జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా .!

జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్న నాయకులు

◆జహీరాబాద్ హెల్త్కేర్ హీరో ఉజ్వలుడు

◆ డాక్టర్స్-డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సన్మానం

◆ డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారికి ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఉజ్వల్‌రెడ్డి గారి స్వగృహంలో డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్‌రెడ్డి గారికి మరియు వారి మిత్రులు డా౹౹ప్రమోద్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్స్‌-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవా మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అని వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,అక్బర్, టీపీసీసీ జిల్లా మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నతానియల్ ‌,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండలం అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ, ఇమామ్ పటేల్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పిచ్చికుక్కల స్వైర విహారం మహిళపై దాడి.

పిచ్చికుక్కల స్వైర విహారం మహిళపై దాడి.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

జహీరాబాద్ పట్టణంలో పిచ్చికుక్కల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్లో గల భవాని కాలనీలో చాకలి మంజులకు పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. కాగా ఫస్తాపూర్లోని జర్నలిస్ట్ కాలనీ, మేస్త్రి కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ లలో పిచ్చి కుక్కలు దాడి చేసి రోజుకు ఒకరికి గాయపరుస్తున్నాయని కాలనీ వాసులు అంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే పిచ్చి కుక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

-కమిషనర్ వివరణ

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుభాష్రవు స్పందిస్తూ.. వెంటనే కుక్కలను నివారించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.

కురిసిన వాన మెరిసిన రైతు.

కురిసిన వాన మెరిసిన రైతు….

◆: రైతుల మొహంలో ఆనందం…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల,పరిధిలో ఎట్టకేలకు పది పదిహేను రోజుల తరువాత వర్షం కురవటంతో రైతులు ఆనందంతో ఉన్నారని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు అనందంతో రైతులు తమ తమ పోలాలల్లో ఆయా ఖరీఫ్ సీజన్ పంటలు పత్తి మొక్కజొన్న, సోయా,మినుము, పెసర పంటలు వేసి వారం నుండి రెండు వారాలు అవుతుంది. వర్షం మాత్రమే
అలికిన సనిపి లాగానే అంతా అంతా మాత్రమేనని నాటి నుండి వర్షం కురువకపోవడంతో పంటలు అంతంతగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పడుతు న్న వర్షాలతో రైతులకు మేలు కలుగుతుంది. అంతే కాకుండా కొంతమంది రైతులు ఎప్పుడు, ఎప్పుడు పత్తి మరియు సోయా తదితర పంటలు వేయడా నికి భూమిని కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పుడు వర్షాలు కురువడంతో రైతులు లక్షలలో పెట్టుబడి పెట్టి వర్షం కోసం చాలా వేచి చూడవలసిన అవసరం రావడమే కాకుండా వర్షాలు కురుస్తున్న నేల రైతుల మొహంలో చిరునవ్వులు పట్టరాని సంతోషం రైతులను కలిగించేసింది.

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి .

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ హోతి(కె)లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, అధికారులు 20 రోజుల్లో ఇస్తామన్న హామీ నిలబెట్టుకోక పోవడంతో నిరసిస్తూ మంగళవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి బైటాయించిన సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది, స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని కూర్చోవడం జరిగింది. తాహసిల్దార్ డిప్యూటీ తహసిల్దార్ తో సిపిఎం నాయకులతో ఫోన్లో మాట్లాడి 7వ తేదీలోగా ఇళ్ల తాళాలు అప్పచెబుతామని, అప్పటివరకు వేచి ఉండాలని ఆలోపు కచ్చితంగా ఇస్తామన్నా స్పష్టమైన హామీతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మాట్లాడుతూ పేదలకు వచ్చిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఇంటి తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఏడవ తేదీ లోపు ఇళ్ళ తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే వెళ్లి ఇళ్లల్లో ఉంటారని, నివసిస్తారని అన్నారు. ఆ పరిస్థితి వరకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు శ్రీనివాస్, శివకుమార్, యాదుల్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ఇళ్లు కేటాయిస్తూ మంజూరుపత్రాలు జారీచేసినా ఇళ్లను అప్పగించడంలేదని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన అధికారులు ఈనెల 7వ తేదీలోపు ఇళ్లతాళాలు లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్దిదారులకు తాళాలు ఇవ్వనిపక్షంలో ఆందోళన చేపడతామని సీపీఎం నాయకుడు మహిపాల్ హెచ్చరించారు.

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం ఉదయం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయా కళాశాలల విద్యార్థులతో కలిసి పోలీసులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ న్యాయమూర్తి, డి. ఎస్. పి సైదా, ఆర్డీవో, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం చేసిన – జేపీ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొన్ని రోజుల క్రితం కొత్తగా నిర్మించిన జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా గారి కుటుంబానికి సహాయం చేయగలరని జ్యోతి పండాల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఖాజా గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో యాక్సిడెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అలాగే వారి కుటుంబం అంతా కూడా ఖాజా గారి సంపాదన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల రేషన్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి కాజా గారి ఇంటికి వెళ్లి బియ్యము, బ్లాంకెట్స్ మరియు పిల్లలకి బట్టలు అందజేయడం జరిగింది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయమని జ్యోతి పండాల్ వారికి తెలియజేయడం జరిగింది.

జహీరాబాద్ నూతన ఎస్సైగా వినయ్ కుమార్.

జహీరాబాద్ నూతన ఎస్సైగా వినయ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ నూతన ఎస్సై గా బదిలీ పై వచ్చిన కె. వినయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పట్టణ ఎస్సై గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి గ్రామంలోని కాలుని లో నూతన సీసీ రోడ్డు పనులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి కోటా లో ఎం ఆర్ జి ఎస్ రోడ్డు పనులను ప్రారంభించిన మొగుడంపల్లి మండల అధ్యక్షులు బి.రాములు ఇటీ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ అంజయ్య జట్టప్ప అనంతరం అంజయ్య తెలంగాణ ప్రభు నాగేష్ యాదవ్ అల్లావుద్దీన్ బిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ కృపాకర్ తదితరులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చిలుక ప్రవీణ్ పై యూట్యూబర్ చల్లా చేసిన దైవదూషణ వ్యాఖ్యలపై జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, ఇస్లాం చివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గౌరవార్థం దైవదూషణ మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నేతృత్వంలోని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ ను కలిసి ఈ విషయంలో అధికారిక ఫిర్యాదు చేసింది. చిలుక ప్రవీణ్ “యు న్యూస్” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోందని చెప్పబడింది. దీనిలో అతను ఉద్దేశపూర్వకంగా ఇస్లాం, ముస్లింలు మరియు ఇస్లాం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గురించి రెచ్చగొట్టే మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. యూట్యూబ్ లో తప్పుడు ఖ్యాతిని పొందడానికి మరియు తన ఛానల్ యొక్క అభిప్రాయాలను పెంచడానికి మాత్రమే అతను ఇదంతా చేస్తున్నాడు. పర్వీన్ యొక్క ఈ చర్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా దేశ సామరస్యాన్ని కూడా బెదిరించాయని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం చెబుతోంది చిలుక ప్రవీణ్ మాటలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, భవిష్యత్తులో ఆమె ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఉండటానికి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాదీ చిలుక ప్రవీణ్ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు మరియు అలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మరియు భవిష్యత్తులో ఎవరూ అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ధైర్యం చేయకుండా దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు ఏ మతానికి వ్యతిరేకంగానైనా ఇటువంటి చర్యలు చేసే వారిపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు, తద్వారా ఎవరూ అలా చేయడానికి ధైర్యం చేయరు. ప్రతినిధి బృందంలో సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ, సజ్జాదా నషీన్ ముహమ్మద్ మహమూద్ సూఫీ, హఫీజ్ ముహమ్మద్ ఇర్ఫాన్, ముహమ్మద్ అజీముద్దీన్ ఖాద్రీ ముహమ్మద్ ముస్తెయిన్ నవాజ్ ముహమ్మద్ ఇంతియాజ్ సాకి, హఫీజ్ ముహమ్మద్ హమీద్ ముహమ్మద్ ఇబ్రహీం ఖలీల్ ముహమ్మద్ రఫీ, స్టేషనరీ ముహమ్మద్ ఫయాజ్ అహ్మద్, క్రైమ్ రిపోర్టర్ మరియు ఇతరులు ఉన్నారు.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను WWW. bsetelangana. cgg. gov. in సెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పాత్రికేయులతో.మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం జహీరాబాద్ పర్యటనలో కొత్తగా ఏమీ ఆశించేది లేదని .బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ కి భారీగా నిధులు మంజూరు చేస్తే బాగుండేది అని నాలుగు నియోజక వర్గాల రైతులు. సంతోషం వ్యక్తం చేసేవారన్నారు .జిల్లా లోని పలు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయిస్తే అన్ని వర్గాల వారు హర్షించేవారని ఇసంధరభంగా తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ దయ బట్టరు.కొత్తగా ఇచ్చిందేమి లేకపోగా గత కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటికే రిబ్బన్ కటింగ్ లు చేసి చేతులు దులుపుకున్నారు అని అన్నారు .రానున్న రోజుల్లో ప్రజలు కూడా చేతి వాటం తప్పకుండా చూపెడతారు అని గుర్తు పెట్టుకోవాలని .ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు .

ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను.

ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటి..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు రావడం మంచిదే కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన పేరుతో రైతులను వారి గ్రామాలకు వెళ్లి రాత్రి వేళలో వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం,మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేసింది చెప్పాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం కాదు ప్లై ఓవర్ బ్రిడ్జ్,బసవేశ్వర విగ్రహం,నీమ్జ్ రోడ్డు ఇవన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమి చేశారో చెప్పాలని నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా తిరిగి ప్రతి విమర్శలు చేయడం సిగ్గు చేటు,గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం జహీరాబాద్ అభివృద్ధికి నిరోధం కాదా? రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

నేడు జహీరాబాద్ కి అక్బరుద్దీన్ ఓవైసీ రాక.

ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ.

◆ నేడు జహీరాబాద్ కి అక్బరుద్దీన్ ఓవైసీ రాక.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆ‌‌క్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ..

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ.. ఉపాధి అవకాశాలతో జహీరాబాద్లో కొత్త శకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగం: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం జహీరాబాద్ పర్యటన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యుడు సంజీవరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ , సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ ప్రాజెక్టు వెళ్లే రోడ్, ఝరాసంగం మండలం మార్చినూరులోని కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా సభ వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ , వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం చే నిమ్జ్ రోడ్డు ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) రహదారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కాల్ మండలం 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2.50 లక్షలమందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి 2013లో ఏర్పాటయింది. పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2023 నుంచి 2025 వరకు రూ.100 కోట్లతో నిమ్జ్ కు ప్రత్యేక రహదారి నిర్మించారు. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు 9 కిలోమీటర్లు, వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 చోట్ల వంతెనలు నిర్మించారు. హుగ్గేల్లి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్ వరకు నిర్మించిన రోడ్డు మధ్యలో సుమారుగా 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి 131 కేవీ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలనుఅమర్చారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం నిమ్జ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సభాస్థలి నుంచే రైల్వే ఓవర్ బ్రిడ్జి

జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలం నుంచే ప్రారంభించనున్నారు. మరో రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఝరాసంఘం మండలం మాచ్నూర్ గ్రామంలో రూ. 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మరో అరుదైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. లింగాయత్ సమాజ్ సృష్టికర్త విశ్వ గురువుగా కీర్తి కిరీటాన్ని సంపాదించిన అశ్వరుడా బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా సభ వేదిక ప్రాంగణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు.

24 మే 2025 నాడు జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆ‌‌క్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మే 24న వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ.

మే 24న జహీరాబాద్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ మే 24న జహీరాబాద్ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్ ముఫ్తీ అబ్దుల్ సుబుర్ ఖాష్మీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు, సభ్యులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ముఫ్తీ అబ్దుల్ సుబుర్ ఖాష్మీ పెద్ద ఎత్తున హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.సభ విజయవంతం కావడానికి ఓటింగ్ శాతం హామీ ఇస్తుంది.ఈ విలేకరుల సమావేశంలో మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామీ, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, ముఫ్తీ ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఖాస్మీ, ముహమ్మద్ అథర్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్, మహ్మద్ మొయిజుద్దీన్, ముహమ్మద్ మొహియుద్దీన్ గౌరీ, ముహమ్మద్ మొహియుద్దీన్ గౌరీ, ముహమ్మద్ మద్స్ మజీద్, మహ్మద్ మద్స్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. ముహమ్మద్ ఫరూఖాలీ, ముహమ్మద్ జమీరుద్-దిన్ అడ్వకేట్ ఆఫీస్, ముహమ్మద్ అక్బర్ మరియు ఇతర అధికారులు. తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి.

జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి

◆ సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి

◆ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలి — రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు.

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు,హెలిప్యాడ్ , హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ,ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి జహీరాబాద్ ఎంపీ.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి: జహీరాబాద్ ఎంపీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ.

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సోమవారం జరిగిన డీఎస్పీల బదిలీలో భాగంగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిని బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్గొండ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సైదాను జహీరాబాద్ డీఎస్పీగా బదిలీ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version