జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప. అధ్యక్షతన ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కార్య నిర్వాణ అధికారి వారు మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిళువిద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భోజనాలు ఏర్పాటుకై జాతర మహోత్సవం గురించి గ్రామ గ్రామాన తెలియపరచాలని జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలపై వాటి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ కార్యనిర్మాణ అధికారి శివ రుద్రప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో. ఆలయ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) కార్యనిర్వాన అధికారి శివ రుద్రప్ప. మాజీ చైర్మన్ నట్కరి మావయ్య. గ్రామ పెద్దలు యువకులు ఆలయ సిబ్బందులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.