శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి పంచాంగశ్రవణం చేసినారు. ఈ సంవత్సరము సూర్యుడు రాజు అగుట వలన నాయకుల మధ్య పరస్పర విరోధము తీవ్రంగా ఉంటుం దని మంత్రి చంద్రుడు ఆగుటచే పంటలు మామూలుగా పండు తాయని ఆహారధాన్యాల కొరత ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి, ఏంశెట్టి ప్రభాకర్ నల్లెల్లవిజేందర్ ,గాదే రాజేందర్, బాసని చంద్రమౌళి దిండిగాల వంశీ, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.