తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.

ఝరాసంగం తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండల గ్రామాల్లో బంగ్లాగడ్డ కాలనీ ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు బంగ్లాగడ్డ కాలనీ చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు.

 

Jhara Sangam

జిల్లా కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 5 రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్‌ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో నీరు వృథాగా పోతున్నది.అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.

Jhara Sangam

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహీర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య.

*ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య *
జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులచే అన్ని ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నామన్నారు. ఐఎఫ్ఫీ (IFP)ప్యానల్ బోర్డుతో విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పిస్తూ, ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు విద్య బోధన జరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ) తో కూడా విద్య బోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టిక ఆహారం, ఉదయం రాగి జావా, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆట స్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సాదిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిడిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి..

ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట…

కేసముద్రం  నేటి ధాత్రి:

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బేరువాడ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ , రాగి జావా,రెండు జతల బట్టలు ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బానోతు వాగ్య, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పనికి ఆహారపథకంలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి కోరారు.

ప్రభుత్వ కొలతల ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ.!

ప్రభుత్వ కొలతల ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి

సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి,ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలియజేశారు.సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,హౌసింగ్ ఏఈ కాంక్ష,పంచాయతీ కార్యదర్శి ఏ.సత్యనారాయణ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

రెచ్చిపోయి వసూళ్లు.!

రెచ్చిపోయి వసూళ్లు.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.

collect

 

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.

collect

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.

మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది.

ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది.

ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది.

ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను
తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది.

ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు.

ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు.

అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం.!

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం సీపీఎం
వనపర్తి నేటిధాత్రి

 

 

. సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సి పి ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 207వ, జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ” కారల్ మార్క్స్ 1818 లో జర్మనీలో జన్మించారని నేటికీ 207 సంవత్సరాలు అవుతుందని, ఆయన సిద్ధాంత రచన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలై 177 సంవత్సరాలు అవుతుందని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతో పాటు స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. కేరళ తరహ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితం గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ ,జిఎస్ గోపి, బాల్ రెడ్డి ,ఏం. రాజు ,ఏ. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, ఆర్. ఎన్. రమేష్, బి. వెంకటేష్, బాల్య నాయక్, గుంటి వెంకటేష్ ,ఎం. పరమేశ్వరా చారి, ఎం. కృష్ణయ్య, ఎస్. రాజు, బి వెంకటేష్, ఎం. వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.!

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదుని సత్యనారాయణ …..

నేటి ధాత్రి .,,……………..

 

 

జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల గ్రామం ఎల్లారెడ్డి పల్లెలో చేనేత కార్మిక కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ రోజంతా శ్రమించి కార్మికులకు రోజు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కావున ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు అయ్యేవిధంగా పని కల్పించాలని మరియు ఇందిరమ్మ గృహాలు హెల్త్ కార్డు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు వరంగల్ జిల్లాలో ఏర్పాటు అవుతున్న కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో పద్మశాలీలకు మరియు చేనేత కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిపి కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు పవర్ రూమ్ కార్మికులకు విద్యార్థి పింఛన్ వెంటనే మంజూరు చేయాలని మరియు మగ్గం వేసే ప్రతి కార్మికునికి జియో ట్రాక్ తో సంబంధం లేకుండా చేనేత మిత్ర కింద 2500 అందించి చేనేత కార్మికులకు ఆర్థిక ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను.!

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని ఒగ్గు కథ

ప్రధానోపాధ్యాయులు -అచ్చ సుదర్శన్

నడికూడ,నేటిధాత్రి:

 

కథలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరని ముఖ్యంగా ఒగ్గు కథలంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమని తెలుసుకున్న నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ బృందం చే ఒగ్గు కథ పాట ను ఆదివారం రోజున చెప్పించడం జరిగింది.నర్ర సతీష్ యాదవ్ సామాన్య జనాల మనసుకు అతుక్కు పోయే విధంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలను ఒగ్గు కథ రూపంలో వివరించడం జరిగింది.అదేవిధంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించాలని,ఆ పాఠశాల యొక్క ప్రత్యేకతలను తల్లిదండ్రులకు ఒగ్గు కథ పాట ద్వారా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒగ్గు కథ పాట ఉపాధ్యాయ గ్రూపులలో మరియు గ్రామాల గ్రూపు లలో వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్నది.సామాజిక మాధ్యమాల ద్వారా బడిబాటను ప్రచారం చేస్తున్న చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ బృందమును, ఒగ్గుకథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ ను మరియు అతని బృందాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని నడికూడ మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు అభినందించారు.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.

 

Students

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.

వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

వనపర్తి నేటిధాత్రి :

 

అకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి వచ్చిన వడ్లు తడిసి పోయాయని అన్నారు శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి తడిసిన వడ్ల ను పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్, పౌరసరఫరాల శాఖ అధికారులకు తడిసిన వరి వడ్లను ఆరబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
రైతులకు అవసరమైన టార్ఫాలిన్ లు అందజేయాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన…..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు యాదగిరి, స్వామి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనపై వారికి అవగాహన కల్పించారు. రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు ఇతర వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు సూచించారు. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బస్ పాస్ సౌకర్యం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కళాశాలలో బైపిసి, ఎంపీసీ, సి ఈ సి, హెచ్ ఈ సి గ్రూపులతో పాటు ఒకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, అకౌంటెంట్ టాక్సేషన్ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలలో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్చరర్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల సత్తా….

ప్రభుత్వ పాఠశాలల సత్తా….

8 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత

మండల టాపర్ ఎల్లారెడ్డి

నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ
తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, బర్దిపూర్, ఎల్గోయ్, జీర్లపల్లి, ఈదులపల్లి, ఝ రాసంగం, ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, మహాత్మ జ్యోతి రావు పూలే పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. కుప్పానగర్ పాఠశాలలో 99% శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా 402 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 401 మంది ఉత్తీర్ణత సాధించారు. కుప్పానగర్ పాఠశాలకు చెందిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

 

Education

మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థి ఎల్లారెడ్డికి 581 మార్కులు సాధించి మండల టాపర్గా గెలిచాడు. తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన ఎస్. రాధిక 574 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. మండ లానికి చెందిన 30 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. జడ్పీహెచ్ ఎస్ ఝరాసంగం పాఠశాలకు చెందిన రాహుల్ 556, సీహెచ్. భవాని 548, జి. భువనేశ్వరి 529, కె. త్రిష 527, ఎలిజబెల్ రాణి 526 మార్కులు సా ధిం చారు. ఈ విద్యార్థులను మండల విద్యాధి కారి శ్రీనివాస్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version