చక్రిధర్ గౌడ్ గారికి.రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డా: కోట ధన్ రాజ్ గౌడ్ డిమాండ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
సిద్దిపేట్ చక్రిధర్ గౌడ్ కు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేసిన డా :కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త. ఇటీవల ఫోన్ ట్రాపింగ్ కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తన ఫోన్
ట్రాప్ చేశారని మాజీమంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టునటువంటి చక్రిధర్ గౌడ్ గారికి.రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త బీసీ ఉద్యమం నేత జహీరాబాద్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన… ఓమేష్ కల్వకుర్తి మండలం జయ ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్నాడు. వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు పాఠశాల అనుమతి లేకుండా.. ఐదు మంది విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అందులో మున్ననూరు గ్రామానికి చెందిన ఓమేష్ స్నానం చేస్తుండగా ఈత రాకపోవడంతో.. కోనేరులో పడి గల్లంతయ్యాడు. బుధ, గురు వారాల్లో శ్రమించిన ఓమేష్ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడి ఆచూకీ కనుగొని భారీ క్రేన్ సహాయంతో బయటకి తీశారు. ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచనలు ఇచ్చారు. బాలుడి మృతదేహం లభ్యం కావడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు నిరంతరాయంగా బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
మండలంలోని ఎల్లంపేట గ్రామంలో కొన్ని రోజులుగా తల్లి గుడిసె భారతమ్మ అనారోగ్యం తో గురువారం ఉదయం మృతి చెందింది.బంధువులందరూ వచ్చారు ఆమె అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసి సాయంత్రం ఆమె దహన సంస్కారాలు పూర్తియైనతరువాత ఇంటికి వస్తున్నా క్రమంలో కొడుకు గుడిసె శీను (45)గుండెపోటుతో బంధువులు, గ్రామస్తులు, సన్నిహితులు అందరూ చూస్తుండగా కుప్పకూలి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను మరణించాడని తెలిసి కన్నీటి పార్వంతామయ్యరు .తల్లి చితి అరక ముందే కొడుకు మరణించడం తో ఎల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికి భార్య ఒక కూతురు, కుమారుడు ఉన్నారని అతను సుతారి మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందనిఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పేకాట రాయుళ్ల స్థావరంపై రామకృష్ణాపూర్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 11 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ముత్యాల ప్రదీప్ ఇంట్లో రహస్యంగా అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుండి 38.290 రూపాయల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముత్యాల ప్రదీప్, మిర్యాల శ్రీనివాస్, దయాకర్, మోతే శ్రీనివాస్, ఎస్.కె చాంద్ పాషా, వెంకటేష్, గూడ సత్తయ్య, పులి శ్రీనివాస్, బండి కిషోర్, సత్యం, రామ్ మహేందర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
• రెండు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా
• ప్రశాంతంగా కొనసాగుతున్న ఉత్సవాలు
• నేడు కేతకీ స్వామివారి కల్యాణోత్సవం
:-అష్ట తీర్థాల నిలయం, దక్షిణ కాశీగా
జహీరాబాద్. నేటి ధాత్రి:
nandi vahanam.
ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవా లయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి లిం గో దృవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభి షేకం, మహా రుద్రాభిషేకం, భస్మార్చన, మహా మంగ ళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. గురువారం ఉదయం అమ్మవారికి విశేష కుంకుమార్చన, యాగశాలలో రుద్ర స్వాకార హోమం, శాంతి హోమం అర్చకుల వేద మంత్రాలు, భక్తుల హర హర మహాదేవ శంకర అనే ప్రతిధ్వనుల మధ్య హోమ పూర్ణాహుతి జరిగింది. సాయంత్రం 5:30 లకు ఆది దంపతులైన పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారు నంది వాహనం పై అభయమిస్తూ భక్తులకు దర్శనమి చ్చారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు అనంతరం స్వామివారి నంది వాహన సేవ ను ప్రారంభించారు. కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల, పు రంతులు వేసిన దండకాల మధ్య స్వామివారి ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఝరాసంగం మాడవీధుల్లో ఊరేగిన స్వామి వారి భక్తులకు అభయమిస్తూ దర్శన మిచ్చారు. ఆది దంపతుల నంది వాహన సేవ నయనా నందభరితంగా సాగింది. 11 వరకు గంటలకు నంది వాహన సేవ మంగళహారతితో ముగిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ ధర్మా దాయశాఖ (సిఎఫ్ఎ) ఉత్సవ నిర్వహణ ప్రత్యేక అధికారి సులోచన, జిల్లా అధికారులు రంగారావు, సారా శ్రీనివాస్, ఈవో శివ రుద్రప్ప, ఝురా సంగం ఎస్సై సరేష్ పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.”
కేతకీ లో పీఠాధిపతి, కర్ణాటక ఎస్పీ పూజలు
కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఉదయం బర్దిపూర్ క్షేత్ర పీఠాధిపతి 1008 మహామం డలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి, కర్ణాటక, కలబురిగి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు.. మేదపల్లి గ్రామానికి చెందిన తీన్మార్ నర్సింలు ఆధ్వర్యంలో సంగీత గాయకులు శివుని కీర్తిస్తూ పాటలు పాడారు. ఆయనకు ఆలయ అధికారులు, మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ లు పూలమాలశాలులతో సన్మానించారు.
కేతకీకి పోటెత్తిన భక్తులు.. భక్తుల అగ్నిగుండ ప్రవేశం
జహీరాబాద్. నేటి ధాత్రి:
అష్ట తీర్థాల నిలయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరా సంగం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అమావాస్య కలిసి రావడంతో భక్తుల మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రికి కల్యాణోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక గూర్చి ఓదెల తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని నేరస్తులైన పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేష్, కోర్రి భాస్కర్, రాజన్ కుమార్ లు ఉనుకమరియు ఇసుక ను కలిపి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిలువచేసి హైదరాబాదుకు తరలించడానికి సిద్దం చేస్తున్న నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేసిన, తరలించిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
వేసవికాలంలో జీర్ణ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు!
జహీరాబాద్. నేటి ధాత్రి:
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో వేడి, తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి. ఇది మలబద్ధకం, అతిసారం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి ఆయుర్వేద చెప్పిన చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..
digestive health
ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది. మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం. వెచ్చని, తాజాగా వండిన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు, సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది. ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు, జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర, ఫెన్నెల్ టీ, లేదా సీసీఎఫ్ టీ, జీర్ణక్రియకు, గ్యాస్, ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు.
పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది. కెఫిన్, స్పైసీ ఫుడ్, కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి. కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన, సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి. ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం. జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా రోజంతా చిన్న మొత్తాలలో తినాలి. ఇది జీర్ణవ్యవస్థపై అధిక భారం పడకుండా చేస్తుంది.
భోజనం చేస్తున్న సమయంలో స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.
రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు, శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ), భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన), బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి, జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు.
క్రమం తప్పకుండా తినడం, నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.
వివాదాల్లో చిక్కినా నష్టపోయిన సినిమాలు అసలు లేవనే చెప్పాలి
నిర్మాతకు శుభసూచికంగా మారుతున్న వివాదం
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక చిత్రం విడుదలకు ముందే వివాదల్లో ఇరుక్కుంటే దానికొచ్చే కలెక్షన్లే వేరు. ఇది ప్రస్తుతం మనదేశంలోని అన్ని భాషా చిత్రాలకు వర్తిస్తుంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీని దేశవ్యా ప్తంగా హిందువులు ఎంతగానో ఆరాధిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణకోసం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ విస్తరణ కాంక్షను గణనీయంగా దెబ్బతీసిన మరాఠావీరుడు ఆయన. ఆయన తదనంతరం శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రిబాటలోనే పయనించి చివరకు ఔరంగజేబ్‌చేతికి చిక్కి చిత్రహింసలకు గురై మరణించాడన్నది చారిత్రక కథనం. ఈ కథనంపై ఆధారపడి తీసిన చిత్రమే ‘ఛావా’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాకముందే గత నెలలో నిర్వాహకు లు విడుదల చేసిన ట్రైలర్ చూపిన ఒక నృత్యంపై వివాదం రేగింది. ఎట్టకేలకు ఆ వివాదం ముగిసిందనుకుంటే ఇప్పుడు నిర్మాతలకు పరువునష్టం దావా కేసు రూపంలో మరో కష్టం వచ్చిపడిరది. చిత్రంలో గనోజీ, చెన్హోజీ షిర్కేలను నెగెటివ్‌గా చూపించారంటూ వారి వారసులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌పై వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించడం తాజా పరిణామం. ఇంత వివాదంలోనూ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్లు వసూళ్లు రాబట్టడం విశేషం.
ఈ రెండు పాత్రలను మరాఠీ నటులు సువ్రత్ జోషి, సారంగ్ సతాయేలు పోషించారు. మొఘల్స్‌కు శంభాజీ ఎక్కడ వున్నదీ వీరు తెలియజేసినట్టు చిత్రంలో చూపించారు. గనోజీ, చెన్హోజీ షిర్కే లు, శంభాజీ అనుపానులు చెప్పడంవల్లనే మొఘల్ సైన్యాలు ఆయన్ను పట్టుకోవడం తర్వాత ఔరం గజేబ్ చిత్రహింసలకు గురిచేసి చంపేసినట్టు చిత్రంలో చూపించారు. ఈ నేపథ్యంలో షిర్కే కుటుంబ వారసులు చిత్ర నిర్వాహకులకు ఫిబ్రవరి 20న ఒక లీగల్ నోటీసు పంపారు. చిత్రం లో చరిత్రను తప్పుగా చూపించడంవల్ల తమ కుటుంబం ప్రతిష్ట బాగా దెబ్బతిన్నదని, వారు తమ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
దీంతో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్, గనోజీ, చెన్హోజీ షిర్కే వారసులైన భూషన్ షిర్కే ఇంటికి వెళ్లి మరీక్షమాపణలు చెప్పారు. ‘‘షిర్కే కుటుంబం భావోద్వేగాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు బాధపడివుంటే అందుకు క్షమాపణలు కోరుతున్నాను. అదీకాకుండా చిత్రంలో వారి ఇంటిపేరు లేదా గ్రామం పేరు ప్రస్తావించలేదు. కేవలం వారిపేర్లు గనోజీ, చెన్హోజీ షిర్కేలుగా మాత్రమే పేర్కొన్నాం’’ అని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ భూషన్ షిర్కే అందుకు సంతృప్తి చెందలేదు. చిత్రంలోని అభ్యంతరకర భాగాలను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
నిజానికి గత నెలలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసినప్పుడు అందులో షంభాజీ మహరాజ్, రాణియశూబాయ్‌తో కలిసి నృత్యం చేస్తున్నట్టు చూపడం దుమారం రేపింది. రాజ్యసభ సభ్యుడు శం భాజీ రాజే ఛత్రపతి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక చరిత్రను చిత్రంగా మలచే సమయంలో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందు నిర్వాహకులు చరిత్రకారులకు చూపించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు. ఈయనశంభాజీ మహరాజ్ కుటుంబ వారసుడు కావడం గమనార్హం. చిత్రంలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశన్, రాణి యశూబాయ్‌గా రష్మికా మండన్న నటించారు. ఒక మహారాజు చరిత్రను చూపుతున్నప్పుడు, వారిపై ఇటువంటి నృత్యాల సీన్లు చిత్రీకరించడం సముచితం కాదని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ‘నృత్యం’పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమర్థించుకున్నారు. శంభాజీ మహరాజ్ జీవితం పోరాటాలతోనే గడిచిపోయింది. అటువంటప్పుడు రాజు, రాణి కి మధ్య రొమాన్స్ జరిగే అవకాశం ఎక్కడుంటుందనేది ప్రతి ఒక్కరికీ సహజంగా వచ్చే సందే హం. కానీ కథను చెబుతున్నప్పుడు సృజనాత్మక కళను జోడిరచడం కొన్ని సందర్భాల్లో తప్పదు. వీక్షకులు ఎంతో తెలివైనవారు. వారెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఒక పోరాట యోధుడి జీవితాన్ని వాస్తవిక రీతిలో ఆవిష్కరిస్తున్నప్పుడు వీక్షకులు ఈ నృత్యాన్ని తప్పక ఆమోదిస్తారు. ఛావా విషయంలో మా అంచనా ఇదేనన్నారు.
ఈ నృత్యం అంశం చినికి చినికి గాలివానగా మారడంతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, ఎం.ఎన్.ఎస్.పార్టీ అధినేత రాజ్‌థాకరేను కలిసి, తాము ప్రవేశపెట్టిన లెంజీ నృత్యం మహారాష్ట్ర సంప్రదా యిక నృత్యం. అయిప్పుటికీ దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నృత్యాన్ని తొలగిస్తామని చెప్పారు. తర్వాత మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరియు శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు నృత్యాన్ని తొలగించి వివాదానికి శు భం పలికారు. విచిత్రమేమంటే లెంజీ తమ సంప్రదాయిక నృత్యమన్న సంగతిని శంభాజీ మహరాజ్ వంశానికి చెందిన వారసులు అంగీకరిస్తున్నారు. కాకపోతే ఈ చిత్రంలో నృత్యం పెట్టిన సందర్భాన్ని వారు ప్రశ్నించడం గమనార్హం.
ప్రముఖ బాలీవుడ్ నటి స్వరభాస్కర్ ఈ చిత్రంపై ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ మరో వివాదానికి కారణమైంది. ‘‘కుంభమేళా సందర్భంగా ఎంతో మంది మరణిస్తే, వారి శవాలను బుల్డోజర్లతో తొల గించే సన్నివేశాలకు ఎంతమాత్రం స్పందించని ఈ సమాజం ఐదువందల ఏళ్ల క్రితం హిందువులను హింసించారంటూ ఎక్కువచేసిన చూపిన మరియు పాక్షిక కల్పనతో కూడిన ఈ చిత్రాన్ని చూసిన సమాజం ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా వుంది. ఇదొక మెదడు, ఆత్మ చనిపోయినసమాజం’’ అనేది ఈ పోస్ట్ సారంశం. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదేసమయంలో ఆమె సమర్థకులూ రంగంలోకి దిగారు. ‘‘శంభాజీ మహరాజ్ హిందువులకో సం చేసిన నిరుపమాన త్యాగాన్ని కేవలం కల్పన అని చెప్పడానికి నీకెంత ధైర్యం.’’ అంటూ ఆ మెపై నెటిజెన్లు ఎదురుదాడికి దిగారు. ‘చరిత్రతో నాటకాలాడొద్దు’ అని మరొకరు ఆమెను హెచ్చరించారు. విచిత్రమేమంటే ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తి ఫహద్ అహ్మద్! అయితే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు కొత్తేం కాదు. వివాదం సృష్టించడం, చీవాట్లు తినడం ఆమెకు బాగా అలవాటైపోయింది.
వివాదాల్లో చిక్కుకున్న కొన్ని బాలీవుడ్ చిత్రాలు
మద్రాస్ కేఫ్:
ఇది శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన చిత్రం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని కూడా ఇందులో చూపారు. అయితే ఎల్‌టీటీఈని దోషిగా చూపారం టూ తమిళనాడులో ఆ సంస్థ అనుకూలురు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంతో తమిళనాడులో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు.
విశ్వరూప్:
తమిళనాడులోని ముస్లిం గ్రూపులు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాయి. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినా, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయలేదు. తమిళనా డులో కంటే అధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగా ఆడిరది.
ఓ మై గాడ్ (ఓ.ఎం.జి):
తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయాలను, హిందూ దేవుళ్లను అపహాస్యం చేసారంటూ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని విశ్వహిందూ పరిషద్, హిందూ జన జాగృతి సమితి వంటి సంస్థలు ఆందోళన చేశాయి. అయినప్పటికీ ఎటువంటి కోతలు లేకుండా ఈ చిత్రాన్ని 2012లో విడుదల చేశారు. కలెక్షన్లలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్:
ఇందులో చిత్రీకరించిన ఒక నృత్యంలో రాధను సెక్సీగా చూపారన్న కారణంగా ఇండోర్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సినీ నిర్వాహకులపై కేసు పెట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంలో ఆ పాటను తొలగించలేదు.
రాక్‌స్టార్: ఈ చిత్రంలో ‘సాదా హక్’ అనే పాటలో వెనుక ‘స్వతంత్ర టిబెట్ పతాకాన్ని’ చూపడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఇంతియాజ్ అలీ మధ్య వివాదం రేగింది. ఆ పతాకా న్ని బ్లర్ చేయమని ఆయన్ను కోరింది. కానీ దర్శకుడు అందుకు అంగీకరించలేదు. అయితే వీడియో నుంచి ఈ సీక్వెన్స్‌ను తొలగించక తప్పలేదు.
అరక్షణ్:
ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ఒక దళిత యువకుడిగా నటించారు. రాచకుటుంబానికి చెందిన సైఫ్ అలీఖాన్ ఆవిధంగా నటించడాన్ని వ్యతిరేకిస్తూ కాన్పూర్‌లో కొన్ని దళిత అనుకూల గ్రూపులు ఆందోళన జరిపాయి. దీంతో ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ల్లో ని షేధించారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‌లు పంజాబ్‌లోని కొన్ని వర్గాలకు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయని అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేస్తే, యు.పి.లో అధికారంలో ఉన్న అప్పటి మాయావతి ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని రెండు నెలలపాటు నిషేధించింది.
మై నేమ్ ఈజ్ ఖాన్:
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ సభ్యులను ఇక్కడి ఐపీఎల్‌కు పోటీపడుతున్న క్లబ్‌లు పిలవడంలేదని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ విమర్శించారు. అయితే దీన్ని శివసేన ఖండిరచింది. ఈ సినిమాను విడుదల చేయరాదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే షారూక్ ఖాన్ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. అవసరమైతే బాల్ థాకరేతో ఈవిష యంపై మాట్లాడతానన్నారు.
బిల్లు:
ఈ సినిమా అసలు పేరు ‘బిల్లు బార్బర్’. అయితే ‘బార్బర్’ పేరు తమను కించపరచేదిగా వున్నదంటూ సెలూన్, బ్యూటీపార్లర్ల యజమానులు ఆందోళనకు దిగడంతో షారూక్ ఖాన్ ‘బా ర్బర్’ పేరు తొలగించి ‘బిల్లు’ పేరుతో విడుదల చేశారు.
తెలంగాణలో శాసన మండలి ఎన్నికకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు గత ఎడాది కాలంగా బిజీబిజీగానే వున్నారు. అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలంటూ అభ్యర్థనలు పంపుతూనే వున్నారు. వీలు చిక్కినపుడుల్లా ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్లు డిల్లీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటూనే వున్నారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటూనే వున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ రానే వచ్చింది. అందులో నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వచ్చే అవకాశం వుంది. రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. మొదట్లో వున్న లిస్ట్‌కు ఇప్పుడు వినిపిస్తున్న లిస్ట్‌కు పొంతనే లేదు. ఒకింత చాంతాడంత పెరిగిపోయింది. అయినా ఎమ్మెల్సీలెవరికి దక్కేనో! అన్నది ఉత్కంఠగా మారిపోయింది. ఇక ముందుగా చెప్పాల్సి వస్తే కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన జీవన్ రెడ్డికి ఆ అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఆయనే వద్దన్నారన్న ప్రచారం కూడా వుంది. పైగా ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ దరి చేరారు. ఇది జీవన్ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. అయినా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అలకను పట్టించుకోలేదు. కానీ ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం అనుకుంటే తప్ప ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. ఇక మొదటి నుంచి అన్యాయం జరుగున్న నాయకుడు అద్దంకి దయాకర్. ఈసారైనా అద్దంకికి అడ్డంకులు తొలిగేనా? అనే ప్రశ్న వుండనే వుంది. ఆయన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా మీదనే ఆధారపడి వున్నారు. అయినా ఎక్కడో ఏదో అనుమానం ఆయన వ్యక్తం చేయకపోయినా లోలోన గుబులు వుండనే వుంది. తుంగతుర్తి నియోజకవర్గం తనదే అన్న ధీమాతో ఆది నుంచి వున్నారు. 2019 ఎన్నికలలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఒక దశలో అద్దంకి దయాకర్ గెలిచినట్లే వార్తలు వచ్చాయి. ఆఖరు క్షణంలో ఫలితం తారుమారైంది. అప్పటి నుంచి ఆయన తుంగతుర్తిని వీడలేదు. ఆ నియోజకవర్గం ఎప్పటికైనా నాదే అని పనులు చేసుకుంటూ వెళ్లారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే మందుల సామేల్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకే టికెట్ అధిష్టానం ఇచ్చింది. ఇందులో ఏం జరిగిందనేది అద్దంకికి తెలుసు. పార్టీకి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా అద్దంకికి టికెట్ వచ్చినట్లే అనుకున్నారు. వరంగల్ సీటు వస్తుందని ఆయన కూడా భరోసాతోనే వున్నారు. ఆఖరు నిమిషంలో కడియం కావ్యకు టికెట్ వెళ్లింది. అద్దంకి అలా మరో సారి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా అద్దంకి ఎమ్మెల్సీ అవుతారా లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొనే వుంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డికి పాద నమస్కారం కూడా చేసిన సందర్భం వుంది. ఇక ఇప్పుడు ఆయన భవిష్యం తేలకపోతే భవిష్యత్తు రాజకీయం కష్టమే. కాంగ్రెస్‌కు వచ్చేవే నాలుగు స్థానాలు. బిసి నినాదం బలంగా వినిపిస్తోంది. ఆ నాలుగు మాకే కావాలని బిసిలు కోరుతున్నారు. అందులో కనీసం రెండు సీట్లైనా బిసిలకు పోతే అద్దంకి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మిగులుతోంది. పైగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా రేస్‌లో వున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సీట్లు ఎక్కువ ఇచ్చారన్న వాదన వుండనే వుంది. వరంగల్ పార్లమెంటు విషయం అన్యాయం జరిగిన దొమ్మాటి సాంబయ్య కూడా సీటు నాకే ఇవ్వాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అద్దంకికి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే ఇక ఆయన నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి. ఒకవేళ అద్దంకి అదృష్టం బాగుండి, ఎమ్మెల్సీ అయితే మాత్రం మంత్రి కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందువల్ల అద్దంకిని అడ్డుకోవడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా తమ వంతు రాజకీయం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్సీ అయితే మంత్రి వర్గ విస్తరణలో ఆ ఇద్దరు నేతలు ఆశలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నాలుగు స్థానాలలో సామాజిక న్యాయం సాధ్యమయ్యేనా! అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గం నుంచి మంత్రులు ఎవరూ లేరు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ రేసులో వున్నారు. ఈసారి అవకాశం వస్తే మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. పైగా నిజామాబాదు ఉమ్మడి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు దక్కాల్సి వుంది. కానీ త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగాల్సి వుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సొంత గూటికి వచ్చేశారు. అయినా ఆయన అంత సంతోషంగా లేరు. సుప్రీంకోర్టు లో వున్న కేసులో తీర్పు ఎలా వుంటుందో చెప్పలేనిది. అందువల్ల హైదరాబాద్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం కోసం ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తారనే అంటున్నారు. ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. అంతే కాకుండా మాజీ టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ కూడా ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. యూపి లోని ఫిరోజాబాద్ నుంచి రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ అనుభవంతో పాటు అధిష్టానం వద్ద అజహరుద్దీన్‌కు మంచి వెయిట్ వుంది. ఇక సీనియర్లలో ఎక్కువగా బిసిలు వున్నారు. వారిలో ఇప్పటికీ ఆక్టవ్‌గా వున్న వి. హనుమంత రావు ఫ్లీజ్ అంటున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్ నాకేం తక్కువ అంటున్నాడు. పైగా రాహుల్ గాంధీకి సన్నిహితుడు అనే గుర్తింపు వుంది. వీళ్లతో పాటు సికింద్రాబాద్ మాజీ ఎంపి. అంజన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నాడు. సీనియర్లు అడ్డుపడితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మొదటికే మోసం వచ్చేనా? ఎందుకంటే ఆశావహులు చాలా మంది వున్నారు. సీటు మాకంటే మాకే అంటూ కాచుకొని కూర్చున్నారు. పార్టీ కోసం ఇంత కాలం త్యాగాలు చేసిన వారు వున్నారు. అంతే కాకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసిన వాళ్లు వున్నారు. వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నాయకులు వున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, మరొకరు ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని కూడా అంటున్నారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారి పూర్తి సీట్లు సాధించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. గత పార్లమెంటు ఎన్నికలలోనే ఖమ్మం సీటు ప్రసాద్ రెడ్డికి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడే ఎమ్మెల్సీ హామీ పార్టీ ఇచ్చిందనేది సమాచారం. ఇన్ని చిక్కు ముడుల మధ్య సామాజిక సమీకరణాలంటే సాధ్యపడతాయా! అధికారంలో వున్నప్పుడు సామాజిక సమీకరణాలతో అన్యాయం జరిగితే నాయకుడు ఊరుకుంటారా? తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లో పదుల సంఖ్యలో క్యూలో వున్నారు. అందరూ మాకే కావాలంటున్నారు! ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు! అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే! అన్న మాటలే వినిపిస్తున్నాయి. నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే అని అంటున్నారు. భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేస్తామంటే నాయకులు సంతృప్తి చెందుతారా? ఇక సందిట్లో సడే మియా లాగా మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరం నింపుతోంది. లేని లీకులతో మీడియా చేసేది గందరగోళం సృష్టిస్తోంది. పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువైపోయింది. నాయకులంతా నిమిత్త మాత్రులే. ఈసారి టికెట్ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!
గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భావించి, మానసిక మరియు శారీరక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని భావించి గత 25 సంవత్సరాలుగా భారతీయ సనాతన ధర్మంలోని యోగ విద్యను 150 గ్రామాలలో సుమారు రెండు లక్షల మందికి యోగాలో ఉచిత శిక్షణను అందించినందుకుగాను ఈ పురస్కారం లభించిందని తెలియజేస్తూ, యోగా శిక్షణతో పాటు అనేక దేశభక్తి, ఆధ్యాత్మిక,సామాజిక మరియు సాంఘిక కార్యక్రమాల్లో చేసిన విశేష సేవలను గుర్తించి ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఈ పురస్కారానికి ఎంపిక చేయటం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి, శ్రీ సి ఎస్ రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, స్వామి ప్రణవానంద దాస్ , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి.దయాకర్ రావు, తాటికొండ.రాజయ్య, వొడితల.సతీష్ బాబు పాల్గొన్నారు.
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బండారు శీనుకు ఇటీవల పక్షవాతం వచ్చి వరంగల్ హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు…అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఇకనుండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిజియోథెరపీ ద్వారా త్వరగా కోలుకుంటావని, ఇక నుండి అన్ని విధాల మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చీకటి కిరణ్,బండారు గోపి పబ్బతి సారంగం, మోరపాక యాకయ్య, రేగుల వెంకటరమణ, ఎసల్ల సత్యనారాయణ, చాగంటి శ్రీను,కొండేటి కళాధర్,పబ్బతి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమనీకి ఊపిరి పోసిన బియ్యల జనార్దన్ సార్ కు ఘన నివాళి
కొత్తగూడ,నేటిధాత్రి :
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆదివాసీల ఆత్మ బంధువు బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వద్ద సారయ్య ఆధ్వర్యంలో బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన దళిత పీడిత బహుజన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి ఆదివాసీల ఆత్మబంధువై పేరు లిఖించుకున్న ఉద్యమకారుడు బియ్యాల జనార్దన్ రావు సార్ గారు మన మధ్య లేకపోవడం ఈ ప్రాంతానికి తీరని లోటు.. తెలంగాణ ఉద్యమంలో తన వాక్కు చతుర్యంతో ప్రతి పల్లెలో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ పోరాటంలో మన కొత్తగూడ మండలానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారని జోహార్ జనార్దన్ సార్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు..ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ చల్ల నారాయణరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు వీరనేని వెంకటేశ్వర్రావు, డిసిసి జనరల్ సెక్రెటరీ బానోత్ రూపుసింగ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ప రాజేశ్వర్ , కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, ఓబీసీ జనరల్ సెక్రటరీ వల్లెపు రంజిత్, యూత్ ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలం వెంకన్న, బానోత్ దేవేందర్, యాదగిరి కిరణ్, మెకానిక్ వెంకట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,,,
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ
పరకాల నేటిధాత్రి వరంగల్, ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో పోలింగ్ సరళిని డిసిపి పి రవీందర్ పర్యవేక్షించారు.అనంతరం పోలీస్ సిబ్బందికి తగిన సలహా సూచనలను తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్వో విజయలక్ష్మి,సీ.ఐ క్రాంతి కుమార్,ఎస్ఐ రమేష్ బాబు.ఆర్ఐ దామోదర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలకు సంబందించిన ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు మండల తహసిల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా 531 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా 375 ఓట్లు, టీచర్స్ 35 ఓట్లు ఉండగా 35 ఓట్లు పోలయన్నారు. మొత్తం 70 శాతం పోలయ్యని తెలిపారు అలాగే మెదక్ ఆర్డిఓ రమాదేవి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.15 లక్షలతో అండర్ డ్రైనేజ్ పనులను గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో.. గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మిన్నాల డేవిడ్, రేణు రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రమౌళి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రకంటి శివ కుమార్, మాజీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏదుల శంకర్, రాములు, మట్ట అంజయ్య, ఏదుల మచ్చేందర్, జక్కుల మల్లేష్, డేరంగుల శ్రీశైలం, పరమేష్, రత్నయ్య, జగన్, కృష్ణయ్య, యాదయ్య, అంజయ్య, ఏదుల అశోక్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన న్యాల్కల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని జహీరాబాద్ ఆర్డీఓ రామిరెడ్డి గురువారం ఉదయం స్వయంగా సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
మంచిర్యాల్ జిల్లాలో ఒకటి టీచర్స్,రెండు గ్రాడ్యుయేట్ స్థానాలనికి పోలింగ్ కేంద్రాలలో సంబంధిత ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను చేపట్టారు.జైపూర్ మండల కేంద్రం మండల పరిషత్ సెకండరీ పాఠశాలలోని మూడు పోలింగ్ భూతులలో గురువారం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ వనజ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకుని మాట్లాడారు.పోలింగ్ ఏర్పట్లను బ్రహ్మాండంగా చేశామన్నారు.దీనితో ఎన్నికల విధానం సక్రమంగా కొనసాగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయన్నారు.
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 లో భాగంగా నేడు 7 వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఉదయం 11 30 గంటలకు ప్రారంభం అయింది. స్థానిక ఎమ్మెల్యే, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో హర హర మహా దేవ శంభో శంకర,ఓం నమ: శివాయ నమ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,ఆలయ ఈఓ,ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు..
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.