గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.