సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వడ్డీ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కమల (40), భోజ్యానాయక్ తండాకు చెందిన అంబ్యానాయక్ (55) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జహీరాబాద్, బీదర్ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహదారులపై అతివేగం, ముఖ్యంగా మూలమలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

రైలు ఢీకొని ఇద్దరు మృతి..

రైలు ఢీకొని ఇద్దరు మృతి

 

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా.. రైలు ఢీ కొట్టింది.

జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని(Train Accident) ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కలికిరి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కలికిరి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. స్టేషన్ సిబ్బంది వారించారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కాసేపు స్టేషన్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోనే పట్టాలపై కూర్చొని మద్యం సేవించారు. అదే సమయంలో ఎక్స్ ప్రెస్ రైలు(Express Train Hits Two,) వచ్చి.. వారిద్దరిని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదం(Train Accident)లో మద్యం సేవిస్తున్న ఇద్దరూ మృతి చెందారు. మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికి పెంటకు చెందిన గంధం ముని కుమార్ గా గుర్తించారు. మరొకరు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం లోని కలికిరి క్రాస్ రోడ్డుకు చెందిన జి వీరభద్రయ్య బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్….

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

 

స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢికొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను వారి కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అలాగే కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రత వాహనదారులు సహకరించాలని కోరారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version