నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌.

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మ‌ధ్య ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్‌ కుమార్‌ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషించగా, మోహన్‌ బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచారు.

ఇప్ప‌టికే అమెరికా, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లోప్ర‌త్యేక ఈవెంట్లు సైతం నిర్వ‌హించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్ప‌టివ‌ర‌కు క‌థానాయిక‌గా ఉన్న‌ నుపుర్ స‌న‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత త‌మిళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan)ను ఆ స్థానంలోకి వ‌చ్చి చేర‌డం సినిమా పూర్తి చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.
ఆపై ఈ ముద్దుగుమ్మ‌పై చిత్రీక‌రించిన పాట‌లు, స‌న్నివేశాల‌ను కాల‌క్ర‌మంలో మేక‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమా జ‌నాల నోళ్ల‌ల్లో నానేలా చేశారు.
అయితే ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో సినిమా టీం అంతా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల్లో బిజీగా గ‌డుపుతుండ‌గా వాటిళ్లో ఎక్క‌డా ఈ ముద్దుగుమ్మ క‌నిపించ‌క పోవ‌డంపై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
కేర‌ళ‌లో జ‌రిగిన ప్రొగ్రాంలో మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ నాట శివ రాజ్‌కుమార్ వంటి మ‌హా న‌టులు ఈ మూవీ ఈవెంట్‌ల‌లో పాల్గొనగా హీరోయిన్ అక్క‌డా కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు.
అప్పుడెప్పుడో ఏడాది క్రితం సినిమా టీజ‌ర్ ఈవెంట్‌లో క‌నిపించిన ఈ చిన్న‌ది మ‌ళ్లీ ఈ చిత్రం విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించింది లేదు.

అఖ‌రుకు.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన మెయిన్ ఈవెంట్‌లోనూ ప్రీతి క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాశం అవుతుంది.

క‌న్న‌ప్ప సినిమాలో తిన్న‌డు ప్రేయ‌సిగా, భార్య‌గా కీల‌క పాత్ర పోషించిన న‌టి ఈవెంట్ల‌లో ఎందుకు క‌నిపించ‌డం లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది.

అంతేకాదు ఇప్ప‌టికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుంద‌న్‌ల‌పై చిత్రీక‌రించిన పాట బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు అందులో హీరోయిన్‌కు వేసిన బ‌ట్ట‌లు, పాట చిత్రీక‌రించిన విధానం తీవ్ర విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వ‌చ్చాయి.

ఇది అస‌లు భ‌క్తి చిత్ర‌మా లేక ర‌క్తి మూవీనా అనే వ‌ర‌కు వెళ్లింది.

కాగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్ర‌ధానంగా హీరోయిన్ ప్రీతి న‌టించిన యుద్దం, ఎమోష‌న‌ల్, రొమాంటిక్ స‌న్నివేశాలే అధికంగా చూపించ‌డం విశేషం.

అలాంటిది పాన్ ఇండియాగా విడుద‌ల‌వుతున్న ఇంత‌ పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన న‌టి ఇ్ప‌పుడు ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఈవెంట్‌కు చిన్న క్యారెక్ట‌ర్ చేసిన సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

మూవీ యూనిట్ ప్రీతి (Preity Mukhundhan)ని లెక్క‌లోకి తీసుకోలేదా, ఈవెంట్ల‌కు పిల‌వ‌డం మ‌రిచారా, కావాల‌నే దూరం పెట్టారా లేక త‌నే రానందా అనే ప్ర‌శ్న‌లు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.

ఈవెంట్‌లో సైతం ప్రీతి గ‌రించి, ఆమె పాత్ర‌, న‌ట‌న‌ గురించి మాట్లాడిన‌ట్లుగా కూడా లేదు.

అఖ‌ర‌కు బాలీవుడ్ స్టార్‌ అక్ష‌య్ కుమార్ సైతం క‌న్న‌ప్ప టీంతో క‌లిసి ఇంట‌ర్వ్యులు ఇచ్చి సినిమా ప్ర‌చారంలో పాల్గొంటు త‌న వంతు సాయం అందించారు.

అలాంటిది క‌న్న‌ప్ప సినిమాలో మెయిన్ పిల్ల‌ర్ల‌లో ఒక‌రైన‌ హీరోయిన్ ఎందుకు ఈవెంట్లు, ఇంట‌ర్వ్యూల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.

సినిమా విడుద‌ల‌కు మ‌రొ నాలుగు రోజులే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా ప్రీతి ముకుంద‌న్ మీడియా ముందుకు వ‌స్తుందేమోన‌ని బావిస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు..

విపరీత ధోరణితో అగమ్య గోచరం కానున్న విద్యార్థుల భవిత

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు

విద్యా హక్కు చట్టంతో ఉపాధ్యాయులకు సంకెళ్లు – నిస్సహాయ స్థితిలో ఆవేదన చెందుతున్న వైనం

తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం రెండూ తప్పే

తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న సినిమాలు, సోషల్ మీడియా

ప్రశ్నార్ధకం కానున్న విద్యార్థుల భవిష్యత్తు – సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం

మొక్కై వంగనిది – మానై వంగుతుందా

నేడు బెత్తమే వారిని మార్చలేక పోతే భవిష్యత్తులో లాఠీలు మార్చాల్సి వస్తది

ఇవి డేంజర్ బెల్స్ – ప్రభుత్వాలు ,మేధావులు ఆలోచించాల్సిన తరుణం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల ఉద్ఘాటన

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాల గోడపై పదవ తరగతి విద్యార్థి ” దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు ,పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు ,నీ అవ్వ తగ్గేదేలే ” అని పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ను కాపీ కొట్టి రాసిన డైలాగ్ చూసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విస్మయం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ సినిమాలు, సోషల్ మీడియా విద్యార్థుల పై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయని, విద్యాహక్కు చట్టం కూడా విద్యార్థులను దండించరాదని చెప్పడం, తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం వలన క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులు ఏం చేసినా అడిగే వారే లేరని వారి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు .వీరికిస్తున్న అతి స్వేచ్ఛ వలన మంచి చెప్పే ప్రయత్నం చేసే ఉపాధ్యాయులపై దాడులు చేయడం , పాఠశాలలో దురలవాట్లకు లోను కావడం , భిన్న రకాల హెయిర్ స్టైల్ లతో ఆకతాయిలుగా మారుతున్నారన్నారు. ఇవన్నీ చూస్తూ విద్యార్థులను సరిదిద్దలేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉంటూ ఎంతో మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎంత చెప్పినా చదువులో రాణిస్తలేరని ,అలా అని మిమ్మల్ని దండించలేకపోతున్నాం అని , ఇప్పటికైనా చదవండి” అని ప్రాధేయ పడుతూ ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీయడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. చిన్నతనంలోనే తప్పు చేసినప్పుడు బెత్తంతోశిక్షిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి భయపడతారని, లాఠీలతో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడదని వివరించారు. కానీ పిల్లలను దండిస్తే ఉపాధ్యాయులను నిందించడం ,వారిపై దాడులు చేయడంలాంటి సంఘటనలు ఎన్నో చూసామన్నారు. “మొక్కై వంగనిది మానై వంగుతుందా” అని ప్రశ్నించారు .చిన్నతనంలోనే మంచి అలవాట్లు నేర్పిస్తే తల్లిదండ్రులు ,గురువులు గర్వించే లాగా తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని అన్నారు . అతి స్వేచ్ఛ ఇచ్చి ఇలాగే వదిలేస్తే సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ సమాజానికి డేంజర్ బెల్స్ మోగించినట్లేనని ,ఇంకా నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టాన్ని ఎవరూ కూడా ఊహించలేరన్నారు.
ఇప్పటికైనా తల్లిదండ్రులు, మేధావులు , ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. చట్టంలో మార్పు తీసుకొస్తే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కష్టమేమీ కాదని, తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు సహకరించాలని  కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version