కెనాల్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.

కెనాల్ కాలువలోకి దూసుకెళ్లిన కారు

వరంగల్ సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తు పడిన కారు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి, కూతురు కొడుకు) మృతి.. మరొకరిని కాపాడిన స్థానికులు

బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు, గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు.

ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు…

వరంగల్, నేటిధాత్రి.

Car

వరంగల్ జిల్లా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ప్రమాదవశాత్తు కారు పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి, కూతురు కొడుకు) మృతి.. మరొకరిని స్థానికులు కాపాడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీలో బాలుడి మృతి చెందారు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తండ్రి, కూతురు కాలువలో గల్లంతు కావడం, గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తో పాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు (3) మృతి చెందగా భార్యను స్థానికులు కాపాడారు. వరంగల్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. అప్పటికే బాబు మరణించాడు. ప్రవీణ్ ఆయన కూతురు కారు సహా నీటిలో గల్లంతయ్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Car

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న.

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న..

స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది…

సృజన.ట్రయిని ఎస్సై..

రామాయంపేట మార్చి 8 నేటి ధాత్రి(మెదక్)

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని ట్రెయిని ఎస్సై సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా అమే మాట్లాడుతూ నేడు పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అలాగే పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. చాలా రంగాల్లో మహిళలు ముందుంటున్నారని అన్నారు. ప్రస్తుత కాలంలో ఏ రంగాల్లో అయినా మహిళలు రాణిస్తున్నారని అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు. మహిళలు పురుషులకంటే ఆత్మస్థైర్యంగా శక్తివంతంగా తయారయ్యారని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే చిన్నచూపు చూడకుండా వారిని కూడా పురుషులతో సమానంగా పెంచి ఉన్నత చదువులు చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తొందరపడి ఆడపిల్లలను చదివిన మధ్యలో ఆపేసి పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అప్పుడు తిరిగి ఆ సమస్య తల్లిదండ్రుల కు వస్తుందన్నారు. అలా కాకుండా ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగం సంపాదించే వరకు పెంచితే వారికి భవిష్యత్తు ఎంతో ఉంటుందని జీవితాంతం సుఖ సంతోషాలతో మెట్టిన ఇంట్లో కూడా ఉంటుందని అన్నారు. దేశంలో నేడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తున్నాయని ఇది మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించడం వల్లనే జరుగుతుందన్నారు. ఆడవారు ఉద్యోగాలనే కాకుండా స్వచ్ఛందంగా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, స్వయం ఉపాధి రంగాల్లో ఎంతో రాణిస్తున్నారని అన్నారు.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళా దినోత్సవ వేడుకలు.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటి ధాత్రి:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ఈ రోజు పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో యస్ ఐ దీకొండ రమేష్ అద్వర్యoలో మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా మహిళ పోలీస్ సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యస్ ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా, విద్య, వైద్య ,పారిశ్రామిక, అంతరిక్ష ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమని అన్నారు.అన్ని రంగాల్లోనూ మహిళలదే పోటీ అని, వారికి ఎవరు సాటి రారని కీర్తించారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ, ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు.పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, కృషితో ఉద్యోగాలలో మరియు ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతంగా ఆలోచించిన మహిళ తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉందని, ప్రత్యేకంగా పోలీస్ శాఖలో తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.మహిళా సాధికారత తోటే అభివృద్ధి సాధ్యం అని, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలియజేశారు.
అనంతరం మహిళా పోలీస్ సిబ్బంది ప్రవల్లిక, రజిత, భారతిమ్మని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏయస్ఐలు సుధాకర్, వీరస్వామి, రత్నాకర్, లక్ష్మి రాజం, హెచ్ సి కిషన్, శ్రీనివాస్, రాము, రాజేందర్, శివ శంకర్, రాజు, హరీష్, సతీష్ పాల్గొనారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

కల్వకుర్తి /నేటి ధాత్రి.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ లు బృంగి ఆనంద్ కుమార్,యెన్నం భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు జిల్లెల్ల రాములు, దామోదర్ గౌడ్, చిన్న రాంరెడ్డి, గోరటి శ్రీనివాసులు, రవీందర్,చిన్న, బాలు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సభ్యులు రేష్మ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్ రాజ్, శ్రీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నాని యాదవ్,రావుల కేశవులు, వెంకటేష్,దున్న సురేష్, శ్రీశైలం మహేందర్, నవీన్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ డీకే అరుణకు సన్మానం.!

ఎంపీ డీకే అరుణకు సన్మానం

మహబూబ్ నగర్ /నేటీ ధాత్రి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో మహబూబ్ నగర్ ఎంపీ అరుణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరియు షాద్ నగర్ బిజెపి నాయకులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ బీజేపీ నాయకులు శ్రీనివాస్, విజయ్ బాస్కర్, నర్సింహా యాదవ్, మోహన్ సింగ్, సుధాకర్, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, చౌదరిగూడ మండల అధ్యక్షులు గడ్డమిది రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, మిద్దె గణేష్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

తలకొండపల్లి /నేటి ధాత్రి

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి లో పెద్దూర్ తాండ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సభావత్ తారబాయి శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ… తమ ట్రస్టు ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి ద్వారా రూ.3 వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిటిసి రఘు నాయక్, మాజీ సర్పంచ్ సక్రి కిషన్ నాయక్, మాజీ వార్డు మెంబర్లు రవి, పుల్యి , రమేష్ గ్రామ పెద్దలు టిక్యి నాయక్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, దస్రు నాయక్, శ్రీనివాస్ ,కృష్ణ తదితరులు వివిధ నాయకులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమం.

ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమం

ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం జరుగుతుంది. అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్, డిఎం అండ్ హెచ్ ఓ, వైఆర్ జి కేర్ సహాయ సహకారము తోటి కళారంజని సందీప్ కళాబృందం ద్వారా కూడలి వద్ద హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై కళా ప్రదర్శనలు నిర్వహించారు హెచ్ఐవి వ్యాధి నాలుగు కారణాల ద్వారా వస్తుంది. రక్షణ లేని సెక్స్,కలుషితమైన రక్త మార్పిడి,కలుషితమైన చిరంజీలు,తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే గర్భంధాలిస్తే పుట్టబోయే బిడ్డకు వస్తుంది

AIDS

హెచ్ఐవి అంటువ్యాధి కాదు ఈ నాలుగు కారణాల వల్ల మాత్రమే వస్తుంది.సుఖ వ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవి వ్యాధి వచ్చే అవకాశం పది రెట్లు ఎక్కువ సుఖ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి యువకులు దీని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే ఆమె గర్భం దాలుస్తే పుట్ట బోయే బిడ్డను కాపాడడానికి మందులు ఉన్నాయి పుట్టబోయే బిడ్డను కాపా డవచ్చు కనుక గర్భం దాల్చిన ప్రతి తల్లి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలి.హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను హింసించకుం డా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే వారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశ ముంది.కళాకారులు,పాటల ద్వారా, పల్లె సూక్తుల ద్వారా నాటకాల ద్వారా తెలియ జేశారు, ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 1097 గూర్చి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైఆర్ జి కేర్ , డి ఆర్ పి ముస్తక్ ,పంచాయితీ కార్యదర్శి రత్నాకర్, సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్, రవీందర్, కారోబార్. రమేష్ బాబు సూపర్ వేజర్ రంజిత్, మామిడి స్వప్న,సిబ్బంది,
కళాకారులు పోలేపాక సందీప్,,కృష్ణం రాజు , రజని, కరుణాకర్, సమ్మయ్య ,రామ పాల్గొన్నారు.

ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న.

* ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్*

జహీరాబాద్. నేతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక అంగన్వాడీ కేంద్రం లో మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని. ఇసందర్బంగ మేధాపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళలని ఉద్దేశించి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని. ప్రతి ఆడబిడ్డ లో తన తల్లిగా చెల్లిగా అక్కగా చూడాలని. స్త్రీ లేనిదే జననం లేదు అని.ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం అని అయన కొనియాడుతూ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు.

అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం.

అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#పాములకు పక్షులకు నివాసంగా మారిన ఆసుపత్రి

#ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న జనం

#పట్టించుకోని అధికారులు

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి(మెడికల్):

Hospital

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన వెల్నెస్ కేంద్ర భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది. అసలు ఇక్కడ వెల్నెస్ కేంద్రం ఉందా లేదా అనే భావన కలుగుతుంది. వెల్ నెస్ కేంద్రానికి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ కేంద్ర భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ పిచ్చి చెట్లు ఉండడంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు అంటున్నారు.

ఆశా వర్కర్ పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై ఎస్సీ.

ఆశా వర్కర్ పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ అయినా ఆశా వర్కర్ పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితునిపైఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఆశా వర్కర్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగాఒక కామాంధుడు దౌర్జన్యం చేసి,బెదిరించిఅత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన జరిగి వారం రోజులు కావస్తున్ననిందితుని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదని తక్షణమే నిందితునిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కఠినంగా వ్వవ రించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్వవహరించి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళల రక్షణ కోసంతగిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని, పోలీస్ యంత్రాంగం నిందితుడికి అండగా ఉండి బాధితురాలికి అన్యాయం చేసి వైఖరి అవలంబిస్తున్నట్టు కనబడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొనినిర్లక్ష్యంగా వ్వవహ రించిన పోలీస్ అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బాధితురాలికిసరైన వైద్యం అందించాలని,ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని,ప్రభుత్వ ఉద్యోగం, మరి ఇతర ఆర్థిక సహాయసహకారాలుఅందించాలనివారు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, అంతిరెడ్డి,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి,సిపిఎం నాయకులు ఎస్ కే. జహంగీర్, యాదయ్య, నరసింహ,వెంకన్న,లక్ష్మమ్మ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం

పరకాల నేటిధాత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామంలో శనివారం రోజున ఉపాధి హామీ పని వద్ద గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మహిళలు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం.

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం….

– విద్యార్థులకు ఐడి కార్డులు అందజేసిన ఉపాధ్యాయులు….

కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-

School

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ రావు , అదేవిధంగా విద్యార్థి నీ విద్యార్థులకు ఐ. డి కార్డులను అందచేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో మరి పాఠశాలలు నాలుగు మాత్రమే ఉన్నాయని అందులో చిన్న ఘనపూర్ పాఠశాల ఎంపిక కావడం జరిగింది. ఈ పాఠశాలలో ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఎల్కేజీ యూకేజీ తరగతి గదులు విద్యాబోధన జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల విద్యార్థులని ప్రవేటు పాఠశాలలకు పంపించకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు పంపించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలల్లోనే రికార్డులను రిజిస్టర్ లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జిగా ప్రధానోపాధ్యాయులు సీతారాం , రమణ అదేవిధంగా సిఆర్ పి బృందం రాజశేఖర్ సాయి రాములు ప్రాథమిక పాఠశాల సిబ్బంది సరిత, ప్రియాంక, ప్రమీల, దివ్య, గ్రామంలోని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పట్లోరి సత్యనారాయణ తెలపడం జరిగింది.

School

విజయవంతంగా ముగిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు.

విజయవంతంగా ముగిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు.

జహీరాబాద్ నీటి ధాత్రి:

Bonalu

ఝరాసంగం మండల్ కొల్లూర్ గ్రామంలో.ఆలయ ధర్మకర్త శ్రీమతి భ్రమరాంబ రాములు గౌడ్ ఆధ్వర్యంలో రెండు రోజులు కనుల పండుగ సాగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవం.ఆలయ కమిటీ చైర్మన్ డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త మాట్లాడుతూ.ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఎస్సై నరేష్ మునిపల్లి మాజీ జెడ్పిటిసి ఫైతరి సాయికుమార్ రైతుబంధు మండల అధ్యక్షులు పరశురామ్ గౌడ్ ఝరాసంగం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం సింగర్ సంధ్య పాటిల్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి బస్వారాజ్ పాటిల్ సతీష్ గౌడ్ రమేష్ గౌడ్ డప్పురు సంగమేష్ నందు పటేల్ శ్రీకాంత్ పటేల్ వేణుగోపాల్ రెడ్డి దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

రాజన్న సిరిసిల్ల టౌన్,నేటిదాత్రి:

గత వారం రోజుల నుండి సిరిసిల్లా జిల్లా చేనేత చౌక్ లో ప్రధాన రహదారిపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు.దీంతో
రహదారిలో వెళ్లే వాహనదారులకు గాని, బాటసారులకు గాని ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చేనేత చౌక్ లో ఓల్డ్ బస్టాండ్ సమీప నా ఎక్కువ రద్దీగా జనసంచారం ఉన్న ప్రదేశంలో సిగ్నల్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇదొక విడ్డూరమని చెప్పవచ్చు అని భావిస్తున్నారు. వాహనదారులకు గాని,బాటసారిలకు గాని ప్రమాదం తలెత్తకుండా వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభించిన మాజీ చైర్మన్.

ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభించిన మాజీ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిర్ చౌరస్తాలో నూతనంగా ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా షోరూం యజమాని మహేష్ ఆహ్వానం మేరకు ట్రెండీ వాల్కాస్ షోరూమ్ ను సందర్శించిన టిజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి తో అందరూ అభివృద్ధి చెందాలని అన్నారు వారితోపాటు ఈ కార్యక్రమంలో వారితోపాటు బిజీ సందీప్ వెంకట్ జగదీశ్వర్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దు.

ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

నెల రోజుల నుంచి కూలీ పనులు కల్పించడం లేదు పని చేసిన తర్వాత కొలతలు మేమే తీసుకోవాలి ప్రశ్నిస్తే మీ ఇష్టమున్న చోట చెప్పుకొండి అంటూ దబాయింపు ఎంపిడిఓ ముందు మొర పెట్టుకున్న కూలీలు
ఉపాధి హామీ పథకంలో తమకు సరిగా కూలీ పని కల్పించడం లేదని, పనిచేసిన తరువాత కొలతలు కూడా తమే చేసుకోవాల్సి ఉందని మం డల పరిధిలోని తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది ఉపాధి కూలీలు శుక్రవారం ఎంపిడిఓ సుధాకర్ కు మొర పెట్టుకు న్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుకు వ్యతిరేకంగా కూలీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తమ కు నెలరోజుల నుంచి సరిగా కూలీకల్పించడం లేదన్నారు. కప్పాడ్ గ్రామా నికి చెందిన వ్యక్తిని తమ గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించా దంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడన్నారు. పని విషయంలో ఏదైనా అడుగుతే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇష్టం ఉంటే చే యండే లేదంటే పని మానుకుండి తమకు దబాయిస్తున్నాడని వారు. వాపోయారు. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ కు ఎంపిడినో ఫోన్ చేసి ఆయన పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు పని కల్పించ కపోతే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరిం చారు. విధులకు సక్రమంగా హాజరు కానిఉపాధి హామీ ఈసి ప్రతాప్ రెడ్డిపై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్.

జహీరాబాద్‌లో ముస్లిం వివాహ మందిరం మరియు హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 1 కోటి వ్యయంతో ఆమోదించబడిన మినీ హజ్ హజ్ మరియు ముస్లిం వివాహ మందిరం యొక్క పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, మాజీ హజ్ కమిటీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, 2022 లో, జహీరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హజ్ హజ్ మరియు ఖూర్ (ఖోర్) శంకుస్థాపనను మాజీ బ్రిక్స్ ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు వేశారని, కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ, వాటి నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హజ్ గృహాల నిర్మాణ పనులను ప్రారంభించగా, ఇప్పటివరకు అది మెత్ కే పరిమితమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించాలని, జహీరాబాద్‌లోని ముస్లిం వివాహ మండపం, హజ్ గృహం పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని హజ్ కమిటీ మాజీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ డిమాండ్ చేశారు.

బండి బలం.. కమలం విజయం!

బండితోనే కమల వికాసం.

బండితోనే కమలనాధుల్లో ఊపు

బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి.

బండి మాటలతోనే యువత బిజేపి వైపు చూపు.

జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే.

అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశావాదం..

నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో నెలకొన్న అనుమానం.

పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం.

అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ చేరిన గెలుపు తీరం.

బిజేపిని గెలిపించి చూపిస్తా అన్నాడు.

కాంగ్రెస్‌ ను ఓడిరచి చూపించాడు.

టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.

ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి సంకేతం.

టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి సంకేతం.

మంత్రిగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం.

బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం.

బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ నేతల ఆకాంక్ష.

బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి చారిత్రక విజయం సాధించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని గెలిపించడంతో బిజేపి గొప్ప విజయాన్ని అందుకుంది. తెలంగాణ రాష్ట్రములోని బిజేపి నాయకులంతా అదే స్పూర్తిని అనురించాలి. తమ తమ రాజకీయ చతురతను, రాజకీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే తెలంగాణలో బిజేపి తిరుగులేని శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. వచ్చే ఎన్నికలలో నాటికి బిజేపి ఎదురులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓసారి లోతుగా విశ్లేషిస్తే మంత్రి బండి సంజయ్‌ చూపిన చొరవ అంతా ఇంతా కాదు. గత ఆరు నెలల కాలంగా ఒక్కో ఇటుకను పేర్చినట్లు తన ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేశాడని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఒక తార్కాణం. ఎన్నికలలో బండి వ్యక్తి గత రాజకీయానికి బిజేపి బలం తోడై కమలం విజయం ఉత్తుంగ తరంగంలా విజయకేతనం ఎగరవేసింది. తెలంగాణ బిజేపి నాయకులు, శ్రేణులు బండి సంజయ్‌ను కొనియాడుతున్నారు. అసలు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాదు, సరికొత్త చరిత్ర సృష్టించడం కూడా బిజేపికే చెల్లింది. నిజానికి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. కానీ యూనియన్లు పాలు పంచుకునే రాజకీయానికి కొత్త తరహా రాజకీయం కూడా చూపించింది బండి సంజయ్‌ అని చెప్పకతప్పదు. గతంలో ఇలా ఏ పార్టీ ధైర్యం చేయలేదు. టీచర్స్‌ ఎమ్మెల్సీలలో పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపే సాహసం చేయలేదు. బండి సంజయ్‌ అంటేనే ఒక సాహసం. ఒక ధైర్యం. నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. నలుగురికి దారి చూపించే సరికొత్త మార్గం వేసేవారికే సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. అది తెలంగాణ రాజకీయాలలో తన మార్క్‌ రాజకీయాన్ని చూపించి, విజయాన్ని సొంతం చేసిన ఏకైక నాయకుడు బండి సంజయ్‌. బండి సంజయ్‌ తోనే తెలంగాణలో బండితోనే కమల వికాసమని మరో సారి రుజువైంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా బండితోనే బిజేపికి ఊపు…బిజేపికి గెలుపు అని చెప్పకతప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బిజేపి రాజకీయాలలో బండి సంజయ్‌ కు ముందు, తర్వాత అని చెప్పడం కరక్ట్‌. గతంలో తెలంగాణలో బిజేపి ప్రభావం లేదని కాదు. ఆ పరంపరను కొనసాగించడమే కాదు, ఊపును తెచ్చి విజయ తీరాలను బిజేపి ఒంటరిగా అందుకునేలా బండి నాయకత్వం పని చేసింది. తెలంగాణలో సహజంగా హైదరాబాద్‌ లో బిజేపి ఎంతో కొంత కీలక భూమికనే పోషించేది. ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడూ జిహెచ్‌ఎంసిలో సీట్లు పది దాటింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కనీస ప్రభావం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్‌ రంగంలోకి దిగారో అప్పుడే సీన్‌ మారిపోయింది. బిఆర్‌ఎస్‌ కు సీన్‌ సితారైంది. బిజేపి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఒక్క అంశం చాలు. బండి రాజకీయం ఎలా వుంటుందో చెప్పడానికి…గత ఎన్నికల ముందు బండి దూకుడుకు ఎందుకు కళ్లెం వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఎన్నికల దాక బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వుండే ఆ రాజకీయాలే మరోలా వుండేవి. కాంగ్రెస్‌ పార్టీ అధికారపు అంచులను తాకేది కాదు. బిఆర్‌ఎస్‌ కు 39 సీట్లు వచ్చేవే కాదు. కానీ అనుకోని రాజకీయ ఎత్తుగడలు బండిని లాగేయాలని చూసినా, పార్టీ కోసం నిరంతరం పరిశ్రమించే నాయకుడు సంజయ్‌. ఇప్పటికీ మించి పోలేదు. బిజేపి నాయకుల చూపంతా బండి నాయకత్వం వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో సారి బండి చాతుర్యం సాక్ష్యంగా నిలిచింది. బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు కార్యకర్తలు మరింత బలంగా నమ్మడానికి కారణమైంది. తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి సంజయ్‌ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ యువతను బిజేపి వైపు మళ్లించడంలో బండిపోషించిన పాత్ర అందరికన్నా పెద్దది. ఒకప్పుడు బిజేపి చిన్న చిన్న పట్టణాలకే పరిమితం. ఇప్పుడు తెలంగాణ లో ప్రతి పల్లెల్లో బిజేపి జెండా ఎగురుతోంది. ప్రతి గ్రామంలో బిజేపి పార్టీ ఏర్పడిరది. ప్రతి ఊరులోనూ బిజేపి బలంగా మారుతోంది. జాతీయ నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిషాల జపం యువత చేస్తున్నారంటే ముమ్మాటికి అది బండి సంజయ్‌ కృషి అని చెప్పాలి. బండి మాటలతోనే యువత బిజేపి వైపు చస్తున్నారు. జాతీయ రాజకీయాల వైపు యువత ఆలోచనలు చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎర్ర జెండాలు కనిపించేవి. ఆ జెండాలు పోయి, అంతటా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బండి సంజయ్‌. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే బిజేపి అభ్యర్థుల ఎంపికపై ముందు అందరికీ అనుమానాలే వుండేవి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో బిజేపి శ్రేణులలో నిరాశావాదం ఆవహించింది. అంతెందుకు నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో అనుమానం అలాగే వుంది. కానీ బండి సంజయ్‌ ప్రచార రంగంలోకి దిగిన తర్వాత ఆ మాటలు మాయమై పోయాయి. పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వంతో కాంగ్రెస్‌ పార్టీ ఖంగుతిన్నది. బిజేపి ప్రచారంలో దూసుకుపోతుంటే అప్పుడే కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ గెలుపు తీరం చేర్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో మిగతా బిజేపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర అంతా ఒక ఎత్తు. బండి సంజయ్‌ సాగించిన ప్రచారం మరో ఎత్తు. ఎందుకంటే బిజేపిని గెలిపించి చూపిస్తా అని బండి సంజయ్‌ శపధం చేశాడు. బిజేపి అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్‌ ను ఓడిరచి చూపించాడు. టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి బండి నాయకత్వమే సంకేతం. టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం. జనం సమస్యల పరిష్కారమే బండి సంకల్పం. కేంద్ర మంత్రిగా వున్న వాళ్లు గతంలో కంటికి కనిపించే వారు కాదు. అధికారిక కార్యక్రమాలు తప్ప జనంలో నడిచింది లేదు. కారు దిగి ప్రజల వద్దకు వచ్చే వాళ్లు కాదు. కానీ బండి అలా కాదు. సికింద్రాబాద్‌ లో గుడి విషయంలో అలజడి నెలకొంటే జనం మధ్యలో వున్నారు. అశోక్‌ నగర్‌లో గ్రూపు అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తుంటే వారికి సంఫీు భావం తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా కాకుండా, ఒక బిజేపి సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి విజయం సాధించడం ఆ పార్టీకి ఎంతో ఊపునే కాదు, మరింత ఊపిరి పోసినట్లైంది. దాంతో బండి సంజయ్‌ పై బిజేపి నాయకులలో మరింత నమ్మకం పెరిగినట్లైంది. అందువల్ల బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో కోరుతున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా బలంగా విశ్వసిస్తున్నారు. కేంద్ర బిజేపి నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఈ సారి అధ్యక్ష ఎంపిక బండి సంజయ్‌కే అప్పగించాలని అనుకుంటోంది. మంత్రి పదవి బండి సంజయ్‌ కు అడ్డంకి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో వుండి కూడా బండి మంత్రిగా కొనసాగడం ఇబ్బంది ఏ మాత్రం కాదు. మంత్రిగా కొనసాగిస్తూనే బండికి అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను.

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలి

-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి

-రైతుల నష్టపరిహారంకై బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు

-ఈటల చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

National

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులతో కలిసి ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా ఎంతోమంది రైతులు భూములను కోల్పోయి నిరాశ్రయులవుతున్నారని, వారికి మార్కెట్ ధర కల్పించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒక ఎకరాకు మూడు కోట్ల రూపాయలను విలువచేసే భూములు కోల్పోతున్నప్పటికీ..వారికి తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇట్టి విషయంలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సందర్భంగా భూములను కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారని, ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భాజపా శ్రేణులు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి రైతులు అడ్డూరు రాజేందర్ సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రావు బండారు రవీందర్ బండారు శ్రీనివాస్ బండారు తిరుపతి కొల్లూరు స్వప్న గుర్ర సునంద రెడ్డి మోరే పద్మ శనిగరపు శ్రీనివాస్ మొగులపల్లి టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాల రైతులు పాల్గొన్నారు

వరంగల్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీ

“వరంగల్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీ” గా ఎస్. అంకిత్ కుమార్

వరంగల్, నేటిధాత్రి :

వరంగల్ పోలీస్ కమిషనరేట్ “ఈస్ట్ జోన్ డీసీపీ” గా అంకిత్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంకిత్ కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ట్రైనీ ఐ. పి. ఎస్ గా పని చేశారు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్న రవీందర్ ను సీఐడీ విభాగం ఎస్పీ గా బదిలీ అయ్యారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version