కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం పురాతన నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి.
ఈవిషయం గ్రామంలోని ప్రజలకు తెలియడంతో విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.
విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం తెలుపగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు, ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్టించాలని గ్రామ నాయకుల మద్య చర్చ జరుగుతోంది.
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంట రవి, మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకటరాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రవీందర్, దుబ్బాక మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
కొహిర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన మహిమాన్విత మన్య ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం ఆలయ అర్చకులు అతిథులను స్వాగతిస్తూ, ఆశీర్వచనం చేసి,తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్,మండల అధ్యక్షులు రామలింగారెడ్డి,హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసి భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మల్లన్న పాటిల్,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి,శుక్లవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు అంజయ్య ,సాయిలు, దశరథ్, అరుణ్ తథితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవం హాజరైన మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం నాగిరెడ్డి పల్లి లో జరుగుతున్న శ్రీ దుర్గా భవాని మాత జాతర ఉత్సవాలకు మాజీ మంత్రులు హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డి గారు,స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గార్లతో తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప ,రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి,ఆలయ కమిటీ , గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.
5. శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూతగిరి మహారాజ్ గారు మల్లన్నగుట్ట ఆశ్రమము
గ్రామ శ్రీ సిద్ధేశ్వర మఠం నుండి స్వామి వారి పాదుకలను మంగళవాయిద్యములతో మరియు భజన భక్తి గీతాలను ఆలపిస్తు మందిరమునకు తీసుకొని పోవుట.ద్వజరోహణము – శిఖర పూజ గురుస్వాములచే.మహన్యాస పూర్వక రుద్రాబిషేకము. తీర్థ ప్రసాదములు, రాత్రికి భజన కీర్తనములు స్వామి వారికి రుద్రాబిషేకము శ్రీ చండికాంభ మాతకు సహస్ర కుంకుమార్చన హారతులు తదుపరి తీర్థప్రసాదములు
11 మంది దంపతులచే మహన్యస రుద్రాభిషేకము
రుద్రస్వాహాకార హోమము, యజ్ఞం, మహామంగళ హారతి తదుపరి భక్తులకు
తీర్ధప్రసాదము, అన్నదానం నిర్వహించబడును.
శ్రీ రేవణసిద్దేశ్వరస్వామి వారికి డోలారోహణము
శ్రీ వీరసోమేశ్వర చండికాంభ మాత సమేత పార్వతి పరమేశ్వరుల కళ్యాణము
అఖండ దీపారాధన (2500 జ్యోతులు వెలింగించుట)
మాహాత్ములచే ప్రవచనములు
సంగీత ధర్బార్ వివిద కళాకారులచే నిర్వహించబడును. తదుపరి భజనలు.
వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు.. 20 ఏళ్లుగా ఇదే గోస.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని గినియర్ పల్లి గ్రామంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే గ్రామంలో ఉన్న బోరుబావులన్నీ నీటితో పైకి పొంగుతాయి. అదే ఎండాకాలం వచ్చిందంటే బోరు బావులలో నీరు అడుగంటి పోతుంది. నీటి కోసం గ్రామస్తులు ప్రతి ఏటా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పటినుంచి కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఎందుకిలా జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ పరిశోధన చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వతమైన నీటి సమస్య పరిష్కారానికి పాలకులు, అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
సమస్యను పరిష్కరిస్తాం: ఎంపీడీవో.
గినియర్ పల్లి గ్రామంలో నీటి సమస్యపై ఝరాసంగం ఎంపీడీవో సుధాకర్‌ను వివరణ కోరగా, నీటి సమస్య ఉంటే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో 4 నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి- జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం
రామడుగు, నేటిధాత్రి:
పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలని కరీంనగర్ జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ (టిపిఏ) అధ్యక్షులు మల్లేశం అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని ఇమ్మానియేల్ ఏజి చర్చిలో పాస్టర్ మచ్చ తిమోతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఉచిత చిల్డ్రన్ బైబిల్ క్లాసులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దైవభక్తి కలిగి ఉన్నప్పుడు పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే మంచి అలవాట్లు అలవాడతాయన్నారు. చదువుతోపాటు నీతి విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చిన్నప్పటినుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన కోసం పాటుపడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా చిన్నారుల జీవితాలకు ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైన మాటలను వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈకార్యక్రమంలో చర్చి నిర్వాహకులు మచ్చ తిమోతి, బైబిల్ క్లాస్ టీచర్లు రజిని, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
◆ కొత్తవాళ్లైనా సరే! మామిడికాయ పచ్చడి ఇలా పెట్టండి – సంవత్సరం నిల్వ ఉంటుంది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో మామిడి కాయ (ఆవ కాయ) పచ్చడి పెడుతుంటారు. అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఒక్కసారి పెడితే సంవత్సరమంతా నిల్వ ఉండడమే గాకుండా చక్కని రుచి ఉండేది. కానీ, కొంత మంది సరైన కొలతలు, నిల్వ చేయడంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో ముక్క మెత్తబడడమే గాకుండా పచ్చడి బూజు పట్టేది. అందుకే ఇవాళ మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సరిగ్గా ఇవే టిప్స్ పాటించడం వల్ల ముక్క తాజాగా ఉండడంతో పాటు సంవత్సరమైనా సరే బూజు పట్టకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.
మామిడి కాయ పచ్చడిలో కారం దినుసులు కలపడం కంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయం శుభ్రత. పదార్థాలైనా, వాటిని ఉపయోగించే గిన్నెలైనా సరే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి.ముక్కలకు ముందుగా నూనె పట్టించడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మెత్తబడకుండా కట్టిగా కరకరలాడుతుంటాయి.మామిడి కాయ నిల్వ పచ్చడి కోసం పెద్దవి కాకుండా మధ్యస్థంగా ఉన్న పుల్లని కాయలు ఎంచుకోవాలి.ముదురు రంగులో ఉన్న కాయలు రుచి బాగుంటాయి.పచ్చడిలో వేసే దినుసులు మొదలుకుని, వాడే పాత్రలు, జాడీల విషయంలో జాగ్రత్త వహించాలి.ఏ మాత్రం తేడా రాకుండా ఒక రోజు ముందుగానే ఎండలో ఆరబెట్టుకుని పచ్చడి కలపడానికి ముందు మిక్సీ పట్టుకోవాలి.పచ్చడి పింగాణీ జాడీలో నిల్వ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రల్లో నిల్వ చేయడం సరికాదు.
తయారీ విధానం :
మామిడి కాయలు ముక్కలు కొట్టించడానికి ముందుగానే వాటిని నీళ్లతో శుభ్రం చేసుకుని ఒక్కొక్కటి తీసుకుని క్లాత్‌తో తుడిచి పెట్టుకోవాలి.అన్నింటినీ ఒకేసైజులో ముక్కలు కొట్టించి జీడితో పాటు టెంక లోపలి వైపు ఉన్న తెల్లని పీచు (పొర) లేకుండా తొలగించుకుని పక్కన పెట్టుకోవాలి.తేమ ఆరిపోయేలా ముక్కలన్నింటినీ శుభ్రం చేసుకుని ఫ్యాన్ కింద ఓ క్లాత్ పరిచి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి.ఇపుడు పచ్చడిలో కావాల్సిన ఉప్పు, కారం, ఆవాలు, మెంతులను రెడీ చేసుకోవాలి. వీటిని కూడా ముందు రోజే ఎండలో ఆరబెట్టుకుని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి.తీసుకున్న వెల్లుల్లిలో కొన్నింటిని కచ్చాపచ్చాగా రుబ్బుకొని మిగిలిన సగం పచ్చడిలో కలుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి
పచ్చడి కలుపుకొనే విధానం..
Mango Pickle.
పచ్చడి ముక్కలు కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. అందులో ఆరబెట్టుకున్న మామిడి కాయ ముక్కలు వేసుకుని ముందుగా పావు లీటర్ నూనె పోసుకుని బాగా పట్టించాలి.ఇవి పక్కనపెట్టి మరో గిన్నెలో కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు లేదా మెంతి పిండి, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుబ్బుకున్న వెల్లుల్లితో పాటు పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు కూడావేసుకుని కలపాలి.ఇపుడు దినుసులన్నీ కలిపిన కారం, మామిడికాయ ముక్కలకు బాగా పట్టించాలి.ఈ సమయంలో మిగిలిన నూనె కూడా పోసుకుని మరో సారి కలుపుకోవాలి.
నిల్వ చేసే విధానం..
కలుపుకున్న పచ్చడిని ఓ జాడీలో పెట్టుకుని వస్త్రాన్ని చుట్టి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా నూనె, కారం అంతా ముక్కలకు బాగా పడుతుంది.మూడు రోజుల తర్వాత ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని మరోసారి చక్కగా కలుపుకోవాలి. ఫైనల్ గా ఈ సమయంలో ఉప్పు, కారం రుచి చూసుకుని కలుపుకుంటే సరిపోతుంది. తినడానికి సరిపోయే పచ్చడిని పక్కనపెట్టుకుని మిగిలినది జాడీలో నిల్వ చేసుకోవాలి.
పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్ /నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో రూ.286.54 లక్షలతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో , ఇక్కడ చుట్టుప్రక్కల ఎన్నో విద్యాసంస్థలు రానున్నాయని , పాలమూరు యూనివర్సిటీ తో పాటు నూతనంగా రాబోయే విద్యాసంస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ అందించేందుకు ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, రానున్న 6 నుంచి 8 నెలల లోపు ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి రానుందని, ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సైతం నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ఎస్ఈ పివి రమేష్, డిఇ లక్ష్మణ్, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్ శ్రీనివాస్, పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
డంపు యార్డు వద్ద పొగలు ఆర్పి వేయుటకు తక్షణ చర్యలు తీసుకోవాలి-సిపిఐ
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ నగర శివారు బైపాస్ రోడ్ లోని డంపు యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని, డంప్ యార్డ్ నుంచి వచ్చే పొగను వెంటనే ఆర్పివేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరుగుతుందని దీనిలో వందలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజులు ఒక సంయుక్త ప్రకటనలో నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో గల డంప్ యార్డు వల్ల నగరంలోని దాదాపు పది డివిజన్లలో ముఖ్యంగా కోతిరాంపూర్, అల్కాపురి కాలని, హనుమన్ నగర్, గణేష్ నగర్, లక్ష్మీ నగర్, హౌసింగ్ బోర్డు, కట్టరాంపూర్, పోచమ్మ వాడ, శాషామహల్, మారుతి నగర్, అలుగునూర్, బొమ్మకల్ ప్రజలకు ఎండాకాలంలో మంటలు అంటుకుని పొగ రావడం వల్ల వాయు కాలుష్యం నెలకొని చాలామంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిల పాలవుతున్నారని, గర్భిణతో ఉన్న స్త్రీలు ఈపొగ పీల్చడం ద్వారా పుట్టే బిడ్డలకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని కనీసం నగరపాలక అధికారులకు డంపు యార్డు తరలింపుపై ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో కరీంనగర్ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు కొన్ని కోట్ల రూపాయలతో చెత్తను శుద్ధి చేయడం కోసం మిషనరీని ఏర్పాటు చేశారని ఆమిషనరీ రెండు, మూడు రోజులు మాత్రమే నడిచి మూలకు పడ్డదని కోట్ల రూపాయల మిషనరీలో కుంభకోణానికి మేయర్, ఎమ్మెల్యే పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపు యార్డ్ మిసనరి కొనుగోలుపై న్యాయవిచారణ చేయాలన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా మాజీ మేయర్ తన హయంలో స్మార్ట్ సిటీలో డంప్ యార్డ్ మిషనరీలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తన హాయంలో జరిగిన పనులలో అవినీతి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కరీంనగర్ లోని తీగల వంతెన, రివర్ ఫ్రంట్ లలో తీవ్ర అవినీతి జరిగిందని సాక్షాత్తు మాజీ మేయర్ సునీల్ రావు చెప్పడం చూస్తుంటే ప్రజలు వీస్తూ పోతున్నారని అన్నారు. తీగల వంతనపై నెలల తరబడి వీధి దీపాలు రాకపోవడం చూస్తుంటే నగరపాలక కమిషనర్ మొద్దు నిద్రలో ఉన్నారా అని వారు ప్రశ్నించారు. డంప్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వివిధ వార్డులకు చెందిన ప్రజలు ప్రతి రోజు నిరసనలు తెలుపుతుంటే మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డంప్ యార్డులో వస్తున్న మంటలను ఆర్పి వేయుటకు చర్యలు తీసుకోవాలని వెంటనే డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.
– ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి….
– మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరగేలా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా మరియు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు.
Indiramma’s house
ఈ కార్యక్రమం ద్వారా నిజంగా అవసరమైన ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు లక్ష్యాల వారీగా నిర్దేశించుకొని అర్హుల ఎంపికను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సజావుగా సర్వే చేయాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా..అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే సర్వే చేసిన వివరాల పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పరిశీలన చేసే క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకూడదని, సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయడం జరుగుతుందని ఏదేని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే మొదటి విడత లో ఎంపిక చేసిన అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగహన కల్పించాలని అన్నారు. విడతల వారిగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి….
– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఎంపీడీవో ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
Grain
ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు . ఐకేపీ, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్. సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, ఆద్వర్యంలో ఇప్పటి దాకా 2715 మంది రైతుల నుంచి 53,602 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ. 28కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సుశీల్వా, కొల్చారం మండల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రమూకలు హిందువులపై దాడి చేసి 25 మందిని కిరాతకంగా చంపేసిన దుశ్చర్యను నిరసిస్తూ శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక మంచిర్యాల బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది.పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అంటూ బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం చేశారు.హిందూ సంఘాలకు ఐక్య వేదిక అధ్యక్షులు కార్యదర్శి,డేగ రవింద్, కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ హిందువులంతా ఏకమై గర్జించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉగ్రవాదం పై ఒక పాదం మోపి సమూలంగా పాతలానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని కోరారు.బందుకు మరియు బైక్ ర్యాలీకి సహకరించి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు,కుల సంఘాలకు,వ్యాపారస్తులకు, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేశారు.
మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నే అని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణన కుల గణనను చేయించిన దాఖల లు లేదని ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, , సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది
శ్రీ ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని శివ మార్కండేయ దేవాలయం లో కొలువైయున్న దేవతా మూర్తులైన శ్రీ వెంకటేశ్వర శివ మార్కండేయ స్వామి చెష్టి దృశ్యం ఓం చండీ ఓం పూర్ణప రుత్తి అవబ్రతశ్రానాము పూజా కార్యక్రమంతో ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ బాసని సూర్య ప్రకాష్ పద్మ దంపతులు,బాసని చంద్ర ప్రకాష్ పద్మశాలి రాష్ట్ర మిని మం వెజినెస్ అడ్వైజర్ నెంబర్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొము రయ్య ,రిటైర్డ్ టీచర్ దేవాల యం కమిటీ నెంబర్ వనం సదానందం ,వంశీ, కందగట్ల గోపాల్, ,శ్రావణ్ భద్రకాళి అర్చకులు, శివ మార్కండేయ వెంకటేశ్వర దేవాలయం అర్చకులు రాజకుమార్ , కరుణాకర్ ,మహిళలు భక్తులు, వివిధ బంధువుల పెద్ద నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి పంట నేలపై ఓరిగి నేలపై వరి గింజలు రాలాయి. సుమారు మండలంలో 300 ఎకరాలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బి.వెంకటేష్ శనివారం గౌతాపూర్ గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జైపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీని మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా శనివారం ఎంపీఓ శ్రీపతి బాబురావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్ లను పరిశీలించి సిగ్రిగేషన్ షెడ్డు లో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేసవికాలం తాగునీరు సరఫరా లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ పైపు లైన్లు లీకేజీలు ఉంటే వెంటనే సరి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పావని,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు https://hycricket. org వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలి సర్పంచులు లేకపోవడంతో స్తబ్దుగా ఉంటున్న గ్రామపంచాయతీలు వివాదాలకు నిలయంగా మారుతున్న ఖాళీ స్థలాలు పరిష్కారం చూపలేకపోతున్న ఖాకీలు
నేటి ధాత్రి ఐనవోలు :
అయినవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో గూడు లేని నిరుపేదలకు గత ప్ర భుత్వాలు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా మిగులు భూమి అన్య క్రాంతం అవుతుంది.వివరాల్లోకి వె ళితే హనుమకొండ జిల్లా,ఐనవోలు మండలం,కక్కిరాలపల్లి గ్రామంలో గత ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల నుండి భూమిని కొనుగోలు చేసి తిరిగి గూడు లేని నిరుపేదలకు పం పిణీ చేయగా, మిగులు భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉం ది.కాగా ఊర చెరువు కట్టకింద ఉన్న సర్వే నెంబర్ 2,6 లో 4 ఎకరాల 06 గుంటల భూమి డబుల్ బె డ్రూం ఇండ్లకి,1ఎకరం పల్లె ప్రకృతి వనాని కి పోగా మిగతా ఎనిమిది గంటల మిగులు భూమి కలదు.అలాగే ఎస్సీ కాలనీ 9వ వార్డులో మెయిన్ రోడ్డుకు అను కొని ప్రభుత్వం కొన్ని దళితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా మిగులు భూమి ఉంది.
Government lands
గ్రామ పంచాయతీ పాలకవర్గం లేక పో వడంతో అడిగే వారు లేక కొందరి కబ్జాదారుల కన్ను అట్టి మిగులు భూము లపై పడింది. అంతేకాకుండా ఎస్సీ కాలనీలో ఉన్న మిగులు భూమి పక్కన ఉన్న వారి మధ్య అట్టి భూమి కోసం తరచు గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అట్టి భూములు అన్యక్రాంతం కాకుండా అధికారులు స్పందించి గ్రామ పం చాయతీ ఆధీనంలోకి తీసుకుంటే ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునే వీలుంటుందని గ్రామస్తులు వేడుకుంటున్నారు. దీనిపై వివరణ కోసం తాసిల్దార్ విక్రమ్ కుమార్ ను చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.గ్రామ కా ర్యదర్శి నిర్మల్ కుమార్ ను వివరణ కోరగా ఎస్సీ కాలనీలో ఇండ్ల స్థ లాలు పంపిణీ చేయగా మిగులు భూమి ఉన్నప్పటికీ గ్రామ పంచా యతీ రికార్డులో లేదన్నారు.ఇట్టి విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసు కెళ్తానన్నారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎన్నో పంచాయతీలు వస్తున్నాయి కానీ వివాద కారణమైన స్థలం ప్రభుత్వం కేటాయించిన స్థలం కావడంతో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
యు సి సి ఆర్ ఐ ఎం ఎల్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ.
కారేపల్లి నేటి ధాత్రి
కారేపల్లి మండల కేంద్రంలో శనివారం మేడే వారోత్సవాలను పురస్కరించుకొని జాకెట్ నాగేశ్వరరావు తాటి అంజయ్య లు పోలీస్ స్టేషన్ సెంటర్ నందు మేడే జెండాను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలేబోయిన ముత్తయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాల బాధ్యులు ఎర్రబాబు బాణాల లక్ష్మీనారాయణ ఓ పి డి ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారు మాట్లాడుతూ భూమి స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం కోసం సాగుతున్న పోరాటాలతో కార్మిక వర్గం నాయకత్వం వహించాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదం
ఈనాడు మరింత సందర్భాచితంగా ఉన్నదని వారన్నారు ప్రపంచ కార్మికుల ఐక్యతతో పోరాడితే హక్కులు సాధించుకోవచ్చని ఇప్పటికే
మన దేశంలో నిరుద్యోగం మహమ్మారిలాగా తయారైందని కార్మికుల వేతనాలు తగ్గిపోయాయి ప్రజల్లో అన్ని రంగాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారని మరొకవైపు అన్ని దేశాలు అభివృద్ధిలో ముందు నడుస్తుంటే
మన దేశం మాత్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని వారన్నారు 10 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే అభివృద్ధి నిరోధక విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ అమెరికా అగ్రరాజ్య
అధిపతి వాద ప్రయోజనాలకు కూడిగం చేస్తున్నది దేశాలపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తున్నది రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నదని అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ను ప్రభుత్వం
ఈ పరిస్థితి ఏమాత్రం మార్చలేదు నిరుద్యోగం ధరల పెరుగుదల అనారోగ్యం అవినీతి వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతూనే ఉన్నారు వారిని పక్కదారి పట్టించడానికి ఇస్తున్న ప్రకటిస్తున్న ఉచిత పథకాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి మన దేశంలో
ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే దేశంలోని ప్రజాస్వామ్య విధానాన్ని రద్దుచేసి ధన్యవాదాలు భూమిపంచాలు సామ్రాజ్యవాదుల ప్రభావం నుండి ప్రత్యేకించి అమెరికా ఆగ్రరాజ్య ప్రభావం నుండి బయటపడి స్వతంత్రమైన విదేశాంగ
విధానాన్ని చేపట్టాలి పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రజలకు ప్రజాస్వామ్యకు హక్కులు కల్పించాలి
ఈ విధంగా భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం కోసం పోరాటం ఒక్కటే ప్రజల ముందున్న మార్గం పాలకవర్గాలు కులమత ప్రాంతీయ వైశ్యాలను రెచ్చగొట్టి ప్రజలను ఐక్యం కాకుండా చూసి పోరాటంలోకి రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు
శ్రీ భేదాలు అధిగమించే ప్రజలను సంఘటిత పరుచు వారు సాగించే పోరాటానికి నాయకత్వం వహించడం సమాజంలో అత్యంత పురోగమి వర్గమైన కార్యవర్గం యొక్క కర్తవ్యం కమ్యూనిస్టు విప్లవకారులు నాయకత్వంలో మన దేశం కార్మిక వర్గం
ఈ సవాలను స్వీకరిస్తుందని తన చారిత్రిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తుందని మేము విశ్వసిస్తున్నాము మేడే సందర్భంగా కార్మిక వర్గం ముందున్న ఒకే ఒక కర్తవ్యం ఇదే ప్రపంచ కార్మికులారా ఏకంకండి మేడే వర్ధిల్లాలి అంటూ నినదించారు
ఈ కార్యక్రమంలో నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
చెల్పూర్ లో రూ.5 కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మాణం
జెన్కో అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో రెండెకరాల విస్తీర్ణంలో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. ప్రయాణికులకు ఏడాది లోపు అందుబాటులోకి రానున్న చెల్పూర్ బస్టాండ్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జెన్కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.