నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని తోపనపెల్లి గ్రామ వాసి ఒంటెల యకమ్మ 90 గారు మరణించగా, దుఃఖం లో యుండి కూడా కుటుంబ సభ్యులు కుమారులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మధుసూదనరెడ్డి, మనుమడు కరుణాకర్ రెడ్డి మనుమలు ‘’సమాజ హితం కోరి, ‘’నేత్రదానం చేయడానికి అంగీకరించగా, “” తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో “” వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ టెక్నీషియన్ లక్షమన్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.మృతురాలు యాకమ్మ గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునివ్వడం తో పాటు భావి వైద్యుల నేత్ర వైద్య విద్యకు ఉపయోగ పడినవారయ్యారన్నారు కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిద్దాం మరియు నేత్ర వైద్య విద్యకు తోడ్పడుదాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం అని అసోసియేషన్ ప్రతినిధి అన్నారు. వివరాలకు 8790548706, 9908088011సెల్ నెంబర్ లలో సంప్రదించవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమములో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లీ ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి,పాల్గొన్నారు.