రసాయన శాస్త్రంలో నీరజ వడగంకు పీహెచ్డీ…

రసాయన శాస్త్రంలో నీరజ వడగంకు పీహెచ్డీ

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నీరజ వడగం డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘లిక్విడ్ క్రోమాటోగ్రఫీని ఉపయోగించి ఫార్మాస్యూటికల్ డోసేజ్ ఫారమ్ లలో చిరల్ మలినాలను వేరు చేయడం, పరిమాణాత్మక అంచనా వేయడం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ బాబు హరిదాస్యం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ నీరజ పరిశోధన ఔషధ విశ్లేషణాత్మక శాస్త్రానికి విలువైన సహకారాన్ని అందిస్తోంది. ఆమె కీలక ఔషధాలలో చిరల్ మలినాల యొక్క స్టీరియో-సెలెక్టివ్ విభజన, పరిమాణీకరణ కోసం బలమైన, స్థిరత్వాన్ని సూచించే క్రోమాటోగ్రఫీ పద్ధతులను అభివృద్ధి చేశారు. ఇది ఔషధ సూత్రీకరణలలో మెరుగైన నాణ్యత, భద్రతను నిర్ధారిస్తుంది.డాక్టర్ నీరజ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించారు

మందమర్రిలో జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు…

మందమర్రిలో జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి

 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకున్న మందమర్రి యువత

నవీన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు

దివ్యాంగ విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ

ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. పదవిలో లేకున్నా దాదాపు పదేళ్లుగా వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక–విద్యా సహాయం అందిస్తూ ప్రజలతో మమేకమై సేవలు చేయడం యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆయన సేవా భావాన్ని ముందుంచుకున్న మందమర్రి యువత ఆయన పుట్టినరోజును అర్థవంతంగా సేవామయ కార్యక్రమాలుగా నిర్వహించింది. సోమవారం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లోని మనోవికాస్ పాఠశాలలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, దివ్యాంగ విద్యార్థులకు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. విద్యార్థుల ముఖాల్లో మెరిసిన ఆనందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “నవీన్ యాదవ్ ప్రజలతో కలిసిపోతూ చేసే సేవలు మాకు దిశానిర్దేశం. అలాంటి నాయకుడి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరపడం మా అదృష్టం. ఇకపై కూడా మా ప్రాంతంలో ఇలాంటి సేవలను కొనసాగిస్తాం” అని గుంట శ్రీశైలం తెలిపారు. వరుస పరాజయాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే పనిచేస్తూ, చివరికి విశ్వసనీయతతో భారీ మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్ నిజమైన కష్టపడి ఎదిగిన నాయకుడని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి తోడ్పడిన మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్రను గుర్తుచేసి ఆయన్ను కృతజ్ఞతలతో స్మరించారు. నవీన్ యాదవ్ ఆయురారోగ్యాలతో ముందుకు సాగి తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని యువత ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో మంద తిరుమల్ రెడ్డి, ఆకారం రమేష్, అంకం రాజ్‌కుమార్, కత్తి రమేష్, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ దివస్ గోడపత్రిక ఆవిష్కరణ

ప్రతిజ్ఞ దివస్ గోడపత్రిక ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి :

 

స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఈనెల 23వ తేదీన జన్మదిన శుభ సందర్భంగా ప్రతిజ్ఞ దివస్ పేరుమీద ఈ వారం రోజులపాటు వివిధ మాధ్యమంలో అనేక ప్రోగ్రామ్స్ జరుపుటకు సిద్ధమైన సందర్భంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వద్ద గోడపత్రిక ఆవిష్కరించడం చేయడం జరిగింది. సేవా దినోత్సవం, జ్ఞాన జ్యోతి దినోత్సవం, ప్రేరణ దినోత్సవం ,స్వేరోవిందు, పర్యావరణ దినోత్సవం, నాయకత్వ దినోత్సవం మరియు ప్రతిజ్ఞ దినోత్సవం ఈ యొక్క మాధ్యమంలో ప్రతిజ్ఞ దివస్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య ,ఎస్ఆర్పీలు , స్వేరోస్ రాష్ట్ర నాయకులు, స్వేరోస్ జిల్లా నాయకులు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి విభాగం మరియు తదితరులు పాల్గొన్నారు.

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాదీ మౌలానా కుటుంబం దుర్మరణం

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాదీ మౌలానా కుటుంబం దుర్మరణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా యాత్రకు వెళ్లిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పా నగర్ గ్రామానికి చెందిన మౌలానా, ఆయన కూతురు గౌసియా బేగం, అల్లుడు ఖదీర్, మనుమడు సోయబ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మక్కా వెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో, మనుమడు సోయబ్ కిటికీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అతనికి కాళ్లు విరిగి, స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు పాస్పోర్ట్ సమస్యల వల్ల ముందుగానే వెళ్లారు.

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి…

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి

రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో తల్లి దివ్యాంగులకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిం చాలని రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఫణిచంద్ర కు వినతి పత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న దివ్యాంగులు నిరుపేదలైన ఫిజికల్ కోటలో వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో
అరికిల్లసాంబయ్య దివ్యాం గుడు పల్లెబోయిన సారయ్య ఎంపిటిసి మాజీ అబ్బు రఘు పతి రెడ్డి శంకర్ లింగం గడిపే ప్రభాకర్ కటికే అశోక్రాజోజు రజిత దివ్యాంగురాలు,సామల శంకర్ లింగం దివ్యాంగుడు పాల్గొన్నారు.

కొత్తగూడ ఏకలవ్య గురుకుల పాఠశాల ఎదుట డి ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ధర్నా..

కొత్తగూడ ఏకలవ్య గురుకుల పాఠశాల ఎదుట డి ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ధర్నా…….!!

కొత్తగూడ, నేటిధాత్రి:

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకూడా కారంతో భోజనం పెట్టడం పట్ల ఆగ్రహించిన డి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బానోత్ దేవేందర్…సమస్యలు తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో గేట్ ఎదుట ధర్నా….ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకులాల పట్ల నిర్లక్యం వహిస్తున్న ఆర్ సి ఓ పై చర్యలు తీసుకోవాలి — సంబంధిత వార్డెన్ ప్రిన్సిపాల్ లను సస్పెండ్ చేయాలి….
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గత నాలుగు రోజుల నుండి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో కూడిన భోజనం తిని కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్న విద్యార్థుల గోడని తెలుసుకుందామని ఏకలవ్య గురుకుల పాఠశాలకి వెళ్తే అనుమతించకోవడంతో గెట్ ఎదుట DSFI అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు……ఈ సందర్భంగా DSFI రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచిన అప్పటినుండి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న ఎల్లిపాయ కారం తో భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని, ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటంవల్ల పిల్లలు బయటకు రాలేక, ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు…..మొన్న జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడంతో డిఎస్ఎఫ్ఐ నేతలు అగ్రహించారు…చివరికి నిన్న పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని గుడ్డుతో కూడిన భోజనం పెట్టడంతో ఆ భోజనంలోనే పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్లు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి, ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని తెలిపారు….ఇది ఇలా ఉండగా ఏకలవ్య స్కూలు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులు పూర్తిగా హిందీలోనే బోధిస్తున్నారని, ఈ భాష ఈ ప్రాంత విద్యార్థులకు అర్థం కాకపోవడం తో విద్యార్థులు చదువులు అప్పటికంటే ఇప్పుడే చాలా వెనుకబడి ఉన్నారని, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, డిఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు…ఉదయం 8 గంటలకు వచ్చిన ఉపాధ్యాయులు మధ్యాహ్న ఒంటిగంట వరకే ఉండి ప్రభుత్వం వాల్లకు కల్పించిన క్వార్టర్స్ లోకి వెళ్లిపోయి మళ్లీ పిల్లల ముఖం చూడటం లేదు ధ్వజమెత్తారు..అసలు పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నారని కూడా పట్టించుకోవడంలేదని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఏకలవ్య స్కూలుకు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి RCO పై,పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో DSFI మండల నేతలు శేఖర్,నవీన్, సురేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు

సిఎస్ఐ పాఠశాల అభివృద్ధి కోసం ఆడహాక్ కమిటీ ఎన్నిక…

సిఎస్ఐ పాఠశాల అభివృద్ధి కోసం ఆడహాక్ కమిటీ ఎన్నిక

పూర్వ విద్యార్థుల కృషిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి

పరకాల,నేటిధాత్రి

చదువుకున్న పాఠశాలను కాపాడుకోవడం కోసం పూర్వ విద్యార్థులంతా ముందుకు రావడం చాలా గర్వంగా ఉందని సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమా జ్యోతి అన్నారు.సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం సిఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమాజ్యోతి అధ్యక్షతన సోమవారం పూర్వ విద్యార్థులు సమావేశం కావడం జరిగింది.ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్ కు లోబడి పాఠశాల అభివృద్ధి కార్యచరణ రూపొందించడం కోసం పూర్వ విద్యార్థుల నుంచి తాత్కలిక అడహక్ కమిటీని వేయడం జరిగింది. అడ హక్ కమిటీ చైర్మన్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎబ్బి,ముఖ్య సలహాదారులుగా కే.జే థామస్,జేమ్స్,సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల మేనేజ్మెంట్కు ఎక్స్ అఫీషి యో ( ప్రత్యేక హోదా )గా పరిగణంలోకి తీసుకుంటూ ఆడహాక్ కమిటీ కన్వీనర్ గా ఒంటేరు ప్రభాకర్,కోకన్వీనర్ గాకాజీపేట రవీందర్,సెక్రటరీగా చొల్లేటి సునేందర్,కోశాధికారిగా బి.అశోక్, సలహాదారుడుగా ఒంటేరు చక్రి,కన్స్ట్రక్షన్స్ కన్వీనర్స్ గా బొచ్చు కళ్యాణ్, పాలకుర్తి తిరుపతిలను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఒంటేరు ప్రభాకర్ మాట్లాడుతూ 1948 సంవత్సరంలో స్థాపించి 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు విద్యా ద్వారా తోడ్పాటు అందించిన సీఎస్ఐ మిషన్ ఉన్నత పాఠశాల పూర్వవైభవమే పూర్వ విద్యార్థులు కృషి చేయాలని ఐక్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది అన్నారు.2026 -27 విద్యా సంవత్సరంలోపు సి ఎస్ ఐ మిషన్ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ జరగాలంటే ప్రతి ఎస్ఎస్సి బ్యాచ్ వారందరినీ వాట్సప్ గ్రూపులో యాడ్ చేస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పనులను తెలియజేస్తూ నిధులను సేకరించడం జరుగుతుందన్నారు.ఆయా నిధులను బ్యాంకు అకౌంట్ తీసి అందులో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి సిఎస్ఐ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఎంతటి హోదాలో ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా
వచ్చే నెల డిసెంబర్ 7న 11 గంటలకు అడహక్ కమిటీ సమావేశమై పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థులు ఒంటేరు చంద్రశేకర్,బొచ్చు అనంతరావు,ఒంటేరు మధు, బొచ్చు శ్రీనివాస్,పాస్టర్ బొచ్చు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

ఏఎస్ఐ సర్వేశ్వరరావు సేవలు మరువలేనివి….

ఏఎస్ఐ సర్వేశ్వరరావు సేవలు మరువలేనివి.

ఎస్ఐ రాజ్ కుమార్

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి ఇనుగుర్తి కి బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ
అతి తక్కువ సమయంలో ఎనలేని సేవలు అందించారు…పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సర్వేశ్వరరావు అతితక్కువ కాలంలోనే తమదైన శైలిలో సేవలు అందించారుని ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. డిపార్ట్ మెంట్ లో బదిలీలలో భాగంగా కొత్తగూడ పిఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సర్వేశ్వరరావు ఇనుగుర్తి పోలీస్ స్టేషన్కు బదిలీ కాగా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆయనను సత్కరించి తను చేసిన సేవలను గుర్తు చేసుకుని ఘనంగా వీడ్కోలు పలికారు.అందించిన సేవలు, నేర్పించిన పాఠాలు, మరియు పంచుకున్న ఆనందాలను తలుచుకుంటూ, వారికి కృతజ్ఞతలు.
వారితో ప్రయాణం ప్రారంభమైనప్పుడు, వారు ఎంతో ఉత్సాహంతో, నూతన ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లారు… మేము వారితో కలిసి పనిచేసినప్పుడు, వారు మాకు ఎన్నో మంచి విషయాలను నేర్పించారు. వారిలోని సహనశీలత, నిబద్ధత, మరియు ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేము వారితో పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, నవ్వులను ఎప్పటికీ మర్చిపోలేముని
భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించాలని, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని
మరోసారి, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మమ్మల్ని కొత్తగూడ మండల ప్రజలు గుర్తుంచుకుంటారు అని ఆశిస్తున్నాము. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి ని . సందర్భంగా ఎస్సై రాజ్ కుమార్ సిబ్బంది శాలువా తో సన్మానించారు

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో…

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో…

◆:- బిజెపి మరియు ఈ.సీ కి వ్యతిరేకంగా…

◆:-;నేడు గాంధీ భవన్ లో నిర్వహించిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మహా నిరసన సభలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అక్బర్ మరియు జహీరాబాద్ డివిజన్ లో గల వివిధ మండలాల యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఝరాసంగం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, యుత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అంబేద్కర్, రాష్ట్ర కోఆర్డినేటర్ శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఫకృద్ధీన్, సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ నవీన్,యుత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ,మోహన్, తదితరులు పాల్గొన్నారు,

మహా రుద్రయాగంలో పాల్గొన్న గంటా కళావతి దంపతులు..

మహా రుద్రయాగంలో పాల్గొన్న గంటా కళావతి దంపతులు

పరకాల,నేటిధాత్రి

 

సోమవారం రోజు పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో కార్తీకమాస మహా రుద్రయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ మహోత్తర కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ మహా యాగంలో పాల్గొనడం ఆ శివుడి కృపను పొందండం మా జన్మ ధన్యమేనని అన్నారు.ఈ మహా యాగన్ని ఏర్పాటు చేసిన ఆలయకమిటీకి మరియు రుద్రయాగా సమితికి ధన్యవాదాలు తెలిపారు.

మహా రుద్ర యాగం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…

మహా రుద్ర యాగం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

రుద్ర యాగ కమిటీ కో కన్వీనర్ ఆముదాలపల్లి అశోక్ గౌడ్

పరకాల,నేటిధాత్రి

 

సోమవారం రోజు పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో కార్తీకమాస మహా రుద్రయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు.21 రోజుల నమక-చమక పారాయణం,32 మంది ఋత్వికుల సమూహ జపం,161 హోమ కుండాలు, 644 మంది దంపతులు హోమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.విశ్వశాంతి, జన సమృద్ధి కోసమే మహారుద్ర యాగం చేస్తున్నట్లు రుద్రయాగ కమిటీ కో కన్వీనర్ ఆముదాలపల్లి అశోక్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యాగంలో పాల్గొన్న దంపతులకు భక్తులకు,సహకరించిన వివిధ శాఖల అధికారులకు,నాయకులకు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

మంగపేట మండల ప్రజలకు వాహనదారులకు మంగపేట పోలీస్ వారు విజ్ఞప్తి…

మంగపేట మండల ప్రజలకు వాహనదారులకు మంగపేట పోలీస్ వారు విజ్ఞప్తి

మంగపేట నేటిధాత్రి

 

ప్రస్తుతం కాలంలో పొగ మంచు ఎక్కువగా ఉంటుంది కావున ప్రజలు తమ ప్రయాణాలను ఉదయం మరియు రాత్రి సమయంలో వాయిదా వేసుకోవాలని సరైన వెలుతురు వచ్చిన తర్వాతనే ప్రయాణం చేయాలని రోడ్డుపైన ఎటువంటి వాహనాలను సరైన జాగ్రత్తలు లేకుండా నిలపరాదని
ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా మంగపేట యస్ ఐ టి వి ఆర్ సూరి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం

అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా వరంగల్ పట్టణ కలకోట వెంకటేశ్వరరావు కుమారుడు, కోడలు ఫని కుమార్, డాక్టర్ శీతల్ వ్యవహరించారు.అలాగే సింగిరికొండ సురేష్ విజయ దంపతుల వివాహ పర్వదిన సందర్భంగా రూ.2 వేలు విరాళంగా అందజేసినట్లు దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

వెంకటాపూర్ మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గంప సుమలత ఇల్లు షార్ట్ షర్కూట్ వల్ల కాలిపోగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క వారి కుటుంబానికి దైర్యం చెప్పారు
పూర్తిగా ఇల్లు దగ్ధం కావడంతో వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి వారి కుటుంబానికి బియ్యం, దుప్పట్లు,దుస్తులు అందించ ఆర్థిక సాయం చేశారు
మంత్రి సీతక్క వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,మండల నాయకులు,యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి..

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సందర్భంగా కామ్రేడ్ సిపి రెడ్డి రాసిన ఏరిన రచనలు అనే
పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ నందు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.రాజేందర్ మాట్లాడుతూ
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవోద్యమంలో చేసిన కృషి గొప్పదని,దేశ చరిత్రలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటంలో చెరగని ముద్రవేశారని అన్నారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఐఎఫ్టియు నర్సంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్,గొర్రె ప్రదీప్, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు అశోక్,పివైఎల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి,ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భోగి సారంగపాణి, నాయకులు కొంపెల్లి సాంబన్న,భద్రాజి, తదితరులు పాల్గొన్నారు.

స్వేరోస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా మంద మనోజ్…

స్వేరోస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా మంద మనోజ్

హన్మకొండ, నేటిధాత్రి:

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా 13 సంవత్సరాల క్రితం ఏర్పడిన స్వేరో సంస్థకు గత పది సంవత్సరాల నుండి పనిచేస్తూ స్వేరో ఉద్యమానికి నికార్సైన స్వేరో నాయకుడిగా వివిధ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో కష్టనష్టాలను ఎదుర్కొని చివరి వరకు నిలబడాలనే ఆకాంక్షకు అనుగుణంగా తన పనితనాన్ని గుర్తించి హనుమకొండ జిల్లా పరకాల మండలం మాదారం కీ చెందిన యువనాయకుడు మంద మనోజ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార మల్ల ప్రకాష్ కో కన్వీనర్ పుల్ల కిషన్ ల ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనీ ప్రకటించడం జరిగింది.
అనంతరం జిల్లా అధ్యక్షుడు మంద మనోజ్ మాట్లాడుతూ స్వేరోస్ సంఘాన్ని మా జిల్లాలో ఉన్న 14 మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా వెలికి తీసి వారికి స్వేరోస్ తరఫున అండగా నిలబడి అధికారుల ద్వారా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని అన్ని గ్రామాలలో స్వేరోస్ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు..

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీలో జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న.బెట్టింగ్ అలవాటు పడి నాశనం అవుతున్నారు,తన ఫ్రెండ్ను చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తికి రూ.20 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న భూమిలు ఫోన్లు బంగారము అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు.

ఇదే గ్రామంలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు.. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యారు. గేమ్స్ లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ. లక్షల వేలలో వరకు అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో తనకున్న బంగారం ఫోన్లు భూములను అమ్మి కట్టేస్తున్నారు,

ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు 11 నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాదలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెద్దు న్నారు. సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల చాలాగ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు ఝరసంగం కోహిర్ మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండ
లంలోని ఒక్కొక్క గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.

మొదట్లో వందలు పెద్దే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్ప చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక్కొక్క గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.

కుటుంబాల్లో గొడవలు

ఆన్లైన్ గేమ్స్ తో యువకులు ఆర్థికంగా నష్టపో తుందదంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరు గుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్మా, భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకు నేదాకా వెళ్లాయి. ‘ఆ పిలగాడు ఫోన్లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిందట… మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టులేదు అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.

రూ.10 మిస్తీకి తెస్తున్నరు

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ అప్పులు తీసుకుంటు న్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్
వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్త వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అను మతులు లేకుండా ఫైనాన్స్ లు నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్రీడబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమవరం చేసుకుంటున్నట్లు తెలిసింది

అవగాహనతో అడ్డుకట్ట

గ్రామలలో అనేక మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా పోలీసులు ఆయా గ్రామలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు

యువత బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ పై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.

ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ విగ్నేశ్వర ఎఫ్పిఓ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ సోమవారం పట్టణంలోని ఎన్టిఆర్ నగర్ వద్ద ప్రారంభం చేశారు.ఎఫ్పిఓ అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి అధ్యక్షతన జరుగగా రామానంద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరైన కాంట పద్ధతి ద్వారా కొనుగోలు చెయ్యాలని తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంధ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలుగూరి మధుకర్,ఎఫ్పిఓ డైరెక్టర్ చింతల సాంబరెడ్డి,బుర్ర మోహన్ రెడ్డి, చిలువేరు వెంకటేశ్వర్లు,కమిటీ సభ్యులు చిలువేరు కొమ్మలు, కొమురయ్య, రేమిడి శ్రీనివాస్, లింగాల సూరయ్య,శంకర్,హనుమయ్య, గాంగడి రాజమ్మల రెడ్డి, ఈక సత్యరాయణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

,,నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు ,,

,,నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు ,,

,,అధికారుల నిర్లక్ష్యం ఆశ్రద్ధతో కనీసం మందులు సూదులు లేక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సామాన్య పేద ప్రజలకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలం అయిపోతుంది,,

◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 500 నుండి 1000 మంది వరకు రోగులు వస్తూ ఉంటారు కానీ రోగులకు సేవలు చేయడంలో ప్రభుత్వాసుపత్రి పడకేయడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి తమ సమయాన్ని ధనమును కోల్పోతున్నారు ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లో కనీస మందులు లేక మందులుంటే సూదులు లేక చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు పేద రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు వీటన్నిటిని చూస్తూ ఆస్పత్రి ప్రధానాధికారులు నిర్లక్ష్యంగా

వ్యవహరిస్తున్నారు దీని మూలంగా ప్రజా సంక్షేమం కోరే ప్రజా పాలనపై ప్రజలు రోగులు లో లోపల గుసగుసలాడుతున్నారు ఇంత మంచి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న అధికారుల ఆశ్రద్ధతో నిర్లక్ష్యంతో ఆస్పత్రి రోజు రోజు కు రోగులకు సేవలు అందించడంలో విఫలమైపోతుంది సామాన్య రోగులు డాక్టర్లు రాసిన చీటీలతో మందులు ఇంజక్షన్లు పొందుటకు వెళితే ఈ మందులు సప్లై లేవు పైనుండే రావడం లేదని నేరుగా ప్రజలతో చెబుతున్నారు అదేవిధంగా వృద్ధులు వెళ్లి సూది తీయించుకోవాలి అంటే కనీసం సూదులు లేక ప్రైవేట్ మెడికల్ షాపుల వెనకాల తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు జహీరాబాద్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్నది కాబట్టి జిల్లా మంత్రి ఆస్పత్రి పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందేలా స్థానిక ప్రజలు

సంతోషించేలా తగు చర్యలు తీసుకుంటారని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాము కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు అంటే చర్మ వ్యాధులకు జలుబుకి దగ్గు జ్వరానికి సరైన మందులు లేవు కనీస మందులను అతి త్వరలో తెప్పించి స్థానిక పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగాణ ప్రశ్నిస్తుంది పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజ్జ భాస్కర్ ఉస్మానియా యూనివర్సిటీ సభ్యులు మాదినం శివప్రసాద్ అరవింద్ ప్యార్ల దశరథ్ బాలు మొదలగు వారు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version