హలో ఉద్యమ కళాకారుడా చలో ఇందిరా పార్క్..

హలో ఉద్యమ కళాకారుడా చలో ఇందిరా పార్క్

ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షు జన్నే యుగేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాల సాధనకై ఈనెల జనవరి 20న ఇందిరా పార్కు ధర్నా చౌక్ హైదరాబాదులో తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యమ కళాకారుల పోరు దీక్ష వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమ కళాకారుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జన్నె యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధించుకున్నాం. అయినప్పటికీ ఉద్యమ కళాకారులకు ఎలాంటి ఉపాధి లేకుండా నిరాశ్రయులుగా, దీనస్థితిలో బతుకుతున్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సాంస్కృతిక సారధిలో 1000 ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 20వ తేదీన తలపెట్టిన పోరు దీక్షను విజయవంతం చేయాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఉద్యమ కళాకారులందరూ మరియు 33 జిల్లాల కళాకారులందరూ ఈ పోరు దీక్షలో పాల్గొనాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జన్నె యుగేందర్ పిలుపునిచ్చారు.. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కళాకారులు సెగ్గెం శ్రావణ్ , ఏ. రాజేష్, జె.రాజా సడవాల్, ఎం మధుకర్, ఈ సమ్మరాజ్, జి రాజశేఖర్, కొనుకుంట్ల సంధ్యారాణి, తిక్క నిర్మల, జె రాజేశ్వరి, ఏ శోభ, మంద సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ దివస్ గోడపత్రిక ఆవిష్కరణ

ప్రతిజ్ఞ దివస్ గోడపత్రిక ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి :

 

స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఈనెల 23వ తేదీన జన్మదిన శుభ సందర్భంగా ప్రతిజ్ఞ దివస్ పేరుమీద ఈ వారం రోజులపాటు వివిధ మాధ్యమంలో అనేక ప్రోగ్రామ్స్ జరుపుటకు సిద్ధమైన సందర్భంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వద్ద గోడపత్రిక ఆవిష్కరించడం చేయడం జరిగింది. సేవా దినోత్సవం, జ్ఞాన జ్యోతి దినోత్సవం, ప్రేరణ దినోత్సవం ,స్వేరోవిందు, పర్యావరణ దినోత్సవం, నాయకత్వ దినోత్సవం మరియు ప్రతిజ్ఞ దినోత్సవం ఈ యొక్క మాధ్యమంలో ప్రతిజ్ఞ దివస్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య ,ఎస్ఆర్పీలు , స్వేరోస్ రాష్ట్ర నాయకులు, స్వేరోస్ జిల్లా నాయకులు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి విభాగం మరియు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version