జహీరాబాద్ లో నాగుల చవితి వేడుకలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద పాలు పోసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పట్టణంలోని 1008 నాగదేవత ఆలయం, నాగుల కట్టలోని నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్షాలు, పాలు నైవేద్యంగా సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు.