విద్యార్థినికి 692 వ ర్యాంకు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హానిక EAPCET లో 692వ ర్యాంకు సాధించింది. కనిక తల్లిదండ్రులు నవీన, శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల కృషితో తనకు మంచి ర్యాంకు వచ్చిందని హానిక తెలిపారు.

మనపై దాడుల్లో టర్కీ ‘సోంగర్‌’ డ్రోన్లు వాడిన పాక్‌

పాక్‌ యుద్ధంతో మన సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి వెల్లడి
పాక్‌ మనపై చేసిన అన్ని దాడులు విఫలం
మన నేవీ దాడిలో కరాచీ పోర్టు ధ్వంసం
లాహోర్‌, రావల్పిండి ప్రాంతాల్లో భయోత్పాతం సృష్టించిన మన దాడులు
పాక్‌ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు…సమీప బంకర్‌కు తరలింపు
మరోపక్క విముక్తి దిశగా బెలూచిస్తాన్‌
పాక్‌ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బెలూచ్‌ వీరులు
హైదరబాద్‌,నేటిధాత్రి: 
పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగా 8వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ తెల్లవారుజాము వరకు పాకిస్తాన్‌ మన సైనిక స్థావరాలపై జరిపిన దాడిలో టర్కీ  తయారీ ‘సోంగర్‌’ డ్రోన్లను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. వీటి సంఖ్య 300`400 వరకు ఉండవచ్చునని అంచనా. ముఖ్యంగా ఈ దాడులు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలపై జరగడం గమనార్హం. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి రాజస్తాన్‌ లోని జైసల్మేర్‌ వరకు ఈ దాడులు కొనసాగాయి. ఇవి లద్దాఖ్‌లోని సియాచిన్‌ గ్లేసియర్‌ వద్ద వు న్న బేస్‌ క్యాంప్‌నుంచి చూస్తే పాకిస్తాన్‌ చేసిన దాడులు చాలా విస్తృత పరిధిలో కొనసాగినట్టు అర్థమవుతుంది. అంటే కశ్మీర్‌ నుంచి  గుజరాత్‌ వరకు 1400 కిలోమీటర్ల దూరం వరకు పాకిస్తాన్‌ ఈ దాడులు కొనసాగించింది. విచిత్రంగా గుమనించాల్సిన విషయమేంటంటే, వీటిల్లో చాలా డ్రోన్‌లను నిఖా కోసం, మన సైనిక, వైమానిక స్థావరాల ప్రదేశాలను కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగించగా, మరికొన్ని ఆయుధాలు అమర్చినవి వున్నాయి. విశేషమేంటంటే మన సైన్యం వీటని గుర్తించడమే కాదు, తక్షణమే వీటన్నింటిని ధ్వంసం చేయడం విశేషం.
ఈ సందర్భంగా అర్మీనియా`అజర్‌బైజాన్‌ యుద్ధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదే టర్కీ అందజేసిన డ్రోన్లతో అజర్‌బైజాన్‌ దాడులు చేయడంతో అర్మీనియా సైన్యం, ట్యాంకులు, రక్షణ వ్యవస్థ   మొత్తం కుప్పకూలిపోవడంతో పూర్తిగా ఓడిపోయింది. ఈ యుద్ధాన్ని నిశితంగా గమనించిన ప్రపంచ దేశాల యుద్ధ నిపుణులు అప్పటివరకు అనుసరిస్తున్న యుద్ధ తంత్రాన్ని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. అదీకాకుండా యుద్ధాలు సంప్రదాయ రీతినుంచి పూర్తిగా సాంకేతికతపై ఆధారపడే దశకు చేరుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ యుద్ధం తెలియజెప్పింది. అంటే అప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతితను మరింత ఆధునిక దశకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వెల్లడిరచింది. దీంతో అప్పటివరకు రక్షణ రంగంలో డ్రోన్ల వినియోగం విషయంపై పెద్దగా దృష్టి సారించని దేశాలు ఒక్కసారిగా వీటిపైవు మళ్లాయి. డ్రోన్ల వినియోగం వల్ల యుద్ధం ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా శత్రువుకు తీవ్రస్థాయిలో నష్టాన్ని కలిగించవచ్చునన్నది స్పష్టం కావడంతో, ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. మనదేశం కూడా డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా పెంచుకోవడానికి కృషి చేసిన ఫలితం నేటి యు ద్ధంలో ఎంతగానో ఉపయోగపడిరది. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యాంటీ డ్రోన్‌ టెక్నా లజీ కూడా బాగా అభివృద్ధి చెందడం గమనార్హం. మనదేశం ఈ రంగంలో ఎంతగా అభివృద్ధి సాధించిందో తెలియనివారికి ఈ యుద్ధం మన సాంకేతిక పరిజ్ఞాన స్థాయి, సామర్థ్యం బాగా తలిసొచ్చింటాయి. క్షిపణులు, విమానాల దాడులనుంచి రక్షణ కల్పించే వ్యవస్థ విషయంలో ఇజ్రాయిల్‌కు చెందిన ఐరన్‌ డోమ్‌ ఇప్పటివరకు ప్రపంచంలో అత్యాధునికమైనదిగా పరిగణించడబడు తోంది. అయితే మనదేశం ఈ విషయంలో రష్యా, ఇజ్రాయిల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలు మనకు కంచుకోటలా నిలిచి, పాకిస్తాన్‌ దాడుల  నుంచి రక్షణ కల్పించాయనే చెప్పాలి. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే మన సాంకేతిక పరిజ్ఞానం  ఎంత ఆధునికంగా, ఎంత ప్రభావశీలకంగా వున్నదీ ప్రపంచ దేశాలకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనం శత్రుదాడులనుంచి రక్షణ పొందడమే కాదు, పాక్‌లోని రక్షణ వ్యవస్థలను తుత్తినియ లు చేయగలగడం మరో విశేషం. లాహోర్‌, రావల్పిండి వంటి ప్రాంతాల్లో చైనా తయారీ పాక్‌ రక్షణ వ్యవస్థలను మన డ్రోన్లు లేదా విమానాలు పూర్తిగా ధ్వంసం చేయగలిగాయి.
మనం దేశీయ, విదేశీయ సాంకేతిక పరిజ్ఞానాలతో ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ శత్రు దాడుల నుంచి కాపాడిరదనేది స్పష్టమైంది. ఈ విషయంలో మనం వివిధ అంచెల్లో రక్షణ వ్యవస్థను ఏ ర్పరచుకున్నాం. వీటి కారణంగా మన సైన్యం తక్షణమే వేగంగా స్పందించి పాక్‌ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్‌లను కూల్చివేసింది. ఈ రక్షణ వ్యవస్థలో ఏఏ విభాగాలున్నాయో చూద్దాం. ఎయిర్‌ డిఫెన్స్‌ గన్స్‌ సహాయంతో మన సైన్యం 50 డ్రోన్లవరకు కూల్చివేసింది. మరో 20 డ్రోన్లను వాటి రేడియో ఫ్రీక్వెన్సీలను జామ్‌ చేయడం ద్వారా వాటిని కూల్చింది. దేశీయంగా తయారు చేసిన భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల ఆకాశ్‌ క్షిపణులు పశ్చిమ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట, పాక్‌ నుంచి వస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక పాకిస్తాన్‌ నుంచి వచ్చే వైమానిక దాడులను రష్యా తయారీ ఎస్‌`400(సుదర్శనచక్ర), బరాక్‌`8 క్షిపణుల సహాయంతో అడ్డుకుంది. ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌`యుఏఎస్‌ గ్రిడ్‌ను మన సైన్యం క్రియాశీలకం చేసింది. ఇది మన లక్ష్యాలవైపు దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గు ర్తించి వాటిని కూల్చివేయడంలో సమన్వయ సహకారం అందించింది. 
కూల్చివేసిన డ్రోన్ల శిథిలాలు అమృత్‌సర్‌ ప్రాంతంలో మన సైన్యం సేకరించింది. వీటిని పూర్తిగా పరీక్షించిన తర్వాత, దాడుల్లో పాకిస్తాన్‌ ప్రమేయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టడం తర్వాతి కార్యక్రమం. నియంత్రణ రేఖవెంట డ్రోన్‌లతో పాటు పెద్ద ఎత్తున ఫిరంగి దాడులు చేస్తున్న పాకిస్తాన్‌ ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఫలితంగా పౌరుల మర ణాలు సంభవిస్తున్నాయి. వీటికి ప్రతిగా భారత్‌ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన కనీసం ఒక్క డిఫెన్స్‌ రాడార్‌ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా మనదేశం  పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ధ్వంసంచేసినందుకు, ఆగ్రహంతో రగిన పాక్‌ ఏకంగా మన సైన్యం, పౌర నివాసాలపై దాడులకు తెగబడిరది. మన సైన్యం కేవలం ఉగ్ర స్థావరాలనే ధ్వంసం చేసింది తప్ప పైనిక స్థావరాలు, పౌర ఆవాసాల జోలికి పోలేదు. ఇటువంటి నీతి నిజాయతీలు పాకిస్తాన్‌కు ఏకోశానా వుండవు కనుక ఇష్టం వచ్చిన రీతిలో సరిహద్దు వెంట దాడులు జరిపింది. ఏతావాతా చెప్పాలంటే, ఉగ్రస్థావరాలపై దాడులు, ప్రస్తుతం పాక్‌ ప్రయోగిస్తున్న డ్రోన్లు, ఇతర క్షిపణులు, వైమానిక దాడులను సాంకేతిక పరిజ్ఞానంతో తుత్తినియలు చేస్తున్న భారత్‌ సామర్థ్యాన్ని ప్రపంచం బిత్తరపోయి చూస్తున్నది. ఈ యుద్ధం కలిగించే నష్టం   మాట అట్లా వుంచితే రక్షణ రంగం విషయంలో భారత్‌తో ప్రపంచ దేశాలు వ్యవహరించే శైలిలో గతం కంటే పూర్తి భిన్నవైఖరి కనిపించక మానదు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని ప్రధాన రాజకీయ గ్రూపుల్లో మనదేశం సభ్యురాలు (బ్రిక్స్‌, క్వాడ్‌, షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ మొదలైనవి). ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నింటితో సంబంధాలు కొనసాగిస్తూ, తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్న భారత్‌, తాజా పాక్‌ యుద్ధంతో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచంలో ఒకదానికొకటి బద్ధశత్రువులుగా వ్యవహరించే అన్ని దేశాలతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదటగా    స్పందించేది భారత్‌ మాత్రమేనన్న అంశం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు స్పష్టంగా తెలిసింది. మనకు కేవలం రెండు దేశాలు మాత్రమే శత్రువులు. ఒకటి చైనా రెండు పాకిస్తాన్‌. తాజాగా బంగ్లాదేశ్‌ కూడా ఈ జాబితాలో చేరింది. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనతో పెట్టుకున్న ఏ దేశం ఇప్పటివరకు బాగుపడిన దాఖలాలు లేవు! తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి! ఇది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇది ధూర్త పాకిస్తాన్‌కు, మనదేశంలో పాకిస్తాన్‌ భక్తులకు అర్థం కాదు.

‘‘ఈ’’ ఇద్దరు గులాబీకి చీడనే! పార్టీకి పీడనే!

ఇద్దరు ఐరన్‌ లెగ్గులే?

`ఆ రెండు జిల్లాల ఓటమి వాళ్ల వల్లనే!!

`రెండు జిల్లాల్లో తుడిచిపెట్టుకు పోవడానికి కారణం వాళ్లే?

`ఖమ్మం ఖాళీ కావడానికి పువ్వాడే!

`వరంగల్‌ ఓటమికి కారణం రాకేషే!

`పొంగులేటిని పట్టించుకోక చెడగొట్డింది పువ్వాడ.

`తమ్మలను పక్కనపెట్టి మొదటికే మోసం తెచ్చింది అజయే.

`వరంగల్‌ ఓటమి మొత్తం రాకేష్‌ వల్లనే!

`బీఆర్‌ఎస్‌ నేతలను తిట్టి పార్టీని పలున చేసింది రాకేషే!

`ఆ ఇద్దరి వల్ల కారుకు వచ్చిన పీడనే!

`ఆ ఇద్దరు చెదపట్టినట్లే పార్టీని చెరిపేశారు.

`ఖమ్మంలో కారు తలెత్తుకోకుండా పువ్వాడ చేశాడు.

`రాకేష్‌ నమ్మితే వరంగల్‌ కు ఓటమిని తెచ్చిపెట్టాడు.

`ఈ ఇద్దరు పార్టీని భ్రష్టు పట్టించారు.

`ఖమ్మం కారులో పువ్వాడ చెరి ఖాళీ చేశాడు.

-మంత్రి పదవిలో వుండి అందర్నీ పార్టీకి దూరం చేశాడు.

-ప్రత్యక్ష,పరోక్షంగా ఈ ఇద్దరు పార్టీని కోలుకోకుండా చేశారు.

-వరంగల్‌ లో తలెత్తుకోకుండా రాకేష్‌ చేశాడు.

-బీజేపీలో వుండి రాకేష్‌ బిఆర్‌ఎస్‌ మీద దుమ్మెత్తిపోశాడు.

-కారులో చేరి పొగబెట్టాడు.

-ఎన్నికల ముందు చేరి, చిల్లం చిల్లం చేశాడు.

-బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఈ ఇద్దరినే నమ్మారు.

-నమ్మిన వాళ్లను ఈ ఇద్దరు నట్టెట ముంచారు.

-ఇప్పటికీ ఆ ఇద్దరికే అగ్రనేతలు ప్రాధాన్యతనిస్తున్నారు.

-ఆ ఇద్దరు వున్నంత కాలం పార్టీ కష్ట కాలం తప్పదు.

-రాకేష్‌ ఒంటెద్దు పోకడలు..పువ్వాడ పనికి రాని లెక్కలు.

-తలకిందులైన కారు అంచనాలు.

-ఇప్పటికీ మించిపోయింది లేదు.

-ఈ ఇద్దరినీ పక్కన పెడితే చాలు.

-కారు జోరందుకోవడానికి పెద్ద సమయం పట్టదు.

-ఈ ఇద్దరి వల్లనే బిఆర్‌ఎస్‌ కు ఉద్యమ కారులు దూరమౌతున్నారు.

-మాజీ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయాల్లో కొంత మందిని గోల్డెన్‌ హాండ్స్‌అంటారు. కొంత మందిని ఐరన్‌ లెగ్స్‌ అంటారు. గోల్డెన్‌ హాండ్స్‌ వల్ల పార్టీకి ఎంతో మేలు జరిగిందని చెప్పుకునే అవకాశముంటుంది. ఐరన్‌ లెగ్గుల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్ప జరిగే మేలు ఏమీ వుండదు. ఐరన్‌ లెగ్గులుగా ముద్ర పడిన నాయకుల్లో చాలా వరకు వాళ్లు గెలిచినా, పార్టీ గెలవదు. వాళ్లతోపాటు పార్టీని నిండా ముంచేస్తారు. అలాంటి వారిని రాజకీయ పార్టీలే ఐరన్‌ లెగ్‌లంటూ ప్రచారం సాగిస్తుంటాయి. అలా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీలో ఇద్దరి పేర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు ఐరన్‌ లెగ్‌లే కాదు, ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి ప్రత్యక్ష, ప్రరోక్ష కారణాలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లను బిఆర్‌ఎస్‌ నమ్మడమే పాపమైపోయిందని అంటున్నారు. వాళ్ల వల్ల పార్టీకి అణాపైస లాభం జరక్కపోగా, పెద్ద నష్టం మిగిల్చారన్న చర్చ సర్వత్రా జరగుతోంది. పార్టీలో ఆ ఇద్దరి మూలంగా జరిగిన నష్టం భర్తీ కావడానికి కూడా సమయం పట్టేలా వుందంటున్నారు. వారు పార్టీలో వుంటే నాయకులంతా ఒక్కతాటి మీద వుండలేకపోతున్నారు. వారి పెత్తనం సాగుతుంటే పార్టీల నాయకులు సహించలేకపోతున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా విషయాన్ని చెప్పుకుంటే పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. పువ్వాడ నాగేశ్వరరావు మీద వున్న అభిమానంతో ఆయనను గెలిపించారు. ముందుగా పువ్వాడ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి గెలిచారు. తర్వాత 2014ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెవడంతో బిఆర్‌ఎస్‌లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌కు సన్నిహితుడయ్యారు. కేటిఆర్‌ వల్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతూ వచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచి, మంత్రి అయ్యారు. 2014నుంచి ఉనికి కోసం తపత్రయ పడ్డ అజయ్‌కుమార్‌ 2018 తర్వాత పెత్తనం చేయడం మొదలు పెట్టారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత సీనియర్‌ నాయకులను పార్టీకి దూరం చేసే ఎత్తుగడలు చేస్తూ వచ్చారు. ఒంటెద్దు పోకడలతో ఇతర నాయకులను పట్టించుకోవడం మానేశారు. ఇతర నాయకుల నాయకత్వాలు ప్రశ్నార్ధకం చేశారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన్ని బలహీన పర్చుతూ వచ్చారు. ఆయనకు ప్రాదాన్యత లేకుండా చేయాలనుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనను దూరం చేస్తూ వచ్చారు. నిజానికి తుమ్మల నాగేశ్వరావు ఒకప్పుడు కేసిఆర్‌కు మంచి మిత్రుడు. ఆ సాన్నిహిత్యంతోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనను కేసిఆర్‌ పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్దిలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని చూశారు. ఎందుకంటే ముందు నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిని నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నంత కాలం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మం జిల్లా అభివృద్దికి బాటలు వేశారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ మంత్రి అయిన నుంచి పక్కన పెట్టడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పాలేరు ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన తుమ్మల తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తుమ్మల ఓటమికి కారణం పువ్వాడ అన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. ఎందుకంటే తుమ్మల 2018 ఎన్నికల్లో గెలిస్తే తనకు ప్రాదాన్యత లభించదని పువ్వాడ ఎత్తులువేసినట్లు చెప్పుకుంటారు. ఇక మరో నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన 2014 వరకు తెలంగాణ రాజకీయాలకు పరిచయం లేని నాయకుడు. కానీ ఉప్పొంగిన తరంగంలా తెలంగాణ వచ్చినతర్వాత కూడా ఆయన తెలంగాణలో వైసిపి తరుపున పోటీచేసి గెలిచారు. ఖమ్మం ఎంపిగా ఆయన గెలవడమే కాదు, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించి, తెలంగాణ రాజకీయాలను తన వైపు తిప్పుకున్నారు. అందరూ ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. ఖమ్మం జిల్లాను శాసించే కొత్త నాయకుడు వచ్చాడని అందరూ అప్పుడే అనుకున్నారు. అలాంటి సమయంలోనే కేసిఆర్‌ ఖమ్మం ఎంపిగా వున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సేవలు వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు అవకాశమివ్వకపోయినా పార్టీ కోసం పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ పార్టీకి దూరం చేస్తూ వచ్చారు. పొంగులేటికి ప్రాదాన్యతనివ్వకుండా చూసుకున్నారు. కేసిఆర్‌ అప్పాయింటు మెంటు కూడా మంత్రి పొంగులేటికి అందకుండా చేశారు. జిల్లారాజకీయాల నుంచి పొంగులేటిని తరిమేయాలని పువ్వాడ చూశారు. కాని ఏమైంది. పువ్వాడ ఓడిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ మీద సవాలు చేశారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకుండా చేస్తానన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్‌ను గెలిపించారు. ఖమ్మంలో క్లీన్‌ స్వీప్‌ చేసి చూపించారు. తన రాజకీయ శక్తి ఎంత గొప్పదో రుచి చూపించారు. తను కూడా గెలవలేని పువ్వాడను నమ్ముకొని, ఆయన మాటలు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్‌ను దూరం చేసుకొని పార్టీ ఓటమి పాలైంది. అదే శ్రీనివాస్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత వుంటే బిఆర్‌ఎస్‌ రాజకీయం మరో విధంగా వుండేది. పువ్వాడ తన స్వార్ధ రాజకీయం కోసం పార్టీని నట్టెట ముంచేశారు. ఇప్పుడు కూడా ఆయన వ్యవహారం మారలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదనే వ్యాఖ్యలే స్వర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదు. ముందు పడతున్నదేమీ లేదు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభకు ఇతర నాయకులు తరలించినంత మందిని కూడా పువ్వాడ తలరించలేదని అంటున్నారు. అందువల్ల ఖమ్మం కారు రాజకీయాల నుంచి పువ్వాడను పక్కకు తప్పిస్తే తప్ప ఖమ్మంలో మళ్లీ గులాబీ వికసించదంటున్నారు. బిఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం రాదంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా అంటేనే బిఆర్‌ఎస్‌కు కంచుకోట. ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ నాయకులున్నంత బలంగా ఏ పార్టీ లేదు. ఏ పార్టీకి అంత బలవంతమైన నాయకులు లేరు. కాని ఒక్క నాయకుడు మూలంగా వరంగల్‌ బిఆర్‌ఎస్‌ రాజకీయాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న మాటలు పార్టీ పెద్దల దాకా చేరడం లేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నాయకులు, ఉద్యమ కారులు ఎక్కువ మంది బిఆర్‌ఎస్‌లోనే వున్నారు. ఉద్యమ కాలం నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకోసం పనిచేస్తూనే వున్నారు. పార్టీకి కంచుకోటలు కట్టిన నాయకులున్నారు. అలాంటి పార్టీని చిన్నా భిన్నం చేసిన నాయకుడు రాకేశ్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లోకి తీసుకోవడమే పెద్ద పొరపాటు అంటున్నారు. ఇది బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ తీసుకున్న సరైన నిర్ణయం కాదంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, బిఆర్‌ఎస్‌కు తీరని అన్యాయంచేసిన రాకేష్‌రెడ్డికి ప్రాదాన్యత కల్పించడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే బిజేపిలో టికెట్‌ దక్కే అవకాశం లేదని నిర్ధారణ జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. అంతకు ముందు మూడేళ్ల కాలం పాటు రాకేష్‌రెడ్డి తన సోషల్‌ మీడియా, బిజేపిని అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద తీవ్ర విమర్శలు చేసేవారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి అండదండలతో బిఆర్‌ఎస్‌ మీద లేని పోని అబద్దాలు సృష్టించి ప్రచారం చేసేవారు. ఏకంగా పోలీసు శాఖను కూడా పదే పదే అవమానించే రీతిలో మీడియా సమావేశాలు ఏర్పాటుచేస్తుండేవారు. ఇక ఉమ్మడి వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఎంతో నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు వున్నారు. అలాంటి మాజీ ఎమ్మెల్యేల మీద కూడా లేనిపోనివి ప్రచారం చేసి, ప్రజల దృష్టిని మరల్చాడు. అంతిమంతా అది కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా చేశారు. తీరా ఎన్నికల ముందు రాకేష్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వల్ల ఆయన మరింత నష్టమే జరిగింది తప్ప, మేలు జరగలేదు. వ్యక్తిగతంగా ఆయన కొంత మంది ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. తాను బిజేపిలో వున్నప్పుడు చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పలేకపోయారు. వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గెలుపుకోసం పెద్దగా కష్టపడిరది లేదు. కాని ఆయనను తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక వచ్చింది.. ఆ టికెట్‌ ఉద్యమ కారులకు ఇస్తారని అనుకున్నారు. కాని రాకేష్‌రెడ్డికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆఖరు నిమిషంలో ఆయన పేరు ఖరారు చేయడంతో అందరూ అవాక్కయ్యారు. పైగా రాకేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ఖర్చు కూడా మొత్తం బిఆర్‌ఎస్‌ పార్టీయే భరించింది. అదే టికెట్‌, ఖర్చు ఇతర ఉద్యమ నాయకులకు ఎవరికి ఇచ్చినా బిఆర్‌ఎస్‌ గెలిచేది. రాకేశ్‌రెడ్డి బిజేపిలో వున్నంత కాలం బిఆర్‌ఎస్‌కు మద్దతుగా వున్న పత్రికలపై కూడా నిత్యం విషం కక్కుతూ వుండేవారు. నమస్తే తెలంగాణ వంటి పత్రికను కూడా తర్పూర పడుతుండేవారు. ఇప్పుడు అలాంటి రాకేష్‌రెడ్డికి ఆ పత్రికలోనే అధిక ప్రాదాన్యతన్విడంపై బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అసహనం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సభ ఏర్పాటు, నిర్వహణ, బాధ్యతలు రాకేష్‌రెడ్డి తీసుకోలేదు. దాని పర్యవేక్షణ సైతం కనీసం చేయలేదు. రజతోత్సవసభ వేదిక మీద నిర్వాహకుల కన్నా, ఎక్కువ హల్‌చల్‌చేశారు. ఇది నిజమైన ఉద్యమకారులకు ఎంతో ఇబ్బందికరంగా కనిపించింది. ఎందుకంటే రాకేష్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. కనీసం ఆది నుంచి బిఆర్‌ఎస్‌ నాయకడు కాదు. మద్దతు దారుడు అసలే కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసిఆర్‌ను గుర్తించిన వ్యక్తి కాదు. కేసిఆర్‌ త్యాగాన్ని ఏనాడు కొనియాడిన నాయకుడు కాదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే కళ్లు చూసిన నాయకుడు కాదు. కాని తెలంగాణను కేసిఆర్‌ ఆగం చేస్తున్నాడని విమర్శించిన నాయకుడు రాకేష్‌రెడ్డి. తెలంగాణను కేసిఆర్‌ అప్పుల పాలు చేస్తున్నాడన్నారు. కాలేశ్వరం విషయంలో రాకేష్‌రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరంగల్‌ జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులపై రాకేష్‌రెడ్డి అబద్దాలు చెప్పి, చెప్పి వారి ఓటమికి కారణకుడయ్యారు. అలాంటి రాకేష్‌రెడ్డిని తెచ్చి ఆ నాయకుల నెత్తి మీద పెట్టేంత పనిచేయడం సరైంది కాదంటున్నారు. రాకేష్‌ పార్టీలో వున్నా, లాభం లేదని అంటున్నారు. అలాంటి నాయకుడు వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్నారు

కాల్పుల విరమణపై డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌

కాల్పుల విరమణపై డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌

ఇప్పటికే పాక్‌ను అథ్ణపాతాళానికి తొక్కేసిన ఇండియా

గతకాలం నాటి భారత్‌ కాదు

కర్ర పట్టుకో, శాంతంగా మాట్లాడు అన్నదే మన విధానం

బలం లేనివాడు శాంతివచనాలు పలికితే ఎవరూ లెక్కచేయరు

సత్తా వున్నవాడు చెప్పే ప్రతిమాట శాసనమే

శాసించే స్థాయికి చేరిన భారత్‌

భారత దౌత్య నిపుణత, సైనిక సామర్థ్యానికి గుర్తింపు

చైనా, పాక్‌లకు తమ స్థాయి ఏంటో తెలియజెప్పిన భారత్‌

భారత్‌ాపాకిస్తాన్‌లు కాల్పుల విరమణ పాటించడానికి అంగీకరించాయని శనివారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌ చేయడం సంచలనం సృష్టించింది. అయితే వీసా, సింధూ నదీ జలాలపై భారత్‌ వైఖరి కొనసాగుతుందనేది ఈ పోస్ట్‌ సారాంశం. పహల్గాం సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరపడం, తర్వాత పాకిస్తాన్‌ మనదేశంపై యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులకు మనదేశం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అని పేరు పెడితే పాకిస్తాన్‌ మనదేశంపై జరి పే దాడులకు ‘‘‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ అని పేరుపెట్టింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ మనకు ఎంతమాత్రం సరిసాటి కాదన్న సంగతి ప్రపంచానికి స్పష్టమైంది. అంతేకాదు, మన సాయుధ సంపత్తి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లను, క్షిపణులను, విమానాలను నిలువరించే పటిష్ట రక్షణ వ్యవస్థ, నిర్వహించిన ప్రతి దాడిలో నూటికి నూరుపాళ్లు కచ్చితత్వాన్ని సాధించడం, మరోవైపు పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేవిధంగా మనం అనుసరించిన దౌత్యనీతి ప్రపంచ దేశాలను నోరెళ్లబెట్టేలా చేసింది. ఒక చెడు మరో మంచికి దారితీస్తుందనేది ఒక సామెత. పాక్‌ చేసిన దుశ్చర్య ఇప్పుడు దానికి తన స్థానమేంటో చక్కగా తెలిసొచ్చింది. రెండోది భారత్‌ పదేళ్ల క్రితం కంటే అన్నిరంగాల్లో సాధించిన ప్రగతి, సామర్థ్యాలను ప్రపంచం అబ్బురంతో చూస్తోంది. ఇప్పటి కే ప్రపంచ యవనికపై దౌత్యపరంగా ఒక విలక్షణ శైలిని అనుసరిస్తూ, అవసర సమయంలో అగ్రరాజ్యాలతో సహా అన్ని దేశాలు తనవైపే చూసే స్థాయికి భారత్‌ చేరింది.
ఈ యుద్ధం చైనాకు కూడా పెద్ద గుణపాఠం నేర్పుతుందనుకోవాలి. ప్రపంచంలోనే తమవి అ త్యాధునిక రక్షణ వ్యవస్థలుగా చైనా విపరీత ప్రచారం చేసుకుంది. ఎఫ్‌`16 విమానాలకు దీటు గా వుంటాయంటూ జెఎఫ్‌`17 విమానాల గురించి ఎంతో గొప్పలు చెప్పుకోవడమే కాదు, తన ఐరన్‌ బ్రదర్‌ పాకిస్తాన్‌కు అందజేసింది. చైనా రక్షణ వ్యవస్థలు, జెఎఫ్‌`17 యుద్ధ విమానాలు ఏవీ మన ధాటికి తట్టుకోలేక ధ్వంసమైపోయాయి. అంతెందుకు, ఎఫ్‌`16 యుద్ధ విమానాలను కూడా మన సైన్యం కూల్చివేసింది. ప్రపంచ మార్కెట్‌లో ఎఫ్‌`16 విమానాలను అమ్ముకోవడానికి అమెరికాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిరది. అమెరికా పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఆవిషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఆ దేశాన్ని ఇరుకున పడేసింది. కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలన్న నిబంధనను ఉల్లం ఘించినందుకు ఇప్పుడు పాకిస్తాన్‌కు, అమెరికా చీవాట్లు పెట్టే పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు చైనా రక్షణరంగ ఉత్పత్తుల్లోని డొల్లతనాన్ని భారత్‌ ప్రపంచానికి వెల్లడిరచినట్లయింది. కేవలం కొద్ది సమయంలోనే పాకిస్తాన్‌లోని చైనా తయారీ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాదు, జెఎఫ్‌`17 యుద్ధ విమానాలను సునాయాసంగా కూల్చివేయడంతో భారత్‌ సత్తా ఏంటో చైనాకు తెలిసొచ్చింది. అంతేకాదు తైవాన్‌ ఆక్రమణకు చైనా చేస్తున్న యత్నాలను చూసి మరే దేశమూ ఇప్పుడు భయపడక పోవచ్చు. ముఖ్యంగా ఆ దేశానికి తన చుట్టూ 14 చిన్న దేశాలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో చైనా ఉత్పత్తుల డొల్లతనం అర్థమైన ఈ దేశాలేవీ ఇక చైనాను లెక్కచేయకపోవచ్చు. అమెరికా కూడా చైనా సాయుధ సంపత్తిపై ఒక అంచనాకు వచ్చి వుండాలి. ఇదే సమయంలో ఎఫ్‌`16 యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్‌ సామర్థ్యం కూడా అమెరికాకు తెలిసొచ్చింటుంది.
2013ా14 నుంచి 2024ా25 వరకు పరిశీలిస్తే భారత్‌ ఎంతటి సామర్థ్యాన్ని సంతరించుకున్నదీ ఈ యుద్ధం స్పష్టం చేసింది. టర్కీ వేల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్‌కు ఇచ్చినప్పటికీ, భారత్‌ వాటిని సమర్థవంతంగా కూల్చివేయడంతో డ్రోన్ల తయారీలో తానే రారాజునని భావిస్తున్న టర్కీకి శృంగభంగమైంది. భారత్‌ శక్తి ఎంటో బాగా తెలిసొచ్చింది. ఇప్పుడు ఏజియన్‌ సముద్రంలోని ద్వీపాల విషయంలో గ్రీస్‌తో టర్కీకి గొడవులున్నాయి. అదేవిధంగా సైప్రస్‌ విషయంలో కూడా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం వుంది. కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ నిలవడంతో మనదేశానికి తీవ్ర ఆగ్రహం కలిగింది. పలితంగా ఇప్పుడు మనం గ్రీస్‌కు మద్దతుగా నిలుస్తున్నాం. అదేవిధంగా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన మరోదేశం అజర్‌బైజాన్‌. ఇప్పుడు ఆ దేశానికి కూడా భారత్‌ శక్తి ఏంటో తెలిసొచ్చింది. దానికి అర్మీనియాకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! అజర్‌బైజాన్‌ కూడా కశ్మీర్‌ విషయంలో పాక్‌ పక్షమే వహిస్తోంది. ఇప్పుడు మనదేశం అర్మీనియాకు ఆయుధ సంపత్తిని సమకూరుస్తూ, అజర్‌బైజాన్‌కు చెక్‌పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నాం. ఇదిలావుండగా అజర్‌బైజాన్‌ాఅర్మీనియా యుద్ధం డ్రోన్ల వాడకం ప్రాధాన్యత ను ప్రపంచానికి తెలియజెప్పగా, భారత్‌ాపాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ‘కౌంటర్‌ డ్రోన్‌’ టెక్నాలజీ అవసరాన్ని ప్రపంచానికి వెల్లడిరచింది.
ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ మొత్తం 26 ప్రదేశాలనుంచి ముఖ్యంగా మనదేశ పశ్చిమ ప్రాంతంపై డ్రోన్లు, సుదూర ప్రాంతాలపై దాడులకు ఉపయోగించే క్షిపణుల సహాయంతో దాడులకు యత్నించగా మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాదు, త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాయి. మన నేవీ కరాచీ పోర్టులో సృష్టించిన విధ్వంసానికిఅది ఇప్పట్లో మామూలు స్థితికి రాదనేది సుస్పష్టం. లాహోర్‌, రావల్పిండి తదితర ప్రాంతాలపై మనదేశం చేసిన దాడులు, పాకిస్తాన్‌కు భవిష్యత్తులో మరచిపోలేని గుర్తులుగా మిగిలిపోతాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
నిజం చెప్పాలంటే పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న పాక్‌ ఉగ్రవాదుల కు వ్యతిరేకంగా భారత్‌ తన చర్యను ప్రారంభించింది. వీరిమూలాలను ధ్వంసం చేయాలన్న నిర్ణయానికి వచ్చి అటువంటి పాక్‌లోని 42 ఉగ్రస్థావరాలను గుర్తించింది. వీటిల్లో మొదటిదశలో 9స్థావరాలపై జరిపిన దాడుల కలిగిన విధ్వంసం పాక్‌ కలలో కూడా ఊహించి వుండదు. అంతే కాదు యూద`అమెరికన్‌ జాతీయుడైన జర్నలిస్ట్‌ డేనియన్‌ పెరెల్‌ హత్యలో పరోక్ష పాత్ర పోషించిన ఇస్లామిక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో హతమయ్యాడు. ఇతగాడిని అప్పగించాలన్ని ఎప్పటినుంచో అమెరికా కోరుతున్నా పాకిస్తాన్‌ ఆపనిచేయడంలేదు. ఇతడి మరణం విషయం భారత్‌ ప్రకటించిన తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేయడం గమనార్హం. ఇదిలావుండగా ఉగ్ర స్థావరాలపై దాడిని తనపై చేసిందిగా పరిగణించి మనదేశంపై ప్రతిచర్యకు దిగిన పాకిస్తాన్‌కు అడుగడుగునా శృంగభంగమే మిగిలింది. తమదేశంలో అంతర్గత కల్లోలాలను తట్టుకోవడానికి భారత్‌పై యుద్ధం చేయకతప్పదని భావించిన పాక్‌ మనదేశం పై కాలు దువ్వింది. చివరకు భంగపడి ఏదోవిధంగా ఈ యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా కా ళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. బహుశా తెరవెనుక దౌత్యం నేపథ్యం కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేయడానికి దారితీసుండవచ్చు.
ఒకవేళ ఇదే నిజమై కాల్పుల విరమణ పాటిస్తే మొత్తం గుర్తించిన 42 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయాలన్న భారత్‌ లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది. ఈ యుద్ధం ద్వారా పీఓజేకేను స్వాధీనం చేసుకునే సువర్ణావకాశం కూడా చేజారిపోతుంది. ఇక బెలూచ్‌ వీరులు ఇప్పటికే 80శాతం బెలూచ్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వాతంత్య్రం ప్రకటించుకునే అవకాశం కూడా దెబ్బతింటుంది. వాస్తవానికి బెలూచ్‌ వీరులకు అమెరికా పరోక్ష మద్దతుందన్న నిర్ధారణ కాని వార్తలు వచ్చాయి కూడా! లక్ష్యం సాధించకుండా వెనుదిరగని నరేంద్ర మోదీ ట్రంప్‌ ట్వీట్‌పై ఏవిధంగా స్పందిస్తా రో చూడాలి. గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా మనదేశం అన్ని సానుకూలతలున్నా, పాకిస్తాన్‌ను క్షమించే రీతిలోనే వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందా? అనేది ప్రశ్న.
మరో అంశమేంటంటే, ఉగ్రవాదులపైనే దాడులు జరపాలి, యుద్ధం అనవసరం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారంటూ మనదేశంలోనే కొందరు వ్యాఖ్యానించే ప్రబుద్ధులున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడినుంచి ప్రారంభమైంది? పహల్గాం దాడినుంచి! ఇక్కడ చనిపోయింది అమాయకు లైన సాధారణ పర్యాటకులు! దీనికి ప్రతీకారంగా భారత్‌ మొదలు పెట్టింది కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులతోనే! మనదేశం చేసిన దాడుల లక్ష్యం సాధారణ పౌరులు లేదా పాక్‌ సైనిక స్థావరాలు కానేకాదు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి మూలాలపై దాడు లు జరిపింది. మరి యుద్ధం మొదలుపెట్టిందెవరు? పాకిస్తాన్‌! మరి మన కుహనా మేధావులకు కంటి ఎదురుగ్గా కనిపిస్తున్న ఈ సత్యం అర్థం కావడంలేదంటే ఆ విచక్షణను వారికే ఒదిలే యాలి. ఒక రకంగా చెప్పాలంటే మనదేశాన్ని కొన్ని రకలు ‘ఇజాలు’ క్యాన్సర్‌లా పట్టిపీడిస్తున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరుకున్నాయంటే ‘ఛాందస స్థాయికి’ చేరుకున్నాయి. అందువల్లనే వీటిని ‘సూ డో లిబరలిజం’ లేదా ‘లిబరల్‌ ఫండమెంటలిజం’ అనడం సబబుగా వుంటుందేమో! భారత్‌`పాక్‌ మధ్య సంఘర్షణను రెండు కులీన వర్గాలకు చెందిన ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధంగా వర్ణించే వారు, పదగుంభనం బాగున్నా, అర్థం తేలిపోతున్నది. తప్పు చేసినవాడిని శిక్షించాల్సిందే! అది ప్రకృతి ధర్మం! చిన్న పిల్లవాడు అమాయకుడు కదాని నిప్పులో వేలు పెడితే కాలకుండా వుండదు! ప్రతి తప్పుడు పనికి కాలం విధించే శిక్ష కఠినంగానే వుంటుంది! సమాజంలో ధనికులు, పేదలు, ఉపాధి లేనివారు, అనాధలు…ఈవిధంగా అన్ని రకాల మనుషులు వుంటారు. వీరి అభ్యున్నతికి ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వీటిని సమూలంగా తొలగించడం సాధ్యంకాదు. అట్లాగని వీరిని ఉపేక్షించనూ కూడదు. ప్రతి సంఘటనకు ‘వీరిని’ ముందుకు తీసుకొచ్చి పదగుంభనంతో మాట్లాడటం ‘డొల్ల మేధావితనం’ తప్ప ‘ఉపయుక్త మేధస్సు’ కాదు!

కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు .!

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు

మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్ నేటి దాత్రి:

 

 

మేడ్చల్ మార్కాజిగిరి జిల్లా

జవహర్ నగర్ మున్సిపాలిటీలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్,మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్,సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద,తదితరులు పాల్గొన్నారు

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం .!

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం

బీసీ జే.ఏ.సీ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున జరగబోయే గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను విజయవంతం చేయాలని బీసీ జే.ఏ.సీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ…. బిసి ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయా అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను గత కొన్ని రోజుల క్రితం కొండ లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామమైన వాంకిడి,అసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు.యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా తిరుగుతూ బీసీ సబ్బండ వర్గాలను ఒకటి చేసి సభలను,రౌండ్ టేబుల్ సమావేశాలను ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.అలాగే ఈ యాత్ర మే10 తేదీ ఆదివారం రోజున మంచిర్యాల పట్టణానికి చేరుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. యాత్రకు స్వాగతం తెలిపి, సాయంత్రం 4:00 గంటలకు మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ నుంచి ఐ.బి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ యొక్క గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్ర కార్యక్రమానికి జిల్లాలో ఉన్న విద్యార్థిని,విద్యార్థులు, రాజకీయ నాయకులు,వివిధ కులసంఘాల నాయకులు,కవులు,కళాకారులు,ప్రజా సంఘనాయకులు,ప్రజాప్రతినిధులు బీసీ కుటుంబ సభ్యులు,బీసీ మద్దతుదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు పరికిపండ్ల అశోక్,వడ్డేపల్లి మనోహర్,గుమ్ములశ్రీనివాస్, విద్యార్థి నాయకులు చేరాల వంశీ,హరీష్ గౌడ్,బీసీ జిల్లా నాయకులు గజ్జలి వెంకన్న, బీసీ యువజన నాయకులు లతీఫ్,ఎర్రోళ్ల రాజు,సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీట్ల తొలగింపు మేలా.!

రౌడీ షీట్ల తొలగింపు మేలా…

మహబూబాబాద్ సబ్ డివిజన్ లో రౌడీ షీట్ల తొలగింపు మేళా.. 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ఎత్తివేత

మార్పు కోసమే ఈ ప్రయత్నం

డిఎస్పీ తిరుపతి రావు

మహబూబాబాద్/ నేటి ధాత్రి:

 

 

మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాలమేరకు తొలగించినట్లుగా డిఎస్పీ తిరుపతి రావు ప్రకటించారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వున్నవారిపై రౌడీ షీట్ల తొలగించపు మేళా మహబూబాబాద్ తోన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఇందులో ప్రశాంవంతమైన జీవితంతో పాటు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలలో పాల్గోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిపై రౌడీ షీట్‌ తొలగించేందుకుగాను జిల్లా పరిధిలో రౌడీషీట్ల తోలగింపు మేళాను ఏర్పాటు చేశామని, అధికారులు నెల రోజుల పాటు కసరత్తు చేసి రౌడీ షీట్ల తొలగించడం జరిగిందని తెలిపారు.

దీని కోసం పరిధిలోని రౌడీషీటర్ల ప్రస్తుత జీవనవిధానంపై సంబంధిత స్టేషన్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్షా జరిపి రౌడీషీట్‌ తొలగింపు జాబితాను రూపొందించారని . ఈ జాబితాను అనుసరించి సత్ప్రవర్తన కలిగిన వారిపై జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్, రౌడీ షీట్‌ తొలగింపు మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మేళాను ఉద్దేశించి మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవితం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు.సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను ఎత్తివేశామని ఎస్పీ తెలిపినట్లుగా డిఎస్పీ వివరించారు.

.ఇక గత కొద్దికాలంగా రౌడీషీటర్లుగా గుర్తింపబడిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగిస్తూ ఎలాంటి నేరాలకు పాల్పడకపోవడాన్ని గుర్తించడం జరిగిందని అందుకే ఇలాంటి ఎవరైనా నేరాలకు పాల్పడుతూ, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తూ , శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని , అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు 28మంది పై రౌడీషీట్‌ తొలగింపు చేశామని చెప్పారు. రౌడీషీట్‌ తొలగించబడిన వ్యక్తులు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.అలాగే ఏదైనా ,ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించే భాధ్యాతయుతమైన పౌరులుగా వుంటూ పోలీసులకు అందించి సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆధే విధంగా వీరిని చూసి మిగితా వారిలో కూడా మార్పు రావాలని రౌడీషీట్లను తొలగించాం అని అన్నారు.ముఖ్యంగా హింసతో ఏది సాధించలేమని, ప్రతికార చర్యలతో కాకుండా పరస్పరం చర్చించుకోని సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో టౌన్ సీఐ దేవేందర్, డోర్నకల్ సీఐ రాజేష్, బయ్యారం సీఐ రవి, ఎస్.ఐ తిరుపతి, రూరల్ ఎస్.ఐ దీపిక, పాల్గొన్నారు.

గుడిలేని దైవం..అమ్మ..

గుడిలేని దైవం..అమ్మ..

అమ్మ లేకపోతే సృష్టే లేదు..

కడుపున పుట్టిన పిల్లలకు పెద్దదిక్కు అమ్మ..

మాతృత్వాన్ని పంచుతున్న కన్నతల్లులు.

“నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం..

అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ అమ్మ. ప్రేమ అంత తీయన కనుకనే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్యాగం. ప్రేమ కలిస్తే అందులో నుంచే అమ్మే పుట్టుకొస్తుంది.
అమ్మకు ప్రత్యామ్నయం లేదు. అమ్మ ఉన్నచోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది. ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటి స్థానం అమ్మకే. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత బిడ్డలందరిపైనే ఉంది. అందుకోసమే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ అమ్మను గౌరవించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మించిన తల్లిని ఆరాధిద్దాం.. పూజిద్దాం..

రామాయంపేట మే 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

తను పునర్జన్మనేత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వ పెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే ఆమె ప్రేమ ఈ జగాన్ని మురిపింప జేస్తుంది. ఆ పదానికి అంతటి మహాత్మామ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. మన పెద్దలు ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటి స్థానం అమ్మకే.. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. తల్లిదండ్రులను గౌరవించని వారు వాడు సమాజాన్ని కూడా గౌరవించడం లేదు.. అందుకే కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత బిడ్డలందరి పైన ఉంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని ఆరాధిద్దాం..
పూజిద్దాం..

పొగబారిన బతుకుతో ప్రేమను పంచుతూ…

 

A templeless god..mother..

 

-బతుకు చక్రం నడుపుతున్న మర్కు సంతోష.

కడుపున పుట్టిన కన్నవారే ఆనందంగా భావిస్తూ తన మాతృత్వాన్ని పంచుతూ
రోజంతా బీడీలు చుడుతూ బతుకు చక్రాన్ని నడుపుతున్న మాతృమూర్తి రామాయంపేటకు చెందిన మర్కు సంతోష, తాళికట్టిన భర్త మర్కు సత్యనారాయణ మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని వెళ్లధీస్తుండగా 2017లో రోడు ప్రమాదం రూపంలో భర్త ప్రాణాలు హరించింది. దీంతో ఒక్కసారిగా ఒంటరితనంతో పాటు కండ్లముందు చిన్నారులైన ఇద్దరు కుమారులు కండ్లముందు మెదిలారు. ఎలాగైనా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావించి తన ఇద్దరు కన్న వాళ్లకు ఎలాంటి లోటు రాకుండా కాపాడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులు తన తల్లి పడుతున్న కష్టానికి ఫలితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

A templeless god..mother..

 

బీడీలు చుడుతూ కుటుంబాన్ని కాపాడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రమీల రామాయంపేట.

రామాయంపేట కు చెందిన మేస్త్రి దుర్గయ్య కాయ కష్టంతో సంపాదించిన దాంట్లో తృప్తిగా జీవితం సాగిస్తున్న సమయంలో అనారోగ్యంతో 2011లో మృతి చెందాడు. దీంతో కుటుంబవారం భార్య ప్రమీల మీద పడింది. తను బీడీలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కొడుకు వెంకటేష్ ను చదివించలేక పోవడంతో ప్రస్తుతం కూలీ పనులకు వెళుతున్నారు. పెద్ద కూతురు సింధుజ మానసిక దివ్యాంగురాలు నడవలేక కుర్చీకే పరిమితమైంది. చిన్న కూతురు శిరీష ఇంటర్ చదువుతుంది తన పిల్లలు ఎవరికి భారం కాకుండా తన రెక్కల కష్టంతో వారి కడుపును నింపుతున్న ప్రమీలకు అభినందనలు తెలపాల్సిందే..

 

A templeless god..mother..

 

కుటుంబం భారమై అన్ని తానై మాతృత్వానికి నిదర్శనం.. మర్కు భాగ్య రామాయంపేట..

జీవితాంతం తోడుండాల్సిన భర్త గుండెపోటు తో మరణించడం తో అన్ని తానై.. తనువు పుండై తన కూతుర్లను ఉన్నత స్థాయిలో ఉంచాలని పరితపిస్తుంది మాతృమూర్తి వరకు భాగ్య. మెదక్ జిల్లా రామయంపేట పట్టణానికి చెందిన మరుకు భాగ్య భర్త మరుకు శ్యామ్ రాజ్ 2024లో గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చనిపోయే సమయంలో ఇద్దరి కూతుర్లు చిన్న వయసు ఉండడంతో తండ్రి లేని లోటు తీర్చుతూ తాను బీడీలు చుడుతూ కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తుంది. చిన్న వయసులో భర్త చనిపోయి కూతుర్ల పోషణ చదువు తన భుజాన వేసుకుని వారిని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేలా భాగ్య పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. తన తనువు పుండైన కూతుర్ల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మాతృమూర్తి మర్కు భాగ్యకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

 

A templeless god..mother..

మ్యాప్ – రామాయంపేట : తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు మన పెద్దలు. ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటిస్థానం అమ్మకే. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. తల్లిదండ్రులను గౌరవించని వాడు సమాజాన్ని కూడా గౌరవించడం లేదు.. అందుకే కన్నతల్లిని కంటికిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలందరిపైనా ఉంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని ఆరాధిద్దాం… పూజిద్దాం.

కుటుంబం భారమై.. అన్నీ తానై

మాతృత్వానికి నిదర్శనం.. సజ్జెనరలక్ష్మీ, శివ్వంపేట

జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆకాల మరణం చెందడంతో అన్నీ తన కొడుకులను తానై.. తనువు పుండై

ఉన్నత స్థాయిలో ఉంచాలని పరితపిస్తుంది. మాతృమూర్తి వజ్జెవరలక్ష్మి, నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన వజ్జె వరలక్ష్మి భర్త వెంకటేశం డిసెంబర్ 2004లో చనిపోయాడు. భర్త చనిపోయే సమయంలో పెద్ద కొడుకు హనుమంతు వయస్సు 8 సంవత్సరాలు, చిన్న కొడుకు సాయికిరణ్ నాలుగేళ్ళ వయస్సు, అప్పటి నుండి తండ్రిలేని లోటు తీర్చుతూ తాను వ్యవసాయం చేస్తూ కొడుకులను ఉన్నత చదువులు చదివించింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హనుమంతు డిగ్రీ పూర్తి చేసి ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే గచ్చిబౌలిలో ఫైనాన్స్ కన్సల్టెంట్ గా పనిచేసుకుంటున్నాడు. చిన్న కొడుకు సాయికిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. చిన్న వయస్సులో భర్త చనిపోయి కొడుకుల పోషణ, చదువు

కన్నవాళ్ళకు ఎలాంటి లోటురాకుండా కాపాడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులు తన తల్లి పడుతున్న కష్టానికి ఫలితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చీడీలు చుగుతూ.. కుటుంబాన్ని కాపాడుతూ… -కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రమీల, రామాయంపేట రామాయంపేటకు

చెందిన మేస్త్రీ దుర్గయ్య

కాయకష్టంతో సంపాదించిన దాంటో తృప్తిగా జీవితం సాగిస్తున్న సమయంలో అనారోగ్యంతో

2011లో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం భార్య ప్రమీల మీద పడింది. తాను బీడీలు చేస్తూ కుటుంబాన్ని నెటుకొస్తుంది. కొడుకు వెంకటేశు చదివించలేక పోవడంతో ప్రస్తుతం అతను కూలీ పనులకు వెళ్తున్నాడు. పెద్ద కూతురు సింధూజ మానసిక దివ్యాంగురాలు. నడవలేక కుర్చీకే పరిమితమైంది. చిన్నకూతురు శిరీష ఇంటర్ చదువుతుంది. తన పిల్లలు ఎవరికి భారం కాకుండా తన రెక్కల కష్టంలో వారి కడుపులు నింపుతున్న ప్రమీలకు అభినందనలు తెలపాల్సిందే.

కుమారులు

మర్కు సిద్దార్థ. మర్కు నందులకు చదువు సంధ్యలు నేర్పిస్తుంది. ఉన్న ఒక్క గూడుతో ఎలాంటి అస్తిపాస్టులు లేకున్నా రోజంతా బీడీలు చుడుతూ పిల్లల చదువుకు వెచ్చిస్తుంది. కుమారులతో పాటు అరు సంవత్సరాల కూతురు కూడా ఉండడంతో ముగురి భవిష్యత్తును భుజాన వేసుకుంది. సంపాదన కుటుంబ పోషణకే సరిపోకున్నా తన

చెరువులో పడి వ్యక్తి మృతి .

చెరువులో పడి వ్యక్తి మృతి

బాలానగర్ /నేటి ధాత్రి :

 

 

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (42), చిట్టెమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం.. కుమారుడు కార్తీక్ ను ఇంటికి పంపించి వెంకటయ్య గ్రామంలోని మైసమ్మ చెరువులో పడి మృతి చెందాడు. శనివారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం.!

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం….. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రజక అభివృద్ధి దారులకు కూడా అమలు చేయాలని మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబిఘాట్లను పూర్తి చేయాలని అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

General Meeting

 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కే చందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య బండి పోశయ్య రాసర రాములు పెనుగొండ సమ్మయ్య తోటపల్లి కళావతి తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు

క్రిమినల్స్ పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .
మిక్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు. జైల్లో ఖైదీలకు కాపలాగా ఉండే పోలీస్ కాస్తా ఖైదీల బట్టలు వెళుకోవడానికి సిద్ధం అయ్యాడు. సిగరెట్లు డిస్టిబ్యూటీ చెస్తున్న వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తు సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ఇద్దరు పోలీసులతో సహా మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3.5 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చెలుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మియాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. వారసిగూడా కు చెందిన గాయని శ్రీకాంత్ (36) కంది జైల్లో జైల్ వార్డెన్ గా పని చేటున్నాడు. కడప జిల్లాకు చెందిన చిదిరి అమర్నాథ్ (41) ఎపి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పలు కెసుల్లో జైల్ కి వెళ్లి వచ్చాడు. ఇద్దరు సస్పెన్షన్ లో ఉండగాఆరో ఇద్దరు మల్కాజిగిరి దాయనంద్ నగర్ కి చెందిన ఎండి ఇమ్రాన్ (32), మలక్ పెట్, మూసరం బాగ్ కి చెందిన వాసం శ్రీకాంత్ (32) లతో పరిచయం ఏర్పడింది. ఇమ్రాన్ డెలివరీ బాయ్ గా శ్రీకాంత్ పెయింటర్ గా పనిస్తున్నారు. నలుగురు ముఠా గా ఏర్పడి ఇటిసి నుండి సిగరెట్లు షాప్ లలో సప్లై చేసే వారే టార్గెట్ గా పెట్టుకొని రెక్కీ నిర్వహించేవారు. వారు బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం మీరు తిఅంకెళ్తున్న సిగరేట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారు అని భయబ్రాంతులకు గురి చేసేవారు. సిగరేట్లతో పాటు గంజాయి, డ్రగ్స్ సప్లై చేటున్నందుకు కేసులు పెడతామని బెదిరిస్తారు. వాటిని పరిశీలించి లోకల్ పోలీసులకు అప్పగించాలి అంటూ బెదిరించి డబ్బ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ లో ఏప్రిల్ 28 వ తేదీన సిగరెట్ సప్లైర్ బెదిరించి సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సప్లర్ శ్రీహరి వెంటనే మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయాయడంతో నిందితులను అదుపులోకి తిఆకున్నారు. వారి నుండి 3.5 లక్షల విలువ చేసే పలు రకాల కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసుల స్వాధీనం చెలుకున్నారు. ఈ విధంగా వారిపై అల్వాల్, మియాపూర్, సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ మేరకు నిందితులను రిమాండ్ కు తరలించి కేసును చేధించిన పోలీసులని ఏసీపీ, శ్రీనివాస్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో, క్రాంతి కుమార్, రవీందర్, రమేష్ నాయుడు,విజయ్ కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, పుల్య నాయక్, సుభాష్

వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం .

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘంఅధ్యర్యములో పసుపుతో తయారు చేసిన కోటి గౌరమ్మల నిమజ్జనం సోమశిల సంగమేశ్వర నదిలో నిమజ్జనము చేశారు నిమజ్జన కార్యక్రమంలో వనపర్తి ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు మహిళా అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి అనంత పద్మావతి గుబ్బ మాధవి కొండూరు మంజుల ప్రవీణ్ కొంపల. శ్రీలక్ష్మి ఆకుతోట సుప్రియ యావజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము లగిశెట్టి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారని బచ్చురామ్ ఒక ప్రకటన లో విలేకరులకు తెలిపారు

బీసీల విద్యా స్థాయిని పెంచాలి.

బీసీల విద్యా స్థాయిని పెంచాలి

నేటిధాత్రి :

బలహీనవర్గాల విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి ఒక నివేదికను అందజేశామని బీసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ తండు నాగయ్య తెలియజేసినారు. శుక్రవారం హైదరాబాద్ ఎడ్యుకేషన్ కమిషన్ కార్యాలయంలో జరిగిన ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ శేషు డాక్టర్ నాగయ్య తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యాస్థాయి, విద్యా విషయాలలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య, ప్రొఫెషనల్, సాంకేతిక విద్యలలో బీసీల విద్యా స్థాయిని పెంచడానికి చెప్పటాల్సిన చర్యలపై కమిషన్ కి నివేదిక అందజేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాన్ని ఆంక్షలు లేకుండా అమలు చేయాలని, పూలే విదేశీ విద్యా జ్యోతి లాంటి పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రాథమిక విద్యలో డ్రాప్ ఔట్ ని తగ్గించాలని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి బలహీన వర్గాల విద్యా స్థాయిని పెంచటానికి కమిషన్ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలియజేసినారు.

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం .

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

పాల్గొన్న శాసన మండలి వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరా ధ్య దైవం పెద్దమ్మతల్లి ఆశీస్సు లతో ప్రజలందరూ సుఖసంతో షాలతో జీవించాలని కోరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ . ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయoలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకు న్నారు

ceremony.

.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘరాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,ముదిరాజ్ సోదర సోదరీమణులు,బిఆర్ ఎస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బోధించు – సమీకరించు- పోరాడు .!

బోధించు – సమీకరించు- పోరాడు అనే నినాదంతో* ముందుకు వెళ్ళాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు సిద్దాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2023-24&25 -లలో వేసిన కమిటీ లు మినహా మిగిలిన గ్రామ కమిటీలను వేయాలని అందుకబోదించు -సమీకరించు – పోరాడు* అనే నినాదంతో గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు మహానీయుల గురించి తెలియజెప్పాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారశని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కమిటీ లను 2023–24-& 25 సంవత్సరా, లలో వేసిన కమిటీలు మిసహ మిగిలిన కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామాల్లో ప్రజలకు చెప్పాలన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో దళితుల పట్ల కుల వివక్షత ఇంకా గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను భారత రాజ్యాంగం గురించి తెలియజెప్పి వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే నెల 31* వరకు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను పూర్తి చెయ్యాలని మండల కమిటీలు భాద్యతలు తీసుకుని గ్రామ కమిటీలు పూర్తి చెయ్యాలన్నారు.

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్ .

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్

నిజాంపేట: నేటి ధాత్రి 

 

 

భారతీయ జనత పార్టీ మండల మండల అధ్యక్షునిగా చిన్మనమైన చంద్రశేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్ .

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్

గన్నీ సంచుల కొరతతో అమ్ముకుంటున్న నిర్వాహకు డు
చిన్నాల ధనుంజయ్

అధికారుల నిర్లక్ష్యం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి :

 

 

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర కల్పించే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన వాటిని ఆసరా చేసుకుని నిర్వాహకులు కొందరిని నియమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డివిజన్ పరధిలోని మండలంలోని హరిపిరాల, గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

గన్ని బ్యాగులను అమ్ముకున్న సెంటర్ నిర్వాహకుడు

Farmers

కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరతతో మండలంలోని అరిపిరాల గ్రామ పిఎసిఎస్ సెంటర్ లో చీకటాయపాలెం గ్రామానికి చెందిన రైతుకు గన్ని బ్యాగులను అమ్ముకోవడంతో పిఎసిఎస్ సెంటర్ నిర్వాకుడు ధనుంజయ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా రైతులు అనుమతి లేకుండా బస్తాలను వేరే గ్రామానికి చెందిన రైతులకు అమ్ముకోవడం ఏంటి అని నిలదీశారు, హరిపిరాల గ్రామానికి వచ్చిన బస్తాలను చీకటాయపాలెం గ్రామానికి ఎలా అమ్ముతారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చేతివాటంతోటి బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనతో గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసి సెంటర్ నిర్వాహకుని పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న . .

మెట్ పల్లి మే 10 నేటిధాత్రి :

 

 

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మల్లాపూర్, చిట్టపూర్, సాతారం డబ్బా, మేడిపల్లి గ్రామ చౌరస్తాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది . అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ మాట్లాడుతూ 12వ తారీకు సోమవారం రోజున మల్లాపూర్ మెట్పల్లి గ్రామం మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న ఐదు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు విగ్రహావిష్కరణ చేస్తారని గీతా కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరియు నియోజకవర్గ గౌడ సంఘ ప్రజలు అత్యధిక మంది పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాని అందని వారు ఇదే ఆహ్వానంగా అనుకొని మన కార్యక్రమం మనం ముందు ఉండాలని ఉద్దేశంతో అందరూ రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గొల్లపల్లి రామా గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు రామా గౌడ్ ,జిల్లా అధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్, ఆరెల్ల నరస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version