ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు.ఝరాసంగం గ్రామంలో ఉదయం,7.00 సాయంత్రం 10.00 వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంచుతున్నారని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ తెలిపారు.సమస్యలు ఉత్పన్నం కాకుండా వెంట వెంటనే పరిష్కరిస్తూ రేషన్ లబ్ధిదారుల డీలర్లు ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా జరిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
30 శాతం పంపిణీ పూర్తి
ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 15 శాతం మందికి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేశామని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ ఆయన తెలిపారు. ఝరాసంగం మండల కేంద్ర పరిధిలోని రేషన్ షాపుల్లో 30 శాతం పంపిణీ పూర్తయిందని అధికారి తెలిపారు.
దుకాణాల వద్ద క్యూ కడుతున్న లబ్ధిదారులు
సన్న బియ్యం పంపిణీకి తోడు ఒకేసారి మూడు నెలల సరుకు పంపిణీ చేస్తుండడంతో దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ పీడీఎస్ను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో నెలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్రలు పీఓఎస్ యంత్రంపై ఇవ్వాల్సి ఉండడంతో పంపిణీ నెమ్మదిగా కొనసాగుతోంది.
వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.
కారేపల్లి నేటి ధాత్రి:
కారేపల్లి మండలం లోని కొమ్ముగూడెం ముత్యాలంపాడు గ్రామాల లో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వై ఆర్ జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్లో వై ఆర్ జి కేర్ డిఆర్పి శివయ్య క్లస్టర్ లింక్ వర్కర్ ఆదేర్ల శంకర్ రావు డాక్టర్ ప్రబంధ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి రక్ష పరీక్షలు చేయడం జరిగింది అలాగే టిబి ఎలా వ్యాపిస్తుంది దానికి నివారణ మార్గాలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎలాంటి అనారోగ్యం కలిగినను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని.
Blood tests
ఈ వర్షాకాలపు సీజన్లో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ ప్రబంధ తెలిపారు వివరిస్తూ తెమడ పరీక్షలు టెస్టులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూర్యం ల్యాబ్ సూపర్వైజర్ రామకృష్ణ టీబీ పేషెంట్ సూపర్వైజర్ విజయ కుమారి ఎల్ హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు ఏఎన్ఎం శ్యామల విజయ కుమారి ఆశా వర్కర్లు సుజాత హనుమంతి పద్మ సావిత్రి వెంకటరమణ లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ సిజీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టిన శివాలయం పునర్నిర్మాణంకు సంబంధించి బుధవారం దేవాలయం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో.. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రో” జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
Shiva temple
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరు చదువుకోవాలని లక్ష్యంతో. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే అన్ని స్కూళ్లకు యూనిఫాం లు, పాఠ్యపుస్తకాలను చేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు.
జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి
◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.
◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.
ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:
విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం
సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం
విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం
ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:
వ్యాసరచన పోటీలు
చర్చా వేదికలు, సదస్సులు
విద్య ప్రదర్శనలు
విద్యా అభివృద్ధిపై చర్చలు
వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.
75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్ చేశారు.
అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలిపారు. అలాగే నిరుపేదలు ఎవరు ఉన్నా సరే వారు ఏ పార్టీలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడకూడదు అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం. నేరెళ్ల గ్రామంలో. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో.కరీంనగర్ డైరీ యూనిట్.సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో. కరీంనగర్ డైరీ చైర్మన్ చలి మెడ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ డైలీ చైర్మన్ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని కరీంనగర్ డైరీ స్థాపించి డైరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే రోజుకు 2000 లీటర్ల నుండి రెండు లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచిన ఘనత చైర్మన్ రాజేశ్వరరావు ది అని. మాకు పండుగ రోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించుకున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి సి యు ఇన్చార్జి రాగుల మధుసూదన్. సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్. ల్యాబ్ అసిస్టెంట్ తిరుపతి. శేఖర్. నరేష్. శ్రీనివాస్. రాజు. సాయికుమార్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల కేంద్రలోని. దేశ పల్లి గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అంగన్వాడీలోని. పిల్లలు నమోదు కావాలని అంగన్వాడీ లోనే పిల్లలకు సంపూర్ణ వికాసం అభివృద్ధి చెందుతుందని మన అంగన్వాడీలో కూడా ఫ్రీ స్కూల్స్ పిల్లలకు బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అలాగే ఆటపాటలతో కూడిన అందిస్తారని విద్యతోపాటు పిల్లల ఫస్ట్ ఆహారం వారి పెరుగుదల పర్యవేక్షణ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సూపర్వైజర్ సుస్మిత. తల్లులు అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు
11వ అంతర్జాతీయ యోగ డే జూన్ 21 నుంచి నిర్వహించబడును…
తంగళ్ళపల్లి నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల వృద్ధ ఆశ్రమంలో ఈనెల 11వ తారీకు నుంచి అంతర్జాతీయ యోగా డే 21 వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక వృద్ధాశ్రమంలో ఉన్న సీనియర్ సిటిజన్ వారి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగ చేయాలని తెలుపుతూ వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ యు నాని. డిస్పెషనరీ. యోగ శిక్షకులు బి శ్రీనివాస్. టి సప్న సీనియర్ సిటీ జనులతోఆసనాలు ప్రాణామాయం ముద్రలు ధాన్యం చేస్తూ వాటి ఉపయోగాలు ఫలితాలు వివరించారు. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా తిరుపతి స్థానిక గ్రామ మండల పల్లి. ఆశ వర్కర్లు సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే రోహిత్ రావు చొరవుతో వేగంగా అభివృద్ధి పనులు..
ఇప్పటివరకు రూ.7 కోట్ల అభివృద్ధి పనులు..
రామాయంపేట జూన్ 11 – నీటి ధాత్రి (మెదక్)
మెదక్ నియోజకవర్గం లోని రామయంపేట మండలం దామరచెరువు గ్రామానికి మహర్దశ పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించి దామరచెరువు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందే గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రారంభించారు. మొట్టమొదటగా ఇక్కడ లేనివిధంగా గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. రూ. రెండు కోట్లతో బీటి, సి సి, రోడ్డుతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు ఐదున్నర కోట్లతో పనులు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా చర్చి కాంపౌండ్ లో, మరియు అంగన్వాడి పాఠశాల, ప్రభుత్వ దవాఖాన వద్ద టాయిలెట్లను నిర్మించేందుకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అభివృద్ధి పనులు జరగకపోవడం ఇప్పుడు ముమ్మరంగా పనులు జరుగుతుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వాడవాడలో సిసి రోడ్లు, గ్రామం నుండి వెళ్లే రోడ్డు బిటి మరియు సిసి రోడ్డుగా పనులు చేయడం పట్ల గ్రామస్తులతో పాటు గిరిజనులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు అంటున్నారు.
The changing phase of the Damara Lake
… చెప్పడం కాదు చేతుల ప్రభుత్వం మాది.. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుడు మాటలు కాదు చేతుల ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే నిజం చేస్తున్నాం. ఎవరు ఇచ్చిన విధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పనులు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. దామరచెరువు గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కానీ మేము అలా చేయలేదు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ ప్రత్యేక చొరవత గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఎక్కడలేని విధంగా చేయడం జరుగుతుంది. గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం.
ఎమ్మెల్యే రోహిత్ రావుకు రుణపడి ఉంటాం.. మాజీ సర్పంచ్ పడాల శివప్రసాద్ రావు.
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రావ్ చెప్పారు. అంతకుమించి అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. దీంతో గ్రామంలో రూపురేఖలే మారిపోతున్నాయి. ఏక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించకుండా బీటీ మరియు సిసి రోడ్లు వేయించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామం అభివృద్ధి దిశలో వెళుతుంది. ఇది ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావు చొరవ తోనే. ఆయనకు గ్రామస్థులం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన హుజూరాబాద్ యువజన కాంగ్రెస్ నాయకులు
వీణవంక, (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి :హైదరాబాద్ లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులను మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నియమక పత్రాలని విడుదల చేసిన భాగంగా అందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో హుజురాబాద్ నియోజకవర్గనికి
చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువజనకాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ నియోజకవర్గం కార్యదర్శి ఉమ్మడి సందీప్ జమ్మికుంట పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బిసది వంశి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ సి గురుకుల పాఠశాలనుమైదాన ప్రాంత నాయకులు తరలించుకు పోతున్నా పట్టించుకోని ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ తెరాస నాయకులు అవసరమా
డా జాడి రామరాజు నేత
ఏటూరునాగారం నేటి ధాత్రి
కన్నాయిగూడెం మండల కేంద్రం లోని బుట్టాయిగూడెం గ్రామంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ ఏటూరు నాగారం లో ఉన్న సాంఘిక గురుకుల పాఠశాల ను మంగపేటకు మార్చిన తర్వాత మైదాన ప్రాంత నాయకులు ఏజెన్సీ ప్రాంత దళిత బహుజన వర్గాల విద్యార్థులకు విద్య అందకుండా చెయ్యడమే లక్ష్యాంగా నాటి జిల్లా పరిషత్ చైర్మన్ క్రీశే జగదీష్ మరియు నాటి ప్రతిపక్ష నాయకురాలు నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మల్లంపల్లి కి తరలించుకు వెళ్లిన మాట్లాడాని కాంగ్రెస్ తెరాస నాయకులు ఈ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు అదేవిదంగా పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షమా శాఖమంత్రి ఏజెన్సీ ప్రాంతం లో ఉన్నా ఐటీడీఎ ను కూడా మైదాన ప్రాంతానికి తరలించుకొని పోవాలని చూస్తున్నా నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మైదాన ప్రాంత కాంగ్రెస్ నాయకురాలు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రినాటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గా దళిత బంద్ నిరుపేదలకి అందకుండా నాడు అడ్డుకొని కాంగ్రెస్ నాయకులకు ఇచ్చింది నేడు ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందకుండా కాంగ్రెస్ నాయకులకే ఇస్తే జెండాలు మోసి జేజేలు కొట్టిన నిరుపేదలైన కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమణి అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజనమైనార్టీ నాయకులారా మైదాన ప్రాంతనాయకురాలు పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖమంత్రి మాటలు నమ్మి మోసపోకుండా ఈ మన ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని విడాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు ఏటూరునాగారం కన్నాయిగూడెం తడ్వాయి మంగపేట కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలోచించి చుడండి మైదాన ప్రాంత నాయకురాలు ఏటూరు నాగారం లో ఉండవలసిన సాంఘిక సంక్షమా గురుకుల పాఠశాలను స్థానిక మండలమైన మల్లంపల్లికి తీసుకెళ్ళింది దేవాదుల లీప్ట్ ఇరిగేషన్ నుండి ములుగు మండల రైతులకు సాగు నీరు త్రాగునిరు
తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాన్ని ఎడారిగా చేసిన నాయకురాలు అవసరమా అదేవిదంగా 6 కోట్లతో కొండాయి దొడ్ల వాగుపై నిర్మించిన బ్రిడ్జి పిల్లర్ల దగ్గర ఇషిక తీసి బ్రిడ్జిని కులగొట్టి 8మంది మరణానికి కారణమైన కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీలు అవసరమాఅన్నారు అదేవిదంగా మంగపేట మండలం లోని రాజుపేట గ్రామాన్ని మండలం చేస్తానానీ చెప్పి ఓట్లు వేసిన తర్వాత ఇచ్చిన మాట మర్చిపోయి మైదాన ప్రాంతమైన మల్లంపల్లి మండలం చేసుకున్నా నాయకురాలు ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలకు అవసరమా 2011 మున్సిపాలిటీ చట్ట ప్రకారం ఏటూరు నాగారం గ్రామపంచాయితీ 20వేల 800వందల జనాభా కలిగి ఉన్నా ఏటూరు నాగారం గ్రామపంచాయితీ ని మున్సిపాలిటీని చేయకుండ 13వేల 600వందల జనాభా కలిగి ఉన్నా ములుగు ను మున్సిపాలిటీ ని ప్రకటించు కున్నా మంత్రి మనకు అవసరమా అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం బస్సు డిపో గురించి గత 35సంత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుకున్న చిరుకాల కళ నేరవేర్చకుండా ములుగు బస్సు డిపో ప్రకటించుకున్నా మంత్రి అవసరమా అన్నారు అదేవిదంగా రెవెన్యూ డివిజన్ ఇంపిల్మెంట్ కాకుండా అడ్డుకొని రాక్షసనందం పొందుతూ ఉన్నా పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షమా శాఖమంత్రి మాటలు నమ్మి మోసపోవడంఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలవలన వాళ్ళ కుటుంబాలు బంధువులు అభివృద్ధి అవుతున్నారు తప్ప నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నా సంక్షమా పథకాలు అందకుండా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని భూస్థాపీతం చెయ్యడమే లక్ష్యాంగా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఏకం కావలసిన అవసరం వచ్చిందని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ
టిఆర్టిఎఫ్ బడిబాట ర్యాలీ
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీని ఘనంగా నిర్వహించారు. టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ బోయన్న గారి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ర్యాలీని ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలో కంప్యూటర్ విద్య, ఏఐ ఆధారిత విద్య, డిజిటల్ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి తరగతిగది సామర్ధ్యాన్ని విద్యా హామీగా మేము ఇస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నందున వాటిని ఉపయోగించుకోవాల ని ప్రజలకు పిలుపునిచ్చారు.
We guarantee quality education.
ఒత్తిడి లేని విద్య, పౌష్టికాహారం ప్రభుత్వ పాఠశాలలతోనే సాకారం అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర టీచర్ల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచడం ద్వారా, ప్రభుత్వ విద్యను వారికి అందుబాటులో తెచ్చేందుకు, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేసేందుకు, పాఠశాలల్లోని వివిధ కార్యక్రమాల్లో సమాజాన్ని అనుసంధానం చేయడం, తదితర అంశాలుగా ఈ బడిబాట విద్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బైక్ ర్యాలీ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ నుండి బయలుదేరి న్యూ బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌరస్తా వరకు సాగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షులు మోతిలాల్, టిఆర్టిఎఫ్ నాయకులు పోతుగంటి రమేష్, మహేషుని లక్ష్మీనారాయణ , గోలీ రాధాకిషన్, ముత్తయ్య గారి నాగరాజు, జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, ఇప్పకాయల ప్రకాష్, రాజశేఖర్, దేవేందర్, పప్పుల శ్రీనివాస్ సామల రాములు, కుమారస్వామి, పులి ప్రవీణ్ కుమార్, కోల వినయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు బాలఎల్లయ్య, కొమురయ్య, సుల్తాన్ రాజు, బూట్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, మామిడాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సామంతుల శ్యామ్, తడుక సుధాకర్ లు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, చెరుకు సుధాకర్, సర్వేశ్వర్, తిక్క ప్రవీణ్, క్యాతం మహేందర్, విజయ్, మారపెల్లి చంద్రమౌళి, వెంకన్న, అంబాల సంపత్, రాజు, వెంకన్న, మోహన్, సమ్మయ్య, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.
We should take advantage of the land.Tehsildar Rajnikumari.
ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని అవకాశం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు.
ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్
పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ ప్రజలపై విద్యార్దుల బస్ పాస్ 20శాతం పెంపు వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందని పెంచిన చార్జీ లను వెంటనే ఉపసంహరించు కోవాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్ ప్రభుత్వాని డిమాండు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పెంచిన బస్ పాస్ చ్చార్జీలు ప్రజల పై ఒక్కరికీ నెలకు 200 నుండి 300రూపాల వరకు బారం మోపిందని ఆర్టీసీ బస్ లో పెద వాళ్లు మధ్యతరగతి ప్రజలు మాత్రమే ప్రయాణిస్తారని వారికి రాయితీలు ఇవ్వవలిసింది పోయివారిపై బారం పెంచేలాచార్జీలు పెంచారని పాలక ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితిలిస్తు ప్రజల పై చార్జీల భారం మోపుతునరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ లోకోట్లాది మందికి బస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పుకుంటు ఆర్టీసీ పై ఆధారపడి జీవన ప్రయాణం కొనసాగించే వారిపై ఆర్థికబారం పడేలా ఉందని వెంటనే ఈ చార్జీల పెంపు పై టీ జి ఆర్టీసిసంస్థ ఆలోచనచేసి పెంచిన చార్జీలను తగ్గించాలని ఈవిద్య సంవత్సర ప్రారంభం నుండీ ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత బస్పాస్
కేబుల్ ఆపరేటర్లు పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలి
ఇండిపెండెంట్ రాష్ట్ర ఎం ఎస్ ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రo వచ్చాక దీనస్థితికి చేరుతుందని ఇండిపెండెంట్ ఎమ్మెస్ ఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యల పై బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇండిపెండెంట్ ఎమ్మెస్ ఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడంలో గాని అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కేబుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో పోటీ పడడం కష్టం కష్టమవుతున్న తరుణంలో మూలిగే నక్క పై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే నష్టాలలో నడుపుతున్న కేబుల్ టీవీ లపై ప్రభుత్వం టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా పోల్ టాక్స్ పేరుతో వాడుతున్న కరెంటు పోల్ లను లెక్కించి పోల్ టాక్స్ కట్టాలంటూ కేబుల్ టీవీ ఆపరేటర్ల పై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం హేయమైనా చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పోల్ టాక్స్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలిసి వినతి పత్రం అందజేశారు.. అలాగే భూపాలపల్లి విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్ కలిసి ఆపరేటర్ల సమస్యలను వివరించి వినతి పత్రం అందించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేబుల్ టీవీ ఆపరేటర్లను కుటీర పరిశ్రమలు గా గుర్తించి వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి కేబుల్ టీవీ లను ప్రోత్సహించాలని కోరారు. అలాగే కేబుల్ ఆపరేటర్ల పోల్ టాక్స్ ను తక్షణమే రద్దు చేసి ఆపరేటర్ల జీవన మనుగడకు తోడ్పడాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు బోట్ల రాజు ,ఓదెల సురేష్,నల్లవేని రాజు, నన్నపు సతీష్, ఒజ్జ ఐలయ్య. గట్టయ్య, దేవేందర్ లు పాల్గొన్నారు
వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.
Whether you choose to walk or run, you are a child.Whether you choose to walk or run, you are a child.
ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.
ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.
రైతుల పండుగ ఎరువక.
ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.
జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజును నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎంఈఓగా పనిచేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో మండలంలోని సత్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేస్తున్న బస్వరాజును ఎంఈఓగా నియమించినట్లు పేర్కొన్నారు.
జహీరాబాద్: బుచినెల్లి గ్రామానికి చెందిన 18 యేళ్ల సత్వార్ నస్రీన్ గత కొన్ని సంవత్స రాలుగా మానసీక స్థితి సరిగా లేక అసాదారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె 6 జూన్ 2025 ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి సత్వార్ షబానా తెలి పారు. ఈ సంఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నస్రీన్అండి సత్వార్ ఖదీర్ కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం గత మూడు నెలల క్రితం కూడా ఆమె ఇలాగే ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు చిరాగ్పల్లి పోలీసులు మి స్సింగ్ కేసు నమోదు చేసి ఆమెను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. ఈసారి కూడా నస్రీన్ తల్లి షబానా ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే యబడింది. సబ్ ఇన్స్పెక్టర్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం న స్రీన్ కోసం దర్యాప్తు . మేము అన్ని వైపుల నుంచి ఆమె అచూకీ కోసం విచారణ చేస్తున్నామని, గతంలో ఆమెను కనుగొన్న అనుభవం ఆధారంగా ఈసారి కూడా త్వరలోనే ఆమెను కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.