దేవాలయ భూములను కాపాడాలని వినతి.

దేవాలయ భూములను కాపాడాలని వినతి.

కల్వకుర్తి/నేటి దాత్రి

 

కల్వకుర్తి మండలం రఘుపతి పేట రామగిరి దేవాలయ భూములను కాపాడాలని దేవాదయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి గ్రామస్తులు, బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
దేవాలయ భూములకు 540 ఎకరాలు సంబంధించిన భూములలోని 100 ఎకరాలకు పైగా ఉన్నగుట్టను కొంతమంది కాంట్రాక్టర్ ఇష్ట రీతిన మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందని, దేవాలయ భూములను కాపాడాలని, మట్టిని అక్రమంగా తవ్విన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,మండల అధ్యక్షులు నరేష్ గౌడ్,మాజీ టౌన్ ప్రెసిడెంట్ బోడ నరసింహ ,వైస్ చైర్మన్ శ్యామ్ సుందర్,రఘుపతి పేట గ్రామస్తులు మల్లికార్జున్ రెడ్డి, వినయ రెడ్డి,రమేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా .!

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు

దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తాం

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పత్రిక సమావేశం నిర్వహించిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

వేములవాడ నేటిధాత్రి

 

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు.గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం పాత్రికేయులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్ల ప్రకటించారని అన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తిర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల , అన్నదాన సూత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు.

అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేసామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడ్తున్నామని అన్నారు. రాబోయే నెలలో రొడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

రాజన్న భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు…

ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడె కట్టుట, క్యూ లైన్ తదితరు ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, ఈఓ వినోద్, ఈఈ రాజేశ్, డీఈ రఘు నందన్, ఆర్అండ్ బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ బీ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి.

‘అందరిపై.. ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.

కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.శేఖర్ పాటిల్

◆ కేతకీ సంగమేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నూతన చైర్మన్ & పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రా౹౹ & మం౹౹ శ్రీ కేతకీ సంగమేశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం రోజున శ్రీ.సంగమేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికీ పాలభి శేకం నిర్వహించారు.ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్.అప్నగారి.

Temple

 

శేఖర్ పాటిల్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి .ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారు,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,జిల్లా యూత్ మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,బి.మల్లికార్జున్ మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆలయం ఈవో&అర్చకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు.!

ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు లక్ష 16 వేల విరాళం.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి లక్షణాచార్యులు (మూకయ్య) గారి చిన్న కుమారుడు రంగాచార్యులు శివాలయానికి విరాళంగా 116000/- రూపాయలు అక్షరాల (ఒక లక్ష పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కళ్యాణం
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు . కళ్యాణోత్సవంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి దంపతులు వాసవి క్లబ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చిగుళ్ల పల్లి శ్రీనివాలు వనిత క్లబ్ అధ్యక్షురాలు సువర్ణ కె బుచ్చయ్య దంపతులు కూర్చున్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ కళ్యాణోత్సవం ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం పట్టణ ఆర్యవైశ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు వనపర్తి ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ లగిశేట్టి అశోక్ లగిశెట్టి రమేష్ లింగం హరినాథ్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బచ్చురాం కాంగ్రెస్ పార్టీ నేత చుక్కయ్య శెట్టి న్యాయవాది బాస్కర్ వజ్రాల సాయిబాబా వై వెంకటేష్ కొండ విశ్వనాథం పూరిరిసురేష్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ అమరవాది నరేందర్ ప్రధాన కార్యదర్శి కల్వ బూపేష్.కుమార్ శెట్టి కొండ ప్రశాంత్ ఆర్యవైశ్యులు బచ్చురాం ఎలిశెట్టి వెంకటేష్ వజ్రాల సాయిబాబా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనoత ఉమావతి కొండూరు మంజుల ప్రవీణ్ పిన్నo వసంత సహాయనిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం పట్టణ ఆర్యవైశ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈసందర్భంగా వాసవి క్లబ్ తరుపున సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఒకప్రకటనలో తెలిపారు

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల.

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధా, అనిల్ కుమార్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర పాల్గొన్నారు.

సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు.

సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాంనగర్ కాలనీ లో శ్రీ సీతారాముల దేవాలయానికి సౌండ్ పొంగలు స్టాండ్ మైక్స ఆమ్ప్ల ప్లేయర్ ఇతర సామాగ్రి దాతలు ఇచ్చారని వనపర్తి బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అశ్విని రాధ ఒక ప్రకటనలో తెలిపారు దాతలు అశ్విని రాద అశ్విని భగవంతు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పట్టణ అధ్యక్షుడు సదుర్ల చిన్నయ్య ప్రధాన కార్యదర్శి న్సోనైల గోవింద్ కోశాధికారి సిమ్లా భాస్కర్ ఇచ్చి న వారిలో ఉన్నారని శ్రీమతి రాద తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు సదుర్ల రమేష్ బాబు పట్టణ మాజీ అధ్యక్షులు చింతకుంట ఆంజనేయులు పూడూరు మోహన్ ఉపాధ్యక్షుడు చింతకుంట సంపత్ నారం దాసు రఘు ప్రచార కార్యదర్శి కురుమూర్తిసంయుక్త కార్యదర్శి సదుర్ల నాగరాజ్ చిన్న గుంటపల్లి నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ సదుర్ల మహేందర్ కార్యవర్గ సభ్యులు అశ్విని రాజు అశ్విని మహేష్ నాగవరం చక్రపాణి అశ్విని పవన్ పూడూరు విజయ్ అశ్విని ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో గల అతి ప్రాచీన గల నాపాక దేవాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు, ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని తెలిపారు ఈ ఆలయంలో రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడు సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మంది కళాకారులచే కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండలాల్లోని వివిధ గ్రామాల భక్తుల ప్రజలు సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కృతజ్ఞతలు కాగలరని తెలిపారు.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం

ఆలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం లో.,ఏప్రిల్ 6వ, తారీకు నిర్వహించనున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేయటం జరిగింది, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించబోనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలో భాగంగా మొదటిగా ఆలయంలో వేద పండితులు చేత తొలక్కం పారాయణం జరుగుతుంది ఏప్రిల్ ఆరో తారీకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది . తదుపరి హోమాలు అదేవిధంగా గ్రామ పర్యటనలో భాగ ంగా రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 11 వ తారీకు నాగబెల్లి తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు
రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్, శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . అదేవిధంగా గణపురం చెందిన కీర్తిశేషులు అమరాజి మొగిలి జ్ఞాపకార్థం కుమారుడు అమరాజి సతీష్, ఆలయ అభివృద్ధి కొరకు 10, వేల 116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం.

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం

మరిపెడ  నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా.!

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం

 

పరకాల నేటిధాత్రి

మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం.

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి పంచాంగశ్రవణం చేసినారు. ఈ సంవత్సరము సూర్యుడు రాజు అగుట వలన నాయకుల మధ్య పరస్పర విరోధము తీవ్రంగా ఉంటుం దని మంత్రి చంద్రుడు ఆగుటచే పంటలు మామూలుగా పండు తాయని ఆహారధాన్యాల కొరత ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి, ఏంశెట్టి ప్రభాకర్ నల్లెల్లవిజేందర్ ,గాదే రాజేందర్, బాసని చంద్రమౌళి దిండిగాల వంశీ, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. స్వామివారికి బిల్వదళాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. రాచన్న స్వామిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

శని అమావాస్య సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ లోని శనీశ్వర ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వర విగ్రహానికి తైలాభిషేకాలను చేశారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని 1008 అవధూత గిరి మహారాజ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ ర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలోభక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి, బుచ్చయ్య స్వామి, చిన్న వీరయ్య స్వామి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి.

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి

మందమర్రి నీటి ధాత్రి

పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ఛైర్మెన్ శ్రీ బండి సదానందం యాదవ్ ఆదేశం మేరకు అలయకమిటి సభ్యులు మరియు వివిధ వార్డు లకు సంబంధించిన అభయ ఆంజనేయ స్వామి భక్తులకు తెలియజేయునది ఏమనగా.

తేదీ 6/4/2025 రోజున శ్రీరామ నవమి ఉన్నందున శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం తో పాటు ఆలయ కమిటీ ని సవరిస్తూ భవిష్యత్తు లో ఆలయాన్ని పెద్ద మొత్తము లో గుడి అభివృద్ధి మరియు ఇతర కొన్ని సమస్య లపై చర్చించుకునేందుకు ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గుడి ప్రాంగణంలోని ఛైర్మెన్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.

ఆలయ కమిటీ.
మందమర్రి అభయాంజనేయ స్వామి దేవాలయం

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

#నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన సీతారామస్వామి దేవాలయం ధర్మకర్త గ్రామ అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండా లక్ష్మణ్ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది ఆలయ ధర్మకర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని లక్ష్మణ్ స్వామి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఆలయాలు లేని సందర్భంలో తన సొంత స్థలం ఇచ్చి గ్రామస్తుల సహకారంతో రామాలయాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి లక్ష్మణ స్వామి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అలాగే గ్రామానికి తీరని లోటు అని అన్నారు పరామర్శలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్., మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, వేల్పుల రవి, గుమ్మడి వేణు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్ తో పాటు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నివాళులర్పించారు.

రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ.

*ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ కు స్వాగతం పలికిన..

*రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 05:

తిరుపతి పట్నాలు
వీధిలో స్థానికంగా గల శ్రీ రేణుక పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవం -2025 మార్చి 14 నుండి మార్చి 16 వరకు జరగనున్నాయి .ఈ నేపద్యంలో ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్,ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్ ను వార్షిక మహోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులు దిలీప్ అధ్యక్షతన ప్రణీత్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ శ్రీ రేణుక పరమేశ్వరి వారి మహోత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన శక్తి మేర మహోత్సవాలలో జరిగే అన్నదానానికి ఆలయ అలంకరణకు కావాల్సిన నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడిఫై స్కూల్ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్..

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్
చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి

చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ విరాజిల్లుతున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా
శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగాచార్యులు మరియు
ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లతో పాటు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఇతర ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని చైర్మన్ శ్రీధర్ రావు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version