నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ట్విస్ట్.. సోనియా, రాహుల్‌పై కొత్త ఎఫ్‌ఐఆర్‌..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ట్విస్ట్.. సోనియా, రాహుల్‌పై కొత్త ఎఫ్‌ఐఆర్‌

 

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.

 నేషనల్‌ హెరాల్డ్‌ కేసు (National Herald Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేతలైన ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సహా మరికొందరిపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో కాంగ్రెస్‌ సీనియర్ నేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడాలతో పాటు యంగ్‌ ఇండియా( Young India) సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఆరోపించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్‌ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 2021లో మృతిచెందారు.

ఇక నేషనల్ హెరాల్డ్ కేసు విషయానికి వస్తే… నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్‌ జర్నలిస్ట్స్‌ లిమిటెడ్‌ (AJL)కు కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుందని, రాహుల్‌, సోనియా(Sonia Gandhi)కు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌కి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది.

ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్‌ నేతల ద్వారా భారీగా అక్రమార్జనకు(political corruption) పాల్పడ్డారని తెలిపింది. 2025 అక్టోబర్ 3 నాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ రూపొందించబడింది. ఈడీ తమ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులతో పంచుకోవడంతో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఢిల్లీ కోర్టు(Delhi court ) డిసెంబర్ 16కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

 అక్కా, పిన్ని అంటూ.. రూ.కోట్లతో జంప్.. ఖి’లేడి’ బాగోతాలు…

 అక్కా, పిన్ని అంటూ.. రూ.కోట్లతో జంప్.. ఖి’లేడి’ బాగోతాలు

 

కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 తెలుగు రాష్ట్రాల్లో మోసాలు మరీ పెరిగిపోతున్నాయి. రొటీన్‌గా చోరీ చేయడం కంటే స్కెచ్ వేసీ మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, స్కాములు ఇవి మాత్రమే కాకుండా ఎలా వీలైతే అలా మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడవాళ్లు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది.
బాగా డబ్బులు ఉన్న ఇళ్ల పక్కనే రెంట్‌కి ఉండటం, తియ్యగా మాటలు కలుపుతూ బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, అక్కా, పిన్నీ అంటూ డబ్బున్న వారికి దగ్గర అవుతూ ఈ లేడీ మోసం చేస్తుంది. వారికి అవసరం ఉన్నా లేకున్నా సాయం చేస్తూ వాళ్లకు తనపై నమ్మకం కలిగేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ తాను మంచిదని నమ్మిస్తుంది. డబ్బున్న మహిళలకు ఎర వేస్తూ వాళ్ళతో కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటుంది. వడ్డీకి ఇస్తానని, మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తానని, తాను బిజినెస్ చేస్తే లక్షకు రెండు లక్షలు వస్తాయని నమ్మించి డబ్బున్న వాళ్ళ దగ్గరనుంచి రూ.లక్షలు కాదు కాదు ఏకంగా రూ. కోట్లే కాజేసింది. ఈ వింత బాగోతం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఒక్కొక్కరి దగ్గర పట్టుమని 10 నెలల కాలం కూడా ఉండకుండా జాగ్రత్తగా డబ్బులతో ఎస్కెప్ అవుతుంది. మొదట ఆంధ్ర‌ప్రదేశ్‌లోని తిరుపతిలో విద్య అనే మహిళ మోసాలకు పాల్పడుతూ వచ్చింది. ఆనోటా ఈ నోటా పాకి ఈమె గురించి అక్కడ అందరికి తెలియడంతో.. ఏకంగా హైదరాబాద్‌కు మకాం మార్చింది.
ఇక్కడ డబ్బున్న వాళ్ళు బాగా ఉంటారని, డబ్బున్న మహిళలకు గాలం వేసి రూ.కోట్లు కొల్లగొట్టాలని భావించి తన మోతపూరిత వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. తిరుపతికి చెందిన మహిళ విద్యకు మాటల గారెడీతో మహిళలను బుట్టలో వేయడం వెన్నెతో పెట్టిన విద్య. తమకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పి తాను వ్యాపారాలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేసి మెల్లగా జారుకుంటుంది. బాధితులు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రశ్నించగా.. రౌడీలతో కొట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని, పోలీసులు ఈ ఖిలాడీ లేడి అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version