ప్రేక్షకులను మెప్పించే కథలతో..

ప్రేక్షకులను మెప్పించే కథలతో

విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన సొంత బేనర్‌ భీమవరం టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న కొత్త…

విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన సొంత బేనర్‌ భీమవరం టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రాల విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘మా బేనర్‌పై విభిన్నమైన కథాంశాలతో పలు చిత్రాలను రూపొందిస్తున్నాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ, లవ్‌ స్టోరీ… ఇలా ప్రేక్షకులను మెప్పించే విభిన్న కథాంశాలతో మొత్తం పదిహేను వరకూ స్ర్కిప్టులు సిద్ధం చేశాం. ఈ చిత్రాలను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళతాము. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని రామసత్యనారాయణ తెలిపారు.

మాదకద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి.

జహీరాబాద్ మాదకద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయించిన, సేవించిన 8712656777 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు యువత వీటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి.

తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలంలోని పురేడుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పి సుధారాణి మీద ఇంతకుముందు వచ్చినటువంటి తప్పుడు ఆరోపణల దృశ్య( ఇంది రమ్మ ఇండ్ల అమలు విషయంలో ప్రతి ఒక్కరి దగ్గర నుండి 10000 రూపాయలు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్త ) పై పంచాయతీ కార్యదర్శి పి సుధారాణి పరునష్టం దావా కింద గ్రామస్తులలో పది మంది మీద కోర్ట్ నుండి నోటీసులు పంపించడం జరిగినది. దానికి బదులుగా బుధవారం నాడు గ్రామస్తులందరి ముందు
ఆ పది మంది వచ్చి పంచాయతీ కార్యదర్శి పి సుధారాణి కి క్షమాపణలు చెప్పి ఇందిరమ్మ ఇళ్ల కు మేమందరమూ అర్హులమే అని చెప్పినాము కానీ మీరు 10000 తీసుకున్నారు అని ఎవరికి చెప్పలేదు అని మా వైపు నుండి ఏమైనా తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి అని గ్రామస్తులందరి ముందు క్షమాపణలు కోరారు.
మంగపేట మండలం పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు కే.సురేష్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే హక్కు మనకున్నది కావున దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండ ఎవరిపైనా తప్పుడు ఆరోపణలు చేసి ప్రచారం చేయకూడదు అని మీడియా మిత్రులను కోరడం జరిగినది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version