23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీ సురేష్ షెట్కార్ తెలిపారు. జహీరాబాద్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. nimz జి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఝరసంగం మండలంలోని కేంద్రీయ విద్యాలయం పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఆల్గల్ రోడ్డు, బైపాస్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.

నూతన టివైజెఎఫ్ జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక.!

నూతన టి.వై.జె.ఎఫ్. జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక….!

◆-టి.వై.జె.ఎఫ్.అధ్యక్షుడుగా చెలిమేడ అనిల్ కుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ జర్నలిస్టు వృత్తి బాధ్యత గల వృత్తి అని, ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని రాష్ట్ర టి . వై.జె.ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ తనుగులు జితేందర్ రావు అన్నారు.హైదరాబాద్ లోని రాష్ట్ర టీ .వై .జె.ఎఫ్ ఆఫీసులో నిర్వహించిన ముఖ్య సమావేశంలో డాక్టర్ జితేందర్ రావు అధ్యక్షతన జహిరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన (టి.వై.జె.ఎఫ్) అధ్యక్షుడు కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన చెలిమేడ అనిల్ కుమార్ ను, టి.వై.జె.ఎఫ్. ఉపాధ్యక్షుడిగా ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామానికి చెందిన నాగేష్ , నూ రాష్ట్ర టి.వై.జె.ఎఫ్.

 

President

అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు నియమిస్తున్నట్లు తెలపడం జరిగింది. త్వరలోనే జహీరాబాద్ టీ.వై.జె.ఎఫ్. మిగతా శాఖలను అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కలిసి నియమించుకోవాలని రాష్ట్ర టి. వై .జె .ఎఫ్.అధ్యక్షుడు కోరడం జరిగింది. చెలిమేడ అనిల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జహీరాబాద్ నియోజకవర్గ టీ.వై.జె.ఎఫ్. అధ్యక్షుడిగా నాకు ఇంత పెద్ద బాధ్యత చెప్పినందుకు రాష్ట్ర టీ.వై.జె.ఎఫ్.అధ్యక్షులకు డాక్టర్ తనుగుల జితేందర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.

మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.!

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.

◆ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాసీ కాను మరియు వక్ఫ్ బచా ప్రచారం, ముస్లిం పర్సనల్ లా బోర్డు జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకంగా వక్ఫ్ బచా దస్తూర్ బచా ప్రచారం యొక్క కేంద్ర నిరసన అఖిల పక్ష సాధారణ సమావేశం మే 24వ తేదీ శనివారం అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని ఆలోచనా విధానాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగిస్తారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవస్థాపక కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో అన్ని ఇస్లామిక్ సోదరులు తమ మతం లేదా మతంతో సంబంధం లేకుండా పాల్గొని, తమ ఐక్యత, జాతీయ సంఘీభావం, మతపరమైన గర్వం మరియు సజీవ దేశంగా నిరూపించుకోవాలని మరియు ఈ వివాదాస్పద నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా తమ సమిష్టి నిరసనను నమోదు చేయాలని అభ్యర్థించారు.

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే .

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ముంగి ఎస్ ఎల్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన న్యాల్కల్ మండల  .మాజీ జెడ్పీటీసీ భాస్కర్ గారి బావమరిది గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజి మార్కెట్ చైర్మన్ గుండపా,మాజి సిడిసి చైర్మన్ ఉమాకంత్ పాటిల్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ నేను అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, మాజి సర్పంచ్ లు కళీమ్,ప్రభు పటేల్,మల్లా రెడ్డి,జగదీశ్వర్,కరణ్,మాజి ఎంపీటీసీ రాములు,నాయకులు విజేందర్ రెడ్డి,దత్తురెడ్డి,రాథోడ్ భీమ్ రావ్ నాయక్ తదితరులు.

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన.!

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన జహీరాబాద్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు కలిశారు. ఝరసంగం మండలం భూపాలపల్లి లో నిర్వహించే పార్టీ సమావేశానికి మరియు మొహమ్మద్ సయ్యద్ తన కూతురు పెళ్లి పత్రిక ఇచ్చి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, నాగన్న, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా మే 6వ తేదీ మంగళవారం జహీరాబాద్‌లో జరిగే మహిళల నిరసన సమావేశంలో పాల్గొనమని విజ్ఞప్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన దేశవ్యాప్త నిరసన ఉద్యమం “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్”లో భాగంగా, “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్” అనే పేరుతో మహిళల చారిత్రాత్మక కేంద్ర సర్వసభ్య నిరసన సమావేశం 2025 మే 6 మంగళవారం ఉదయం 10:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్థానిక ప్రచారకర్త హజ్రత్ మౌలానా అతిక్ అహ్మద్ కాస్మి అధ్యక్షతన జరుగుతుందని ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి కానో మరియు ఎండోమెంట్స్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ జహీరాబాద్ తెలియజేశారు. ఈ సమావేశానికి హజ్రత్ మౌలానా ఘియాస్ అహ్మద్ రషాది, కన్వేజ్, వక్ఫ్ బచా క్యాంపెయిన్, తెలంగాణ, శ్రీమతి న్యాయవాది జలీసా యాస్మిన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఇంచార్జి, వీరితో పాటు జామియా గుల్షాన్ గర్ల్ టీచర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, జామియా గుల్షన్ హనీస్ ఖైరీ- జమాతే ఇస్లామీ మహిళా విభాగం అధిపతి బుష్రా అఫ్రోజ్, సున్నీ దావత్-ఏ-ఇస్లామీ మహిళా విభాగం ఇన్‌చార్జి జహీర్ అబా, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ – ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, మిస్టర్ ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ, స్థానిక జమాత్ ఘోరీ ఈ సమావేశానికి సయ్యద్ జియావుద్దీన్ మౌలానా మసూమ్ ఆలం కూడా హాజరుకానున్నారు. జహీరాబాద్ నగరం మరియు హదీసు పరిసర ప్రాంతాల మహిళలు మరియు బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జాతీయ ఐక్యత మరియు ఇస్లామిక్ మద్దతును ప్రదర్శించాలని జమియత్ ఉలేమా, జమాతే-ఇ-ఇస్లామి, సఫా బైతుల్ మల్, సున్నీ దావత్-ఇ-ఇస్లామి, జమియత్ అహ్లే యాత్ ముస్లిం యాక్షన్ కమిటీ మరియు అన్ని ఇతర సంస్థల నాయకులు విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో

➡ *₹ 8,02,000/- సీఎం సహయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి,జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం సహయనిధి చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు గారు, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు హుగేల్లి రాములు, వెంకట్ రెడ్డి,అడ్వొకేట్ వాజహత్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ గారు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
లబ్ధిదారుల వివరాలు:-పసుల. వెంకట్ – 60,000
మనియర్పల్లి ఆర్య మల్లికార్జున్ – 60,000 నాగిరెడ్డిపల్లి బోయ. నరేష్ – 60,000 గొట్టిగరపల్లి నాగేల్లి. సమ్మయ్య – 42,500 బిలాల్ పూర్ యండి. ఖాద్రి – 27,500 జహీరాబాద్ పట్టణం గౌరిహ.బేగం -37,500 జహీరాబాద్ పట్టణం.మహమ్మద్. ఖాలీల్ – 50,000
జహీరాబాద్ పట్టణం గౌష్. బేగం – 50,000
మల్చేల్మా బానోత్.వారురాన్ – 45,000 అర్జున్ నాయక్ తండా బ్రాహ్మణ తనియా – 60,000 వైసత్వార్
రుకితమ్మ – 58,000 గుడ్పల్లి ఆగమాయ్య – 45,000
టేకుర్ బిరాదర్.అప్పారావు – 49,000 న్యాయంతాబాద్
రబియా. బేగం – 60,000 జహీరాబాద్ మోహన్ రెడ్డి – 60,000 చిల్కాపల్లి గంగామని – 37,500 హమాలి కాలనీ- జహీరాబాద్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పారు.

హిందువులను చైతన్యం చేసేందుకే ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మీద పీఠాధిపతులు, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా జహీరాబాద్‌లో.!

పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా జహీరాబాద్‌లో క్యాండిల్‌ మార్చ్‌ …

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనపై జహీరాబాద్ ముస్లిం యాక్షన్ కమిటీ. రాజేష్ పెట్రోల్ పంప్ నుండి డాక్టర్ భీంరావు అంబేద్కర్ విగ్రహం వరకు మౌనంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పహల్గామ్ ఉగ్రదాడిని ముస్లిం యాక్షన్ కమిటీ నాయకులు సంయుక్తంగా తీవ్రంగా ఖండించారు. ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు జహీరాబాద్ ముహమ్మద్ యూసుఫ్, మౌలానా మౌలానా ముజీబ్ ఖాస్మీ అధ్యక్షుడు జమియత్ ఉలేమా-ఉలేమా హింద్ జహీరాబాద్, ముహమ్మద్ అయూబ్ లైడరీ మరియు క్యాండిల్ లైట్ నిరసన అధ్యక్షుడు ఎంపీజే ముహమ్మద్ మొయిజుద్దీన్ మహమ్మద్ ముస్లిం యాక్షన్ కమిటీ జహీరాబాద్, నామా రవికిరణ్ మాజీ కౌన్సిలర్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎల్ జనార్దన్ దళిత నాయకుడు, ప్రకాష్ తాజర్ పర్చా, సమీ అడ్వకేట్ మాట్లాడుతూ పహల్గాం ఘటన మానవతావాదమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా ఉక్కు పంజాతో అణిచివేయాలని, ఉగ్రవాదులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఖవాజా మియాన్‌, ఈద్గా కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్‌ మజీద్‌, ఉమర్‌ ఫరూక్‌ మసీదు అధ్యక్షుడు అబ్దుల్‌ ఖదీర్‌, జమియత్‌ ఉలామా జహీరాబాద్‌ కార్యదర్శి అబ్దుల్‌ ఖదీర్‌, జట్టే రాజ్‌ కాంగ్రెస్‌ నాయకుడు శ్రీనివాస్‌ అలీపూర్‌, ఎజాజ్‌ పాషా, అయూబ్‌ఖాన్‌, సర్ఖాన్‌, ఎజాజ్‌ పాషా, అయూబ్‌ఖాన్‌, సర్ఖాన్‌ మెహబూబ్ ఘోరీ, నసీరుద్దీన్, ఎంఏ అజీమ్ మహ్మద్ ఫిరోజ్, నస్రుల్లా, వసీం, ముయేజ్ లష్కరీ, అయూబ్ సహారా, మోయిన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ యూసుఫ్ క్యాండిల్ మార్చ్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

జహీరాబాద్: పోరాట ఫలితంగానే.!

జహీరాబాద్: పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాల పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి

పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని పేర్కొన్నారు.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్ కు చెందిన తిరుమలేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా బుధవారం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఉగ్రవాదుల దాడులలో 26 మంది మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్.

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో

◆ 6,22,500 సీఎం రిలీఫ్ ఫండ్ ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు గారు పంపిణీ చేశారు.అనంతరం లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.లబ్ధిదారుల వివరాలు మల్లెగారి. అరుణ్ కుమార్ 60,000,జహీరాబాద్ కోహిర్. చంద్రయ్య 60,000 కోహిర్ బంగ్లాదొడ్డి. స్వప్న 60,000
ఆర్య నగర్, జహీరాబాద్ చెంగోలి. పుణ్యమ్మ 22,500
పైడిగుమ్మల్ కంట్టం. నాగరాజు 60,000 జహీరాబాద్
శెట్టి రాథోడ్ 60,000 హుగేల్లి బ్యాతా. శ్రీకాంత్ 60,000
న్యాలకల్ అశ్వక్ 60,000 జహీరాబాద్ బాయిని. క్రాంతి కుమార్ 60,000 వెంకటేశ్వర కాలనీ,జహీరాబాద్
బి.ధనరాజ్ 60,000 అసిఫ్ నగర్ కొన్నదొడ్డి.పద్మ 60,000 రేగోడ్. వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

రేపు జహీరాబాద్ నియోజకవర్గంలో సదస్సులు.

రేపు జహీరాబాద్ నియోజకవర్గంలో భూభారతి సదస్సులు.

జహీరాబాద్. నేటి ధాత

 

 

 

 

భూభారతి అవగాహన సదస్సులు సోమవారం మూడు మండలాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలు తెలిపారు. మొగుడంపల్లిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30, రాయికోడులో 1: 30 నుంచి 3. 30, జహీరాబాద్ లో 3: 30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు జరుగుతాయని చెప్పారు. అధికారులు, రైతులు సమయానికి హాజరుకావాలని సూచించారు.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో శనివారం మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చి వద్ద ప్రత్యేక ప్రార్ధన నిర్వహించి, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రైల్వే గేట్ వరకు, అక్కడి నుండి పస్తపూర్ కూడలి వరకు, తిరిగి మెథడిస్ట్ చర్చ్ గార్డెన్ నగర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతపెద్దలు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

జహీరాబాద్ లో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు 8:30.

జహీరాబాద్ లో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు 8:30

చంద్రుడు కనిపించిన తర్వాత ఉదయం 8:30 గంటలకు జహీరాబాద్‌లోని ఈద్గాలో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించబడతాయని ఈద్గా కమిటీ ప్రకటించింది.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్,ఈద్గా కమిటీ పర్యవేక్షణలో ఈద్గా మైదానంలో విలేకరుల సమావేశం జరిగింది.అన్ని మసీదుల నుండి యువకులు మరియు నగర పండితులను ఆహ్వానించారు.ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఖాస్మి మరియు ఖాజియుద్దీన్ ఖతీబ్ ఈద్గా,ప్రస్తుత పరిస్థితిని వెలుగులోకి తెస్తూ, యువత ఐక్యంగా ఉండి మతంపై దృఢంగా నిలబడాలని ఆహ్వానించారు. వేసవికాలం మరియు తీవ్రమైన ఎండల కారణంగా, ఈద్గాలో ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థన సమయాన్ని ఉదయం 8:30 గంటలకు వాయిదా వేసినట్లు పండితులు సమావేశంలో ప్రసంగించారు. అందువల్ల, ముస్లింలందరూ ఈద్ యొక్క అన్ని సున్నతులను అనుసరించి, ముందుగానే సిద్ధంగా ఉండి, ఈద్ ప్రార్థనలు తప్పిపోకుండా ఉండటానికి షెడ్యూల్ చేసిన సమయానికి ముందే ఈద్గా చేరుకోవాలని అభ్యర్థించబడింది. ఈద్గా అధ్యక్షుడు ముహమ్మద్ అబ్దుల్ మజీద్, కార్యదర్శి ఉపాధ్యక్షుడు ముహమ్మద్ అయూబ్, కార్యదర్శి హఫీజ్ ముహమ్మద్ అక్బర్, కోశాధికారి ముహమ్మద్ వసీం అక్రమ్, కమిటీ సభ్యులు మొహమ్మద్ ఫాసిహ్ భాయ్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఎహ్తేషామ్ ముహమ్మద్ అహ్మద్, జహీరాబాద్ యువతను ఉద్దేశించి ఈద్గాలో ప్రసంగించారు. ఈద్ ప్రార్థనకు విరాళాలు సేకరించడంలో సహాయం చేయమని విజ్ఞప్తి చేయబడింది మరియు దేవుడు దయ ఉంటే ఈద్ అల్-ఫితర్ ప్రార్థన ఉదయం 8:30 గంటలకు సరిగ్గా జరుగుతుందని మరియు ఈద్ అల్-ఫితర్ ప్రార్థనకు ఒక గంట ముందు ఉదయం 7:30 గంటలకు ప్రసంగం ప్రారంభమవుతుందని ప్రకటించబడింది.

జహీరాబాద్ లో వడగళ్ల కూడిన భారీ వర్షం..

జహీరాబాద్ నియోజకవర్గం లో వడగళ్ల కూడిన భారీ వర్షం l

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో శనివారము నాలుగున్నర గంటల ప్రాంతంలో అప్పటివరకు భానుడి భగభగతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Heavy rain

వడగండ్ల వానకు తోడుగా బికర గాలులతో తోడవడంతో ప్రజలు భయాందోళన వచ్చింది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు వానగాళ్లు తో ప్రజలు ఇక్కట్లు

Heavy rain

పడ్డారు. సాయంత్రం ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా..

 

 

సాయంత్రం కురిసిన వర్షం తో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో వానగాళ్లు
కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జహీరాబాద్ న్యాల్కల్ కోహీర్ మొగుడంపల్లి ఝరాసంగం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఝరాసంగం మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోనూ భారీ వర్షం పడింది. భారీ వర్షాలు పడటంతో రైతులకు కొంతమేర నష్టం కలిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version