చట్టబద్ధమైన విధానం లోనే ప్రజలకు న్యాయం…

చట్టబద్ధమైన విధానం లోనే ప్రజలకు న్యాయం

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం – ప్రతి సోమవారంప్రజాదివాస్‌ కార్యక్రమం

మొగులపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గారు ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పిర్యాదుదారుల నుండి మొత్తం 20 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు జారీ చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు, త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
అలాగే, శాంతి–భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఏఎస్ఐ సర్వేశ్వరరావు సేవలు మరువలేనివి….

ఏఎస్ఐ సర్వేశ్వరరావు సేవలు మరువలేనివి.

ఎస్ఐ రాజ్ కుమార్

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి ఇనుగుర్తి కి బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ
అతి తక్కువ సమయంలో ఎనలేని సేవలు అందించారు…పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సర్వేశ్వరరావు అతితక్కువ కాలంలోనే తమదైన శైలిలో సేవలు అందించారుని ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. డిపార్ట్ మెంట్ లో బదిలీలలో భాగంగా కొత్తగూడ పిఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సర్వేశ్వరరావు ఇనుగుర్తి పోలీస్ స్టేషన్కు బదిలీ కాగా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆయనను సత్కరించి తను చేసిన సేవలను గుర్తు చేసుకుని ఘనంగా వీడ్కోలు పలికారు.అందించిన సేవలు, నేర్పించిన పాఠాలు, మరియు పంచుకున్న ఆనందాలను తలుచుకుంటూ, వారికి కృతజ్ఞతలు.
వారితో ప్రయాణం ప్రారంభమైనప్పుడు, వారు ఎంతో ఉత్సాహంతో, నూతన ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లారు… మేము వారితో కలిసి పనిచేసినప్పుడు, వారు మాకు ఎన్నో మంచి విషయాలను నేర్పించారు. వారిలోని సహనశీలత, నిబద్ధత, మరియు ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేము వారితో పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, నవ్వులను ఎప్పటికీ మర్చిపోలేముని
భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించాలని, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని
మరోసారి, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మమ్మల్ని కొత్తగూడ మండల ప్రజలు గుర్తుంచుకుంటారు అని ఆశిస్తున్నాము. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి ని . సందర్భంగా ఎస్సై రాజ్ కుమార్ సిబ్బంది శాలువా తో సన్మానించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version