శనివారం కల్వకుర్తి మండలం లోని తర్నికల్ గ్రామానికి చెందిన వర్కాల కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తర్నికల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ రుక్ముద్దీన్, మాజీ వార్డు సభ్యులు దేవయ్య, మాణిక్యరావు, వెంకటరత్నం, కృష్ణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సామజిక తనిఖీ పై గ్రామ సభ • వివరాలు వెల్లడించిన బీఆర్పి అధికారులు
నిజాంపేట: నేటి ధాత్రి
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024 – 2025 సంవత్సరాలకు గాను గ్రామాలకు వచ్చిన డబ్బులు, కూలీల పని దినాలను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి గ్రామ సభ నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో శనివారం సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి 25 పనులకు గాను కూలీల వేతనాలు 24,88,950 రూ,, సామాగ్రికి 5,53,262 రూ,, కలిసి మొత్తంగా 30,42,212 రూపాయలు వచ్చినట్లు గ్రామసభలో వెల్లడించారు. అలాగే గ్రామంలో నూతన జాబ్ కార్డుల కోసం కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం గౌరీ, ఆశ వర్కర్ పుష్పులత, గ్రామస్తులు మ్యాదరి కనకరాజు, అందేస్వామి, బోయిని బాలరాజు, చాకలి రవీందర్, మంగలి అమరేందర్, బుర్రని మల్లేష్ గౌడ్, చాకలి రాములు, పిట్ల మల్లయ్య తదితరులు ఉన్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు
నర్సంపేట,నేటిధాత్రి:
ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.
Congress
ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు.
సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు వస్తాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని ఇకనుండి ముందుగా వేయాలని సూచించారు.
ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిని తొందరగా విత్తడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని, తెగుళ్లు మరియు చీడ పీడలప్రభావం తగ్గించవచ్చని అలాగే ముందుగా వరి కోయవచ్చని వివరించారు.
అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలన్న సూచనలు చేశారు.
రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం ను అనుసరించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.
Collector
రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, వ్యవసాయాన్ని స్థిరీకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో 1.8 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించబడినదని విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు.
అదేవిధంగా, చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు.
రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమం లో మరియు వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని రైతులకు సూచించారు.
వికాషిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్, కేవికే మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, కార్యాచరణ అంశాలు గురించి రైతులకు వివరించారు.
కార్యక్రమం ద్వారా రైతులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించి, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం లక్ష్యమని చెప్పారు.
అలాగే డా. తమ్మీ రాజు గారు పశు పోషణ, టీకాలు మరియు పరి శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి వివరించారు.
జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం నేలలో భూసారం పెరుగుతుందని మరియు అధిక దిగుబడి రకాల గురించి వివరించారు.
పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్, డా. బాలకృష్ణ మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలని తెలిపారు.
నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. రాజు మరియు శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి గార్లతో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలించిన కలెక్టర్
అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు.
స్వీకరించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నెల 20 వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
ధరఖాస్తు కోసం వచ్చే వారికి కేంద్రంలో ఏర్పాట్లు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని ఆన్నారు.
రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి నేడు పెద్ద పండుగ అయ్యిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని, పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరనం కనిపిస్తుందని మాధవరెడ్డి రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శుక్రవారం నర్సంపేట పట్టణానికి చెందిన, 01,04,14,15,17,18,వార్డుల్లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులు పోయించి కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లులేని ఊరు ఒక్క గ్రామం కూడా లేదని అన్నారు.
పదేళ్లలో పరిపాలించిన బిఆర్ఎస్ పాలకులు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజా ప్రభుత్వంలో అర్హులకు న్యాయం చేయాలనేదే నా ఆకాంక్షాన్ని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలలో పడద్దని ఎమ్మెల్యే దొంతి చెప్పారు.
ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.
MLA Donthi Madhav Reddy
ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్,టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ. చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:-బక్రీద్ పర్వదినం పురస్కరించుకోని మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలోని ఈద్గా లో బక్రీద్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం త్యాగానికి మారుపేరుగా నిలిచే ఈ పవిత్రమైన పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకోవాలని ఆకాంశిస్తూ. ముస్లిం సోదర, సోదరిమనులందరికి, బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్ గారు, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు గారు, ఖాజా గారు, మొయిజ్ గారు, యూనుస్ గారు, గౌస్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ నూతన ఎస్సై గా బదిలీ పై వచ్చిన కె. వినయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పట్టణ ఎస్సై గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. (అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రయివేటు యాజమాన్యాలు)…
◆ టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం
*జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేయకుండా ఈ నెల 12 నుండి బడి బాట కార్యక్రమం చేపట్టడంలో అర్థమేం ఉన్నది ప్రయివేటు పాఠశాలల్లో నర్సరీ,ఎల్.కే.జి, యూ.కె.జి,3 సంవత్సరాలు చదివిన పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఎలా చేరతారు, గతంలో మన ఊరు మన బడి పేరుతో ప్రతి పాఠశాలలో సౌకర్యాలు పెంచాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ అది పూర్తి కాకుండానే అసంపూర్తిగానే మిగిలింది,ఇప్పటికే ప్రభుత్వం విద్యను పేదలకు దూరం చేస్తు ప్రయివేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా కృషి చేస్తున్నట్లు అందరికి కనబడుతున్నది,ప్రభుత్వ బడుల్లో నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు,ప్రయివేటు బడుల్లో నైపుణ్యం లేని టీచర్లతో బోధన చేస్తున్న ప్రయివేటు బడులపై ఎందుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రయివేటు యాజమాన్యం టీచర్లకు తక్కువ జీతాలు చెల్లించి వారితో వెట్టి చేయిస్తారు వారికి విద్యార్థులను కొత్తగా చేర్పించాలని టార్గెట్ లు పెట్టి వేదిస్తారు లేనిచో విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తారు,విద్యార్థుల ఫీజులను కూడా ఒక్కో పాఠశాలలో ఒక్కోరకంగా వారి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు విద్యార్థుల దశల వారిగా చెల్లించాల్సిన ఫీజులు సమయానికి చెల్లించనిచో వారిని మానసికంగా వేధిస్తూ పై తరగతుల విద్యార్థులను నర్సరీ,ఎల్.కె.జి,యూ.కె.జి,తరగతులలో కూర్చోబెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
ఈ విదంగా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అధిక ఫీజులతో అవస్థలకు గురిచేస్తున్న దీనిపై ప్రభుత్వం కాని అధికారులు కాని ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలను నియంత్రిచి ప్రభుత్వ అజమాషీలో నడిచే విదంగా చర్యలు చేపట్టాలి ప్రతి తరగతికి ఒక నిర్ణిత ఫీజును ప్రభుత్వంమే నిర్ణయించాలి,అన్ని ఫీజులను ఒకే అకౌంట్లో జమ చేసే విదంగా మరియు అన్ని ఫిజులను ఒకే రశీదుపై ఇచ్చే విదంగా మరియు టీచర్ల విధ్యార్హతలు వారికి ఇచ్చే జీతాలను ప్రభుత్వం నమోదు చేసుకోవాలి బహిరంగ పరిచి ప్రయివేటు పాఠశాలలను కట్టడి చేయాలని డిమాండ్
సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను శుక్రవారం రోజు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ఆత్మీయ ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలుపుకున్న హిందూ ముస్లింలు పరకాల, జూన్ 07 బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని కలిగి ఉండాలని, పేదలకు సాయం చేస్తే అల్లాకు సేవ చేసినట్లేనని మత పెద్దలు బోధించారు.
న్యాల్కల్..
న్యాల్కల్ : మండలంలో శనివారం బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయించారు. అనంతరం పేదలకు దానం చేశారు. పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాల్లో సందడి నెలకొంది.
ఝరాసంగం..
Muslims
ఝరాసంగం : మండలంలో బక్రీద్, తొలిఏకాదశి వేడుకలు శుక్రవారం ఇరు వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. హిందువుల పండుగ తొలిఏకాదశి, ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయగా, ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలయ్ బలయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ బి. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టి ఆర్ యస్ టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా మాజీ ఎంపీటీసీ సంతు రజినిప్రియ అల్లం గిరి మస్జిద్ సదర్ సయ్యద్ మజీద్ మాజీ సదర్ షేక్ మహబూబ్ అశ్రాఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మాజీ వార్డ్ మెంబర్ సజావుద్దీన్ సద్దాం సాధాత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మొగుడంపల్లి..
మొగుడంపల్లి : మండల వ్యాప్తంగా హిందువులు తొలి ఏకాదశి, బక్రీద్‌ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త దుస్తులు ధరించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హిందువులు, ముస్లింలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తొలిఏకాదశి సందర్భంగా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు హాజరై పూజ చేశారు. రెండు పండుగలు ఒకేరోజు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
కోహీర్..
కోహీర్ : మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు మసీదు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింలు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. .
జహీరాబాద్..
జహీరాబాద్ : మండలంలోని ముస్లింలు ఈద్-ఉల్-ఆదా వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ముస్లింలు శుక్రవారం ప్రత్యేక వంటకాలు చేసి తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని కోరుతూ ఫాతీహాలు ఇచ్చి కుటుంబాల సమేతంగా సామూహిక భోజనాలు చేశారు. ఈద్గాల వద్ద మత గురువులు, ఇమామ్‌సాబ్‌ల సారథ్యంలో ప్రత్యేక నమాజులు చదివారు. ప్రార్థనల అనంతరం ఖబరస్థాన్‌లకు వెళ్లి పూర్వీకుల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో కోహ్లీపై కూడా ఫిర్యాదు దాఖలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదు దాఖలైంది. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్‌లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీ ప్లేయర్లను సత్కరించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడి డ్రెయిన్‌పై ఉన్న మూత కూలడంతో జనాల్లో కంగారు బయలుదేరి తొక్కిసలాటకు దారి తీసింది. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వారు ఉన్నారు.
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది.
అనంతరం, సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్‌వర్క్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.
ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు.
ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య.
“నేటిధాత్రి”,బాలానగర్. (హైదరాబాద్):
ప్రభుత్వం నుండి నేరుగా మహిళలకు అందే పథకం ఏదైనా ఉందని అడిగితే అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవమైన పథకం అని ఇందులో ఎలాంటి బేషజాలు ఉండకూడదని ఆమె అన్నారు. బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయని, మహాలక్ష్మి పథకం లేనపుడు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. రోజు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు మహాలక్ష్మి పథకం ముందు వెనుక ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఉచితం అని అందరూ బస్సుల్లో చేయడం లేదని ఇతర వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతే గానీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పెట్టిన పథకాలను అగౌరవపరచకుండా , మన హక్కుగా భావించి అవసరాల నిమిత్తం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. కేవలం మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు పథకం మాత్రమే రద్దు చేయాలనీ కొంతమంది కోరుకోవడం తగదని ఆమె అన్నారు. మహిళల కోసం పెట్టిన పథకాలను కొంతమంది సాటి మహిళలలే విమర్శించడం ఒక బాధ్యత గల పౌరురాలిగా తీవ్రంగా ఖండిస్తున్నాని ఆమె తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.
సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు వస్తాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
High profits through integrated farming system.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని ఇకనుండి ముందుగా వేయాలని సూచించారు.ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిని తొందరగా విత్తడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని, తెగుళ్లు మరియు చీడ పీడలప్రభావం తగ్గించవచ్చని అలాగే ముందుగా వరి కోయవచ్చని వివరించారు. అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలన్న సూచనలు చేశారు.రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం ను అనుసరించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.
రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, వ్యవసాయాన్ని స్థిరీకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో 1.8 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించబడినదని విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా, చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు. రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమం లో మరియు వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని రైతులకు సూచించారు.వికాషిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్, కేవికే మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, కార్యాచరణ అంశాలు గురించి రైతులకు వివరించారు.
కార్యక్రమం ద్వారా రైతులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించి, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం లక్ష్యమని చెప్పారు. అలాగే డా. తమ్మీ రాజు గారు పశు పోషణ, టీకాలు మరియు పరి శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి వివరించారు.జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం నేలలో భూసారం పెరుగుతుందని మరియు అధిక దిగుబడి రకాల గురించి వివరించారు. పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్, డా. బాలకృష్ణ మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలని తెలిపారు. నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. రాజు మరియు శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి గార్లతో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలించిన కలెక్టర్
అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20 వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ధరఖాస్తు కోసం వచ్చే వారికి కేంద్రంలో ఏర్పాట్లు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని ఆన్నారు. రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి నేడు పెద్ద పండుగ అయ్యిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని, పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరనం కనిపిస్తుందని మాధవరెడ్డి రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శుక్రవారం నర్సంపేట పట్టణానికి చెందిన, 01,04,14,15,17,18,వార్డుల్లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులు పోయించి కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లులేని ఊరు ఒక్క గ్రామం కూడా లేదని అన్నారు.
పదేళ్లలో పరిపాలించిన బిఆర్ఎస్ పాలకులు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు.
పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజా ప్రభుత్వంలో అర్హులకు న్యాయం చేయాలనేదే నా ఆకాంక్షాన్ని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలలో పడద్దని ఎమ్మెల్యే దొంతి చెప్పారు.
ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.
MLA Donthi Madhav Reddy
ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్,టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యురాలు శ్రీలత బడిబాట కార్యక్రమం కరపత్రం ఆవిష్క రించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య గూర్చి తెలియజేశారు.
అనంతరం శాయంపేట కూడలి వద్ద ఉపాధ్యాయులతో కలిసి ప్రధానోపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలల బలోపే తం గూర్చి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానో పాధ్యా యురాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తు న్నామని ప్రభుత్వం విద్యార్థు లకు ఉచిత పుస్తకాలు అంది స్తూ భోజన సౌకర్యం కల్పిస్తుం దన్నారు.
ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
Govt Schools Principal Srilatha.
అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో 2025 ఎస్ ఎస్ సి ఫలితా లు అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన అక్షయ,సాయి,ఎండి.
అమ్రీన్ లకుప్రధానోపాధ్యాయు రాలు టి.శ్రీలత ప్రశంసా పత్రా లు అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు శేఖర్ బాబు, సుజాత , లక్ష్మీబాయి ,రేణుక ,గీత, కుమారస్వామి, రంజిత్ కుమార్, విజయలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని తోపనపెల్లి గ్రామ వాసి ఒంటెల యకమ్మ 90 గారు మరణించగా, దుఃఖం లో యుండి కూడా కుటుంబ సభ్యులు కుమారులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మధుసూదనరెడ్డి, మనుమడు కరుణాకర్ రెడ్డి మనుమలు ‘’సమాజ హితం కోరి, ‘’నేత్రదానం చేయడానికి అంగీకరించగా, “” తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో “” వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ టెక్నీషియన్ లక్షమన్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.మృతురాలు యాకమ్మ గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునివ్వడం తో పాటు భావి వైద్యుల నేత్ర వైద్య విద్యకు ఉపయోగ పడినవారయ్యారన్నారు కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిద్దాం మరియు నేత్ర వైద్య విద్యకు తోడ్పడుదాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం అని అసోసియేషన్ ప్రతినిధి అన్నారు. వివరాలకు 8790548706, 9908088011సెల్ నెంబర్ లలో సంప్రదించవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమములో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లీ ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి,పాల్గొన్నారు.
కేసముద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని మహబూబాబాద్ శాసనసభ్యులు డా.మురళీ నాయక్ స్పష్టం చేశారు.
శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలు మరియు రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.
This is the real Indiramma Rajyam…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ, ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..
పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు.
కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న,రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ప్రారంభించడం జరిగింది. శుక్రవారం రోజు మండలంలోని సూరారం మూల మలుపు వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇంధన విక్రయ కేంద్రం, వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడిన వినాయక పెట్రోల్ పంతులు, బాజీ జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ ప్రారంభించారు, మారుమూల ప్రాంతంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరకు రైతులు మండల కేంద్రానికి, రావాల్సి వస్తుండేదని గ్రామంలో ఇండియన్ ఆయిల్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ఇందాన కేంద్రం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినాయక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన యజమాని కిరణ్ కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ, నాణ్యత పరిమాణాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందించాలని కోరారు. వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభంలో గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి.
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాఅధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరానికి గాను (ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి) అంటూ
quality education
ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేష ను) సిరిసిల్ల ..కళాశాల అధ్యాపకులు స్థానిక వెంకంపేట ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రభుత్వం కల్పించే వసతులను పొందాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఎంసెట్ తదితర విషయాలలో నైపుణ్యాలు అందించడమే కాకుండా ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ఉచిత విద్యను పొందవచ్చు అని వారు తెలిపారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో ప్రిన్సిపాల్ శ్రీ విజయ రఘునందన్,అధ్యాపకులు సామల వివేకానంద ,ఆంజనేయులు ,శ్రీనివాస్ , చంద్రశేఖర్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగ అని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, పంచాయతీ కార్యదర్శి సుమలత,పాఠశాల చైర్మన్ దుమాల లక్ష్మి, కారోబార్ ఆనందరావు,అంగన్వాడీ టీచర్ ఉప్పరి భద్రమ్మ ఆయాలు,తల్లిదండ్రులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.