ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి.

మహదేవపూర్ -నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మతినుల్లా ఖాన్ నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు బీటీ కావడం జరిగింది.
గురువారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ లోని మతిన్ ఖాన్ నివాసంలో కోట రాజబాబు భేటీ కావడం,రాబోయే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తుంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మతిన్ ఖాన్, మహాదేవపూర్ కాటారం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నాయకుడుగా ఉండడం, రెండు మండలాల్లో ప్రజల్లో పలుకుబడి సంపాదించిన ఖాన్ సాబ్, కావడంతో పంచాయితీ ఎన్నికల్లో, సర్పంచ్ నుండి ఎంపీటీసీ ల పోటీలకు బి ఫాం నుండి, గెలుపు పొందె వరకు ఖాన్ సాబ్ అవసరం ఉంటుంది కనుక, ముందస్తుగా మతిన్ ఖాన్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో, పలు నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కోట రాజబాబు మతిన్ ఖాన్ గృహంలో కలవడం ఒక సాధారణ ప్రక్రియ లో భాగమేనని చెప్పడం జరుగుతుంది.

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్న రవీందర్ యాదవ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ను కేటీఆర్ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దారని రవీందర్ యాదవ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి పనికి కమీషన్ల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని రవీందర్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

సాగు చేసుకునే ప్రతీ రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తాం

చెల్పూర్ లో జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండలం
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో తహశీల్దార్ సత్యనారాయణ స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో భూమికి పట్టాలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా పట్టాలిచ్చే కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన ప్రతీ దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ కు పనితీరు అవార్డు

ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ కు ఉత్తమ పనితీరు అవార్డు

జైపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ),మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గా పనిచేస్తున్న గోగు సురేష్ కుమార్ గురువారం ఆ సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని టీజీ ఎఫ్ డీసీ డివిజన్ కేంద్ర కార్యాలయమైన కాగజ్ నగర్ లో గురువారం జరిగిన కార్యక్రమం లో ఈ అవార్డు అందుకున్నారు.టీ జీ ఎఫ్ డీసీ ఏర్పడి దశాబ్ది కాలం పూర్తి అయిన సందర్బంగా ప్లాంటేషన్ ల నిర్వహణ లో ఉత్తమ పనితీరు కు గాను ప్రోత్సాహకంగా ఈ అవార్డు అందజేసినట్లు ప్లాంటేషన్ గోగు మేనేజర్ సురేష్ తెలిపారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్మన్

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తం గార్డెన్ లో చాకలి అనసూయమ్మ గారి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలిపిన సిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితో పాటు మాజీ కౌన్సిలర్లు జాంగిర్ ఖురేషి మొతిరం బిజీ సందీప్ బాల్ రెడ్డి వారితోపాటు తమ బృందం తదితరులు ఉన్నారు.

వరదకు అడ్డుగా హైవే నిర్మాణం


వరదకు అడ్డుగా హైవే నిర్మాణం

పంట పొలాలు కుంటలుగా మారుస్తారా అంటూ రైతుల ఆందోళన

గ్రీన్ ఫీల్డ్ హైవే మహమూద్ పట్నం చెరువును మింగేస్తుందా

చెరువులోకి వర్షం నీరు చేరేదెలా…?

కేసముద్రం/ నేటి ధాత్రి :

 

టీ వలే నూతనంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలోనే ఉన్నటువంటి త్రాగునీటి సాగునీటి చెరువు సుమారు 250 ఎకరాల పంట పొలాలకు నిరంధించే సామర్థ్యం గల చెరువు నేడు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను చెరువు పక్కనే నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, చెరువు పక్కన ఉన్నటువంటి సుమారు 70 ఎకరాల పంట పొలాల మీదుగా వర్షపు నీరు చెరువులోకి చేరుతుందని గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణ పనులు వరద నీరు చెరువులోకి చేరకుండా అడ్డుగా రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధిత రైతులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు మొదలుపెట్టిన నాటి నుండి పలుమార్లు వరద నీరు చెరువులోకి చేరేలా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్కు తెలిపామని రైతులు అన్నారు. సుమారు 70 ఎకరాల పంట పొలాలు కుంటలుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నామని ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే వర్షాలు కురుస్తుండడంతో పైనుండి వచ్చే వరద మా పంట పొలాలనే నిలుస్తుందని, మహమూద్ పట్నం చెరువు కింద పంట పొలాలు సుమారు 250 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములకు నీరు అందిస్తుందని గ్రీన్ ఫీల్డ్ హైవే వరదకు అడ్డుగా నిర్మాణం జరుగుతుందని అందుచేత చెరువులోకి వరద నీరు చేరేదెలా అంటూ రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థను ప్రశ్నిస్తున్నారు.

Farmers

పై నుండి వచ్చే వర్షపు నీరు సజావుగా చెరువులోకి పోవాలంటే గ్రీన్ ఫీల్డ్ నిర్మాణ పనులలో ముందుగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గురువారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ ప్రతినిధి శ్రీరామ్ ఘటన స్థలానికి చేరుకొని రైతులు కోరినట్టుగా ముందుగా కల్వర్టు నిర్మాణ పనులను రెండు మూడు రోజులలో ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మిట్ట గడపల యాకూబ్, తరిగి నవీన్, బొద్దుల వెంకట మల్లు, రాపోలు శ్రీనివాస్, పోలు నరసయ్య, దేశ బోయిన అనిల్, ఎలిజాల యాకయ్య, కాసోజు విజయ్, పోలు మురళి, చిలువేరు రవీందర్, గణేష్, శివాజీ, సామా అశోక్, పోలె పాక కమలాకర్, బత్తుల సుభాష్, పిట్టల విజేందర్, మూడ వత్ మాంజ, మోతిలాల్, మాదరపు పుల్లయ్య, పెరుమాండ్ల నవీన్, పిట్టల ఉపేందర్, పెరుమాండ్ల జానీ పలువురు రైతులు పాల్గొన్నారు.

పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం వేడుకలు.

ఆకట్టుకున్న అటవీ శాఖ అధికారుల బైక్ ర్యాలీ.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ రేంజ్ అధికారి రవి అన్నారు. గురువారం రోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా మహదేవ్పూర్ అటవీ శాఖ రేంజ్ తో పాటు డివిజనల్ అధికారులు బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి రవి మాట్లాడుతూ, పచ్చదనం పర్యావరణ మానవ జీవనశైలిలో ఎంతో ప్రాముఖ్యత తో పాటు ఆరోగ్య రక్షణ కూడా కలిగిస్తుండని, పచ్చదనాన్ని కాపాడుటకు చెట్లు అడువులను రక్షించడం అటవీ శాఖ తోపాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, కుటీర పరిశ్రమల ద్వారా అందించే సంచులను వాడాలని సూచించారు. అడవుల్లో ప్లాస్టిక్ సంచులు,బాటిల్స్, అడవుల్లో వేయకూడదని, అడవుల్లో వృక్షాలను నరకకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పాటించాలని, అడవుల రక్షణ ప్రకృతి పరిరక్షణ మానవ మనుగడకు ముడిపడి ఉందన్న విషయం, ప్రజలంతా గుర్తుంచుకోవాలని అన్నారు.

ఆకట్టుకున్న అటవీ శాఖ అధికారుల బైక్ ర్యాలీ.

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మహదేవ్పూర్ రేంజ్ తో పాటు సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారులు మరియు సిబ్బంది, పర్యావరణం ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ నిషేధించాలని అటవీ శాఖ కార్యాలయం నుండి ,అటవీ శాఖ అందించిన ద్విచక్ర వాహనాలపై సిబ్బంది అధికారులు మండల కేంద్రమంతా ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పెద్ద సంఖ్యలు అటవీ శాఖ సిబ్బంది పచ్చని రంగు ద్విచక్ర వాహనాల ర్యాలీ ప్రదర్శన, ప్రకృతి అందంలా తలపించింది, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో,ఎఫ్ ఆర్ ఓ రవి , డిఆర్ఓ రాజేశ్వర్, ఎఫ్ ఎస్ ఓ,లు. వరుణ్,ఆనంద్,తిరుపతి సుమన్, హసన్ ఖాన్, ఫయాజ్ అహ్మద్, అఫ్జల్,ఎఫ్ బి ఓ లు సదానందం, దిలీప్, అంజయ్య, విటల్,సురేందర్ సంజీవ్ అనిల్ రాజశేఖర్, త్రివేణు తో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

చందుపట్ల కీర్తి రెడ్డి బిజెపి పార్టీ అధికార ప్రతినిధి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన అధ్యక్షతన జిల్లా మండల స్థాయి పదాధికారులతో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు
అనంతరం జిల్లా కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు.
11 ఏళ్ల మోదీ పాలనతో సాధించిన విజయాలు, ఘనతలపై ఈ నెల 4 నుంచి 25 వరకు చేపట్టబోయే కార్యక్రమాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి వికసిత భారత్ కన్వీనర్ కో కన్వీనర్లులు జన్నే మొగిలి దొంగల రాజేందర్ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కన్వీనర్ సుతాటి వేణు రావు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు శక్తి కేంద్ర ప్రభారీలు ప్రముఖు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ రాజిరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని మెటల్ కుంట గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సును ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారని తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో గ్రామసభలో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్వేర్ లాల్ సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన సిపిఐ కరీంనగర్ జిల్లా మహాసభలో నూతనంగా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పరిచయం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను పంజాల శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. పంజాల శ్రీనివాస్ విద్యార్థి దశ నుండే చురుకైన వాడని, విద్యార్థి, యువజన రంగాలలో పనిచేసి, పార్టీలో జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగాడని ప్రజా సమస్యల పై అధికారులు కలిసినప్పుడు స్పందించాలని కలెక్టర్ ను వెంకటరెడ్డి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటనలో శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుడాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈవో) మొండయ్యకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు వూర్తిస్థాయిలో అందివ్వాలని పాఠశాలలో సబ్జెక్టు వైస్ గా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు, ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, డిజిటల్ క్లాసులకు అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ మరియు ఎన్విరాల్న్మెంట్, ఎక్విప్మెంట్స్ పెంచుకునేందుకు ప్రతి పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా సరిపడ గ్రాండ్స్ విడుదల చేయాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలో కనీసం టాయిలెట్స్, పాఠశాల
కాంపౌండ్ వాల్, కరెంటు, వాటర్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా కాలిగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని, ఈఅంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ పవణ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లిసత్యం జన్మదిన వేడుకలు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని ప్రశాంతి భవన్ లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవాజి హరీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురాజు, నేరేళ్ల మల్లేశం, చొప్పదండి అనిల్, మధు, సంతోష్ , అజయ్, మహేష్, సాయి, సాగర్, ఎండి. ముషూ, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి అలంకరణ

వనపర్తి లో శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి మామిడి పండ్లతో అలంకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారికిమామిడి పండ్లతో నేడు అలంకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చురాం యూవజన సంగం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచారకార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటన లో తెలిపారు భక్తులు అమ్మవారికి తే చ్చే మామిడి పండ్లు మధ్యాహ్నం 12 గంటల లోపు అమ్మవారి గుడి లో ఇవ్వాలని వారు కోరారు.
శుక్రవారం సాయంత్రం మామిడిపళ్ళతో అలంకరణ అంతతరం అర్చన
7 గంటలకు కుంకుమార్చన
మంగళహారతి తీర్థ ప్రసాదలు అల్పాహారం ఉంటుందని వారు తెలిపారు
ఈ పూజలకు భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు

విధి కుక్కలకు వింత రోగాలు…

విధి కుక్కలకు వింత రోగాలు…

వ్యాధుల బారిన పడుతున్న విధి కుక్కలు…

వింత వ్యాధులతో గ్రామాల్లో సంచరిస్తున్న వైనం…

చర్మ వ్యాధుల బారిన పడుతున్న విధి కుక్కలు, ప్రజలకు సోకుతుందేమోననే ఆందోళలో ప్రజలు…

నేటిధాత్రి – గార్ల :

 

మహబూబాబాద్ జిల్లా, గార్ల, బయ్యారం మండలాల్లోని చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం, దేశ్య తండ, మంగలి తండ, ఎస్టి కాలనీ, సర్వన్ తండ గ్రామాలతో పాటు, బయ్యారం మండలం కొత్తపేట గ్రామాల్లో విధి కుక్కలకు ఫంగస్ వచ్చి,వింత రోగాలు,చర్మ వ్యాధులతో యదేచ్చగా తిరుగుతున్నాయి. వింత రోగాలతో కుక్కల ఒంటి పై బొచ్చు ఊడిపోయి చర్మ వ్యాధులతో, నోట్లో నుండి నురగలు తీస్తూ సంచరిస్తుంటే, ఇది గమనించిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.చర్మం తోలు ఊడిపోయి బక్క చిక్కి, నిరసించి, గ్రామాల్లో దర్శనమివ్వడంతో విధి కుక్కలకు ఏదో వైరస్ సోకిందని, ఇది ఏ మహమ్మారో నని,ఇది ప్రజలకు సోకుతుందేమోనని, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలకు వెళ్లే పిల్లలపై రెచ్చిపోతు, వెంబడించి గాయపరిచే ప్రమాదం పొంచి ఉంది.ఇంత జరుగుతున్న ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం.తక్షణమే ఉన్నత అధికారులు చొరవ తీసుకోని వింత వ్యాధులతో బాధపడుతున్న వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని,విధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నారు.

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం.

మందమర్రి నేటి ధాత్రి :

 

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
గొల్లెం మల్లేష్ నూతన గృహప్రవేశం ఫంక్షన్లో లో మిగిలిన
ఆహారాన్ని పడేయద్దని ముఖ్య ఉద్దేశంతో.
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం ఇవ్వడం జరిగింది….

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్పందించి ఆ మిగిలిన ఆహారాన్ని మందమర్రి బస్టాండ్ దగ్గర నివసిస్తున్న పేదవారికి మరియు మందమర్రి రైల్వే స్టేషన్ ఏరియా లో ఆ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం అధ్యక్షుడు నది పాట రాజ్ కుమార్ మాట్లాడుతూ.
అలాగే ఏక్కడ ఏ ఆహార పదార్థాలు మిగిలిన మాకు సమాచారం ఇస్తే మేమే వచ్చి తీసుకుపోయి పేదలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చరణ్, జవీద్ ,దిలీప్ తదితరులు పాల్గొన్నారు..

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన తల్లి లక్ష్మమ్మ తండ్రి నరసింహ పెద్ద కుమారుడు చరణ్ (23) గత నెల కింద తల్లి మృతి చెందగా.. తండి కూడా చనిపోవడం జరిగినది. కల్వకుర్తికి మోటార్ సైకిల్ ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ బైకు పైకి దూసుకెళ్లడం జరిగినది. బుధవారం సుమారుగా 12 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టి 24 గంటలు గడిచిన మృతుడి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్తులు మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతుడికి ఒక తమ్ముడు ఉన్నాడు.

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

ఇందు డిపో మేనేజర్ భూపాలపల్లి

భూపాలపల్లి నేటిధాత్రి

 

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్‌టిసి టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఇందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక్క రోజులో భూపాలపల్లి నుండి కొమురవెల్లి, కొండ పోచమ్మ వేములవాడ, కొండా గట్టు, ధర్మపురి సందర్మించి రాత్రి భూపాలపల్లికి బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు :-680/-
ఒక్క రోజులో భూపాలపల్లి నుండి భద్రచలం, పర్ణశాల , మల్లూరు దేవాలయాలను సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:- 700
ఒక్క రోజులో భూపాలపల్లి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుదని . ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:-770/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి బీజపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఆలంపూర్ జోగులాలు దేవాలయాలను సందర్శించి మరుసటి రోజు రాత్రి భూపాలపల్లికి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ -పోనూ చార్జీలు:- 1700/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి విజయవాడ కనక -దుర్గా అమ్మవారి దేవాలయం, అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి సందర్శించుకొని మరుసటి రోజ రాత్రి భూపాలపల్లి కి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ…పోనూ చార్జీలు :-2150/-
ఇలా ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలు బస్సులు నడపాలని నిర్ణయించాముని, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పూర్తి సమాచారం కోసం :- 9959226707, 9701967519, 9849425319, 9908336391

జోరుగా సాగుతున్న ఫైనాన్స్ అక్రమ దందా…

జోరుగా సాగుతున్న ఫైనాన్స్ అక్రమ దందా…

నేటి ధాత్రి -మహబూబాబాద్, గార్ల:-

 

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పేదప్రజల
అవసరాలను ఆసరాగా చేసుకొని డైలీ ఫైనాన్స్, చిట్టీలు అంటూ జోరుగా దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా బహిరంగగానే జరుపుతూ అధికవడ్డీ వసూలు చేస్తూ అమాయకులను రోడ్డున పడేస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాలతో పాటు పలు గిరిజన గ్రామాల్లో సైతం అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ఈ దందాలో కూరుకుపోయేది మధ్యతరగతి, చిరు వ్యాపారులు, గిరిజనులనే టార్గెట్ చేస్తూ డైలీ, వారం అంటూ అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ వసూలు చేయడమే కాకుండా అధిక వడ్డీని వసూలు చేస్తున్నారు కొందరు. అమాయకపు ప్రజలు తమ వ్యాపారాల కోసం ఫైనాన్స్ లో నుండి అప్పులు తీసుకొని చిక్కుల్లో పడుతూ సతమతమవుతున్నారు.

finance

డైలీ, వారం ఫైనాన్స్ ల పేరిట ఐదు నుంచి పదిశాతం వడ్డీని వసూలు చేస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారాలు కొనసాగుతున్నప్పటికీ అక్రమ డైలీ ఫైనాన్స్, చిట్టీ వ్యాపారుల పై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారంలో అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ లు నడిపేవారి ఆగడాలను తట్టుకోలేక చిరువ్యాపారులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొంది. లోకల్ ఫైనాన్సులే కాకుండా గుంటూరు, విజయవాడ నుండి వచ్చి గార్ల, బయ్యారం మండలాల్లోనీ గిరిజన ప్రాంతాల్లో కొందరు అక్రమ వ్యాపారులు వడ్డీ దుకాణాలు తెరిచి బహిరంగంగానే వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఘటనలు కోకోల్లలుగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా అధిక వడ్డీతో డైలీ ఫైనాన్స్,చిట్టివ్యాపారాలు నడుపుతూ అమాయకులను దోచుకుంటున్న వారిపై సంబంధించిన అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం

వరంగల్ డిఆర్ డిఓ కౌసల్యాదేవి

#నెక్కొండ, నేటి దాత్రి:

 

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ డిఆర్డిఓ కౌసల్య దేవి దీక్షకుంట గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ కౌసల్య దేవి మాట్లాడుతూ ప్రజలందరూ సింగిల్ యూజ్ గా ప్లాస్టిక్ను వాడం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని ప్లాస్టిక్ వలన కాలుష్యం పేరుకుపోయి పర్యావరణాన్ని తీవ్రంగా నష్టం చేస్తుందని ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని దిక్షకుంట్ల గ్రామంలోని మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి రెండు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీ ఎం శ్రీనివాస్, ఏపీఓ జాకబ్, దీక్షకుంట గ్రామపంచాయతీ సెక్రటరీ భాను ప్రసాద్, మహిళా సంఘాల వివో అధ్యక్షులు లత, మధులత, చంద్రకళ, వివో ఏ ఏకాంబరం, మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

కల్తీ విత్తనాలను అరికట్టాలి…

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి…

అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలి…

కల్తీ విత్తనాల బెడద రైతుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది…

రైతుల వ్యవసాయ సాగుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ 

 

కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, గుగులోత్ సక్రు, నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Seeds

నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాబన్న, గౌని భద్రయ్య,వీరభద్రం, మాన్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version