ప్రమాదకరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయండి,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలంలోని శేకాపూర్ రోడ్ గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. సెప్టెంబర్ 8న ప్రారంభం అయి మూడు రోజుల పాటు కొనసాగే హాజరత్ షేక్ షహబుద్దీన్ దర్గా జాతరకు పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. ప్రతీ ఏడాది ఉత్సవాలకు సుమారు 40-50 వేల మంది భక్తులు హాజరవుతారు. ఈసారి కూడా భారీ స్థాయిలో జాతర జరుగనుండగా, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ప్రయాణికులు నరకం అనుభవిస్తున్న ఈ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయాలని షహబుద్దీన్ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మణిక్ రావు, సెట్విన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ లకు విజ్ఞప్తి చేశారు.