సర్దార్ 2 షూటింగ్ పూర్తి!

సర్దార్ 2 షూటింగ్ పూర్తి!

కార్తీ సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోయింది. ‘సర్దార్’కు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, సీక్వెల్ కు సామ్ సీఎస్ ను తొలుత అనుకుని ఇప్పుడు యువన్ శంకర్ రాజాతో మ్యూజిక్ చేయించుకున్నారు.

కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా 2022లో దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రజిషా విజయన్ (Rajisha Vijayan), రాశీఖన్నా (Rasi Khanna) హీరోయిన్లుగా నటించారు. లైలా (Laila) ఓ కీలక పాత్రను పోషించి మెప్పించింది. పి.ఎస్. మిత్రన్ (P.S. Mithran) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ తెలిపారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ను కొంతకాలం క్రితం ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టోటల్ క్రూ అంతా కలిసి కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.

ప్రిన్స్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘సర్దార్ -2’లో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath), రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తుండగా, ఎస్. జె. సూర్య (SJ Suryah) ఓ పవన్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత సామ్ సి.ఎస్.ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆ స్థానంలోకి యువన్ శంకర్ రాజా (Yuvan Sakar Raja) వచ్చాడు. చిత్రం ఏమంటే… ‘సర్దార్’ తొలి భాగానికి వీరిద్దరూ కాకుండా జి.వి. ప్రకాశ్‌ కుమార్ సంగీతాన్ని అందించాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫీ సమకూర్చుతున్న ‘సర్దార్ -2’ చిత్రానికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఎస్. లక్ష్మణ్‌ కుమార్ నిర్మిస్తున్న ‘సర్దార్ 2’ కు ఎ. వెంకటేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న . .

మెట్ పల్లి మే 10 నేటిధాత్రి :

 

 

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మల్లాపూర్, చిట్టపూర్, సాతారం డబ్బా, మేడిపల్లి గ్రామ చౌరస్తాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది . అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ మాట్లాడుతూ 12వ తారీకు సోమవారం రోజున మల్లాపూర్ మెట్పల్లి గ్రామం మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న ఐదు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు విగ్రహావిష్కరణ చేస్తారని గీతా కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరియు నియోజకవర్గ గౌడ సంఘ ప్రజలు అత్యధిక మంది పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాని అందని వారు ఇదే ఆహ్వానంగా అనుకొని మన కార్యక్రమం మనం ముందు ఉండాలని ఉద్దేశంతో అందరూ రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గొల్లపల్లి రామా గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు రామా గౌడ్ ,జిల్లా అధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్, ఆరెల్ల నరస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version