ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
– సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలో బిర్సా ముండా జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో గిరిజన హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాకి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ
“బిర్సా ముండా భారత గిరిజన సమాజ చరిత్రలో అజరామర వీరుడు అన్నారు. ఆయన చేసిన పోరాటం న్యాయం, స్వాభిమానం, దేశభక్తికి ప్రతీక అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ గిరిజన అభ్యున్నతికి కట్టుబడి పనిచేసిందనీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సిరిసిల్ల పట్టణంలో గిరిజన సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడమే పార్టీ ధ్యేయం” అని అన్నారు.
ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
