20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

ఆల్ ట్రేడ్ యూనియన్ లు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మికులకు, గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్డు కూడాలీ నుండి జయలక్ష్మి సెంటర్ వరకు సీఐటీయూ,బిఆర్టిటి, ఏఐటీయూసీ ఏఐఎఫ్టీయు న్యూ,ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం గౌడ్,బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బానోత్ సాగర్, ఏఐటిసి జిల్లా నాయకులు గుంపల్లి మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ కార్పొరేట్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను కార్పొరేట్ సంస్థలకు పణంగా పెట్టి శ్రామిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా దోచుకోవడానికి మరిన్ని అదనపు లాభాలను పోగు చేసుకోవడానికి పని గంటల భారాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఇరువైన దేశవ్యాప్తంగా సంఘటితమై సమ్మె చేస్తున్నారని అన్నారు సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హనుమకొండ శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాజు, బిఆర్టియు జిల్లా నాయకులు పెరమండ్ల రవి, నాయిని వేణు చంద్ ,బొల్లం ప్రసాద్ ,అన్నం రాజు ,అనిల్, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు అశోక్ ,రవి, పైడి ,ఆనంద్, ఐ ఎఫ్ టి యు నాయకులు కుమార్, ప్రదీప్ ,తదితరులు పాల్గొన్నారు.

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.

మృతురాలు ఎల్లవ్వ కుటుంబానికి బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

స్వాములకు దంపతుల అన్నప్రసాదం అందజేత.!

స్వాములకు రాసమళ్ళ కృష్ణ అంజలీ దంపతుల అన్నప్రసాదం అందజేత

 

పరకాల నేటిధాత్రి :

 

పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవస్థానంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన రాసమళ్ళ కృష్ణ అంజలి దంపతులు మరియు రాయపర్తి గ్రామానికి చెందిన మార్క రాజేశ్వరి విజయ్ కుమార్ లు ఆంజనేయ మాల వేసిన స్వాములకు అన్నప్రసాదం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్ ఇఓ వెంకటయ్య అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,భక్తులు,దీక్ష స్వాములు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది.

మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన .

మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన

రామడుగు  నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల ట్రైనీ ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ వద్ద మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ట్రైనీ ఎస్సై సతీష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన ముఖ్యంగా యువతపై కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాలను వివరించారు. అలాగే మత్తు పదార్థాలపై నియంత్రణ అవసరాన్ని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల నివారణ చర్యలలో భాగంగా ఆప్రాంతంలో కుక్కల బృందంతో (డాగ్ స్క్వాడ్) తనిఖీ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సయ్యద్ అబ్రార్ కు టి జె ఎస్ సన్మానం.!

హజ్‌ యాత్రకువెళ్ళుతున్న సయ్యద్ అబ్రార్ కు టి జె ఎస్ సన్మానం.

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అక్తర్ కుమారుడు సయ్యద్ అబ్రార్ ను మక్కా హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ.ఖాదర్ పాష శాలువతో ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా పాషా మాట్లాడుతూ ఇస్లాం ధర్మంలో జీవితంలో ఒక్కసారి మక్కయాత్ర కు పోవాలని అన్నారు ఎప్పుడైనా హజ్ యాత్ర చేస్తే పుణ్యక్షేత్రముగా ఉమ్రా కూడా చేయవచ్చు నని. ముస్లిం సోదరులు ఉమ్రా చేయవచ్చని అన్నారు సన్మానిం చిన వారిలో
య౦ఏ ఖాదర్ పాష.
చాంద్ పాషా తెలంగాణ ఉద్యమ నాయకులు. రిటైర్డు ఉద్యోగి
జి.ఎం గౌస్ పాన్ గల్ అబ్బాస్ అలీ. మహిబూబ్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
సయ్యద్ అక్తర్
తదితరులు పాల్గొన్నారు

దేశం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ చాలీసా.!

దేశం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ చాలీసా పారాయణం…

ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ చాలీసా,108 హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం జరిగిందని ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ తెలిపారు.హనుమాన్ మాల ధరించిన ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసాలో అత్యంత వైభవోపేతంగా పాల్గొన్నారు.

Hanuman.

భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అవరోధాలకు తావులేకుండా, ఎలాంటి విపత్తులు కలగకుండా ప్రజలంతా ఆయురారోగ్య, అష్టయిశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ శనివారం రోజున హనుమాన్ యజ్ఞం, మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాల ధరించిన సాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన నేపద్యంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన పట్టణ బి.ఆర్. ఎస్ నాయకులు ఈరోజు శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణం వివిధ వార్డ్ లకు చెందిన 8 మంది లబ్ధిదారులకు గాను ₹2,56,500 విలువ గల చెక్కులను ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది..

లబ్ధిదారుల వివరాలు :-
పస్తాపూర్ కి చెందిన పల్లె అశోక్ ₹.20,000/- రంజోల్ కి చెందిన రిజ్వనా ఫాతిమా ₹.18,500/- & కళావతి ₹.11,500/- రచ్చన్నపేట్ కి చెందిన ధన లక్ష్మి ₹.24,500/- హమాలీ కాలనీకి చెందిన సుమయ్య ఫాతిమా ₹.14,000/- బస్వవేశ్వర స్ట్రీట్ కి చెందిన సంతోష ₹.54,000/- APHB కాలనీ కి చెందిన మానస ₹.21,000/- ఆర్యనగర్ కి చెందిన గౌరమ్మ ₹.42,000/-చిన్న హైదరాబాద్ కి చెందిన రవి ₹.51,000/-.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు……. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరి , మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ యాకూబ్, వెంకటేశం గుప్తా, పద్మజ, అశోక్ రెడ్డి, పాండు ముదిరాజ్, నరేష్ రెడ్డి లు పాల్గొన్నారు.

వివాహ వేడుక లలో రాష్ట్ర వైస్ ఛైర్మన్.

వివాహ వేడుక లలో

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

గోపాల్ పేట్ మండల్.  కేంద్రంలో పద్మావతి గార్డెన్స్ లో గోపాల్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో రాష్ట్ర ప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు
కందిరీగ తాండ కు చెందిన లోక్య నాయక్ కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు .

సంస్థ గత ఎన్నికల నిర్మాణ సన్నాహాగా సమావేశం.!

సంస్థ గత ఎన్నికల నిర్మాణ సన్నాహాగా సమావేశం సంస్కృత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు రిజర్వేషన్ ఏదైనా కలిసికట్టుగా పని చేద్దాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

 

మండలంలో జరిగిన సమావేశంలో రిజర్వేషన్ ఏదైనా కలిసికట్టుగా పని చేద్దాం గ్రామ కమిటీలను పటిష్టం చేయడం మనందరి బాధ్యత అని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మొగుళ్లపల్లి లోని అమ్మ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణ రావు తోపాటు సంస్థాగత నిర్మాణ సన్నాహక పరిశీలకులుగా ఇనుగాల వెంకటరామిరెడ్డి, లింగాజీ పాల్గొనగా. సభాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ. మొగులపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 15 నుండి 17 వరకు అన్ని గ్రామాల ప్రజలు కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని గ్రామ కమిటీలను ఎన్నుకునే విధంగా ఇన్చార్జిలు బాధ్యత తీసుకోవాలని కమిటీలను వేయడం పూర్తి చేయాలని గ్రామ కమిటీలు పటిష్టంగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందని గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మండలంలో 25 మంది సర్పంచుల 25 మంది ఉపసర్పంచ్లు 300 మంది వార్డు సభ్యులను ఒక ఎంపీపీ ఒక జడ్పిటిసి 13 మంది డైరెక్టర్లకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని. రిజర్వేషన్ ఏది వచ్చిన ఆ గ్రామాలలో నాయకత్వం వహించి నాయకుడు బాధ్యత వహించి గ్రామ ప్రజలు నిచ్చే వ్యక్తిని సర్పంచ్ గా ఎంపిటిసిగా జడ్పిటిసిగా డైరెక్టర్లుగా ఎంచుకొనె బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు మీ గ్రామాల్లో అభివృద్ధి కొరకు గ్రామ కమిటీలు ఒక్కటిగా కూర్చుని చర్చించి తీర్మానం చేసుకుని గ్రామ కమిటీ అధ్యక్షుడు వస్తే తప్పకుండా ఆ పనిని చేయడం జరుగుతుందని ఎవరు పడితే వారు రావద్దని కార్యకర్తలకు సూచించారు.

Congress Party

ఎవరు పడితే వారు తమ ఇష్టంగా నా పని కావాలంటే మీ పదవులు ఉండవని ఎమ్మెల్యే వారికి తెలిపారు ప్రజల కోసం ఇచ్చిన పదవులను ప్రజలు మెచ్చే విధంగా పనిచేయడం అని ఇందిరమ్మ పిల్ల జాబితా అర్హులకు అందే విధంగా చూసుకోవాలని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమందరం యుద్ధ సైనికుల పని చేసేందుకు పటిష్టమైన కార్యకర్తలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో. పరిశీలకులు ఇనుగాల వెంకటరామిరెడ్డి, లింగాజి, పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, చిట్యాల ఏఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సంపెళ్లి నరసింగారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, జిల్లా నాయకులు మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

సివిల్ సప్లై హమాలి యూనియన్.!

సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా మహాసభల కరపత్రం విడుదల

కేసముద్రం నేటి ధాత్రి:

మే 18న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్లో జరిగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటియుసి మండల కార్యదర్శి మంద భాస్కర్, సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంద భాస్కర్ , చొప్పరి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సంస్కరణ పేరుతో చట్టాలను సవరించి కార్మికుల శ్రమను అప్పనంగా దోచుకునేందుకు కుట్ర పండుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. కేసముద్రంలో జరిగే జిల్లా మహాసభలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని ఐదు ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి హమాలీ కార్మికులతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ సారధి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ బిక్షపతి హాజరవుతారన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్డే బోయిన లక్ష్మీనరసయ్య, రాజబోయిన శ్రీను, నరముల యాకయ్య, బిచ్చు, రాజు, యాకయ్య, రెంటాల వెంకన్న, నగేష్, తాటికాయల యాకయ్య, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ లో సుందరీమణులు ఆహ్వానించిన సీపీ.!

ఖిలా వరంగల్ లో ప్రపంచ సుందరీమణులు

ప్రపంచ సుందరిమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ

ఖిలా వరంగల్ లో భారీ పోలీస్ బందోబస్తు

వరంగల్ తూర్పు  నేటిధాత్రి :

 

 

మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకై బుధవారం సాయంత్రం హరిత కాకతీయ హోటల్ కు చేరుకున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాధరంగా ఆహ్వానించారు.

 

Thousand Pillar

మొదటగా హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో సందర్శన చేసిన ప్రపంచ సుందరీమణులు, అనంతరం వరంగల్ తూర్పు పరిధిలోని ఖిలా వరంగల్ కోట వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

Thousand Pillar

వరంగల్ డివిజన్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మట్టేవాడ సిఐ తుమ్మ గోపి, వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్సై లు, మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా రైతు మృతి.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

 

తిమ్మాజీపేట/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా బావాజీ పల్లి గ్రామంలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నిలిపింది. గ్రామస్తులకు వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల బాలస్వామి (55) సొంత పొలంలో ట్రాక్టర్ సహాయంతో పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.

ఎల్ఐసి నూతన మేనేజర్ భాద్యతల స్వీకరణ.!

ఎల్ఐసి నూతన మేనేజర్ గోపి కిషోర్ భాద్యతల స్వీకరణ

పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన సిబ్బంది, ఏజెంట్ల నాయకులు.

నర్సంపేట నేటిధాత్రి:

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ గా గోపి కిషోర్ బుదవారం బాధ్యతలు చేపట్టారు.ఎల్ఐసి కార్యాలయానికి చేరుకున్న నూతన మేనేజర్ గోపి కిషోర్ కు .కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్,అడ్మినిస్ట్రేషన్ అధికారితో.

LICs new manager

ముఖ్య అధికారులు,సిబ్బంది,ఎల్ఐసి ఏఓఐ సంఘం నాయకులు, ఎల్ఐసి లియాపి సంఘం నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం పలువురు శాలువాలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్స్,అధికారులు,ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు..

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ

పోచంమైదాన్ బస్ షెల్టర్ పై, కొన్ని రోజులుగా వార్తలు ప్రచురించిన “నేటిధాత్రి”.

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ కు అభినందనలు

ఎక్స్ అకౌంటు (ట్విట్టర్) ద్వారా ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన “నేటిథాత్రి” పత్రిక

ఎట్టకేలకు పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి

షెల్టర్ నీడన ప్రయాణికులు.. “నేటిధాత్రి” పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

బస్ షెల్టర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బిల్డింగ్ ఓనర్, ఆర్టీసీ అధికారుల పైకి ఎదురు దాడి ప్రయత్నం

అండగా నిలబడి నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్..

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

వరంగల్ తూర్పు పరిధిలో, పోచంమైదాన్ జంక్షన్ వద్ద ఉన్న బస్సు స్టాండ్ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా ఉన్న బస్ స్టాండ్ ను తొలగించారు. అదే స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టిన అధికారులు, పైకప్పు (షెల్టర్) వేయడం మర్చిపోయారు. దీంతో మహిళలు, ప్రయాణికులు కొన్ని రోజులగా నానా ఇబ్బందులు పడ్డారు. బస్ స్టేషన్ కు పైకప్పు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల సమస్యను నేటిధాత్రి పత్రిక, “బస్ షెల్టర్ నిర్మించండి సార్” అని, “బస్ షెల్టర్ నిర్మించండి మంత్రి గారు” అని బస్టాండ్ సమస్యపై, అనేకసార్లు వార్తలు రాసి, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి. సోషల్ మీడియా ఎక్స్, (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన నేటిదాత్రి పత్రిక. పిర్యాదుకు స్పందించిన ఆర్టీసీ ఎండీ, మే 14, బుధవారం నాడు మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు, వారి పర్యటనలో భాగంగా ఖిలా వరంగల్ కు బుధవారం రానున్న నేపథ్యంలో, నగరాన్ని సుందరీకరణ చేస్తున్న విషయం తెలుసుకొని, జిల్లా ఆర్టీసీ అధికారులకు బస్
షెల్టర్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో. వెంటనే స్థానిక ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేశారు. నిలువ నీడ చేకూర్చిన ఆర్టీసీ అధికారులకు, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రిక కు, స్థానిక కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియచేశారు ప్రయాణికులు.

RTC bus

బస్ షెల్టర్ నిర్మాణం ఆపాలని, ఆర్టీసీ అధికారులతో వాగ్వాదం

బుధవారం ఉదయం ఆర్టీసీ అధికారులు పోచంమైదాన్ కు చేరుకొని, బస్ షెల్టర్ నిర్మాణం చేస్తుండగా, పక్కనే ఉన్న బిల్డింగ్ యజమాని కుమారులు వచ్చి, ఆర్టీసీ మహిళ అధికారిని పైకి ఇనుప రాడ్డుతో దాడి చేయబోయి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్డుతో దాడి చేయబోయే సంఘటనపై వీడియో తీసిన ఆర్టీసీ అధికారులు వీడియోను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ఓ టౌన్ ప్లానింగ్ అధికారి సైతం వచ్చి బస్ షెల్టర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆర్టీసీ అధికారులపై రుబాబు మాటలు మాట్లాడటంతో, మున్సిపల్ కార్పొరేషన్ “పెద్దల సహకారం” బిల్డింగ్ ఓనర్ కు ఉంది అనే అనుమానాలకు తావిచ్చింది. బిల్డింగ్ ఓనర్ కుమారులు మాట్లాడుతూ, నగర మేయర్ మేడం మాకు సపోర్ట్ గా ఉంది అని చెప్పడం గమనార్హం.

RTC bus

స్పందించిన స్థానిక కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్

బస్ షెల్టర్ వద్ద నిర్మాణం అడ్డుకున్న వ్యాపారితో మాట్లాడిన స్థానిక కార్పొరేటర్. ఇరువురికి నచ్చచెప్పిన తరువాత ఆర్టీసీ అధికారులు పని మొదలు పెట్టారు. దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిన స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్. బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో . ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం గంగాపూర్ గ్రామం పి.మల్ శెట్టి పాటిల్ కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, రామలింగారెడ్డి, శివరాజ్ పాటిల్,జలీల్, జి.నర్శింలు,నబిసాబ్, చెంగల్ జైపాల్,చంద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి.

రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి

నెక్కొండ నేటి ధాత్రి:

 

రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు విశిష్ట కార్డు రైతులకు ముఖ్యమని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లో రైతు విశిష్ట కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి నాగరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కిసాన్ యోజన తో పాటు ఎరువులు విత్తనాలు కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకున్న రోజున ఈ విశిష్టత కార్డు ప్రభుత్వం తప్పనిసరి అనే విధానాన్ని కల్పించ నున్నదని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన విధానాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రైతు విశిష్టత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు, కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి వసంత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మేరకు బృందాల ప్రదర్శన. !

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళా బృందాల ప్రదర్శన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర.సంబంధాల శాఖ ఆధ్వర్యంలో. తెలంగాణ సాంస్కృతిక సారధి గడ్డం శ్రీనివాస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు గ్రామాలలో బృందంచే. అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు అయిన. కెసిఆర్. కాలనీ కాబట్టి ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పారిశుభ్రత పాటిస్తూ ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా .తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. తెలియజేస్తూ ముఖ్యంగా యువత పిల్లలు డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని. పెద్దలు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిసి కలకాలం. పిల్లాపాపలతో చల్లగా ఉండాలని. ముఖ్యంగా ప్రజలు వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని. కూలి పనికి వెళ్లేవారు. ఉదయం. సాయంత్రం. పనులు చేసుకోవాలని ఎండలో పనిచేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తలపాగా టోపీ గొడుగు మంచిరు వంటివి వెంట తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందిరమ్మ ఇల్లు రాజు యువ వికాసం గృహ జ్యోతి ఉచిత . వంట గ్యాస్. 200 యూనిట్ల ఇంటి కరెంటు సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో. జిల్లా సాంస్కృతిక. సారధి టీం లీడర్ గడ్డం శ్రీనివాస్. కళాకారులు. శ్రీరాముడు రామచంద్రం. గుగ్గిళ్ళ పరశురాములు. వంతడుపుల గణేష్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ.

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ బృందం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

హైదరాబాద్ లోని మినిష్టర్ నివాసంలో వ్వవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరావు ను సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కె కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మెన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కమిటీ డైరెక్టర్ లు కలసి పుష్పగుచ్చాము అందజేసి శాలువతో సత్కరించారు.అనంతరం సర్దాపూర్ లో గల వ్వవసాయ్ మార్కెట్ కమిటీ సిసి రోడ్ కాపౌండ్ వాల్ కొరకు నిధులు కొరకు మంత్రి దృష్టి కి తీసుకెళ్లగా, మంత్రి గారు స్పందించి, సిసి రోడ్ కు నిర్మాణానికి 1 కోటి 30 లక్షలు, కాంపౌండ్ వాల్ కోటి రూపాయలు కేటాయించి నిధులు మంజూరు చేశారాని మార్కెట్ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ కు సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30 కి పూర్ణహుతి, మ. 12 గం. లకు స్వామివారికి హారతి, 12. 30 కి అన్నప్రసాద కార్యక్రమలు జరుగునని తెలిపారు.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి..

#ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

#దేవాలయ స్థల దాతకు ఘన సన్మానం .

#మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version