రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖలను సద్వినియోగం చేసుకోవాలని న్యాల్కల్ రెవెన్యూ అధికారులు కోరారు. న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఈ సదస్సులో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్.

ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్

Rukmini Vasanth:నేటి ధాత్రి:

 

 

 

ఇటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్న రుక్మిణీ వసంత్ కు బన్నీ – అట్లీ మూవీలో సైతం ఛాన్స్ దొరికిందని వార్తలు వస్తున్నాయి. అందుకే కాబోలు అమ్మడు ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట.

ఆర్మీ ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth). ఆమె నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ (Saptha Sagaralu Daati) రెండు భాగాలుగా విడుదలైంది. ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ఇతర భాషల్లోకీ డబ్ అయ్యింది. అలానే కొద్ది వారాల గ్యాప్ లోనే ‘సప్త సాగరాలు దాటి’ పార్ట్ వన్ అండ్ టు జనం ముందుకు వచ్చాయి. గాఢమైన ఈ ప్రేమకథా చిత్రంలో రుక్మిణీ వసంత్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టేసింది. దాంతో ఈ సినిమా తర్వాత ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీస్ లోనూ రుక్మిణీ వసంత్ ను వెతుక్కుంటూ పాత్రలు వెళుతున్నాయి.

సినిమా టికెట్లు

‘సప్త సాగరాలు దాటి’ మూవీ టైమ్ లోనే తెలుగులో నిఖిల్ (Nikhil) సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీకి రుక్మిణీ సైన్ చేసింది. కాస్తంత ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పెద్దంత ప్రమోషన్స్ లేకుండానే జనం ముందుకు తీసుకొచ్చారు. దాంతో అది కాస్తా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. చాలామందికి నిఖిల్ అలాంటి ఓ సినిమాలో నటించాడని కానీ కన్నడ హీరోయిన్ రుక్మిణి ఆ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అని కానీ తెలియదు. అయితే చిత్రంగా ప్రశాంత్ నీల్ (Prasanth Neel)… ఎన్టీఆర్ (NTR) తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ కు చోటుదక్కింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ చివరికి అదృష్టం రుక్మిణిని వరించింది. 

సినిమా టికెట్లు

అలానే అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కించబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీలోనూ రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం. అదే నిజమైతే… దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న రెండు బెస్ట్ మూవీస్ లో అమ్ముడు నటిస్తుండటం కెరీర్ పరంగా గ్రేట్ అఛీవ్ మెంట్. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఏకంగా సినిమాకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తోందట. మొన్నటి వరకూ సినిమాకు కోటి రూపాయలు మాత్రమే తీసుకున్న రుక్మీణీ ఇప్పుడు 3నుండి 4 కోట్ల వరకూ అడుగుతోందని అంటున్నారు. ఒకవేళ ఇటు ఎన్టీఆర్ మూవీ లేదా అల్లు అర్జున్ మూవీస్ లో ఒకటి హిట్ అయినా… రుక్మిణి కెరీర్ తారాజువ్వలా పైకి ఎగసిపోతుందని అంటున్నారు. ఇప్పటికే పరభాషా చిత్రాల నుండి వస్తున్న అవకాశాలతో కన్నడ చిత్రాలకు రుక్మిణీ ఎస్ చెప్పలేకపోతోందట. అమ్మడికి లభిస్తున్న డిమాండ్ చూస్తుంటే… అతి తక్కువ సమయంలోనే… నేషనల్ క్రష్ రష్మికా మందణ్ణ సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూద్దాం… ఏం జరుగుతుందో!!

మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

Vishal:నేటి దాత్రి :

 

 

 

 

గ‌త కొంత‌కాలంగా పెండింగ్‌లో ఉన్న న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌పై ఆ సంఘం కార్య‌ద‌ర్శి, హీరో విశాల్‌ స్పందించారు.

నడిగర్‌ సంఘానికి (Nadigar Sangam) ఎన్నికలు నిర్వహిస్తే సంఘ భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే నడిగర్‌ సంఘ సభ్యుల పదవీ కాలం మూడేళ్ళ పాటు పొడిగించినట్టు హీరో, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ (Vishal) మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)కు తెలిపారు. నడిగర్‌ సంఘం బై లా ప్రకారం ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ప్రకారంగా 2022లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్‌, ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, కోశాధికారిగా కార్తి, ఉపాధ్యక్షులుగా పూచ్చి మురుగన్‌, కరుణాస్‌ తదితరులు ఎన్నికయ్యారు. అయితే, వీరి పదవీకాలం గత మార్చితో పూర్తయింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిటీ సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్ళపాటు పొడగిస్తూ 2024, సెప్టెంబరు 8వ తేదీ జరిగిన నడిగర్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నటుడు నంబిరాజర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు (Madras High Court) నడిగర్‌ సంఘానికి నోటీసు జారీ చేసింది. దీంతో విశాల్‌ హైకోర్టులో ఒక అఫడవిట్‌ దాఖలు చేశారు.

‘నడిగర్‌ సంఘ (Nadiga Sangam) భవనాన్ని రూ.25 కోట్లతో నిర్మాణం చేపట్టి 60 శాతం మేరకు పనులు పూర్తి చేశాం. మా పదవీకాలం ముగిసినప్పటికీ 2025-28 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటే భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల ఈ ప్రస్తుత కార్యవర్గాన్ని మరో మూడేళ్ళపాటు పొడిగిస్తూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఈ పిటిషన్‌ దాఖలు వెనుక స్వార్థం ఉంది. అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు తదుపరి విచారణను జూన్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Roshan Kanakala:నేటి దాత్రి :

 

 

 

 

‘బబుల్ గమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల, సుమ కొడుకు రోషన్ ఇప్పుడు యాక్షన్ మూవీ ‘మోగ్లీ 2025’ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా క్లయిమాక్స్ లోని యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు.

 

శ్రీకాంత్, ఊహ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మల కాన్వెంట్’ (Nirmala Convent) తో తెరంగేట్రమ్ చేసిన సుమ (Suma), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ (Roshan) ‘బబుల్ గమ్’ (Babbulgum) సినిమాతో హీరోగా మారాడు.

ఇప్పుడు మరోసారి ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

‘బబుల్ గమ్’లో లవర్ బాయ్ గా నటించి ఆకట్టుకున్న రోషన్ ఇప్పుడీ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చేస్తున్నాడు.

తాజాగా 15 రోజుల పాటు ఈ సినిమా భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ ను దర్శకుడు, ‘కలర్ ఫోటో’ (Color Photo) ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) పూర్తి చేశాడు.

ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

ఈ షెడ్యూల్ విశేషాలను సందీప్ రాజ్ చెబుతూ, ‘తాజా షెడ్యూల్ ను మారేడుమిల్లిలో చేశాడు.
ఇదో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ను పెర్ఫార్మ్ చేశాడు.
ఈ సీన్స్ మూవీకి హైలైట్ గా ఉండబోతున్నాయి.
మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.
ఇదే నెలలో టీజర్ ను రిలీజ్ చేస్తాం.
ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.
అలానే మ్యూజిక్ కూ చాలా ప్రాధాన్యం ఉంది.
‘మోగ్లీ’ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ ఉండబోతున్నాయి.
దీనిని కాలభైరవ అందిస్తున్నారు.
ఈ మూవీతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
అలానే బండి సరోజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ యేడాది చివరిలో మూవీని రిలీజ్ చేస్తాం” అని చెప్పారు.

ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు.

ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు.

చిట్యాల,నేటి దాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రంలోని మజీద్ ఏ కౌసర్ ఆవరణలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు నమాజు చేసుకొని అనంతరం ఒకరికొకరు అలాయి బలాయి చేసుకొని ఈద్ ముబారక్ తెలపుకొని బక్రీద్ పండుగనుఆనందంగా జరుపుకున్నారు ఈ సమావేశానికి హాజరై న చిట్యాల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగలలోముఖ్యమైనది బక్రీద్ పండుగ ఒకటి అని ఇది త్యాగ నిరతికి సౌబ్రాతృత్వానికిగుర్తుగా నిలిచిపోయే పండుగ అని చిట్యాల మండల కేంద్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ఈ సమావేశంలో చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మజీద్ కమిటీ సభ్యులు అధ్యక్షులు అజ్మత్ మియా కార్యదర్శి హైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ పాషా జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ హుస్సేన్ శంషుద్దీన్ అలీ పాషా సభ్యులు ఆటో అంకుసు యూసుఫ్ జలీల్ ఉమాఫ్ ఆరిఫ్ చుట్టుపక్కల గ్రామాలైన నవాబుపేట తిరుమలాపురం గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

నేటిధాత్రి, పోచంమైదాన్.

 

 

వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో 22వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి డివిజన్ ప్రజల సౌకర్యార్ధం, వారి సమస్యను కొన్ని సంవత్సరాల నుండి ఫంక్షన్స్ కు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్న పరిస్థితిని గుర్తించి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన మంత్రి కమ్యూనిటీ హాల్ కు 50 లక్షల నిధులతో నిర్మాణం చేయించాలని కోరారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ.

 

Minister Konda Surekha

 

శుక్రవారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లు విచ్చేసి కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ సైతం తనవంతు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు

శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు

 

Manchu Vishnu: నేటిధాత్రి

 

 

 


 

మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే.

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోస్ ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Maohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar)  స్పెషల్ క్యామియోస్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,  టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు.. తన సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ మీద జరిగిన ట్రోలింగ్ పై స్పందించాడు. కన్నప్ప  టీజర్  చివర్లో మంచు విష్ణు శివయ్యా అని అరుస్తున్న డైలాగ్ ఉంటుంది. టీజర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఆ డైలాగ్ ఒక మీమ్ లా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ అన్నింటిని కలిపి  శ్రీవిష్ణు(Srivishnu) హీరోగా నటించిన సింగిల్(Single) సినిమాలో పెట్టారు. ట్రైలర్ కట్ లో  శివయ్యా డైలాగ్ ను కూడా రీక్రియేట్ చేశారు. 

 

 సింగిల్ ట్రైలర్ రిలీజ్ తరువాత శివయ్యా డైలాగ్ ను ట్రోల్ చేసినందుకు మంచు విష్ణు సీరియస్ అయ్యాడు.  ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి లేఖ రాసి.. ఆ డైలాగ్ ను తీయించేసాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ ట్రోలింగ్ పై మంచు విష్ణు మాట్లాడాడు. సింగిల్ సినిమాలో  శివయ్యా డైలాగ్ ను అల్లు అరవింద్ ఎందుకు తీయించేశాడు.. మీరేమైనా చేశారా.. ? అన్న ప్రశ్నకు మంచు విష్ణు మాట్లాడుతూ.. ” నేను ప్రొడ్యూసర్  కౌన్సిల్ కి ఒక లెటర్ రాశాను. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు .. లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనమందరం ఒకటి అవ్వాలి. మనమందరం ఒకటిగా ఉండాలి.

 

 ఆ సినిమాలో ఒకటి నందమూరి బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. అదే టైమ్ లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది.  ఒక్కరు కూడా ఆయనకు కంగ్రాట్స్  మెసేజ్ పెట్టలేదు కానీ, ఆయన కామెడీ అయితే చేశారు. కన్నప్ప సినిమాది చేశారు. ఇండస్ట్రీలో ఇది కొత్త ట్రెండా.. ? మీరు అడ్రెస్స్ చేస్తారా.. ? లేక రేపు నా సినిమాలో మిగితావాళ్లను పెట్టినప్పుడు ఎవరైనా అడిగితే మాత్రం బావుండదు. ఇది  ఇప్పుడు నార్మల్ గా ఉందా.. ? అలా అయితే నేను కూడా అంగీకరిస్తాను. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది అని చెప్తే నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పాను. వారు అరవింద్ గారితో మాట్లాడారు. అసలు ఎందుకు ఈ డైలాగ్ అందులో పెట్టారు.. ? ఆ తరువాత ఎందుకు తీసేశారు అనేది ఆయననే అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు.  

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే చేతుల మీదుగా యంత్రచేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి దైవకార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అభివృద్ధి విషయంలోనూ ఏకతాటిపై ఉండాలని సూచించారు.ఆలయ ప్రాంగణంలో సీసీ నిర్మాణం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి శిష్యులు కిడాంబి నరసింహ దేశికనచార్యులు యాగ్గిక బృందం, ఆలయ చైర్మన్ చెన్నూరి కిరణ్ రెడ్డి జంగా జనార్దన్ రెడ్డి కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి రామ్ రెడ్డి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి వివిధ కుల సంఘాల బాధ్యులు ఆలయ కమిటీ బాధ్యులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

 

KL Rahul:నేటి ధాత్రి:

 

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్ట్‌లో థ్రిల్లింగ్ నాక్‌తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.

ఇది కదా కావాల్సింది..

ఇంగ్లండ్ లయన్స్‌తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్‌నెస్, మైండ్‌సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

 

శనివారం కల్వకుర్తి మండలం లోని తర్నికల్ గ్రామానికి చెందిన వర్కాల కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తర్నికల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ రుక్ముద్దీన్, మాజీ వార్డు సభ్యులు దేవయ్య, మాణిక్యరావు, వెంకటరత్నం, కృష్ణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సామజిక తనిఖీ పై గ్రామ సభ.

సామజిక తనిఖీ పై గ్రామ సభ
• వివరాలు వెల్లడించిన బీఆర్పి అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024 – 2025 సంవత్సరాలకు గాను గ్రామాలకు వచ్చిన డబ్బులు, కూలీల పని దినాలను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి గ్రామ సభ నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో శనివారం సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి 25 పనులకు గాను కూలీల వేతనాలు 24,88,950 రూ,, సామాగ్రికి 5,53,262 రూ,, కలిసి మొత్తంగా 30,42,212 రూపాయలు వచ్చినట్లు గ్రామసభలో వెల్లడించారు. అలాగే గ్రామంలో నూతన జాబ్ కార్డుల కోసం కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం గౌరీ, ఆశ వర్కర్ పుష్పులత, గ్రామస్తులు మ్యాదరి కనకరాజు, అందేస్వామి, బోయిని బాలరాజు, చాకలి రవీందర్, మంగలి అమరేందర్, బుర్రని మల్లేష్ గౌడ్, చాకలి రాములు, పిట్ల మల్లయ్య తదితరులు ఉన్నారు.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ

మహాసభను జయప్రదం చేయాలి

వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.

 

Congress

 

 

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు వస్తాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని ఇకనుండి ముందుగా వేయాలని సూచించారు.

ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిని తొందరగా విత్తడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని, తెగుళ్లు మరియు చీడ పీడలప్రభావం తగ్గించవచ్చని అలాగే ముందుగా వరి కోయవచ్చని వివరించారు.

అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలన్న సూచనలు చేశారు.

రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం ను అనుసరించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.

 

 

Collector

 

రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, వ్యవసాయాన్ని స్థిరీకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో 1.8 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించబడినదని విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు.

అదేవిధంగా, చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు.

రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమం లో మరియు వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని రైతులకు సూచించారు.

వికాషిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్, కేవికే మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, కార్యాచరణ అంశాలు గురించి రైతులకు వివరించారు.

కార్యక్రమం ద్వారా రైతులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించి, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం లక్ష్యమని చెప్పారు.

అలాగే డా. తమ్మీ రాజు గారు పశు పోషణ, టీకాలు మరియు పరి శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి వివరించారు.

జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం నేలలో భూసారం పెరుగుతుందని మరియు అధిక దిగుబడి రకాల గురించి వివరించారు.

పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్, డా. బాలకృష్ణ మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలని తెలిపారు.

నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. రాజు మరియు శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి గార్లతో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

 

భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలించిన కలెక్టర్

అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు.

స్వీకరించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ నెల 20 వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

ధరఖాస్తు కోసం వచ్చే వారికి కేంద్రంలో ఏర్పాట్లు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని ఆన్నారు.

రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి పెద్ద పండుగ..

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి పెద్ద పండుగ..

-కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి నేడు పెద్ద పండుగ అయ్యిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని, పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరనం కనిపిస్తుందని మాధవరెడ్డి రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శుక్రవారం నర్సంపేట పట్టణానికి చెందిన, 01,04,14,15,17,18,వార్డుల్లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులు పోయించి కొబ్బరికాయలు కొట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లులేని ఊరు ఒక్క గ్రామం కూడా లేదని అన్నారు.

పదేళ్లలో పరిపాలించిన బిఆర్ఎస్ పాలకులు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అర్హులకు న్యాయం చేయాలనేదే నా ఆకాంక్షాన్ని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలలో పడద్దని ఎమ్మెల్యే దొంతి చెప్పారు.

ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.

 

MLA Donthi Madhav Reddy

 

 

ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్,టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

పవిత్ర బక్రీద్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న.

పవిత్ర బక్రీద్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్:-బక్రీద్ పర్వదినం పురస్కరించుకోని మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలోని ఈద్గా లో బక్రీద్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం త్యాగానికి మారుపేరుగా నిలిచే ఈ పవిత్రమైన పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకోవాలని ఆకాంశిస్తూ. ముస్లిం సోదర, సోదరిమనులందరికి, బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్ గారు, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు గారు, ఖాజా గారు, మొయిజ్ గారు, యూనుస్ గారు, గౌస్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ నూతన ఎస్సైగా వినయ్ కుమార్.

జహీరాబాద్ నూతన ఎస్సైగా వినయ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ నూతన ఎస్సై గా బదిలీ పై వచ్చిన కె. వినయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పట్టణ ఎస్సై గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.

కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. (అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రయివేటు యాజమాన్యాలు)…

◆ టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం

*జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేయకుండా ఈ నెల 12 నుండి బడి బాట కార్యక్రమం చేపట్టడంలో అర్థమేం ఉన్నది ప్రయివేటు పాఠశాలల్లో నర్సరీ,ఎల్.కే.జి, యూ.కె.జి,3 సంవత్సరాలు చదివిన పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఎలా చేరతారు, గతంలో మన ఊరు మన బడి పేరుతో ప్రతి పాఠశాలలో సౌకర్యాలు పెంచాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ అది పూర్తి కాకుండానే అసంపూర్తిగానే మిగిలింది,ఇప్పటికే ప్రభుత్వం విద్యను పేదలకు దూరం చేస్తు ప్రయివేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా కృషి చేస్తున్నట్లు అందరికి కనబడుతున్నది,ప్రభుత్వ బడుల్లో నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు,ప్రయివేటు బడుల్లో నైపుణ్యం లేని టీచర్లతో బోధన చేస్తున్న ప్రయివేటు బడులపై ఎందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్రయివేటు యాజమాన్యం టీచర్లకు తక్కువ జీతాలు చెల్లించి వారితో వెట్టి చేయిస్తారు వారికి విద్యార్థులను కొత్తగా చేర్పించాలని టార్గెట్ లు పెట్టి వేదిస్తారు లేనిచో విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తారు,విద్యార్థుల ఫీజులను కూడా ఒక్కో పాఠశాలలో ఒక్కోరకంగా వారి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు విద్యార్థుల దశల వారిగా చెల్లించాల్సిన ఫీజులు సమయానికి చెల్లించనిచో వారిని మానసికంగా వేధిస్తూ పై తరగతుల విద్యార్థులను నర్సరీ,ఎల్.కె.జి,యూ.కె.జి,తరగతులలో కూర్చోబెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

ఈ విదంగా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అధిక ఫీజులతో అవస్థలకు గురిచేస్తున్న దీనిపై ప్రభుత్వం కాని అధికారులు కాని ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలను నియంత్రిచి ప్రభుత్వ అజమాషీలో నడిచే విదంగా చర్యలు చేపట్టాలి ప్రతి తరగతికి ఒక నిర్ణిత ఫీజును ప్రభుత్వంమే నిర్ణయించాలి,అన్ని ఫీజులను ఒకే అకౌంట్లో జమ చేసే విదంగా మరియు అన్ని ఫిజులను ఒకే రశీదుపై ఇచ్చే విదంగా మరియు టీచర్ల విధ్యార్హతలు వారికి ఇచ్చే జీతాలను ప్రభుత్వం నమోదు చేసుకోవాలి బహిరంగ పరిచి ప్రయివేటు పాఠశాలలను కట్టడి చేయాలని డిమాండ్

సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను శుక్రవారం రోజు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ  సూచించారు.

భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలు.

భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలు

 

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

బక్రీద్‌ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ఆత్మీయ ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలుపుకున్న హిందూ ముస్లింలు పరకాల, జూన్‌ 07 బక్రీద్‌ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని కలిగి ఉండాలని, పేదలకు సాయం చేస్తే అల్లాకు సేవ చేసినట్లేనని మత పెద్దలు బోధించారు.

న్యాల్కల్..

న్యాల్కల్ : మండలంలో శనివారం బక్రీద్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయించారు. అనంతరం పేదలకు దానం చేశారు. పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాల్లో సందడి నెలకొంది.

ఝరాసంగం..

 

Muslims

 

 

 

ఝరాసంగం : మండలంలో బక్రీద్‌, తొలిఏకాదశి వేడుకలు శుక్రవారం ఇరు వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. హిందువుల పండుగ తొలిఏకాదశి, ముస్లింలు బక్రీద్‌ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయగా, ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలయ్‌ బలయ్‌ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ బి. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టి ఆర్ యస్ టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా మాజీ ఎంపీటీసీ సంతు రజినిప్రియ
అల్లం గిరి మస్జిద్ సదర్ సయ్యద్ మజీద్ మాజీ సదర్ షేక్ మహబూబ్ అశ్రాఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మాజీ వార్డ్ మెంబర్ సజావుద్దీన్ సద్దాం సాధాత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

మొగుడంపల్లి..

మొగుడంపల్లి : మండల వ్యాప్తంగా హిందువులు తొలి ఏకాదశి, బక్రీద్‌ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త దుస్తులు ధరించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హిందువులు, ముస్లింలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తొలిఏకాదశి సందర్భంగా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు హాజరై పూజ చేశారు. రెండు పండుగలు ఒకేరోజు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.

కోహీర్..

కోహీర్ : మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు మసీదు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింలు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. .

జహీరాబాద్..

జహీరాబాద్ : మండలంలోని ముస్లింలు ఈద్‌-ఉల్‌-ఆదా వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ముస్లింలు శుక్రవారం ప్రత్యేక వంటకాలు చేసి తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని కోరుతూ ఫాతీహాలు ఇచ్చి కుటుంబాల సమేతంగా సామూహిక భోజనాలు చేశారు. ఈద్గాల వద్ద మత గురువులు, ఇమామ్‌సాబ్‌ల సారథ్యంలో ప్రత్యేక నమాజులు చదివారు. ప్రార్థనల అనంతరం ఖబరస్థాన్‌లకు వెళ్లి పూర్వీకుల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు.

బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు.

బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు

 

Virat Kohli: నేటిధాత్రి

 

 

 

 

 

ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో కోహ్లీపై కూడా ఫిర్యాదు దాఖలైంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదు దాఖలైంది. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్‌లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇక బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీ ప్లేయర్లను సత్కరించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడి డ్రెయిన్‌పై ఉన్న మూత కూలడంతో జనాల్లో కంగారు బయలుదేరి తొక్కిసలాటకు దారి తీసింది. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వారు ఉన్నారు.

మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది.

అనంతరం, సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్‌, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్‌వర్క్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version