మేకోవర్‌ మొదలైంది.

మేకోవర్‌ మొదలైంది

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక…

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్ల చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. తదుపరి జరిగే షెడ్యూల్‌ కోసం బీస్ట్‌ లుక్‌లోకి మారిపోయారు రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పిక్‌ను రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘పెద్ది’ కోసం మేకోవర్‌ మొదలైంది. ఈ సవాలు కఠినమైనదైనా.. ఎంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని పేర్కొన్నారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉండబోతోంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ సంస్థలు మైత్రీమూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకటసతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న చిత్రం విడుదలవుతోంది.

వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం..

వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం

 

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండల కేంద్రంలోని వెలుగు మండల సమైక్య కార్యాలయంలో. బుధవారం ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు గాను మహిళల పాలాభిషేకం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎం రవి వర్మ మాట్లాడుతూ ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి మొన్న జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన సంధర్భంగా మహిళా స్వయం సహాయక సభ్యులతో చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాల గురించి వారితో మాట్లాడి సంతృప్తితో ఎస్ హెచ్ జి లకు వడ్డీ లేని ఋణం క్రింద రూ.100 కోట్లను మంజూరీ చేశారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెలుగు మండల సమాఖ్య మొగుళ్ళపల్లి సెర్ప్, డి.ఆర్.డి.ఏ మొగుళ్లపల్లి మండలం ఆధ్వర్యంలో. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ మినిస్టర్ సీతక్క, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ. 10 కోట్లు మంజూరీ కాగా మొగుళ్లపల్లి మండలానికి క్రింది విధంగా మంజూరీ కావడం జరిగింది.మండలంలో మొత్తం 657 సంఘాలకు ఒక కోటి ఆరు లక్షల తొంబై ఏడు వెయ్యిల రెండు వందల తొంబై నాలుగు రూపాయలు సంఘాల ఖాతాలలో పడడం జరిగినది. మహిళా సంఘ సభ్యులకు అందించిన ముఖ్య మంత్రి, పంచాయితీ రాజ్ గ్రామీణభివృద్ధి శాఖా మంత్రి , సి.ఈ.ఓ, సెర్ప్, మండల మహిళలు అందరి తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది గాజుల బాబురావు, బత్తిని శ్రీనివాస్, బత్తిని ప్రవీణ్, పసరగొండ రేవతి, వివో ఏలు శ్రీరామ్ తిరుపతి, లలిత, పావని, రమాదేవి, రమ్య, శ్రీకాంత్, బాలకృష్ణ, వివిధ గ్రామాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version