జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి !

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో.

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో..
వెంకటాపూర్ (ఆర్ )లో
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం..

రామాయంపేట మే 8 నేటి దాత్రి (మెదక్):

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ రోనాల్డ్ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తాము అన్ని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఒకప్పుడు జిల్లాల్లో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించే వారమని ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Red Cross

అనంతరం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి మాట్లాడుతూ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మెగా వైద్య శిబిరాలతో పాటు, రక్త దాన శిబిరాలు, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు… ఆరోగ్య శిబిరాల చైర్మన్ దామోదర్ రావు మాట్లాడుతూ మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో విరివిగా మెగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులను ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా
కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మద్దెల సత్యనారాయణ,మద్దెల రమేష్,సభ్యులు వి.సతీష్ రావు,తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి సూరారం డాక్టర్ లు రాఘవేందర్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, మేఘాన, రవి కిరణ్ లు రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను.!

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

 

 

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి.

తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలంలోని పురేడుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పి సుధారాణి మీద ఇంతకుముందు వచ్చినటువంటి తప్పుడు ఆరోపణల దృశ్య( ఇంది రమ్మ ఇండ్ల అమలు విషయంలో ప్రతి ఒక్కరి దగ్గర నుండి 10000 రూపాయలు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్త ) పై పంచాయతీ కార్యదర్శి పి సుధారాణి పరునష్టం దావా కింద గ్రామస్తులలో పది మంది మీద కోర్ట్ నుండి నోటీసులు పంపించడం జరిగినది. దానికి బదులుగా బుధవారం నాడు గ్రామస్తులందరి ముందు
ఆ పది మంది వచ్చి పంచాయతీ కార్యదర్శి పి సుధారాణి కి క్షమాపణలు చెప్పి ఇందిరమ్మ ఇళ్ల కు మేమందరమూ అర్హులమే అని చెప్పినాము కానీ మీరు 10000 తీసుకున్నారు అని ఎవరికి చెప్పలేదు అని మా వైపు నుండి ఏమైనా తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి అని గ్రామస్తులందరి ముందు క్షమాపణలు కోరారు.
మంగపేట మండలం పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు కే.సురేష్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే హక్కు మనకున్నది కావున దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండ ఎవరిపైనా తప్పుడు ఆరోపణలు చేసి ప్రచారం చేయకూడదు అని మీడియా మిత్రులను కోరడం జరిగినది

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట.

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట

#అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు.

#మధ్యవర్తులను నమ్మి మోసపోతున్న తల్లిదండ్రులు.

# కాలేజీ చైర్మన్ నీ కలిసిన తరువాతనే అడ్మిషన్ తీసుకోవాలి.

మంద సురేష్ బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు

హన్మకొండ,నేటిధాత్రి:

 

 

గ్రామలలో ఇంటింటి ప్రచారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యంత్రం ఉపాధ్యాయులకు లక్ష్యంగా నిర్దేశం కరపత్రాలు బ్రోచర్ల పంపిణీ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులకు టార్గెట్ నిర్దేశిస్తున్నాయి ఆ లక్ష్యం వాళ్లను సాధించేవరకు మండుటెండల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుస్తున్నారు తమ పాఠశాల ప్రత్యేకతలు విశిష్టతను వివరిస్తూ ఆకాశాన్నియమైన బ్రోచర్లు కరపత్రాలను పంచుతున్నారు పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాపారం వెనుక ప్రచారాల తలపిస్తుంది ప్రతి ఒక్కరూ 10 నుండి 20 మందిని పాఠశాలలో చేర్పించాలంటూ ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు టార్గెట్ విధించారు దీంతో వారు ఉదయం ఏడు గంటల నుండి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ ప్రదక్షణం కొరబడినందున ఆరోపణలు ఉన్నాయని ఫీజులు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోలను అమలు చేయడంలో లేదు అలాగే కొన్ని పాఠశాలలో సరైన విద్యా అర్హత లేని వారితో బోధనలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి అని మంద సురేష్ ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని అధికారులపై మండిపడ్డారు.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఎంపీడీవో ఎమ్మార్వో గ్రామపంచాయతీ కార్యదర్శి చిట్యాల వ్యవసాయ. మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ చిట్యాల డైరెక్టర్లు అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మంత్రి బర్త్డే వేడుకల సందర్భంగా నూతన వస్త్రాలు !

మంత్రి బర్త్డే వేడుకల సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన యూత్ నాయకులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే సందర్భంగా సిరిసిల్ల యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పొన్నం ప్రభాకర్ బర్త్ డే వేడుకల సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేసిన చుక్క రాజా శేఖర్ అలాగే అనంతరం కేక్ కట్ చేసి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలకాలం ఆరోగ్యాలతో పిల్లాపాపలతో సు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని. ఆ దేవుని ప్రార్థించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఏఎంసి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగేల రాజు. జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ సిరిసిల్ల అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్చార్జి గుగ్గిళ్ల వినయ్ గౌడ్ భరత్. తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. దుగ్గిళ్ల భరత్. ఎడ్ల తిరుపతి. గణాధి కిషన్. పెద్దూరి తిరుపతి. మచ్చ శ్రీనివాస్. సుద్దాల శ్రీనివాస్. రాపల్లి ఆనందం. సుద్దాల కరుణాకర్. ముక్క శ్రీనివాస్. బంటి పరశురాం బై రీ రమేష్. బొద్దుల రాజేష్. పయ్యావుల శ్రీనివాస్. విజయ్. భాగ్యలక్ష్మి. శోభ. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.!

డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో తెలంగాణ ఉన్నత విద్య మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.దోస్త్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందగలరని తెలిపారు. కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని,డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీ కొరకు మే 3 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయని అన్నారు.ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలో జరుగుతుందని అందులో జూన్ 30 నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ వారి మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలని పేర్కొన్నారు.దోస్త్ రిజిస్ట్రేషన్ కొరకు పదవతరగతి మెమో,ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్,కుల ధ్రువీకరణపత్రం,ఆదాయధ్రువీకరణపత్రం(01-04-2025 తేదీ తరవాత తీయబడింది) 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు,ఆధార్ కార్డు ,పాస్స్పోర్ట్ సైజు ఫోటో తీసుకురాగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో దోస్త్ సమన్వయ కర్త డా.పూర్ణచందర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ,అడ్మిషన్ ఇంచార్జ్ డాక్టర్ యం.సోమయ్య,కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్ ఎస్.కమలాకర్, రహీముద్దీన్ ,డాక్టర్ రాంబాబు, డా.భద్రు, డా.రాజీరు పాల్గొన్నారు.

ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం.!

ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం అజయ్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్
శేరిలింగంపల్లి,

నేటి ధాత్రి:-

 

నల్లగండ్లలో ఇందూ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభం

ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, మందుల ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా అన్నారు. నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందు ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిటల్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రాచీన వైద్య చికిత్సలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద హాస్పిటల్ ను అందరికీ అందుబాటులో ఉండేలా నల్లగండ్లలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, దీని ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఎంతోకాలంగా ఆయుర్వేద చికిత్స విధానాలను అనుసరిస్తున్నానని, తద్వారా 35 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వానికి సేవలందించానన్నారు. మానసిక, శారీరక రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక రోగాలకు సైతం మెరుగైన వైద్య చికిత్సలో ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయని వైద్యులు ప్రదీప్ నోరి అన్నారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాడి,,

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి.

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి

హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

ప్రపంచ తలసీమియా దినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి హనుమకొండ నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి మదన్మోహన్ రావుతో కలిసి జండా ఊపి ప్రారంభించారు. పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం ,అలాగే పోచమ్మ కుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,బ్లడ్ బ్యాంక్ మరియు టీ హబ్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ కొత్తూర్ మరియు మెయిన్ రోడ్డు గుండా అవగాహన నినాదాలతో నిర్వహించడం జరిగింది. అనంతరం బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 300 మంది చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారని , ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి అని,వ్యాధితో బాధపడుతున్నారు మరియు వారి కుటుంబ సభ్యులు జన్యు పరీక్షలు చేయించుకోవాలని అలాగే మేనరిక వివాహాలు కూడా సరికాదన్నారు. వీరికి తరచుగా రక్త మార్పిడి అవసరము ఉంటుందన్నారు అలాగే రెడ్ క్రాస్ ఆవరణలో వీరి కోసం ప్రత్యేకమైనటువంటి వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉందన్నారు. నెలల వయస్సులోనే ఈ వ్యాధి లక్షణాలను మనం గుర్తించవచ్చునని వీరిలో ఎదుగుదల సరిగా ఉండదని మొహం పీకపోయి ఉన్నట్టుగా ఉండి నీరసంగా ఉంటారని తొందరగా అనారోగ్యం బారిన పడతారన్నారు. తలసీమియా మరియు సికిల్ సెల్ అనే మియా రెండు కూడా జన్యుపరమైనవని అలాగే రక్తమునకు సంబంధించిన సమస్యలతో కూడుకున్న వన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో సికిల్ సెల్ అనేమియా గురించి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమంలు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు.
జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వీరికి ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి రక్త మార్పిడి అవసరం ఉంటుందని అలాగే తలసీమియా వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే గర్భవతి కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా తలసీమియా స్క్రీనింగ్ చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్రావు , ఇన్చార్జ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ గీత , జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డిపోచమ్మ కుంట వైద్యాధికారి డాక్టర్ దీప్తి పిహెచ్ఎన్ రామేశ్వరి టీ హబ్ మేనేజర్ శ్రీ కౌముది, హెచ్ ఈ ఓ ఖాదర్ అబ్బాస్ ,సూపర్వైజర్లు రమేష్ , బజిలీస్ అమ్మ, విప్లవ్ కుమార్్,రాజేష్ , కమలాకర్,ల్యాబ్ టెక్నీషియన్లుఏఎన్ఎంలు ,ఆశాలు
పాల్గొన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అడ్డుకోవాలి.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అడ్డుకోవాలి.

◆ స్వతంత్ర నియంత్రణ సంస్థల ఏర్పాటు అవసరం.

◆ ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను ప్రచారం చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాలలో ప్రైవేట్ బిద్యా సంస్థల సంఖ్య విపరీతంగా పెరిగింది. పాఠశాలల నుండి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వరడు, ప్రైవేట్ సంస్థలు విద్యా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థలు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విస్తరించాయి. అయితే, బీట్ లాభాపేక్ష, వాణిజ్య ధోరణి దల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు బిద్య భారంగా మారింది. పేద విద్యార్థులు తర్కును ఫీజుల బదులలో చదువుకుంటే, అర్కడ సౌకర్యాలు బోధనా నాణ్యత తక్కువగా ఉంటాయనే భావన పెద ప్రజల్లో బలంగా నాటుకునేలా చేయడం తో పిల్లల విద్య కోసం ఎంత కష్టమైన ధరించి ఉన్నత చదువులు చదివించాలని అమాయక తల్లి దండ్రులు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలను నమ్ముడుని లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు.

private education


ఈ సంస్థలు ఆధునిక సౌదర్యాలు, ఇంగ్లీష్ మాధ్యమం, ఉన్నత విద్యా ప్రమాణాలను అందిస్తానని చెప్పుకుంటాయి. విపరీతమైన ఫీజులను వసూలు చేస్తాయి. పైగా అనేక ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులకు ప్రవేశ అవకాశాలను నిరాకరిస్తాయి. ఆర్థిర స్థితి, కులం, లేదా నేపథ్యం ఆధారంగా వివర్ల చూపడం ఇక్కడ సర్వసాధారణం. సంపన్న వర్గాల విద్యార్థులకు మాత్రమే గుణాత్మర విద్య అందేలా ప్రణాళికలు తయారు. చేస్తారు. సెక్షన్’ ల వారీగా విద్యార్థులను విడదీసి, ఎవరు ఎర్చుకను తెలివైన వారో, ఎవరు చదువులో చురుగ్గా ఉన్నారో వా ప్రత్యేక క్లాస్సులు అంటూ ఫీజులు గుంజుతారు. అభ్రకు రీతిలో డొనేషన్లు అదనపు ఫీజులు కమాలు చేయడం మామూలు విషయంగా మారింది. లక్షల్లో విద్యార్థులు ఉంటే అందులోంచి ముంచి మార్పులు సాధించిన రేడల 10 నుంచి 20 బిద్యార్థుల ఫోటో ల తో తను సంస్థల్లో అత్యాదిక మార్కులు సాధించిన విద్యార్థులంటూ ప్రచారం చేసుకుని, అమాయక దండ్రులను ఆరర్షించే ప్రణాళిక రూపొందించుకుంటారు. అదే బిధంగా ఊదూరా ప్రచారం నిర్వహిస్తారు. ప్రైవేట్ సంస్థలలో పోటీతత్వం అధిరంగా ఉంటుంది.ర్యాంకులు, గ్రేమ్లు, పరీక్షలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వీరు పెట్టె మానసిక క్షోబ తట్టుకోలేద ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుడుని జీవితాలను చాలించారు. ఇలాంటి వార్తలు మనం రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్తల మానసిక ఒత్తిడి.కారణంగా విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరని, మానవ హక్కులు, స్వచ్ఛంద సేవ సంస్తలు, మేధావి వర్గ విద్యా వంతులు ప్రబుత్వాలకు మొర పెట్టుకున్నా అంతగా ప్రయోజనం జరుగలేక పోయింది. ప్రబుత్వాలు నామ మాత్రపు చర్యలు తీసుకున్నట్లు కనబడుతున్నారే గాని వాస్తవ స్తితి భిన్నంగా ఉంది.ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఫీజుల నియంత్రణ,ప్రవేశ విధానాలు, బోధనా నాణ్యతపై

కఠినమైన చర్యలు లేకపోవడం వల్ల ఈ సంస్థలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల
నాణ్యతను ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యా అందించడం లేదనే అపవాదు ను తుడిచి వేయాలి. అధికారులు,ప్రభుత్వం ఈ దిశ లో చర్యలు తీసుకోవాలి,
గతం లో కంటే ప్రస్తుతం ప్రబుత్వ బడులు మెరుగ్గానే ఉన్నాయి. కానీ పాత అపవాదు మోసుకుని సాగుతుండటం తో ప్రైవేట్ బడులు లబ్ది పొందుతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు, బోధనా నాణ్యతను ఇంకా మెరుగుపరచడం ద్వారా పేద విద్యార్థులకు ఉచిత, గుణాత్మక విద్యను
అందించవచ్చు. ప్రైవేట్ బడుల దోపిడిని అరికట్టవచ్చు. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలపై నిఘా ఉంచే స్వతంత్ర నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేయాలి. అప్పుడే అందరికీ సమానమైన, గుణాత్మక విద్యను అందించే దిశగా ప్రబుత్వ బడులు సాగుతాయి.

నలబై ఆరు విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు !

నలబై ఆరు విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు, హాస్టల్ వసతిని కల్పించిన సదిశ

కరీంనగర్, నేటిధాత్రి:

 

సదిశ ఫౌండేషన్ గత పది సంవత్సరాలుగా మూడు రాష్ట్రలల్లోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతి సంవత్సరం ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ రెండు సంవత్సరాల చదువుకు అయ్యే ఫీజు, హాస్టల్ వసతిని పూర్తిగా ఉచితంగా అందచేయటం జరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా సదిశ మాథ్స్ టాలెంట్ టెస్ట్ 2024 నవంబర్లో నిర్వహించిన పరీక్షలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జోన్ లో ప్రథమ స్థానంలో నిలిచిన నలబై ఆరు మంది విద్యార్థులను ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కళాశాలలో చేర్పించామని సదిశ ఫౌండేషన్ చైర్మెన్ గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్, జోన్ ఇంచార్జి లు పవన్ , రవి, నరేంద్ర సింహా, సతీష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ గలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచితంగా విద్యను అందించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సదిశ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ సురేష్.

వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని యస్.వి. కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ గారి కూతురి వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ గారు, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్ గారు,పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు, శుక్లవర్ధన్ రెడ్డి, ఖాజా భాయ్, స్వామి, ముర్జల్ గారు,మొయిజ్, ఇనాయత్, తధితరులు పాల్గొనడం జరిగింది.

సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లిములను ఉగ్రవాదులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు బుధవారం ఫిర్యాదు చేశారు. వందశాతం ముస్లిములు ఉగ్రవాదులే అని పవన్ ద్వేషపూరిత ప్రకటన చేశారని పేర్కొన్నారు. ముస్లింల టోపీలు, గడ్డాలు, కుర్తాలు ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ .

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండేపల్లి ప్రభుత్వ వయో ముద్దుల సమక్షంలో రాష్ట్ర రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాలపై దృష్టి సారించి మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ పొన్నం ప్రభాకర్ కి దీర్ఘాయుష్ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎగుర్ల ప్రశాంత్. నరేష్. శ్యామ్. వేణు. శ్రీకాంత్. జ్యోతి. మౌనిక. అనిత. జ్యోతి . కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎల్ ఓ సి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

2,00,000/- రూపాయల ఎల్ ఓ సి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాల్కల్ మండలం మీర్జాపూర్ బిగ్రామానికి చెందిన ఇస్మాయిల్ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/- ఎల్ ఓ సి మంజూరు చేయించి అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇమ్రాన్,యువ నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు .ఈ సంధర్బంగా లబ్దిదారులి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

రామడుగు నేటిధాత్రి:

యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం పురస్కరించుకుని రామడుగు మండల కేంద్రంలో జిల్లా ఉన్నత పాఠశాల మైదానంలో చిన్నారులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చొప్పదండి అనిల్ కుమార్, నేరెళ్ళ మల్లేశం, మల్యాల అక్షయ్ కుమార్, ఎడవెల్లి సాగర్, వాలీబాల్ కోచ్ ఆశాలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటు.

గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version