అక్కా, పిన్ని అంటూ.. రూ.కోట్లతో జంప్.. ఖి’లేడి’ బాగోతాలు
కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలుగు రాష్ట్రాల్లో మోసాలు మరీ పెరిగిపోతున్నాయి. రొటీన్‌గా చోరీ చేయడం కంటే స్కెచ్ వేసీ మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, స్కాములు ఇవి మాత్రమే కాకుండా ఎలా వీలైతే అలా మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడవాళ్లు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది.
బాగా డబ్బులు ఉన్న ఇళ్ల పక్కనే రెంట్‌కి ఉండటం, తియ్యగా మాటలు కలుపుతూ బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, అక్కా, పిన్నీ అంటూ డబ్బున్న వారికి దగ్గర అవుతూ ఈ లేడీ మోసం చేస్తుంది. వారికి అవసరం ఉన్నా లేకున్నా సాయం చేస్తూ వాళ్లకు తనపై నమ్మకం కలిగేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ తాను మంచిదని నమ్మిస్తుంది. డబ్బున్న మహిళలకు ఎర వేస్తూ వాళ్ళతో కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటుంది. వడ్డీకి ఇస్తానని, మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తానని, తాను బిజినెస్ చేస్తే లక్షకు రెండు లక్షలు వస్తాయని నమ్మించి డబ్బున్న వాళ్ళ దగ్గరనుంచి రూ.లక్షలు కాదు కాదు ఏకంగా రూ. కోట్లే కాజేసింది. ఈ వింత బాగోతం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఒక్కొక్కరి దగ్గర పట్టుమని 10 నెలల కాలం కూడా ఉండకుండా జాగ్రత్తగా డబ్బులతో ఎస్కెప్ అవుతుంది. మొదట ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో విద్య అనే మహిళ మోసాలకు పాల్పడుతూ వచ్చింది. ఆనోటా ఈ నోటా పాకి ఈమె గురించి అక్కడ అందరికి తెలియడంతో.. ఏకంగా హైదరాబాద్‌కు మకాం మార్చింది.
ఇక్కడ డబ్బున్న వాళ్ళు బాగా ఉంటారని, డబ్బున్న మహిళలకు గాలం వేసి రూ.కోట్లు కొల్లగొట్టాలని భావించి తన మోతపూరిత వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. తిరుపతికి చెందిన మహిళ విద్యకు మాటల గారెడీతో మహిళలను బుట్టలో వేయడం వెన్నెతో పెట్టిన విద్య. తమకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పి తాను వ్యాపారాలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేసి మెల్లగా జారుకుంటుంది. బాధితులు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రశ్నించగా.. రౌడీలతో కొట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని, పోలీసులు ఈ ఖిలాడీ లేడి అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.