ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.

ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ‌ ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు. ‌ దేవనూరి కుమార్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ ‌ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ముదిరాజులకు ఇచ్చిన హామీల వెంటనే నెరవేర్చాలని మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ డిమాండ్ చేశారు ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ముదిరాజుల రిజర్వేషన్ మార్చిందని దుయ్యపట్టారు నామినేట్ పదవులను జనాభా ప్రాతిపదికన ముదిరాజులకే ఎక్కువ పదవులు కేటాయించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభాలో ముదిరాజులు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన కులగనన సర్వేలో తేలిందని తెలిపారు

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

భారతదేశంలోని అతి ప్రాచీనమైన యోగ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యోగా శిబిరాలను నిర్వహిస్తూ యోగానే తన ఇంటి పేరుగా మార్చుకున్న యోగ గురువు శ్రీనివాస్ యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అని భావించి, సమాజమే దేవాలయంగా గత 25 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువు పోశాల శ్రీనివాస్ అభినందనీయుడు.

నేటి ధాత్రి:

 

 

 

ఇల్లంద గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి తదినంతరం తిరుపతిలోని సాంస్క్రిట్ విద్యాపీట్లో యోగ డిప్లమా పూర్తి చేసుకుని, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరావు గారి సూచనతో గ్రామీణ ప్రాంతాలలో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో సుమారు 157 గ్రామాలలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి యోగా లో శిక్షణను ఇవ్వటమే కాకుండా…

 

 

 

 

 

 

20 24 సంవత్సరానికి గాను యోగాలో గోల్డ్ రికార్డ్ సాధించినందుకు గాను వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారు అభినందిస్తున్న ఫోటో.

 

జూన్ 21.2024 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందుకున్న శ్రీనివాస్ మనందరికీ అభినందనీయుడు.

వృద్ధాశ్రమాలలో, అనాధాశ్రమాలలో , అందుల ఆశ్రమాలలో ఇలా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి సమాజంలోని అనేకమందికి మార్గదర్శకుడిగా నిలిచాడు యోగా గురువు పోశాల శ్రీనివాస్.

సేవే పరమావధిగా భావించి అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పునర్జన్మకు కారణమయ్యాడు

యోగా గురువు శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరం కిలా వరంగల్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా ఉత్తమ యోగ గురువు అవార్డును పొందడం జరిగింది.

 

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి జీ వారి చేతుల మీదుగా…

 

2017 వ సంవత్సరంలో జనవరి (12- 18 ) జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.

2018 – 2022 సంవత్సరాలలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శనను అందించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి అవార్డులను అందుకోవటం జరిగింది.

2019వ సంవత్సరంలో ప్రముఖ చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో ఒక వెయ్యి మంది విద్యార్థులతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందుకోవటం జరిగింది.

 

 

 

 

 

ధరిత్రి దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతూ…

 

2019 సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రామప్ప దేవాలయంలో, వేయి స్తంభాల దేవాలయంలో, కిలా వరంగల్ కోటలో అంతర్జాతీయ యోగా డేలను నిర్వహించినందుకు కాను అవార్డులను అందుకోవటం జరిగింది.

 

 

2019 వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన యోగ డే ప్రోగ్రాం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవార్డును కోవడం జరిగింది.

 

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ తో

 

 

 

2021 వ సంవత్సరంలో పెరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కరోనా సమయంలో ప్రతిరోజు వేలాదిమంది కి ఫుడ్, మెడిసిన్స్ అందించి రోగుల కొరకు విశేష కృషి చేసిన యోగా గురువుకు తెలంగాణ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందుకోవటం జరిగింది.

 

25 సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న విశేష కృషిని ఆదరించి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని యోగా గురువు శ్రీనివాస్ కి అందించడం జరిగింది.

 

అదేవిధంగా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మరియు శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్ ఆధ్వర్యంలో అనేక అవార్డులను యోగా గురువు శ్రీనివాస్ అందుకోవటం జరిగింది. .

 

ప్రముఖ వ్యక్తులైన శ్రీ రాందేవ్ బాబా గారి చేతుల మీదుగా, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా అవార్డులను అందుకోవటం జరిగింది.

 

యోగా గురువు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో మరియు పాఠశాలలోను,

 

NSS, NCC క్యాండిడేట్లకి యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.

 

 

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

మామునూరు లో ఉన్నటువంటి ఫోర్త్ బెటాలియన్ CRPF పోలీస్ ఆఫీసర్లకి, భీమారంలో ఉన్నటువంటి 58వ బెటాలియన్ CRPF ఆఫీసర్ లందరికీ యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.తన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై యోగా లో ఉత్తమ ప్రదర్శనలు కనబరిచి అనేక అవార్డులను అందుకోవటం కూడా జరిగింది.

పురాతన శివలింగం నంది విగ్రహాం లభ్యం.

పురాతన శివలింగం, నంది విగ్రహాం లభ్యం

చోప్పదండి, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం పురాతన నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి.

 

ఈవిషయం గ్రామంలోని ప్రజలకు తెలియడంతో విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

 

విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం తెలుపగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు, ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్టించాలని గ్రామ నాయకుల మద్య చర్చ జరుగుతోంది.

 

ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంట రవి, మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకటరాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రవీందర్, దుబ్బాక మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version