కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దేవరకద్ర /నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామాగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు.

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

Farewell Day Party

సింగరేణి ఉన్నత పాఠశాలలో 2024 /25 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు.

మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకు గౌరవాన్ని అందిస్తూ చదువు పూర్తి చేసుకుని పాఠశాలను వదిలి వెళుతున్న వారి కోసం ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యను అభ్యసించిన అందరూ పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభవం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా చదువు పైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. సింగరేణి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు యూనిఫాం పంపిణీ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం..

వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం

 

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండల కేంద్రంలోని వెలుగు మండల సమైక్య కార్యాలయంలో. బుధవారం ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు గాను మహిళల పాలాభిషేకం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎం రవి వర్మ మాట్లాడుతూ ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి మొన్న జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన సంధర్భంగా మహిళా స్వయం సహాయక సభ్యులతో చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాల గురించి వారితో మాట్లాడి సంతృప్తితో ఎస్ హెచ్ జి లకు వడ్డీ లేని ఋణం క్రింద రూ.100 కోట్లను మంజూరీ చేశారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెలుగు మండల సమాఖ్య మొగుళ్ళపల్లి సెర్ప్, డి.ఆర్.డి.ఏ మొగుళ్లపల్లి మండలం ఆధ్వర్యంలో. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ మినిస్టర్ సీతక్క, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ. 10 కోట్లు మంజూరీ కాగా మొగుళ్లపల్లి మండలానికి క్రింది విధంగా మంజూరీ కావడం జరిగింది.మండలంలో మొత్తం 657 సంఘాలకు ఒక కోటి ఆరు లక్షల తొంబై ఏడు వెయ్యిల రెండు వందల తొంబై నాలుగు రూపాయలు సంఘాల ఖాతాలలో పడడం జరిగినది. మహిళా సంఘ సభ్యులకు అందించిన ముఖ్య మంత్రి, పంచాయితీ రాజ్ గ్రామీణభివృద్ధి శాఖా మంత్రి , సి.ఈ.ఓ, సెర్ప్, మండల మహిళలు అందరి తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది గాజుల బాబురావు, బత్తిని శ్రీనివాస్, బత్తిని ప్రవీణ్, పసరగొండ రేవతి, వివో ఏలు శ్రీరామ్ తిరుపతి, లలిత, పావని, రమాదేవి, రమ్య, శ్రీకాంత్, బాలకృష్ణ, వివిధ గ్రామాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

గంగ్వార్ గ్రామంలో నీటి కొరత.!

గంగ్వార్ గ్రామంలో నీటి కొరత..

జహీరాబాద్.నేటి ధాత్రి:

సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలోని 1వ వార్డ్ లో గత ఏడునెలల నుంచి నీటికొరత ఏర్పడుతుంది. బోరు చెడిపోయి ఏడునెలలు గడుస్తున్నా ఏఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. ఈ విషయంపై అధికారులకు చాలా సార్లు గ్రామస్థులు వినవించుకొన్న పటించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నీటి సమస్యను తీర్చాలని మండల బీజేపీ అధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు.

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం.!

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం ముష్టి వేసినట్లు 3.6 శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన ఈ బడ్జెట్ బీసీలకు ఏ విధంగా..ఏ మేరకు..ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చెప్పాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసిన మీరు..బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని..ఇది వివక్షత కాదా..? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడ్జెట్ ను సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు.!

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి.

జహీరాబాద్.నేటి ధాత్రి:

ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే మాస్టర్ సిద్దు స్వామి10వ తరగతి విద్యార్థునులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు పదవ తరగతి విద్యార్థునులకు పరీక్ష ప్యాడులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.!

సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామానికి చెందిన బాధితులకు
గురువారం ఉదయం ముఖ్య మంత్రి సహయనిధీ
చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల
అధ్యక్షుడు రామలింగారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం.!

మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం..

—కె.మాణిక్ఆవు, ఎమ్మెల్యే, జహీరాబాద్

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథ కాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నది. సంగమే శ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరా బాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగు డంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామా ల్లోని 1,03,259 ఎకరాలకు సాగు నీరందిం చేందుకు లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ హయాంలో భూమి పూజ చేశాం. మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడలో పంపుహౌస్ కోసం భూమి పూజ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వర ఎత్తిపోతల పథ కాన్ని అడ్డుకుంటున్నది. వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అనేకసార్లు దీనిపై అసెంబ్లీలో విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జహీరాబాద్ ప్రాంత నిరుద్యోగు లకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడుతున్న నిమ్స్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.

రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యం కలి గిన రంగాలకు నిధులు కేటా యింపు ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రా మిక రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర బలహీనవర్గాలకు కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుతం ఇచ్చిన నిధులతోనైనా సకాలంలో పనులు చేపడితేనే ప్రజలకు ప్రయోజనం కలుగు తుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో నిష్ణా ప్రాజెక్టు తోపాటు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధు లను విస్మరించారు.

Construction of Ram Temple is greatest acheivement

• Centuries problem resolved

• BJP roots in Janasangh

• Shyama Prasad Mukharji established Janasangh in 1951

• Three party alliance formed in 1977 in the name of Jantaparty

• Fall of Janata Government in 1979

• Since 1984 BJP gradually strengthened

• In 1999 alliance government formed under the leadership of Atal Bihari Vajpayee

• In 2014 BJP attained full majority under the leadership of Narendra Modi

Construction of Ram Temple in Ayodhya is one of the most important promises fulfilled by Bharatiya Janataparty. Like that centuries old religious-dispute which began in Moghul era came to an end and culminated BJP fulfilling decades old poll promise. Not only party succeeded in concluding the dispute and now successfully completed the construction of the temple, which facilitated the holistic development of town Ayodhya. Being prevailed problem for centuries everybody has doubt on this achievement. But Narendramodi finally achieved this success without any hesitation. Some decades back he vowed not to enter into Ayodhya till the construction of Ram Mandir made. Now his vow fulfilled. This achievement not only confined to him but for entire Hindus in the country. In the month of October 2023 he made an announcement regarding the construction of the temple and in 2024, January, 22nd Grand Ram Temple dedicated to millions of devotees around the world with Prime Minister Narendra Modi presiding over the ‘pranprathista’ as the main ‘yagnam’. 

During 2024 election campaign Narendra Modi toured around the country and gave much attracted slogan ‘achieve 400 seats’. This gave a chance to Congress led INDIA alliance to counter it by misinterpreting it that if NDA is given such majority, SC/ST/BC reservations will be abolished. This negative campaign got its impact on voters especially in UP people who gave their verdict against BJP which led to loss of most of the seats won during previous elections. Now with 293 seats NDA alliance has been ruling the country. N. Chandrababu Naidu and Nitish Kumar parties are extending their support the BJP government.

Bharatiya Janataparty

BJP is a Hindu Nationalist party that formed after Independence. During early years it had strong roots in higher casts in North India. Later party began to fill various party positions with people belong to BCs and tried to prove it as a party of all people. Like that it gradually succeeded in achieving the confidence among the other casts people. Like that its movement began and finally in the years 2014, 2019 and 2024 it attained power in the centre.

The roots of BJP

BJP has its roots in Janasangh which is treated as political wing of RSS. It was established in 1951 by Dr. Shyama Prasad Mukharji. Since then it continued its activities and by 1967 succeeded in achieving considerable strength in some seats in North India. Under the leadership of Atal Bihari Vajpayee Janasangh merged with two other parties and formed Janata party in 1977. Unfortunately power struggle and conspiracy politics inside the party led to fall of the Government in the year 1979. Later the other parties leaders in the Janata party demanded, Janasangh MPs should not participate in RSS activities. This led to tussle in the party and Janasangh came out and transformed into a new party called Bharatiya Janata Party in the year 1980. Atal Bihari Vajpayee, Lalkrishna Advani and Murali Manohar Joshi led the party. They had successfully exposed the minority appeasing policies of Congress party under the cover of ‘Secularism’. At the same time they run their politics mainly concentrating on the construction of Ram Temple at the disputed site in Ayodhya. This campaign facilitated Hindus to get consolidated which caused BJP to achieve 120 seats in 1991 elections.

Finally on 6th, December 1991 the monument at disputed site was demolished and entire country left in dumb stick with this incident. Like that there was another step forward in resolving the problem. Before that BJP stalwart L.K. Advani conducted ‘Rathayatra’ in North India which created vibrations throughout the country which facilitated BJP to gain the recognition in National level through gradually increasing its strong base. In overall this Ramjanmabhoomi movement started generating nation wise buzz ultimately proved to be inflection point for BJP. Palmpur resolution in 1989 for the temple cause made BJP then led by LK Advani aligns with it in his quest for relevance in a landscape dominated by Congress. This pivotal decision imparted a definitive Hindutva edge to the party politics, providing it with a compelling cause celebrate that had been absent till then. At the same time BJP also succeeded in exposing how the political parties greatly neglecting the majority Hindus under the cover of Secularism. With this rigorous campaign most of the Hindus began to realise the importance of construction of Ram Temple in Ayodhya.

Became large party in 1996

In months of April and May 1996 General Elections held in three phases. In these elections BJP won 161 seats and became large party among other parties. Then President Shankara Dayal Sharma invited Atal Bihari Vajpayee to form the Government as the leader of largest party in Lok Sabha and gave 15 days to prove his majority. Vajpayee took the sworn as Prime Minister on 15th, May. Later he tried to make alliance with other parties but not succeeded. Then he realised that instead of facing the no-confidence motion and decided to resign. On 13th day he resigned as Prime Minister. Immediately under the leadership of H.D. Devegowda UPA government formed but ultimately collapsed within a year. Next in 1997 under the leadership of Indrakumar Gujral government formed but its life also ended within one year. This instability caused elections in 1998. This time BJP contested in 338 seats against 471 seats in 1996 elections. This time party had shown better performance by winning 182 seats, still long distance away from simple majority. Event alliance government formed within one year it collapsed. Again in 1999 elections held in which BJP managed to won in 182 seats as like in previous elections. This time with forming strong alliance group party was able to form government under the leadership of Atal Bihari Vajpayee. This time Vajpayee government run in full tenure. During 2004 elections NDA group defeated and UPA government formed under the leadership of Manmohan Singh. This government ruled the country in two terms. In these elections BJP lost its seats and won in only 138 seats. Even in the next elections party performance became poor further deteriorating its seats tally in the parliament.

The advent of Narendra Modi

By the time of 2014 elections people were fed up with the rule of UPA Government. Then BJP announced Narendra Modi as its Prime Minister candidate who served as Chief Minister of Gujarat for long period. This time in the months of April and May elections held in phase wise manner. In these elections under the leadership of Narendra Modi BJP recorded great victory by achieving 282 seats which are more than majority mark 272. After a long time this was the first time a single party got full majority. Other NDA partners gained 54 seats. Like that stable government formed in the centre. On 26th, May 2014 Narendra Modi sworn in as Prime Minister.

The progress journey of BJP

If we observe since its split from Janata Party the political journey made by BJP is nothing but a history of success. In 1984 (8th Lok sabha) BJP had only two sets. In 1989 elections (9th Lok Sabha) its seats tally raised to 89 seats. The Rathyatra taken up by L.K. Advani was the main cause for this success. In 1991 (120), in 1996 (160), in 1998 (182), in 1999 (182), in 2004 (138), in 2009 (116) {In these two elections BJP lost its seats with its weak performance}. In 2014 party won 282 seats, in 2019 (303) finally in 2024 it confined to 240 seats only. But with the support of Chandrababu Naidu and Nitish Kumar under the leadership of Narendra Modi NDA rule has been continuing.

రామాలయ నిర్మాణం గొప్ప విజయం

శతాబ్దాల సమస్యను పరిష్కరించి రామాలయ నిర్మాణం

భాజపా మూలాలు జనసంఫ్‌ులో

1951లో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్థాపించిన జనసంఫ్‌ు

1977లో మూడు పార్టీలు కలయికతో జనతాపార్టీ ఆవిర్భావం

1979లో కుప్పకూలిన జనతా ప్రభుత్వం

1984 నుంచి క్రమంగా పార్టీ బలోపేతం

1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ సాధన

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్యలో రామమందిర నిర్మాణ వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకురావడమే కాకుండా, అక్కడ నూతన రామాలయ నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టి, భారతీయ జనతాపార్టీ హిందువులకు ఇచ్చిన అతిముఖ్యమైన హామీని నెరవేర్చింది. నిజానికి ఇక్కడ రామమందిర నిర్మాణం జరుగుతుందా? అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న. అటువంటి దాన్ని ఎటువంటి శషభిషలకు తావులేకుండా సాధించి చూపారు నరేంద్ర మోదీ. కొన్ని సంవత్స రాల క్రితం ఆయన, రామమందిర నిర్మాణం జరిగిన తర్వాతనే అయోధ్యలో అడుగుపెడతానన్న శపథాన్ని నెరవేర్చారు. 2023 అక్టోబర్‌ నెలలో రామమందిర నిర్మాణం విషయం ప్రకటించి, 2024 జనవరినెలలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. 2024 పార్లమెంట్‌ ఎన్నిక ల్లో ఆయన రామమందిర నిర్మాణాన్నే ప్రధాన సమస్యగా ముందుకు తెచ్చి, ఈసారి 400 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉధృతంగా ప్రచారం సాగించారు. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమి, 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే, రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ దుష్ప్రచారం చేయడం తో ప్రజల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఓటర్లలో అనుమానాలు బలంగా నాటుకొని, బీజేపీకి వ్యతిరే కంగా ఓట్లు వేయడంతో, ఎన్డీఏ కూటమి సీట్లు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గి 293కు మాత్రమే పరిమితమయ్యాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, నితిష్‌కుమార్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీల దన్నుతో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పాలన సు స్థిరంగా కొనసాగుతోంది. 

భారతీయ జనతాపార్టీ

స్వాతంత్రానంతరం ఏర్పడిన భారతీయ జనతాపార్టీ హిందూ జాతీయవాద పార్టీ. ప్రధానంగా ఉత్తర భారతదేశానికి చెందిన అగ్రకులాలవారు ఈ పార్టీకి అనుకూలం. ఈ అపప్రథనుంచి బయటపడి ఇతర వర్గాల్లో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి, వెనుకబడిన వర్గాల వారికి పార్టీ కీలకస్థానాల్లో అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఈవిధంగా తాను కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే కాదని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే పార్టీగా ప్రజల్లో క్రమంగా పేరు సంపాదించుకుంది. ఆవిధంగా క్రమంగా ఎదుగుతూ వచ్చిన పార్టీ 2014, 2019 మరియు 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించి దేశ పాలనను కొనసాగిస్తోంది. బీజేపీ మూలాలు

ప్రస్తుత భారతీయ జనతాపార్టీ మూలాలు 1951 నాటి జనసంఫ్‌ులో వున్నాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ విభాగంగా 1951లో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జనసంఫ్‌ును స్థాపించారు. 1967 ఎ న్నికల్లో ఉత్తరభారతదేశంలో జనసంఫ్‌ు గుర్తించదగిన స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకుంది. తర్వాత అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో మరో మూడు పార్టీలతో కలిసి ‘జనతాపార్టీ’ ఏర్పా టైంది. ఇందిరాగాంధీ నేతృత్వంలోని ఇందిరా కాంగ్రెస్‌ను ఓడిరచి 1977లో అధికారంలోకి వ చ్చిన జనతాపార్టీ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటల కారణంగా 1979లో కుప్పకూలిపోయింది. తర్వాత జనతాపార్టీలో భాగంగా వున్న భారతీయ జనసంఫ్‌ు ఎంపీలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గనకూడదంటూ మిగిలిన పార్టీల నాయకులు పట్టుపట్టడంతో, జనతాపార్టీ ముక్కలుగా చీలిపోయింది. ఆవిధంగా 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ కొత్త పార్టీ కి అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్‌ జోషీలు నేతృత్వం వహించారు. వీరు క్రమంగా సెక్యులర్‌ ముసుగులో కాంగ్రెస్‌ పార్టీ సాగిస్తున్న మైనారిటీ బుజ్జగింపు రాజకీ యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అంతేకాదు అయోధ్యలోని రామ జన్మభూమి ప్రదేశంలో మొఘల్‌ రాజు బాబర్‌ నిర్మించిన కట్టడం స్థానంలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న ప్రధానలక్ష్యంతో రాజకీయాలు నడిపారు. అంతేకాదు ముక్కలు చెక్కలుగా వున్న హిందూ ఓటర్లను సంఘటితం చేసి ఒకేతాటిపైకి తీసుకొని రావడానికి ఈ ముగ్గురు నేతలు ఎంతో కృషిచేశారు. అ యోధ్య రామమందిరం సమస్య దేశంలోని హిందువులను సుసంఘటితం చేసేందుకు ఎంతగా నో దోహదం చేసింది. ఫలితంగా అప్పటివరకు లోక్‌సభలో కేవలం రెండు సీట్లకే పరిమితమైన పార్టీ 1991 ఎన్నికల నాటికి పార్లమెంట్‌లో 117 స్థానాలకు ఎదిగింది. అదే ఏడాది ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

నిజానికి 1992, డిసెంబర్‌ 6వ తేదీన అయోధ్యలో అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి పరి ష్కారంలో మరో అడుగు ముందుకు పడిరది. అంతకు ముందు భాజపా సీనియర్‌ నేత అయిన లాల్‌కృష్ణ అద్వానీ నేతృత్వంలో జరిపిన రథయాత్రకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం లభించడమే కాదు, బీజేపీ బలీయమైన పార్టీగా ఎదగడానికి దోహదం చేసింది. అంతేకాదు రథయాత్ర పుణ్యమాని కుహనా సెక్యులర్‌ పార్టీల దాగుడుమూతల రాజకీయాలు, హిందువులను ఓట్లకోసం చీల్చి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న విధం ప్రజలకు బాగా అవగాహనకు వచ్చింది. అ యితే ఇది పూర్తిస్థాయిలో రానప్పటికీ, చాలావరకు చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు తరతరాలుగా హిందువులు తమ ఆరాథ్య దైవంగా పూజించే రాముడికి అయోధ్యలో మందిరం నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించిన హిందువులు జాగృతమయ్యారు. 

1996లో అతిపెద్ద పార్టీగా అవతరణ

1996 ఏప్రిల్‌ 27, మే 2, 7 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ లోక్‌సభలో 161 సాధించి పెద్దపార్టీగా అవతరించింది. కానీ అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మెజారిటీ లేదు. అయితే అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ, అతిపెద్ద పార్టీగా అవత రించి బీజేపీ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. మే 15న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా పదవీ స్వీకారం చేశారు. సభలో మెజారిటీ నిరూపిం చుకునేందుకు రాష్ట్రపతి 15 రోజుల అవకాశాన్నిచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం లోక్‌సభలో ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించింది కానీ సఫలీకృతం కాలేదు. దీంతో అవి శ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేకంటే, రాజీనామా చేయడమే ఉత్తమమని భావించిన వాజ్‌పేయి 13వ రోజున తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత హెచ్‌.డి. దేవెగౌడ నేతృత్వంలో ఏడాదికా లం, 1997లో ఇంద్రకుమార్‌ గుజ్రాల్‌ నేతృత్వంలో మరో ఏడాది పాటు యునైటెడ్‌ ఫ్రంట్‌ పాలన సాగించినా ఆయా ప్రభుత్వాలు పడిపోవడంతో 1998లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అయితే 1996లో 11వ లోక్‌సభ ఎన్నికల్లో 471 స్థానాలకు పోటీచేసిన భారతీయ జనతాపార్టీ, 1998లో 12వ లోక్‌సభ ఎన్నికల్లో 388 సీట్లకు పోటీచేసింది. ఈసారి పార్టీ182 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఏడాదిలోనే కుప్పకూలింది. ఫలితంగా 1999లో మళ్లీ 13వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ సారి కూడా బీజేపీ 182 సీట్లనే సాధించినప్పటికీ, వివిధ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయ డం ద్వారా అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో నేషనల్‌ డెమోక్రటిక్‌ ఆలయన్స్‌ ప్రభుత్వం 2004 వరకు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. ఈ ఏడాది 14వ లోక్‌సభకు జరిగిన ఎ న్నికల్లో బీజేపీ బలం గణనీయంగా తగ్గిపోయింది. అప్పటివరకు 182 సీట్లున్న పార్టీ, కేవలం 138 స్థానాల్లోనే గెలుపు సాధించింది. ఫలింగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. ఆవిధంగా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా యుపీఏ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలో కొనసాగింది. అంటే పదేళ్లపాటు 2014 వరకు యూపీఏ అధికారంలో వుంది. 

నరేంద్ర మోదీ నేతృత్వంలో తిరిగి అధికారంలోకి…

2014 నాటికి దేశంలో యుపీఏ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారు. అప్పటివరకు సుదీర్ఘ కాలంగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీని, బీజేపీ ఈసారి ఎన్నికల్లో ప్రధా ని అభ్యర్థిగా ప్రకటించింది. అదే ఏడాది ఏప్రిల్‌`మెనెలల్లో అనేక విడతలుగా జరిగిన ఎన్నికల్లో దేశంలో భారతీయ జనతపార్టీ అప్రతిహత విజయం నమోదు చేసి అధికారాన్ని చేపట్టింది. విశే షమేంటంటే ఈ ఎన్నికల్లో పార్టీ 282 స్థానాల్లో విజయం సాధించడం. అంటే పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే ఎన్డీఏ కూటమిలోని మిగిలిన పార్టీలు మరో 54 స్థానాల్లో విజయం సాధించడంతో చాలాకాలం తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైంది. 2014 మే 26న నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. 

బీజేపీ అభివృద్ధి ప్రస్థానం

జనతాపార్టీనుంచి విడిపోయి భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే బీజేపీ క్రమానుగతంగా బలాన్ని పెంచుకుంటూ చివరకు మెజారిటీ స్థానాలను గెలుచుకునే దశ కు చేరుకోవడాన్ని గమనించవచ్చు. 1984లో (8వ లోక్‌సభ) బీజేపీకి లోక్‌సభలో కేవలం 2 సీట్లు మాత్రమే వుండేవి. 1989 (9వ లోక్‌సభ)లో పార్టీ ఏకంగా 89 సీట్లను గెలుచుకోగలిగింది.ఇందుకు ప్రధాన కారణం లాల్‌కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర మరియు ఆయన వ్యూహాత్మక నాయకత్వం. ఇక 1991లో 120, 1996లో 161, 1998లో 182, 1999లో 182,2004లో 138, 2009లో 116 సీట్లు (ఈ రెండు టర్మ్‌ల్లో పార్టీ సీట్లు క్రమంగా తగ్గిపోవడం గమనార్హం), 2014లో 282 (సొంతంగా మెజారిటీ సాధన), 2019లో 303, 2024లో 240 స్థానాల్లో గెలుపు సాధించింది. పార్టీ క్రమంగా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే, ఒక స్పష్టమైన వ్యూహాత్మక వైఖరితో నాయకత్వం పార్టీని ముందుకు నడిపిందని అర్థమవుతుంది. మిగిలిన పార్టీల్లో ఈవిధమైన క్రమానుగత వృద్ది కనిపించదు. వస్తే అధికారంలోకి రావడం లేదా కుప్పకూలిపోవడం. ఈ రెండిరటిలో ఏదో ఒకటి మాత్రమే జరిగేది. ఒకటి రెండుసార్లు ఎన్నికల్లో దెబ్బతిన్నా విశ్లేషించుకొని మరింత బలంగా ముందుకు వెళ్లడం పార్టీ బలీయమైన సంస్థాగత నిర్మాణాన్ని వెల్లడి చేస్తోంది.

‘‘పవన్‌’’కు ఇచ్చిన పదవి..’’వర్మ’’ పెట్టిన బిక్ష!

 

`పిఠాపురంలో పవన్‌ ఒంటరిగా పోటీ చేయలేదు.

`టిడిపి బలంగా వున్న పిఠాపురంను పవన్‌ ఎంచుకున్నాడు.

`వర్మను బ్రతిమిలాడి సీటు కోరుకున్నాడు.

`చంద్రబాబును ఒప్పించి, వర్మను మెప్పించి తీసుకున్నారు.

`వర్మ ముందు వంగి వంగి ఆశీర్వాదం తీసుకున్నాడు.

`పవన్‌ కోసం వర్మ ఇళ్లిళ్లు తిరిగి ప్రచారం చేశారు.

`వర్మ కుటుంబమంతా తమ శ్రమను దారపోశారు.

`ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని తెలిసినా సహకరించారు.

`పార్టీ కోసం వర్మ ఎవరూ చేయని త్యాగం చేశారు.

`వర్మ స్థానంలో మరెవరున్నా పవన్‌కు సీటు వచ్చేదే కాదు.

`వర్మ రెబల్‌ గా పోటీ చేస్తే పవన్‌కు డిపాజిట్‌ కూడా వచ్చేది కాదు.

`వాపు ఎప్పుడూ బలుపు కాదు.

`టిడిపి పొత్తు లేకుంటే జనసేనకు బతుకే లేదు.

`21 టిక్కెట్లు ఇచ్చినా జనసేన పోటీ చేసేందుకు అభ్యర్థులు దిక్కులేరు.

`వైసిపి నుంచి అరువు తెచ్చుకుంటే తప్ప అభ్యర్థులు దొరకలేదు.

`ఒంటరిగా నిలిచి గెలిచిన చరిత్ర జనసేనది కాదు.

`జనసేన కోసం 21 మంది టిడిపి నాయకులు బలయ్యారు.

`వారి త్యాగాలతో జనసేన అభ్యర్థులు గెలిచారు.

`టిడిపి త్యాగాల మీద జనసేన పదవులు అనుభవిస్తున్నారు. 

`పదవులు ఇవ్వాల్సి వస్తే టిడిపి త్యాగధనులకు ఇవ్వాలి.

`పొత్తు పేరుతో ఇప్పటికే అర్హతకు మించి జనసేన లాభం పొందింది.

`ఇంకా ఒక్క పదవి జనసేనకు ఇచ్చినా టిడిపి నాయకులకు అన్యాయమే!

`పాముకు ఎంత పాలు పోసినా విషమే కక్కుతుంది.

`జనసేనకు ఇంకా ప్రాధాన్యత ఇస్తూ పోతే టిడిపి మునుగుతుంది.

`జనసేనకు సైనికులే సక్కగ లేరు.

`సినిమా అభిమానులంతా కార్యకర్తలు కాదు.

`జనసేనకు జనంలో ఆదరణే లేదు.

`ఇప్పటికీ మించి పోలేదు.. జనసేన చెవులు పిండకపోతే టిడిపికి మేలు జరగదు. 

`ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి సామెత నిజం చేసుకోవద్దు

                            హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏపిలో కూటమి ప్రభుత్వంలో ఆరని మంటలు రాజేశాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనుద్దేశించి పరోక్షంగా నాగబాబు మాటలు తెలుగుదేశం శ్రేణుల్లో కలకలం రేపాయి. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ఆజ్యం పోసినట్లుగా ఏపి. డిప్యూటీ సిఎం. పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. జనసేన నిలబడడమే కాకుండా, నలభైఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ చేసిన పవన్‌ మాటలు మరింత మంటలు రేపాయి. అవి ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేవు. ఎందుకంటే తాను చేసిన వ్యాఖ్యల్లో అంతర్ధాం అది కాదన్న మాట ఇప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ చెప్పలేదు. ఆ మాటలకు పరోక్షంగా కట్టుబడి వున్నట్లుగానే ఆయన వ్యవహార శైలి వుండడం వల్ల తెలుగు తమ్ముళ్లలో కలవరం మొదలైంది. అక్కున చేర్చుకొని అందలమెక్కిస్తే తమకు పవన్‌ గుణపాఠం నేర్పాడంటూ, తనంటే మరోసారి రుజువు చేశాడని తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమౌతున్నారు. సరిగ్గా 2014 ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీకి పవన్‌ కళ్యాణ్‌ మద్దతిచ్చారు. ఆ సమయంలోనూ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రదాన కారణం జనసేన అని అప్పట్లోనే ఆయన బహిరంగంగా అనేక వేధికల ద్వారా చెప్పారు. తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీని, ఇటు బిజేపిని కూడా ఆయన అనేక సార్లు తూర్పార పట్టారు. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని శపథాలు చేశాడు. ఏకంగా ఆ సమయంలో మంత్రి లోకేష్‌ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడంటూ విమర్శలు గుప్పించిన ఘనత పవన్‌ కల్యాణ్‌ది. 2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసిన జనసేనాని తెలుగు దేశం పార్టీ తన అభ్యర్ధులకు కోట్ల రూపాయలు ఎలా సమకూర్చిందంటూ ప్రశ్నించారు. ఇలా అడుగడుడునా తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తూ, ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో 2014 ఎన్నికల్లో 60 సీట్లతో ప్రతిపక్ష హోదా సంపాదించున్న వైసిపి, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ మీద పవన్‌ చేసిన ఆరోపనలు కూడా కారణమయ్యాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిపోరుతో ఒక్క సీటు కూడా గెలవని పవన్‌ కళ్యాణ్‌ కూటమితో జతకట్టి మొదటిసారి ఎన్నికల్లో గెలుపొందారు. కాని ఆ విశ్వాసాన్ని పది నెలల్లోనే మర్చిపోయారు. విశ్వాస ఘాతుకానికి మరోసారి తెరతీశారు. పిఠాపురం సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను అప్పుడే పవన్‌ ఖండిస్తే పరిస్దితి వేరుగా వుండేది. లేకుంటే నలభై ఏళ్ల టిడిపిని గెలిపించామని అనకపోయినా బాగుండేది. కాని అన్నదమ్ములిద్దరూ ముందే అనుకొని ఆ సభలో మాట్లాడినట్లు అర్ధమౌతోంది. తెలుగుదేశం పార్టీ తమ మీదే ఆదారపడి గెలిచిందని పరోక్షంగా పవన్‌ సంకేతాలు పంపినట్లైంది. కాని అది నిజమేనా? అంటే జనసైనికులు కూడా ఒప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఒక్కమాటలో చెప్పాలంటే జనసేన సభకు తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే ఆ సభ సక్సెస్‌ అయ్యేదా? ఇప్పుడు పవన్‌ కళ్యాన్‌ అదే పిఠాపురంలో మరో సభ నిర్వహించగలరా? నిజంగానే పవన్‌ పిఠాపురంలో తన స్వశక్తి మీదే గెలిచారా? వర్మ ఆ సీటును వదులకోవద్దని అనుకుంటే పవన్‌కు దక్కేదా? వర్మ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేస్తే పవన్‌కు కనీసం డిపాజిట్‌ దక్కేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పిఠాపురంలో పవన్‌ గెలుపు ముమ్మాటికీ తెలుగుదేశంనాయకుడు వర్మ పెట్టిన బిక్ష అని చెప్పకతప్పదు. ఆయన ఒక వేళ నాకెందుకు అని ప్రచారానికి మానుకున్నా పవన్‌ గెలుపు ఎప్పుడో గందరగోళంలో పడేది. వర్మ కనుసైగ చేస్తే ఆ ఓట్లు మరో పార్టీకి పడేవి. కాని ఆయన ఎంతో నిబద్దతతో పొత్తు ధర్మాన్ని పాటించారు. ఆ ఎన్నికల్లో తాను పోటీచేసినప్పుడు ఎలా ప్రచారం చేస్తారో అలాగే చేశారు. అంతే చిత్తశుద్దితో పనిచేశారు. ఎన్నిక నాది కాదన్న ఆలోచన ఆయనలో ఏ కోశాన కనిపించలేదు. అసంతృప్తి అసలే చెందలేదు. అందుకే ఆయన కుటుంబం మొత్తం పవన్‌ గెలుపుకోసం పనిచేశారు. వర్మ కుమారుడు కూడా ఎంతో కష్టపడి పవన్‌ను గెలిపించారు. వర్మ సతీమణి కూడా పవన్‌ గెలుపులో కీలకభూమిక పోషించారు. ఇలా వర్మకుటుంబం మొత్తం పనిచేసి పవన్‌ను గెలిపించారు. గెలిచిన తర్వాత పవన్‌ తన కృతజ్ఞతను కూడా తెలిపారు. ఆ సంగతి పవన్‌ మర్చిపోయినట్లున్నారు. వర్మ నుంచి ఆశిర్వాదం తీసుకున్నారు. తన గెలుపు బాధ్యతను తీసుకున్న వర్మ త్యాగాన్ని ఆనాడు పవన్‌ ఆకాశానికెత్తాడు. జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పాడు. కాని పట్టు మని పది నెలలు గడవకముందే నాగబాబు తన వైఖరిని చూపించారు. పిఠాపురంలో పవన్‌ గెలుపు నావల్లనే అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ మాట్లాడడం కూటమి మధ్య బీటలు తెచ్చిపెట్టింది. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయమేమిటంటే పవన్‌ పిఠాపురంలో జనసేన అభ్యర్ధిగాకంటే కూటమి అభ్యర్ధిగానే పోటీచేశారు. జనసేనకు పిఠాపురంలో కనీసం పార్టీ యంత్రాంగం కూడా లేదు. అక్కడ ఇల్లు లేదు. పవన్‌ లోకల్‌ కూడా కాదు. అయినా ప్రజలు ఆదరించారంటే పవన్‌ను చూసికాదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మను చూసి మాత్రమే ఓట్లేశారు. పవన్‌ను గెలిపించారు. గోదావరి జిల్లాలో టిడిపి బలంగా వున్న పిఠాపురంను పవన్‌ ఎంచుకోవడంలో కూడా ఒక కారణం వుంది. ఆయన గెలవాలంటే టిడిపి బలంగా వున్న నియోకవర్గం ఎంచుకోవాలని ముందు నుంచి లెక్కలేసుకున్నాడు. పిఠాపురంలో పోటీచేస్తే తెలుగుదేశం మద్దతు పూర్తిగా అందుతుందని తెలుసుకున్నాడు. అందుకే ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. వర్మను బ్రతిమిలాడి ఆ సీటును తెచ్చుకున్నాడు. వర్మ ముందు వంగి వంగి దండాలు పెట్టి తెచ్చుకున్నాడు. పవన్‌ కళ్యాన్‌ అసలు నిజ స్వరూపం వర్మకు పూర్తిగా తెలుసు. అయినా పార్టీ కోసం వర్మ త్యాగంచేశారు. అదే సమయంలో శాసనసభ్యుల ఎమ్మెల్సీలలో మొదటి అవకాశం వర్మకే ఇస్తామని చంద్రబాబు కూడా హమీ ఇచ్చారు. కాని ఆ హమీని కూడా అందకుండా పవన్‌ పరోక్షంగా తన అన్నను తెచ్చిపెట్టాడు. వర్మకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నాడు. పిఠాపురంలో వర్మ ఎమ్మెల్సీగా వుంటే తన ప్రతాపం చెల్లదని గ్రహించాడు. తన నాయకత్వానికి నష్టం జరుగుతుందని తెలుసుకున్నాడు. అంందుకే పిఠాపురంలో మరో నాయకుడు లేకుండా చేయాలన్న ఆలోచనతో, నాగబాబుకు ఎమ్మెల్సీ ఇప్పించాడు. నిజానికి పార్టీ కోసం ఎవరూ చేయని త్యాగం వర్మ చేశారు. ఎందుకంటే ఆయన అప్పటికే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. అలాంటి వర్మ సీటు కోరుకోవడం పవన్‌ తప్పు. ఆ సీటును టిడిపి పవన్‌కు కేటాయించడం కూడా స్వయంకృతాపరాధమే అని చెప్పాలి. వర్మ స్దానంలో మరో నాయకుడు ఎవరున్నా పవన్‌కు పిఠాపురం సీటు వచ్చేదే కాదు. అయినా వర్మచేసిన త్యాగాన్ని ఎగతాలి చేసిన నాగబాబు వాపును చూసి బలపనుకుంటున్నాడు. అసలు టిడిపికి జనసేనతో పొత్తు లేకున్నా అధికారంలోకి వచ్చేది. కాని ప్రభుత్వ ఓటు చేలకుండా సాయపడతా అని ఉడతా భక్తి చూపించి, మొత్తం నేనే చేశానంటూ పవన్‌ చెప్పుకోవడానికి తెలుగు తమ్ములు జీర్ణించుకోకుండా చేశారు. అసలు టిడిపితో పొత్తు అనేదిలేకుంటే, కూటమి అనేది కట్టకపోతే జనసేనకు బతుకేలేదు. ఈసారి కూడా పోటీచేసే పరిస్దితి వచ్చేది కాదు. ఆ విశ్వాసం జనసేనానికి లేకుండాపోయిందనేది అర్దమౌతోంది. జనసేనకు ఎంతో ఉదారతో 21 సీట్లు ఇచ్చినా కనీసం ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్ధులకే దిక్కులేని పార్టీ. వైసిపి నుంచి అరువు తెచ్చుకుంటే తప్ప పోటీకి అభ్యర్దులు దొరకలేదు. వైసిసి వద్దనుకొని, వదిలేసిన నాయకులను తెచ్చుకొని పోటీచేయించుకున్నాడు. అదికూడా టిడిపి దయతో వాళ్లంతా గెలిచారు. అది వాళ్లు మర్చిపోలేదు. కాని పవన్‌ మర్చిపోయారు. నాగబాబు అంతకన్నా మర్చిపోయారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా నిలిచిన చరిత్ర జనసేనది కాదు. ఒంటరిగా గత ఎన్నికల్లో పోటీచేసి ఒక్క చోట కూడా పవన్‌ గెలలేకపోయారు. జనసేన కోసం టిడిపికి చెందని 21 మంది నాయకులు బలయ్యారు. రాజకీయ జీవితం వదలుకున్నారు. ఒక రకంగాచెప్పాలంటే సమాది చేసుకున్నారు. పార్టీ గెలిచిందని టీ పార్టీ చేసుకోవడం తప్ప మిగిలిని సంతోషం వారికి లేదు. వారి త్యాగాలతో గెలిచిన జనసేన, లేని పోని గొప్పలు చెప్పుకుంటూ త్యాగాలను కించపర్చుతున్నారు. అందుకే పవన్‌ను ఏపి జనం చీ కొడుతున్నారు.

వరంగల్‌లో ఓ వైద్యుడి వక్రబుద్ది! అతడి బుద్ది ఎప్పుడూ పాడుబుద్దే!!

`పనిచేసిన ప్రతి చోట లైంగిక వేధింపులు అలవాటే!

`అంతటా తన్ని తరిమేసినా ఎప్పటికీ బుద్దిరాదంతే!

`తాజాగా మరోసారి బైట పడిన అతని రాక్షస బుద్ది.

`సారీ చెప్పి అతని సతీమణి తప్పు సరిదిద్ది!!

`పని చేసిన ప్రతి చోట ఇదే రిపీట్‌ అవుతోంది!

`అయినా బుద్ది రాని ప్రబుద్దుడి వైఖరి!

`వైద్యులలో దెయ్యామైన దుర్మార్గుడు.

`ఆడపిల్లల పట్ల అసభ్య ప్రవర్తనకు పరాకాష్ట ఈ దుష్టుడు.

వరంగల్‌ జిల్లా ,నేటిధాత్రి: 

వైద్యుడంటే సమాజంలో ఉన్నతమైన గౌరవమే కాదు, పూజ్య భావం కూడా అందరిలోనూ వుంటుంది. వ్యక్తి ప్రాణాలు కాపాడే అవకాశం, నైపుణ్యం వున్న ఆ వ్యక్తి పట్ల సమాజం మొత్తం కృతజ్ఞతాభావంతో వుంటారు. అయితే అలాంటి వ్యవస్థలో కూడా నీచులు, నికృష్టులు, దరిద్రులు, దుర్మార్గులు, చిత్త కార్తె కుక్కలుంటాయని ఇటీవల అనేక సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. సమాజమంతా గొప్ప వారిగా పూజిస్తుంటే వారి బుద్దులు పాతాళంలో వుంటున్నాయి. అలాంటి ప్రబుద్దుడు ఒకడు వరంగల్‌ లో వైద్యుడుగా చెలామణీ అవుతున్నాడు. అతని పేరు కూరపాటి రమేశ్‌. మహిళ కనిపిస్తే చాలు. ఆసుపత్రిలో పని చేయడానికి వస్తే చాలు. అది ఎంతటి వారైనా సరే..తన దరికి తెచ్చుకోవాల్సిందే? లొంగదీసుకోవాల్సిందే! ఆ మహిళల జీవితం పాడు చేయాల్సిందే! ఆది నుంచి ఆ వైద్యుడి వెర్రివేషాలన్నీ ఇవే.

అతడి బుద్ది ఎప్పుడూ పాడుబుద్దే!! గతంలోనే రమేశ్‌ అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పని చేసిన ఆసుపత్రుల నుండి తన్ని తగిలేయబడ్డాడు. ఇక ఏ ఆసుపత్రి అతని వైద్యునిగా చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి తానే ఆసుపత్రి పెట్టుకోవాల్సి వచ్చింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. రమేశ్‌ సతీమణి కూడా వైద్యురాలే కావడం గమనార్హం. బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల కూరపాటి ఆసుపత్రిలో పని చేసే మహిళ మీద రమేశ్‌ కన్నేశాడు. నయానా, భయాన చెప్పి చూశాడు. ఆ మహిళ అంగీకరించలేదు. ఇక అప్పటి నుంచి ఆ మహిళను రమేశ్‌ వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. ఇబ్బందులు పెట్టడం షురీ చేశాడు. అయినా ఆ మహిళ దారికి రావడం లేది నిత్యం అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక విసిగివేసారి పోయిన ఆ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. మీడియాకు సమారమందించింది. ఇక పరిస్థితి చేయి దాటిపోయేలా వుందని గ్రహించిన రమేశ్‌ సతీమణి సదరు మహిళలకు క్షమాపణ చెప్పించింది. కథ ఇక్కడితో ముగించాలని చూసింది. నిజానికి ఆ మహిళా వైద్యురాలు పరోక్షంగా తన భర్తనే వెనకేసుకొచ్చినట్లైంది. తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన కాపురం కోసమే ఆలోచించింది. కానీ ఆ మహిళ పట్ల జాలి చూపించినట్లు ఎక్కడా కనిపించలేదు. పైగా అదే ఆసుపత్రిలో పని చేసే శ్రీకాంత్‌ రెడ్డి అనే వ్యక్తి వ్యవహారం మరోలా వుంది. ఆసుపత్రులలో పని చేసే వాళ్లు అన్నింటికీ సిద్దమయ్యే రావాలంటూ ఆ మహిళలకు నీతి వాఖ్యాలు వల్లించినట్లు తెలిసింది. బాధిత మహిళ పోలీసులకు, మీడియా కు సమాచారం అందించినట్లు తెలిసి, మీడియా ను శ్రీకాంత్‌ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఒక మహిళల మీద లైంగిక వేధింపులు జరిగితే అది చిన్న సమస్య మీడియా రావాల్సిన అవసరం లేదంటూ ఆసుపత్రిలోకి రాకుండా డోర్లు మూసేశాడు. మేం,మేం మాట్లాడుకుంటామంటూ పెళ్ళి సంబంధాలను కుదర్చుకుంటున్నంత సులువుగా మీడియా తో శ్రీకాంత్‌ చెబుతూ అడ్డుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఇలాంటి ఘోరాలు, నేరాలు ఎన్ని జరిగినా పోలీసులు స్పందించరు. ప్రజా సంఘాలు కదలవు. మహిళా సంఘాల జాడ కనిపించదు. అదే ప్రభుత్వాసుపత్రిలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల సంఖ్యలో మీడియా చేరిపోతుంది. వందలాది మంది పోలీసులు వచ్చి చేరుతారు. ప్రజా సంఘాలన్నీ ధర్నాలు, నిరసనలు చేపడతాయి. కానీ అదే ప్రైవేటు ఆసుపత్రిలో ఎంత పెద్ద ఘోరం జరిగినా, పేషెంట్ల ప్రాణాలు పోయినా పోలీసులు ఆసుపత్రికే సెక్యూరిటీ ఇస్తారు. బాధితుల మీద అవసరమైతే కేసులు సమోదు చేస్తారు. ఆసుపత్రి గేటు వరకు కూడా మీడియాను అనుమతించరు. అందుకే ప్రైవేటు ఆసుపత్రులలో దుర్మార్గాలు ఆగడం లేదు. కొంత మంది వైద్యులు దుశ్చర్యలు ఆపడం లేదు. అందువల్ల వైద్య సమాజానికే మాయని మచ్చగా మారిన వైద్యుడు కూరపాటి రమేశ్‌ ను శిక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

డప్పుసప్పుళ్లతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు కార్యకర్తలు

పరకాల నేటిధాత్రి

 

The CM’s portrait was anointed under the auspices of the Congress party.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల లో బీసీ కులగణన,ఎస్సి కుల వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించిన సందర్బంగా బుధవారం రోజున పట్టణంలోని బస్టాండ్ కూడలిలో పట్టణ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఏంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి బీసీ కులగణన కార్యక్రమాన్ని చెప్పటి బిల్లును అసెంబ్లీ లో ఆమోదించడానికి,అలాగే సుప్రీంకోర్టు ఎస్ సి వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును గౌరవించి దేశంలోని మొట్టమొదటిసారిగా ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి పరకాల కాంగ్రేస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ, కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్ కుమార్,మాజీ ఎంపీపీ రామ్మూర్తి,చిన్నల గొనాద్, నల్లబోల కృష్ణయ్య అల్లం రఘునారాయణ,దాసరి బిక్షపతి,మడికొండ సంపత్,బండి సదానందం గౌడ్,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,నల్లెల అనిల్ బొమ్మ కంటి చంద్రమౌళి దుబాసి వెంకటస్వామి,అంబిరు మహేందర్,సుంకరి దిలీప్, ఎండి తాజుద్దీన్,ఎండి ఆజి, బొచ్చు జెమిని,మచ్చ సుమన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా

వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో అంగన్వాడి కేంద్రం- 2 ఫ్రీ స్కూల్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆహాల్లదకరమైన వాతావరణంలో చిన్నారులకు ఆటలు పాటలతో డ్రాయింగ్, రంగు రంగుల బొమ్మలతో విద్యాబోధన చేపట్టారు తల్లిదండ్రులకు పిల్లలకు నేర్పించే అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది 3 సంవత్సరాల వయస్సు నుండి నుండి 6 ఏళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ,అంగన్వాడి స్కూల్ లో అయిపోగా ప్రేరణాత్మక బోధన అభ్యసించి అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ మా దేవి అన్నారు అంతేకాకుండా గర్భిణులకు బాలింతలకు పాలు గుడ్లు బాలామృతం మంచి పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రేణుక పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు, ఆయా స్వరూప తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆశాలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి..

బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు 18వేల కనీస వేతనం నిర్ణయించాలి

కాంగ్రెస్ ఆశాలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి

లేదంటే ఆశాల పోరాటం ఉదృతం చేస్తాం

సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, నేటిధాత్రి:
ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 18,000/ లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని పీఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే ఆశాలు సమరశీల ఉద్యమాలకు సిద్ధమవుతారని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని,ఆశాల వేతనాలు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కనీస వేతనం 18 వేలు పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఆశాల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కనీసం చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ హెచ్ ఎం స్కీం లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రాత్రనకా పగలనకా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ డెలివరీల సందర్భంగా రోజుల తరబడి కుటుంబాన్ని వదిలి హాస్పిటల్ వద్ద ఉండాల్సి వస్తుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆశాలు పోరాడుతుంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న హక్కులను కాలరాస్తుందని అన్నారు.45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు ప్రకారం 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ కరోనాకాలంలో ఆశాల శ్రమను గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్లు గ్లోబల్ లీడర్స్ అని ఆశాలకు అవార్డును ప్రకటించింది.కానీ మన కేంద్ర ప్రభుత్వం నేటికీ ఆశల శ్రమను గుర్తించడానికి సిద్ధపడట్లేదు పైగా ఎన్ హెచ్ ఎం స్కీంకు బడ్జెట్ ను తగ్గిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా చేసి కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆశ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న పి హెచ్ సి ల ముందు ధర్నాలు, 24న చలో హైదరాబాద్ కు ఆశాలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి,టీ వెంకటమ్మ,సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, బైరం దయానంద్,అవుట రవీందర్ అశా యూనియన్ నాయకులు రమావత్ కవిత, కె శైలు, విమల పుష్పలత, ఎస్ జయమ్మ, స్వర్ణ, పార్వతమ్మ, ప్రేమలత, బి అనూష, ధనలక్ష్మి, కె సునీత, వీరభద్రమ్మ, మంగతాయి తదితరులు పాల్గొన్నారు

బడుగు బలహీన వర్గాలకు న్యాయం.

బిల్లుల ఆమోదంతో… బడుగు బలహీన వర్గాలకు న్యాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్,

శాసనసభలో బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు,ధన్యవాదాలు తెలిపిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దస్రు నాయక్

అనంతరం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:- 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లును చట్టసభలో ఆమోదంతో బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని నిరూపితమైంది..

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల న్యాయం చేస్తుందని మరోసారి రుజువైంది.
ఎవరు చేయలేని సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారు.
బీసీ బిల్లును కేంద్రం బిజెపి అడ్డగుడ్డ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు..

సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దపిట వేస్తున్నాను చెప్పడానికి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభలో ప్రవేశపెట్టడమే నిదర్శనం..

ఎన్నికల్లో హామీ ఇచ్చినం మాట ప్రకారం రాష్ట్రంలో కులగరణ పూర్తి చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది..

దేశవ్యాప్తంగా కులగనన చేపట్టాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితులను చేస్తానని చెప్పి కేసీఆర్ గెలిచాక తానే గద్దనికి దళితులను అవమానించారు అని గుర్తుచేశారు..

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అథారిటీ సభ్యులు రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, ఎండి తాజోద్దీన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, యాదగిరి, వీరన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, పోలేపల్లి వెంకట్ రెడ్డి,రాము, వేణు,కొండ సురేష్, కొమరయ్య, సాట్ల శ్రీను,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు, భూలోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గందసిరి వెంకన్న, పోకల శ్రీనివాస్,తరాల సుధాకర్, సామల నరసయ్య, ఏలేందర్ బన్నిచెట్టి వెంకటేష్, బద్య, హనుమ, బాల,ముజ్జూ, సుందర్ వెంకన్న, బాదవత్ సుమన్,బాలు, పిల్లి రమేష్, వెంకన్న, ఎండి నవాజ్, మామిడి శెట్టి మల్లయ్య, సారయ్య,అరుణ్,రఫీ,సిద్దు,అలీమ్,ఏకాంత చారి,సుధాకర్, గొట్టం రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారు

రాష్ట్ర బడ్జెట్ పై యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఫైర్.

హైదారాబాద్,వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్బాటంగా శాసనసభలో ఆర్బాటంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరువై ఐదు కోట్ల రూపాయల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, వివిధ వర్గాలకు కెటాయించిన నిదులు మాటలు బారెడు – చేతలు చారెడుగా ఉన్నాయని ఈ బడ్జెట్ గత బిఆర్ఎస్ అంకెల గారడీ బడ్జెట్ గా, పాత సీసాలో కొత్త సారాయి లాగా ఉందని రాష్ట్ర బడ్జెట్ పై యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఫైరయ్యారు.దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు పాలక కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని అందుకు తగిన మూల్యం చెల్లించటానికి కాంగ్రెస్ పాలకులు సిద్దంగా ఉండాలని రవి హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉదాహరణకు జనాభా లో 50 శాతం ఉన్న మహిళా, శిశు సంక్షేమానికి కేవలం రూపాయలు 2,862 కోట్లు, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనకుల గణనలో నూటికి 56 శాతం ఉన్న బిసిల అభివృద్ధి సంక్షేమానికి రూ. 11.405 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42 శాతం బిసి రిజర్వేషన్ కు ఈ నిదులు ఎలా సరిపోతాయని అన్నారు.షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కలిపి చూస్తే రూపాయలు 57,401 కోట్లు కెటాయించి వాటిని ఎలా ఖర్చు పెడుతారో చెప్పలేదని కాగితాల మీద కెటాయింపు తప్ప మరేమీ కాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో యువజన రంగానికి నిదులు కెటాయింపులేదని అందులో పారిశ్రామిక రంగానికి రూపాయలు 3, 527 కోట్లు ఇచ్చారని వీటితో పరిశ్రమలు స్థాపన,ఉద్యోగం కల్పన ఎలా సాధ్యమని అలాగే
క్రీడారంగానికి కేవలం రూ.465 కోట్లతో ఎలా నైపుణ్యం పెరుగుతుందని, ప్రోత్సాహం ఎలా సాధ్యమని అడిగారు.ఆరోగ్య శ్రీ బకాయిపకు కెటాయించిన బడ్జెట్ రూ.12,393 కోట్లు అయితే మరి రానున్న సంవత్సరం వైద్య రంగం ఎలా ముందుకు పోతుందని దీంతో
ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారుతొందని అన్నారు.విద్యా రంగానికి బడ్జెట్ లో 20 శాతం నిదులు కెటాయించకుండా కేవలం రూ.23,108 కోట్లు కెటాయించటం వలన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు, మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మొత్తంగా విద్య, వైద్య కార్పోరేట్ శక్తులకు ఉపయోగ పడుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్ కెటాయింపులో పైస కెటాయింపు లేకపోవడం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను తుంగలో తొక్కి కప్పదాటు చర్యలకు దిగుతున్న తీరు ప్రజలు సహించరని యంసిపిఐ(యు) హెచ్చరిస్తుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసి లకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు, విద్య, వైద్య, ఆరు గ్యారంటీల అమలు కు బడ్జెట్ ను సవరించాలని హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశ నుండి యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
డిమాండ్ చేశారు.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు ఎండి.హమిద్ మరియు స్థానిక మస్జిద్ ఇమామ్ సాబ్ పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా మణుగూరు మదీనా మర్కస్ మస్జిద్ తరపున ఆర్ధిక సహాయం,బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ఈ కార్యక్రమంలో
ముస్లిం పెద్దలు మర్కస్ మస్జిద్ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు..

విపరీత ధోరణితో అగమ్య గోచరం కానున్న విద్యార్థుల భవిత

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు

విద్యా హక్కు చట్టంతో ఉపాధ్యాయులకు సంకెళ్లు – నిస్సహాయ స్థితిలో ఆవేదన చెందుతున్న వైనం

తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం రెండూ తప్పే

తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న సినిమాలు, సోషల్ మీడియా

ప్రశ్నార్ధకం కానున్న విద్యార్థుల భవిష్యత్తు – సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం

మొక్కై వంగనిది – మానై వంగుతుందా

నేడు బెత్తమే వారిని మార్చలేక పోతే భవిష్యత్తులో లాఠీలు మార్చాల్సి వస్తది

ఇవి డేంజర్ బెల్స్ – ప్రభుత్వాలు ,మేధావులు ఆలోచించాల్సిన తరుణం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల ఉద్ఘాటన

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాల గోడపై పదవ తరగతి విద్యార్థి ” దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు ,పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు ,నీ అవ్వ తగ్గేదేలే ” అని పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ను కాపీ కొట్టి రాసిన డైలాగ్ చూసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విస్మయం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ సినిమాలు, సోషల్ మీడియా విద్యార్థుల పై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయని, విద్యాహక్కు చట్టం కూడా విద్యార్థులను దండించరాదని చెప్పడం, తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం వలన క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులు ఏం చేసినా అడిగే వారే లేరని వారి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు .వీరికిస్తున్న అతి స్వేచ్ఛ వలన మంచి చెప్పే ప్రయత్నం చేసే ఉపాధ్యాయులపై దాడులు చేయడం , పాఠశాలలో దురలవాట్లకు లోను కావడం , భిన్న రకాల హెయిర్ స్టైల్ లతో ఆకతాయిలుగా మారుతున్నారన్నారు. ఇవన్నీ చూస్తూ విద్యార్థులను సరిదిద్దలేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉంటూ ఎంతో మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎంత చెప్పినా చదువులో రాణిస్తలేరని ,అలా అని మిమ్మల్ని దండించలేకపోతున్నాం అని , ఇప్పటికైనా చదవండి” అని ప్రాధేయ పడుతూ ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీయడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. చిన్నతనంలోనే తప్పు చేసినప్పుడు బెత్తంతోశిక్షిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి భయపడతారని, లాఠీలతో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడదని వివరించారు. కానీ పిల్లలను దండిస్తే ఉపాధ్యాయులను నిందించడం ,వారిపై దాడులు చేయడంలాంటి సంఘటనలు ఎన్నో చూసామన్నారు. “మొక్కై వంగనిది మానై వంగుతుందా” అని ప్రశ్నించారు .చిన్నతనంలోనే మంచి అలవాట్లు నేర్పిస్తే తల్లిదండ్రులు ,గురువులు గర్వించే లాగా తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని అన్నారు . అతి స్వేచ్ఛ ఇచ్చి ఇలాగే వదిలేస్తే సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ సమాజానికి డేంజర్ బెల్స్ మోగించినట్లేనని ,ఇంకా నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టాన్ని ఎవరూ కూడా ఊహించలేరన్నారు.
ఇప్పటికైనా తల్లిదండ్రులు, మేధావులు , ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. చట్టంలో మార్పు తీసుకొస్తే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కష్టమేమీ కాదని, తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు సహకరించాలని  కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

తెలంగాణ మాదిగ జాతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గజాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
చేవెళ్ల డిక్లరేషన్ భాగంగా కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో
ప్రకటించి వెను వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి యెక్క సూచనల మేరకు ఏకసభ్య కమిషన్ నియమించి రాష్ట్రంలో వర్గీకరణ తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకొని అసెంబ్లీలో వర్గీకరణ చర్చ చేసి క్యాబినెట్ సమావేశంలో ఆమోదిం న్యాయం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని తెలియజేశారు
రానున్న రోజుల్లో జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రంగాలలో‌ కాక చట్ట సభల్లో మరియు నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగ జాతికి న్యాయం జరుగుతుంది గత 45 సంవత్సరాలు‌గా అన్యాయం తొలగిపోయి జనాభ దామాషా ప్రకారం అని పదవుల్లోనూ మాదిగలకు వాటా లభిస్తుందని అన్నారు
ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు కృషి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన
రాష్ట్ర ముఖ్యమంత్రి కి మాదిగ జాతి తరపున కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version