◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..

నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.

పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.

ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.

ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version